top of page

హరి- హరి సంవాదము

Updated: Aug 19, 2023


'Hari Hari Samvadam' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'హరి- హరి సంవాదము' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి


హరి అంటే దేవుడు అంటే శ్రీ మహా విష్ణువు.

హరి అని మనిషిని కూడా అంటారు-

హరుడు అంటే శివుడు ఐనా శివ కేశవులు ఒకటే అంటారు. హరిహర నాథుడు అంటే భగవంతుడు- శివాయ విష్ణు రూపాయ- శివ రూపాయ విష్ణవే


శివస్య హృదయం విష్ణు విష్ణుర్విష్నోశ్చ హృదయం శివ


•{శివుణ్ణి పూజిస్తే విష్ణువును పూజించినట్టే. శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరినీ ద్వేషించినట్టే. ఈ పరమార్థాన్ని చెప్పేవే పంచారామాలు}.


ఇప్పుడు కథలోనికి వస్తే ఇక్కడ ఆస్తిక- నాస్తిక వాదములో ఆస్తికుడైన భాస్కర శర్మ నాస్తికుడైన శంకరా చార్యకు భగవంతుని గూర్చి విడమర్చి జెప్పుట. మరియు భాస్కరశర్మ కలలో భగవంతునితో సంవాదము చేసి భగవంతుడే గొప్ప అని నిర్ధారించుకొనుట.


ఇక కథలోకి..

భాస్కర శర్మకు దేవుడంటె అపరిమిత నమ్మకం. దేవుడు లేడనే వారితో అందరూ వాదించకుండ ఉంటే ఇతను మాత్రము వదులకుండా వాదిస్తుంటాడు - భాస్కర శర్మ ఇంకా వాదనలో భాగంగా ఆయన అనేది-

దేవుడు నిక్కచ్చిగా ఉన్నాడు-

పంచేంద్రియాలతో పాటు జీవికి నడువడానికి కాళ్ళు, పని చేయడానికి చేతులు, చేతులకు పట్టు ఉండడానికి వ్రేళ్ళు, కాళ్ళకు వ్రేళ్ళకు గోళ్ళు, నములడానికి పళ్ళు-గ్రహించడానికి మనసు, జ్ఞానము, పలుకడానికి, తినడానికి నోరు అట్లనే ఉపయోగార్థము నవరంధ్రాలు-


పంచేంద్రియాలకనుకూలమైన కనులు, ముక్కు, నాలుక, చెవులు, చర్మము, ఆహారము కొంత కాలానికి నిలువ ఉంచుకోవడానికి ఉదరము, సంతానము పొందడానికి హంగులు అందులో కలిగే తృప్తి భావన ఇన్ని ఉండి ప్రపంచాన్ని, గ్రహాంతర యానానికి గల తెలివి, మనకు అనుకూల వస్తువులు, తిండి గింజలు ఇత్యాదివాటీ సృష్టికి సాంకేతిక జ్ఞానము- చెప్పుతూ పోతే ఎన్నో వసతలు కల్పించిన ఆ భగవంతుడు లేడను మూర్ఖ జ్ఞానము కూడా దేవుని మాయయే అని జీవుడు గ్రహించాలి అంటాడు భాస్కర శర్మ.


