#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #హనుమాశతకము, #HanumaSathakamu, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems
Hanuma Sathakamu - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 07/11/2024
హనుమా శతకము - తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
1.) అంజన కేసరి పుత్రుడ
సంజీవ నగను వహించి సహజపు బలుడా
కంజదళ నేత్రు రామును
రంజన పరుచగ సతతము రంజిల హనుమా
2.) భావన ధోరణి వారధి
నీవని దలతురు జనమున నిక్కము గాగన్
రావణు రాజ్యము జెడిపిన
దావరి నీవని జగమున దలుతురు హనుమా
3.) సుందరు డనమడు పేరును
అందము గనుచును తలియగి అంజని బెట్టన్
అందరు బిలిచెడి బేరన
సుందరు బదులుగ హనుమని జూస్తును హనుమా
4.) రవికడ విద్యలు నేర్చిన
రవికుల తిలకుడు రఘుపతి రాముకు భాజీ
అవనిజ చిరునామెదకిన
రవిసుతు సచివుడ వనగను రవిసిసు హనుమా
5.) అతులిత దీక్షా దక్షత
మతినిక దలచిన హనుమయె మారుతి యనగన్
సతియన లేనగు వటకుడు
అతిగను రామును దలచెడి అనుమయె హనుమా
6.) సుందర కాండలొ హనుమయె
అందరు యెరిగిన అధిపతి అనగను ఉండన్
సుందరి జానకి వెదికిన
సుందరు డనుమయె వినగను సుగుణుడు హనుమా
7.) అంజన తనయుడె రుద్రుడు
రంజన గలుగగ పుడమిన రాజిలు చుండెన్
భంజన జేసెను లంకను
అంజన సుతునిక ఘటికుడు అనగను హనుమా
8.) రాముడు దేవుడు అయితెను
రాముని కీర్తిని దెలుపను రాముని సేవన్
రాముని సరసనె మారుతి
రాముని దలచుచు నిలిచియు రాజిలె హనుమా
9.) వానర వీరుల చెలిమియు
వానర శ్రేష్టుడు హనుమిక వదలక యుండెన్
దానవ వీరుల దునిమియు
దానిక లక్ష్మణు అసువుల దాతయె హనుమా
10.) సీతది శోకము అణచియు
సీతకు రాముని వివరము శీఘ్రము దెలుపన్
ఖ్యాతియు బొందెను హనుమిక
రాతిరి పగలుయు దలుచుచు రామునె హనుమా
11.) శ్రీరాము బంటు హనుమ
శ్రీరాము విడువక మెలగు శీలము తోడన్
శ్రీరాము సతియు సీత
శ్రీరాము కడకు నయించె శీఘ్రము హనుమా
12.) వేధ సుత సువర్చలసతి
కాదని చెప్పిన వదలక కపిలుడు ముదలన్
దీధితి మంతుని ఆనతి
కాదనక హనుమ ఒడబడె కానగ హనుమా
13.) హనుమన కేసరి పుత్రుడు
హనుమన సూర్యుని మనుమడు హనుమయు అనగన్
కనగను అంజని సుతుడన
హనుమన వాయువు సుతుడును అగునిక హనుమా
14.) రూపున రుద్రుడు అనగను
దాపున నిలిచెను రఘుపతి దాసుడి వలెనన్
ఏపని అయినను హనుమిక
ఆపక చేయును కపిరథు ఆనతి హనుమా
15.) హనుమన శివాంశు సంభవు
డనగను వాయువుకును సుతుడగునన జూడన్
హనుమయు శూరుడు ధీరుడు
హనుమను దలచిన తొలగును అంజిక హనుమా
16.) రవికిని మనుమడు హనుమన
