top of page

హంతకుడు ఎవరు?

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #SuperGirlsRakshaLanka, #HanthakuduEvaru, #హంతకుడుఎవరు?, #TeluguCrimeStories, #కొసమెరుపు


Hanthakudu Evaru - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi

Published In manatelugukathalu.com On 09/04/2025

హంతకుడు ఎవరు? - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)

"హనుమంత్ రావు గారి హత్య జరిగింది, త్వరగా రండి, అరణ్య వీధి, రోహిణి అపార్ట్మెంట్స్" అంటూ ఫోన్ కాల్ వచ్చింది పోలీస్ ఇన్స్పెక్టర్ శరత్ కు. ఇది అతడి కెరీర్ లో తొలి హత్య కేస్. అయినా తొణుకు బెణుకు లేకుండా, ఇద్దరు కానిస్టేబుల్స్ ను వెంట బెట్టుకుని, వెంటనే జీప్ స్టార్ట్ చేసి అరణ్య వీధి వైపు దూసుకు పోయాడు బుల్లెట్ లా ఇన్స్పెక్టర్ శరత్ . 


2) 

ఆ హత్య గది లో ఇద్దరు చెరో పిస్టల్ పట్టుకొని నిల్చొని ఉన్నారు. తల్లి మరియు కొడుకు. హనుమంత్ రావు గారి గుండెల్లో నుండి రెండు బుల్లెట్లు దూసుకు పోయాయి. రక్తం చింది అతడి తెల్ల చొక్కా ఎర్ర గా మారింది. కుర్చీ లో కూర్చొని, తన ముందు ఉన్న టేబుల్ పై తల వాల్చి ఉన్నాడు. ప్రాణం గాలిలొ కలిసిపోయింది. 


3)

అక్కడ ఆ గది లో సీసీటీవీ కెమెరా పరిశీలించాడు ఇన్స్పెక్టర్ శరత్. హనుమంత్ రావు తో ఆమె (తల్లి) మరియు ఆమె కొడుకు (సుమారు ఇరవై ఐదు ఏళ్ళు) ఏదో తీవ్రంగా చర్చిస్తున్నారు. కోపంగా అరుచుకుంటున్నారు అనటం సబబు. అక్కడ ఆ దృశ్యం లో ముగ్గురి ఘర్షణ జరుగుతున్నది. 


హనుమంత్ రావు గారి కోపం తారా స్తాయికి చేరింది. వెంటనే తన ముందున్న టేబుల్ సరుగు నుండి (డెస్క్ నుండి) రెండు పిస్తోల్లు తీశారు రెండు చేతుల్లో .. ఒకటి కుడి చేతిలో, ఒకటి యెడమ చేతిలో "గెట్ ఔట్" అంటూ అరుస్తూ. 


వెంటనే ఆ తల్లి కొడుకులు, ముందుకు కదిలి, చెరో పిస్తోల్ లాక్కున్నారు. 

వెంటనే రెండు "డాం డాం" అని శబ్దాలు వినిపించాయి. హనుమంత్ రావు ఛాతీ నుండి రక్తం కారింది. అతడు వేసుకున్న తెల్ల షర్ట్ కు పాకింది. అతడు ముందున్న టేబుల్ పైకి ఒరిగాడు (ప్రాణం వదిలేసి). 


తల్లి "నేనే రెండు సార్లు పిస్తోల్ కాల్చాను ఈ క్రూరుడి ని హతమార్చాను" అన్నది దీన స్వరంతో ఆ తల్లి. 


"లేదు లేదు .. కాదు కాదు .. నేనే రెండు సార్లు పిస్తోల్ కాల్చాను ఈ క్రూరుడి ని నేనే హతమార్చాను" అన్నాడు కొడుకు నివ్వెర పోతూ. 


"ఇట్ ఇస్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. వీరిద్దరూ (తల్లి కొడుకులు) కాల్చింది సృష్టంగా సీసీటీవీ కెమెరా లో కనిపిస్తుంది .. ఇద్దరూ హంతకులే", అన్నారు ఇన్స్పెక్టర్ శరత్ అక్కడున్న మీడియా తో మరియు ఇతర మనుషులతో. 