ఇంకా వాదనలో భాగంగా ఆయన అనేది


ఎక్కడ ఎక్కడ దేవుడని ఎకసక్కాలాడకు

నీలోనే ఉన్నాడు కాస్త మేలుకొని చూడు మరి

కనబడ లేదని దేవుడు మనసు గూడ లేడనుకోకు

నొప్పి నీకు కనబడదు తప్పునా ఆ బాధ నీకు


చీకటే లేదనినప్పుడు వెలుగునకు ప్రాముఖ్యముండునా

ఉన్నడనే నమ్మకం ఉదయించినప్పుడే

లేడనే నినాదం లేవదీయుచుందురు

పసిబిడ్డ పుట్టగానె పాలకొరకు వెదుకును

ప్రకృతి మాయలోన మనమంతా పసివాళ్ళమె

దేవుడెక్కడని దేవురించు మనసంతా

చీకటిలో కనిపించుటకు తోడ్పడు ఆ వెలుతురె దేవుడు


నీలోనే ఉన్నాడు దేవుడు నీ చేరువలోనె ఉన్నాడు దేవుడు

తెలిసిన మార్గం నమ్మలేక తెలియని త్రోవ వెదుక బోకు

పలు తీరులు తిరిగిన ఫలితమేమి

ప్రాణమంటె దేవుడు కదలికంటె దేవుడు


ప్రకృతి వింతలకు పరమాత్మయె కారణమ్ము

మిణుగురు పురుగులోన మినుకు మినుకు మను వెలుతురు

ఆ వెలుతురెక్కడిదొ ఆలోచన జేస్తివా

ఆ శక్తియె దేవుడు ఆ యుక్తియె దేవుడు


అయస్కాంత శక్తిలోన ఆకర్షణ వికర్షణ అణిగియుండు

ఇనుము చెంత జేరగాని ఇనుమడించు దాని శక్తి

ఇనుములాంటి దృఢత్వం మనలోన ఉన్నప్పుడు

అయస్కాంతమను దేవుడు ఆకర్షించును మన మనసును

పంచేంద్రియ జ్ఞానమైనా పంచాంగ పరిజ్ఞానమైనా

నిక్కముగా భగవంతుని మాయయె.


ఆ దేవుడె లేకుంటె ఈ జీవుడు మనగలుగునా

నీటిలోన గాలిలోన నీలోన నాలోన

ఎక్కడైనా దేవుడు నిక్కముగా ఉన్నాడు.


ఇలా కొంత మందిని తన దారిలోకి తెచ్చుకుంటాడు భాస్కర శర్మ-


ఇంకా గుంపులో మిగిన వారిలో శంకరా చార్య అను నాస్తికుడు ‘మీ వన్ని మాట నిలబెట్టుకునే భావాలు. అసలు దేవుడనే వాడే లేడు’ అని గట్టిగా వాదిస్తుంటాడు.


“అసలు నీవు ఏమి చేస్తుంటావు?” అని అడుగుతాడు భాస్కర శర్మ శంకరా చార్య తొ-


“నాకు ఒక తోట ఉంది, కూరలు, కాయలు, పండ్లు పూలు పండిస్తుంటాను” అంటాడు శంకరా చార్య.


“పూలలో పరిమళం, పండ్లలో షడ్రుచులు, భూమిలో ఏ విత్తు పెడితె ఆ విత్తుకు తగిన రూపము, గుణము, రంగు, రుచి వాసన ఎక్కడి నుండి వస్తున్న వనుకుంటున్నావు? ఇవన్ని నీ వల్ల సాధ్యము కావు గద.. వాటిలో ఏ లక్షణము మార్చలేవు. అదంతా దేవుని మాయయే అని మేము దృఢంగ నమ్ముచున్నాము” అంటాడు భాస్కర శర్మ.


“అసలు నీపేరు శంకరాచార్య. శంకరుడు ఎవరంటె మేము నమ్మిన త్రిలోకనాథుడు- మరి నీకా పేరు ఎందుకు?” అంటాడు భాస్కరశర్మ.


“ఎప్పుడైతె నువ్వు నాస్తిక వాదుడవో అప్పుడు నీ పేరు దేవుండ్లవి పెట్టుకుంటె నీ వాదనకు పస లేదు. ముందు అది ఆలోచించు” అనగానే అక్కడినుండి లేచి వెడలి పోతాడు శంకరా చార్య.


మరునాడు మళ్ళీ వస్తాడు శంకరాచార్య- వస్తూనే అంటాడు “మీ భావన కొంతవరకు సబబే అని తోస్తున్నది. ఐనా నాకు ఇంకా కొంత అపనమ్మకము నా మనసును తొలుస్తున్నది” అంటాడు శంకరాచార్య.


“నీ అనుమాన నివృత్తికి నేను కొన్ని మాటలు చెబుతాను విను” అంటు నాస్తికులు, ఆస్తికులను చూసుకుంటూ అంటాడు.