రవిసుతు సచివుగ నిలిచియు రాజ్యము నేలన్
రవికుల తిలకుని బంటుయు
రవిసుత సతిగను సువర్చ లాయెను హనుమా
17.) మకర ధ్వజుడనెడు కొడుకుయు
వికర్తను సుతకన గలిగె వినగను అతడే
ప్రకటము హనుమకు సుతుడని
సకలము జనులును దెలియగ సహురిన హనుమా
18.) చిరజీవి యగునటు హనుమ
వరముగ బొందెను అనగను వసుధను బతుకన్
ధరణిలొ హనుమయు గలడని
నరులును అనెదరు హనుమను నమ్ముచు హనుమా
19.) వనమున బతుకుట చేతను
అనెదరు వాలము గలుగగ అనుమను కపనిన్
కనగను కేసరి రాజుయె
వనముకు చరితము జదువగ వసుధన హనుమా
20.) పరమాత్మ రాముడు అయితె
ధరణిజ జీవాత్మ అనగ ధారుణి యందున్
ఇరువురి అనుసంధానము
మరియిక చేసెను తగినటు మారుతె హనుమా
21.) సకలగు గుణసంపన్ను డు
సకలము దేవత బలమును సత్యము జేయన్
నికరపు వజ్రపు దేహుడు
వికర్తను సిసుడును అనగ విశ్రుతి హనుమా
22.) నిత్యము హనుమను గొలచిన
సత్యము పున్నెము గలుగును సకలము బాధల్
రత్యము వేగము తీరన
సత్యము తొలగుట జనులలొ సహురిన హనుమా
23.) నమ్ముచు హనుమను దలచిన
కమ్మిన దోషము తొలగును ఖచ్చిత మనగన్
రమ్మన రావిక ఇడుములు
నిమ్మళ మనగను బ్రతుకుట నిక్కము హనుమా
24.) దయ్యము అనెడును భ్రాంతిని
చయ్యన తొలగించు హనుమ చండుడు అగుచున్
దయ్యపు జాడలు మరుగగు
బయ్యము హనుమచె తొలగును భక్తన హనుమా
25.) స్రష్టయు ఒసగెను హనుమకు
అష్టమ సిద్ధుల ననగను అతనికి ఇంకన్
కష్టము కలుగక ఉండెడు
ఇష్టము అగునటు దళపము ఇంకను హనుమా
26.) పంపా నదికిని తీరము
సొంపారగనన గనెనన అంజని సొగసున్
ఇంపారగనన హనుమను
కెంపారెడు మోమ గనగ కేసరికనుమా
27.) అనగను కిష్కింధ నగరు
కనగను పంపకు దరినన కనెనన హనుమన్
వినగను అంజని కేసరి
తనయుడు అనగను శివాంశు ధర్మము హనుమా
28.) హనుమంతు డనగ భక్తుడు
కనగను సీతకు రఘుపతి కాప్తుడు అగుచున్
హనుమంతు పేర్లు అధికము
హనుమది గుడిలేని కొటిక అగుపడ దనుమా
29.) రవివెంట నింగినెగురుతు
రవికడ విద్యను అరయగ రాణింపనగన్
కవియును పండితు డాయెను
అవనిన హనుమను గొలువగ అందరు హనుమా
30.) దశరథు యజ్ఞము నందున
వశవవ క్షీరేయి ఇడెను వహతంజనికిన్
ఉశిగల్గంజని ద్రాగగ
యశమన బుట్టిన హనుమన యతడే హనుమా
31.) హనుమయు దెలిపెను సీతకు
వినమని రాముని వివరము వినయము తోడన్
జనకజ వినుచును ఉండగ
గుణగణ రూపము ధరణిజ గుర్తన హనుమా
32.) హనుమన త్రేతా యుగమున
అనగను రాముని అడియడు అగునటు ఉండన్
హనుమయె ద్వాపర యుగమున
అనగను అర్జున కభయము అనుచును హనుమా
33.) కంజుని న్యాయము స్థానపు
పుంజిక స్థలయెను పుడమిన పుట్టెను ఆమే
అంజన కేసరి సతిగ
స్వంజుని వరమున హనుమను స్వజుగనె హనుమా