ఇద్దరినీ పోలీస్ జీప్ ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి పోయారు. అక్కడే లాకప్ లో కూర్చో పెట్టారు. తరువాయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 


4)

తన ఆఫీస్ లో కూర్చుని ప్రైవేట్ డిటెక్టివ్ పరశురామ్ ఆ హత్య కేస్ చదివారు దిన పత్రిక మొదటి పేజీ లో. 6 వ పేజీ లో హంతకుల ఫోటో ఉన్నది అని వ్రాసి ఉన్నది. అది చూసి పేపర్ తిప్పారు నింపాదిగా .. చూద్దామని. 


ఆ హంతకుల ముఖాల ఫోటో చూడగానే పరశురామ్ షాక్ తిన్నారు. అతడి కళ్ళు చెమర్చాయి. చెమ్మగిల్లాయి. 


టప్ మని లేచి నిల్చున్నాడు అరుస్తూ, . "నో నో .. ఆ తల్లి కొడుకులు హంతకులు కారు కాలేరు" అని అరుస్తూ. 


అక్కడున్న అతడి ఉద్యోగులు కళ్ళు పెద్దవి చేస్తూ నిల్చుండి పోయారు. 


పరశురామ్ వెంటనే బయిటికి వెళ్లి తన కార్ లో కూర్చుని పరుగులు తీయించాడు పోలీస్ స్టేషన్ వైపు. 


5)

జడ్జి గారి ఇంట్లో ఇన్స్పెక్టర్ శరత్ మరియు డిటెక్టివ్ పరశురామ్ కూర్చుని ఉన్నారు. 


ఇన్స్పెక్టర్ శరత్ ఇలా చెప్పారు: "ఇన్వెస్టిగేషన్ అవసరమే లేదు ఈ హత్య కేస్ లో. సీసీటీవీ లో ఇద్దరు .. అదే అమ్మ మరియు బాబు .. చెరో పిస్టల్ లాక్కుని .. హనుమంత్ రావు ను కాల్చింది స్పష్టముగా కనిపిస్తున్నది. అందరూ చూసాము. ఇద్దరూ హంతకులు ఒప్పుకున్నారు కూడా. సో, కేస్ ఇస్ క్లోజ్డ్" 


ప్రైవేట్ డిటెక్టివ్ పరశురామ్ అందుకున్నారు ఇలా, 

"నొ నొ నొ.. వాళ్లిద్దరూ దేవతా మూర్తులు. నేను చిన్నప్పుడు పేద వాడిని. ఆ మహా తల్లి నాకు స్కూల్లో టీచర్ మరియు ఇంటి పక్కనే ఉండేది. ఉచితంగా కూడా నాకు ట్యూషన్ పాఠాలు చెప్పి, నేను ఇంతగా ఎదగడానికి దోహద పడింది ఆ మాతృ హృదయం నాకు స్కాలర్షిప్ లు కూడా ఇప్పించింది స్కూల్లో మరియు కాలేజి లో". 


"నాకు ఈత రాదు. ఆమె కొడుకు - అదే ఆ బాబు .. ఓ సారి నన్ను నీటిలో మునిగి పోకుండా కాపాడాడు, తన ప్రాణాలకు తెగించి". 


"వారిరువురికి పిస్టల్ కాల్చడం యే రాదు. అలాంటి వారు గురి చూసి గుండు అతడి (హనుమంత్ రావు) గుండెను తాకేలా కాల్చటం అసాధ్యం. అయినా కాల్చిన వారు ఎవరైనా ఒప్పుకుంటారా? ఇంకో విషయం ఇది సెల్ఫ్ డిఫెన్స్ లేక పెనుగులాట లో ఏక్సిడెంటల్ డెత్ పరిధి లోకి వస్తుంది. ఎలా చూసినా వారిని వదిలేయాలి. అసలు బెయిల్ కూడా అవసరం లేదు. అసలు అరెస్ట్ చేయడం, ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం లేదు సెల్ఫ్ డిఫెన్స్ లేక పెనుగులాట ఏక్సిడెంట్లల్ మరణం లో. ఇది ప్లాన్ చేసి చంపిన హత్య కాదు. ఎలా చూసినా ఇది హత్య కానే కాదు నో నెవర్", అని అరిచాడు తీక్షణంగా డిటెక్టివ్ పరశురామ్. 