పంచ భూతాలను పంచుకొని బ్రతుకునీడ్చు ప్రజల్లారా

మరువకండి హరి నామం మరి కొలువరండి శ్రీహరి పాదం

కాల మందే దేవుడు కలసి ఉన్నాడు ఈ

నేల మీది జీవులకై నిలిచి ఉన్నాడు

నీ వెంట నీడలా నీ కంటి పాపలా నిలిచి ఉన్నాడు


అంబరాన సూర్యుడై నేలపైన అంబువై

ప్రాణమిచ్చు గాలియై ప్రజ్వరిల్లు తేజమ

నిలువ నీకు స్థానమై

పంచ భూతాలను నీ పంచ జేర్చినాడు

ప్రపంచాన బ్రతుక నీకు పట్టు ఇచ్చినాడు


తల్లి పాలలోనె నీకు తగిన పాళ్ళ ధాతువై

శ్రీ వల్లినాథుడారోగ్య సిరుల నిచ్చినాడు

పసిపాపగ నీవుండగ పరమాత్ముడె నీయందు

పరివేష్టితు డయ్యాడు

ఈడు మీద పడగానె నీతో ఆడుకొన జూస్తాడు


అడుగడుగున ఆపదలకు అతడె కారణం

అవి నివారించు శక్తి యుక్తి రక్తి దాయకం

కష్ట పడే అలవాటు ను కలిగించునదతడే

కష్టానికి ఫలితాన్ని కడకు నిచ్చునదతడే


శిక్షకుడు రక్షకుడు శ్రీమన్నారాయణుడే

పక్షపాత మెంత లేని పరమాత్ముడతడే


ఇప్పుడైనా అర్థమైందా అంటాడు భాస్కర శర్మ.


చాలా మంది భాస్కర శర్మతో ఏకీభవిస్తారు శంకరాచార్యతో సహా.


ఒకనాడు రాత్రి నిద్రలో భాస్కర శర్మ కు కలలో తను ఊహించుకున్న ఆకారములో భగవంతుడు కన బడుతాడు-


భగవంతునికి మ్రొక్కి ఆ క్షణములో నాస్తిక పాత్ర పోషిస్తూ “సృష్టిలో నువ్వే గొప్ప అని లోకులు అంటారు. కారణ మేమిటి?” అంటాడు- భాస్కర శర్మ.

భగవంతుడు -- “సృష్టి అంటేనే నేను” అంటాడు.


భాస్కర శర్మ -- మరి మానవుల మైన మేమూ సృష్టించుచున్నాము గదా.

భగవంతుడు-- అవును నన్ను తలచుకొనే మీ అవసరాలకు తగినవి సృష్టించుకొను చున్నారు.


భాస్కర శర్మ-- నువ్వు లేనిది ఏదీ కాదంటావా?


భగవంతుడు- శివునాజ్ఞ లేనిది చీమైనా కదలదని మీరే అంటారు.

భాస్కర శర్మ-- మేము ఇప్పుడు చంద్ర గ్రహము, అంగారక గ్రహము తాకుచున్నాము గద.


భగవంతుడు- భగవంతుని దయ వల్లనే అని మీ శాస్త్రజ్ఞులే అంటుంటారు.


భాస్కర శర్మ-- మేము నైవేద్యము పెట్టనిదే నీ కడుపు నిండదు కద?


భగవంతుడు-- నా కడుపు ఎంత సూక్ష్మమో అంత విశాలము- మీరు నైవేద్యము పెట్టినా పెట్టకున్నా మీ కడుపు నిండాలి. అందుకొరకే నేను మీకు సకల సదుపాయాలు కలిగిస్తున్నాను.

భాస్కర శర్మ -- మరి నాస్తికుల సంగతో

భగవంటుడు-- మీ పిల్లలు మొండి చేస్తె మీరు తిండి పెట్టక పస్తులుంచడానికి మీ మనసొప్పుతుందా?

భాస్కర --ఇక చాలు భగవంతుడా.. నువ్వే గొప్ప”

అనేలోగా ప్రక్కనున్న కూజా పడి శబ్దమౌతుంది.

అప్పుడు మెలకువ వస్తుంది భాస్కర శర్మకు.

సమాప్తం.


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Commentaires


bottom of page