34.) అంజన కోరిక మీదట
అంజన కడుపున జననము అక్షరు డాయెన్
సంజుడె హనుమన దెలియగ
అంజని పుత్రుగ నిలిచెను ఆనిలి హనుమా
35.) బలముకు ప్రతీక హనుమన
ఇలలో అంతటి బలమన ఈశ్వరు డొకడే
అలికాక్షు మించు లావరి
పలుకగ సకలబ లుడయిన పావనె హనుమా
36.) వాహన మొంటన హనుమవి
వాహము సువరుచల నగను వాయువు సుతుకున్
దేహము బలముగ ఉండియు
సాహస మనగను హనుమకె సాధ్యము హనుమా
37.) వనమున బుట్టగ హనుమను
అనెదరు వానరుడనుచును అవనిలొ జనులున్
కనగను ఆనిలి గూడను
మనిషగు జన్మయె దలువగ మనమున హనుమా
38.) అలనా డనుమయు లేకను
కలయగు రాముడు దశశిరు కదనము అనగన్
బలమున హనుమకు సాటన
ఇలలోన గనమన ఎవరు ఇంతగ హనుమా
39.) రాముని తోడను భక్తన
భీముని తోడను చెలిమన బింకము లేకన్
దేముడు కాకను ప్రజలకు
దేముడు ఆయెను సుగుణము దెలుపుతు హనుమా
40.) వాయువు పుత్రుడు గావున
మేయను పండని రవిగని మేఘము దాటన్
వేయను ఇంద్రుడు కులిశము
ఆయెను వంకర దవడన అనుమకు హనుమా
41.) హనుమయు పండిత శ్రేష్టుడు
జనచక్షు కడను జదువను జయముతొ బొందెన్
వినయము విధేయ తలనగ
హనుమయు నేర్చెను సకలము అవికడ హనుమా
42.) కనగను సుమేరు పర్వత
మనగను సంజీవి కొరకు మారుతి దేవన్
క్షణమున అసువులు నిల్చెను
అనగను లక్ష్మణు కపుడన అబ్రము హనుమా
43.) అణిమా సిద్ధితొ హనుమయు
అణువుగ దేహము అగునటు అనగను జేయన్
కనగనె లంకలొ లంకిణి
హనుమయె పిడికిలి అభిహతి అణిచెను హనుమా.
44.) భుజబలు హనుమయె సీతను
భుజమున గూర్చొని పయనము భూమిజ జేయన్
నిజమగు మనసుతొ కోరగ
భుజబలు కోరిక వలదనె భూమిజ హనుమా
45.) భుజబల మెంతయొ నుండగ
భజరంగు బలియు అనెదరు భక్తులు హనుమన్
విజయము పొందుటె యెరుగుచు
భజనన జేయును రఘుపతి భక్తితొ హనుమా
46.) సదనము లేనగు సీతను
విధివశ మనగనె హనుమయు విటపము క్రిందన్
అదిగని హృదయము అదరగ
కదలెను లంకను వదలక కాల్చను హనుమా
47) సురపతి వలనన వాలియు
అరుణుడు సుగ్రీవు గనెను అదియును వినగన్
గరితగ రుక్ష విరజుడుని
సురతము వలననె హరిహరి సుతులన హనుమా
48.) ఇచ్చిన మాటను దప్పడు
సచ్చరి తుడనగ హనుమయె సహురిన జూడన్
నచ్చిన దనగను హనుమకు
సచ్చీలు డనగ రఘుపతి సహనము హనుమా
49.) సీతను కనగనె జెప్పెను
మాతరొ వినుడిక రఘుపతి మాటలు చెవికిన్
పాతకు రావణు చెంతకు
దూతగ నన్నంపె వదల దుఃఖము హనుమా
50.) సంతస మొందిరి వానర
సంతతి యంతయు జనకజ సంగతి దెలియన్
అంతనె రాముకు వివరము
అంతయు వేగము దెలుపను అరిగిరి హనుమా
51.) అంగద ప్రముఖుల ముందర
సంగతి సీతను గనినటు సంజీవ రాయు
డుంగర మిచ్చుట దెలుపగ
బెంగయు సోదర ద్వయముకు బెడకెను హనుమా