"ఇంకో విషయం. హనుమంత్ రావు కి ఎంతో మంది శత్రువులు ఉన్నారు. అతడిది మోస పూరిత జీవితం. డబ్బు దురాశ ఎక్కువ. డబ్బు కోసం దాసోహం అతడి జీవితం. అది కూడా అందరూ గమనించాలి. నన్ను ఓ సారి హత్య ప్రదేశం పరిశీలించడానికి అనుమతి ఇవ్వండి, ప్లీజ్. ఆ ఇద్దరు అమాయకుల మీద ఏటువంటి కటిన చర్య తీసుకోకండి", అని ముగించాడు డిటెక్టివ్ పరశురామ్. 


6)

హత్య గది పరిశీలించాడు పరశురామ్. గోడలు, కిటికీలు. హనుమంత్ రావు స్మార్ట్ ఫోన్ కూడా. చిరు నవ్వు తో బయిటికి కదిలాడు. 


7)

పోలీస్ స్టేషన్ లో లాక్ అప్ లో ఉన్న తల్లి కొడుకులు పరశురామ్ ను చూడగానే చిరు నవ్వు నవ్వారు ప్రశాంతం గా. వారి ముఖాల్లో అలసట - అలజడి అదృశ్యం అయిపోయింది. 


పరశురామ్ తల్లి కొడుకులతో ఇలా అన్నాడు, "అమ్మా, బాబు మీరిరువురు నా ప్రాణ దాతలు. నాకు మంచి జీవితాన్ని - అభ్యుదయం వెలుగు ను ప్రసాదించిన వారు. నా తల పై ఒట్టు పెట్టి చెప్పండి. మీరు పిస్థోల్ కాల్చారా?", అంటూ వారి చెవులో ఏదో చెప్పి, తన తల పై వారిరువురి చేతులు పెట్టాడు. 


ఆశ్చర్యం. 


"నేను పిస్తోల్ కాల్చలేదు", అన్నారు ఇద్దరు. 


శరత్, ఇతర పోలీసులు ఆశ్చర్య పోయారు ఈ హఠాత్ సంఘటనకి. 


"నాకు తెలుసు", అన్నాడు పరశురామ్ "హా హా హా" అని సంతోషం గా నవ్వుతూ. 


ఈ సారి అక్కడున్న అందరితో బాటు తల్లి కొడుకులు కూడా ఆశ్చర్య పోయారు. 


8)

అప్పటికప్పుడు తన స్మార్ట్ ఫోన్ లో జడ్జీ గారి తో ఇలా మాట్లాడాడు పరశురామ్, 


"నేను హత్య అయిన గది ను పరిశీలించాను. తల్లి కొడుకు నిల్చున్న .. వెనుక వైపు గోడ పై 2 బుల్లెట్ మార్క్స్ - ఎర్ర స్క్రాచస్ కనిపించాయి. హనుమంత్ రావు కూర్చున్న కుర్చీ వెనుక వైపు కిటికీ మరియు బాల్కనీ ఉన్నాయి. అక్కడి నుండి ఎవరో కాల్చారు పిస్టల్ ను. అది హనుమంత్ రావు గారి గుండె ను చీలుస్తూ .. తల్లి కొడుకుల మధ్య నుండి దూసుకు వెళ్లి వారి వెనుక ఉన్న గోడ కి తగిలింది. అక్కడ ఎర్ర స్క్రాచ్ మార్క్స్ చేసింది ". 


"అదే సమయం లో తల్లి కొడుకుల పెనుగులాట హనుమంత్ రావు తో .. వారి చేతిలోకి అతడి పిస్తోల్ రావటం క్షణికం లో జరిగి పోయాయి. వారే అతడిని కాల్చినట్టు అనిపించింది అందరికీ, శిక్షణ సీసీటీవీ లో దృశ్యం చూసి"


"ఇంకో విషయం. తన తల్లి యే కాల్చి చంపింది అనుకొని ఆ మంచి - కొడుకు తన పై నేరం వేసుకోవాలి అనుకున్నాడు. తన కొడుకే చంపాడు అని పొరబడి ఆ మహా తల్లి తన నెత్తి పై హత్యా నేరం వేసుకోవాలి అనుకున్నది". 