52,) కపిరథు లక్ష్మణు లపుడును
కపిమూకనగను గదులగ కడలిని జేరన్
కపిదొర లెందరొ రాగను
కపిపరి సేతువు సృజించ కడలిన హనుమా
53.) భూసుత దుఃఖము బాపగ
దాసుడు హనుమయు దెలిపెను దానవ మూకన్
వేసుక దిరిగెడి రావణు
ఊసును ఎత్తని దినమిక ఉందని హనుమా
54.) దశరథ నందను లిరువురు
వశమవ లంకను అసురులు వదులుట వరకున్
విశదము పోరని దలచిరి
దశవద నుననగ దునుమను తమలము హనుమా
55.) జాడయు సీతది దెలియగ
చూడను చూడా మణినన చురుకగు మోమున్
వేడెను రాముడు అంగద
తోడుగ కపిపరి ననికని తోషము హనుమా
56.) కపిరథు తోడుగ అనికని
కపిపరి అంతయు కదలిరి కానన మిడిచిన్
ఉపఖండ లంకయు వరకు
ఉపయోగ మగునటు నడవ ఉంచను హనుమా
57.) నడవను నిర్మించ జలధి
నడచిరి లంకకు పయనము ననుచును అపుడున్
సడలగ శమలము సోదరు
లడరగ కపిపరి కలసియు లాతుగ హనుమా
58.) అనిలో రాముడు లక్ష్మణు
డనగను జేరిరి దునుమను డంబపు రావణ్
దునిమిన పిదపనె గలసెను
తనదగు సీతను రఘుపతి తనివితొ హనుమా
59.) సమరము నందున గెలుపుతొ
తమవశ మాయెను నగరము తగులము లేకన్
శమముననువిభీషణునకు
తమకును అబ్బిన పుడమిని తగుననె హనుమా
60.) యుద్ధము నందున పాత్రన
పెద్దది హనుమదె నిజమని పేర్కొన నుండన్
పద్ధతి యెరిగిన విధమున
యుద్ధము నందున తలపడె యుక్తితొ హనుమా
61.) హనుమయు లేకను లేదన
వినగను రాముని చరితము విపులన గనగన్
అనలాం బకుడుని వరమున
హనుమయు బుట్టగ బలమది అగునన హనుమా
62.) హనుమంతు గూర్చి రాముడు
అనెనిటు అద్భుత మనగను అనుమయు జేసెన్
ఘనకార్య మనగ లోకము
కనగను ఎవరును ఎరుగరు కలలో హనుమా ---
63,) అందరి ప్రాణము నిలిపెను
సుందరు డనుమయె అనగను సుగుణము తోడన్
అందుకు ప్రతిఫల మనగను
సుందరు నాలింగన మన సుగుణమె హనుమా
64.) హృదయము నకత్తు కొనియెను
బదులుగ హనుమను రఘుపతి భారము బనులన్
పదిలము జేయుట వలనన
తుదివర కనగను నదియును తుష్టితొ హనుమా
65.) సుందర కాండను జదివిన
అందును పున్నెము మనిషికి అదియే మేలున్
సుందరు డనగను హనుమయె
అందరు ఎరిగిన నిజమది అవనిలొ హనుమా.
66.) అనియన ముగిసిన పిదపను
హనుమ విభీషణు అనుమతి అందగ బోయెన్
జనకజ చెంతకు వేగము
వినయము తోడను జయమును వినగను హనుమా.
67.) అంజని పుత్రుడు హనుమయె
భంజన జేసెను వనమును భద్రుడు అగుచున్
రంజిల ముఖముయు అపుడిక
అంజలి ఒనరిచె మహీజ హర్షమ ననుమా
68.) శంకయు లేకను హనుమయె
లంకను దహనము ఒనరిచె లక్షిత మనగన్
అంకిలి జెందగ అసురులు
బింకము మానక తెగబడె బిగువుతొ హనుమా
69.) శివునికి రావణు భక్తుడు
శివునికి అంశగు హనుమయె శివమును దల్వన్
అవసర మేదియు లేదని
రవమును జేయుచునులంక రాచెను హనుమా.
70.) ఒక్కతె లంకలొ నిలువను
చక్కని సీతను మలికిత చరితని నమ్మే
దెక్కడు వలదని రాముడు
నిక్కము దెలియగ సుశిఖము నిలుమని హనుమా
71.) ఒడయడి మాటను వినగనె
తడయక సీతయు రఘుపతి తమ్ముని గోరెన్
వెడలుము అగ్నిని బేర్చను
జడువక దూకెద నిజమును జనమిన హనుమా
72.) అగ్గిలొ దూకగ సీతయు
భగ్గున మండియు జనకజ భద్రము గుండన్
తగ్గెను రామడు మనమున
నిగ్గుయు దేలగ నరమర నిప్పున హనుమా
73.) కాముక వృక్షము క్రిందను
భామిని సీతను కనగను భద్రత లేకన్
దీమము గూడను లేకను
రాముని సతిగతి కనుమయు రగిలెను హనుమా
74.) రాముని చరితము ఎచటను
గోముగ దలువగ హనుమయె గోచర మవగన్
దేముని స్థానము గూడను
రాముని తోడుగ నొసగగ రమ్యమె హనుమా
75.) జనకజ ననగను వెదకగ
కనబడ లేదను హనుమిక కలతయు జెందిన్
తనకిక బ్రతుకుయు యేలని
తనువును చాలించ మదిని తలచెను హనుమా
76.) ఎచటను రాముని జపమన
అచటను హనుమంతు జపము అనెదరు జూడన్
అచలము కన్నను దృఢమగు
రుచిరపు దేహము అనగను రుద్రుడె హనుమా
77.) వాయువు పుత్రుడు హనుమన
ఆయువు చిరకాల మనగ అగరువు డగుచున్
చేయును రాముని కీర్తనె
మాయని కీర్తన హనుమదె మహిలో హనుమా
78.) కపిభుజ ములపయి నెక్కగ
కపిరథు డాయెను రఘుపతి కాలపు మహిమన్
ఉపకార మొకటియె ననక
కపివరు డనగను నిలిచెను కడదాకనుమా
79.) విజయపు ప్రదాత అనగను
నిజమగు భక్తుడు రఘుపతి నిక్కము అనగన్
భుజబల సంపన్నుడతడు
భజనలు సేయగ సుకృతము భక్తులకనుమా
80.) గురుడగు సూర్యుని పుత్రిని
పరిణయ మాడను విధిగను పవన సుతుడనన్
పరికించ సువర్చలనగ
మరీచి మాలియె పనుచెను మారుతిననుమా
81.) హనుమను దలచిన పనులన
కనగను జరుగును జయముతొ కాదన కుండన్
వినయము తోడను మ్రొక్కగ
ధనముయు ధాన్యము ధరుమము దక్కును హనుమా
82.) విజయుని పతాక మందున
విజయము గోరుతు నిలిచెను వినుచూల్బిడ్డే
వ్రజవరు మిత్రుడు గావున
నిజమగు చర్యని దలచియె నిలిచెను హనుమా
83.) తల్లియు బెట్టిన పేరును
ఎల్లరు పలుకక హనుమనె ఎరుగుదు రనగన్
తల్లియె సుందరు డనుచును
ఉల్లము రంజిల బిలుచుచు ఉండెను హనుమా
84.) సుతుడన శివునికి వరమున
సుతుడన కేసరి కనగను సురభిన హనుమే
సుతుడన అనిలుని కనగను
సుతుడత డంజని సుగుణపు సుందరు డనుమా
85.) సుందరి యనగను సీతగు
సుందరు డనగను హనుమయె సుందర మనగన్
మందిర ములనగ లంకలొ
సుందరము కపివర నడత చూడగ హనుమా
86.) అంచిత భావము తోడను
పంచముఖంశజు గొలచిన పరిపరి విధముల్
మంచియు జరుగును కనగను
ఇంచుక నష్టము అనకను ఇలలో హనుమా
87.) జీవన ముండుటె సుఖమని
లావుగ దలచెను హనుమయె లంకలొ సీతన్
త్రోవయు దొరకక వెదకన్
చావుకు సిద్ధము పడుచును చపలత హనుమా
88.) ముఖమున సింధూర మలద
సుఖమని రాముని కనుచును సుగుణ కుజనగన్
నఖశిఖ పర్యంత మలదె
సుఖమని రఘుపతి కనుచును సుందరుడనుమా
89.) సమరము ముగిసిన పిదపనె
విమలపు చరితుడు రఘుపతి విజయము దెల్పన్
కమలాప్తు మనుమడు హనుమ
తమకము తోడను అయోధ్య తరలెను హనుమా
90.) భరతుని కెరుగను జేయగ
అరగెను రఘుపతి నయోధ్య అధిపతి జేయన్
త్వరగను నియతము జరిగెడు
ధరుమము నీదనె హనుమయె దమ్మునికనుమా
91.) మాటల పద్ధతి బట్టియు
మాటనె రాముడు హనుమని మారుతి నపుడున్
దీటగు వ్యాకరణవిధము
రాటును దేలిన విధమనె రాముడు హనుమా.