"నేను లాక్ - అప్ లో తల్లి కొడుకులకు మెల్లగా నింపాదిగా చెప్పాను .. రిలాక్స్ అవ్వండి .. 2 ఎర్ర బుల్లెట్ మార్క్స్ మీరు నిల్చున్న స్థలం వెనుక వైపు ఉన్న గోడ పై దొరికాయి అని. ఎవరో హనుమంత్ రావు ను వెనుక వైపు నుండి కాల్చారు కిటికీ నుండి, బాల్కనీ లో నిల్చుని", అని. 


"అప్పుడు వెంటనే ఇద్దరూ .. అదే తల్లి కొడుకులు .. 

 సంతోష మనస్సులలో - రిలాక్స్డ్ హృదయాలతో .. ఈ సారి .. ఇప్పుడు .. ఒప్పుకున్నారు .. తాము పీస్తోల్ కాల్చలేదని. ఎందుకు? తన మనిషి కాల్చలేదు అని తెలిసిపోయింది కాబట్టి .. తన నెత్తిన వేసుకొనే త్యాగం కు అవసరం లేదు కాబట్టి ". 


"వారికి, ఆ తల్లి కొడుకులకు, ఆ వ్యాపారి హనుమంత్ రావు పెద్ద మొత్తం లో డబ్బు బాకీ ఉన్నాడు. ఏళ్ల తరబడి తిప్పుతున్నాడు ఆ మోసకారి. తమ డబ్బు అడగటానికి వెళ్లారు ఆ ఇరువురు అంతే". 


"మీకు ఈ రాత్రి యే ఆ అసలైన హంతకుడిని అప్పగిస్తాను" అని జడ్జీ గారికి చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు డిటెక్టివ్ పరశురామ్. 


అమాయకులైన తల్లి కొడుకులను, అదే తన ప్రాణ దాతలను తీసుకొని వెళ్ళిపోయాడు తన ఇంటికి. 


9)


రాత్రి పరశురామ్ పోలీసులతో సహా హత్య గది బాల్కనీ కింద ఖాళీ స్థలం లో కాపు కాచాడు - నిఘా పెట్టడు. ఆశ్చర్యం. హనుమంత్ రావు బిజినెస్ పార్టనర్ గోవింద్ రావు అక్కడికి వచ్చాడు. ఇటూ అటూ ఏదో వెతుకుతున్నాడు. 


"బాల్కనీ కింద నువ్వు కాల్చిన పిస్తోల్ జారి పడిపోయింది. దాని కోసం వచ్చావా గోవింద్ రావు. నీ పిస్తోల్ నాకు దొరికింది. అనుమానం వచ్చి ఈ కాళీ స్థలంలో వెతుకు తున్నప్పుడు. దాని కోసం రాత్రి చీకటి లో నువ్వు వస్తావని నాకు తెలుసు". 


"అందుకే కావాలనే మేము పేపర్ లో (దిన పత్రిక లో) ప్రకటన ఇచ్చాము తల్లి కొడుకులు ఒప్పుకున్నారని హత్య చేసినట్టు. అది చూసి నువ్వు ధైర్యంగా వెంటనే వస్తావని చేజారిన పిస్తోల్ కోసం అని నేను ముందుగానే పసి గట్టాను. హనుమంత్ రావు స్మార్ట్ ఫోన్ లో మీ ఇరువురు వైరం పగ ప్రతీకారం తో ఇచ్చుకున్న మెసేజెస్ చూసాను. నీకు అతడు కోటి రూపాయలు ఇవ్వకుండా తిప్పుతున్నాడు అని తెలుసుకున్నాను ఆ మెసేజెస్ ద్వారా. అతడి తరువాత నువ్వే ఆ బిజినెస్ ఎంపైర్ కి డైరెక్టర్ అవుతావని కూడా తెలుసుకున్నాను". 


హత్య జరిగిన రోజు, సీసీటీవీ లో కూడా, జన సమూహంలో ఉన్న నీ ముఖం చాలా సంతోషం గా వెలగటం చూసాను. యువర్ గేమ్ ఇస్ అప్ .. నీ ఆట సమాప్తం", అన్నాడు పరశురామ్. గోవింద రావు ను కస్టడీ లోకి తీసుకున్నాడు పరశురామ్ ఇతర పోలీసులతో సహా. 


"రాక్షసుడు మోసగాడు చస్తే పండగ సంతోషం" అన్నాడు గోవింద రావు జీప్ ఎక్కుతూ. 


--------- కొస మెరుపు కథ సమాప్తం -----------------


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






Comments


bottom of page