92.) అపుడిక స్నేహము జేసెను
కపివరు డనుమతొ రఘుపతి కరుణతొ అనగన్
ఉపయోగ మాయెను తుదకు
కపివరు స్నేహమె నిరతము కలుగగ హనుమా
93.) హనుమది చరితము అధికము
హనుమది కీర్తియు అధికము హాయిగ వినగన్
హనుమది భక్తియు అధికము
హనుమన రాముని అడియడు అదినిజ మనుమా
94.) హనుమయు యయాతి కభయము
తనుగను గాపాడ నొసగ తామస మొందిన్
అనుశిష్టి నొసగ రాముడు
వినకను తలపడె విదార విధముకె హనుమా
95.) అరయగ దేవత లందరు
వరముల నిచ్చిరి హనుమకు వరుసగ బలముల్
దొరయగ చిరజీవి గనన
నిరతము నిలువను పుడమిన నిర్జరు గనుమా
96.) కులిశము తోడను ఇకనన
నలువది తూపుయు విడువగ నాశము గాకన్
బలమగు వరములు ఒసగిరి
ఇలలో జనులకు అభయము ఈయను హనుమా
97.) హనుమయు జేసిన సేవకు
మనమున రాముడు దలువగ మదియది గనుచున్
మనసది ఇంగిత మనుచును
జనకజ ఒసగెను హనుమకు చౌకిని హనుమా
98.) ఎంతయు శూరుడు అయినను
కొంతయు సహజపు గుణమును కోల్పో కనగన్
చింతయు లేకను చిలిపిగ
గంతులు వేయుచు హనుమయు గనుపించనుమా
99.) ఏపని కైనను వెరువక
ఆపని ముగుయుట వరకును అంజని సుతుడున్
ఓపిక తోడను మొదలిడి
వీపున బరువును వదలని వీరుడు హనుమా
100.) కలువలు మల్లెలు తులసియు
వెలియాకు సరడు హనుమకు వేయగ తృప్తే
ఇలసుత గూడను హనుమక
మలమగు చిత్తము ఒసెగవి మర్యాదనుమా
101.) అందరు వేల్పుల లోనను
సుందరు డనుమనె కొలువగ సుఖముల నీయున్
దెందము ఆనంద మనగ
పొందును హృదయము సతతము పొందిక హనుమా
102.) విషనా గనగను జూడగ
విషధరు లింగము గిరిగొను విపులను గనగన్
విషధరు అంశన బుట్టిన
విషమన అంటక హనుమన విజ్ఞుడు హనుమా
103.) పొగరన ఎరుగని హనుమకు
పొగరన రాముని బకితియె పొద్దును మాపున్
జగమున దేవుడు అనగను
యుగముల తరబడి నిలిచెడు యుక్తది హనుమా
104.) మహిరా వణునిని కొలువున
మహనీయు డనుమయు గనెను మకర ధ్వజుడినిన్
మహబల శాలిగ తనసుతు
మహిమయు దెలిసియు దలపడె మారుతి హనుమా
105.) మంగళ పతిసుతు డనగను
మంగళ వారము జనించె మారుతి యనగన్
పొంగగ మూతియు హనుమయె
సంగతి దెలియగ సురపతి శంబవ మనుమా
106.) అంజన పుత్రుని గొలువరి
భంజన సేయును కరుణతొ భయమును వీడన్
రంజన గలుగగ నిరతము
పంజర బ్రతుకుల ఇడుములు బాపును హనుమా
107.) రాముని ఈడన హనుమకు
రాముడు నవమిన జనించ లంకా దహియున్
రాముని పిదపను పున్నమ
జామున బుట్టెను వినగను జగమున హనుమా
108.) సూకము సుతుడగు హనుమయు
రాకన జననము జరుగగ రవికిని దోడున్
లోకము నందున నిలిచెను
శోకము ఎరుగక జనముయు శోభిల హనుమా--.
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments