#DinavahiSathyavathi, #దినవహిసత్యవతి, #Harithayathra, #హరితయాత్ర, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు
'Harithayathra' - New Telugu Story Written By Dinavahi Sathyavathi
Published In manatelugukathalu.com On 04/11/2024
'హరితయాత్ర' తెలుగు కథ
రచన: దినవహి సత్యవతి
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
అనన్య, కారుణ్య, శరణ్య ఒకే కాలేజీలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు. భాషలు వేరైనా భావాలు మిళితమై మంచి స్నేహితులయ్యారు.
అనన్య ఒక మధ్య తరగతి కుటుంబంలో, నలుగురు ఆడపిల్లల్లో కడపటిది. కారుణ్య తండ్రి మహారాష్ట్రలోని ఒక బహుళార్థసాధక కంపెనీలో మేనేజర్. శరణ్య కేరళలోని ఒక పేద కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయి.
ముగ్గురూ ఇంటర్మీడియట్ పాసయ్యాక, విశాఖపట్నంలో, ఆంధ్రా యూనివర్సిటీ పరిథిలోని, ఒక కాలేజీలో, పర్యావరణ శాస్త్రం ముఖ్యాంశంగా, డిగ్రీ చదువుతున్నారు.
విశాఖపట్నం సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో, నగరంలో భౌతికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో ఒకటి రహదారుల విస్తరణ. దానికోసం వందలాది పచ్చని చెట్లు నేల కూల్చబడుతుండడం స్నేహితురాండ్రని ఎనలేని మనస్తాపానికి గురిచేస్తోంది.
“ఇవాళ ప్రొద్దున హాస్టల్ నుంచి కాలేజీకి వస్తున్న త్రోవలో యాభై సంవత్సరాలనాటి ఒక పచ్చని చెట్టును కొట్టేయడం చూసానే. మనసు పిండినట్లైందనుకో” మనసులోని బాధను పంచుకుంది శరణ్య, స్నేహితురాండ్రతో.
“నువ్వెళ్ళి అడగలేదా వాళ్ళని అలా ఎందుకు చేస్తున్నారని?” కోపంగా అంది కారుణ్య.
“అడిగానే కానీ, ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. వాళ్ళేం చెబితే మేమది వినాలి. అయినా చదువుకునే దానివి నీకెందుకమ్మా ఇవన్నీ, పోయి నీ పని చూసుకో” అంటూ చాలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారే.
“హూ...” అనన్య చెప్పింది విని దీర్ఘంగా నిట్టూర్చింది కారుణ్య.
“మొన్నటికి మొన్న, నేను అద్దెకుంటున్న ఇంటి ప్రాంగణంలోని చెట్టు కొమ్మలు పక్కింట్లో వాలి చెత్త పడుతోందని, వెంటనే ఆ చెట్టును కొట్టించేయమని, పక్కింటాయన పెద్ద గొడవ పెట్టుకున్నాడు. మా ఇంటి యజమానురాలు, ఇష్టం లేకపోయినా, ఇరుగూ పొరుగూతో గొడవలెందుకని, ఆ మహావృక్షాన్ని కొట్టించేసిందే. ఆ తర్వాత, ఆ చెట్టు, ఆవిడ పుట్టినప్పుడు, ఆవిడ తల్లిదండ్రులు నాటారనీ, అది తనకి ప్రాణంతో సమానమని నాతో చెప్పుకుని కన్నీళ్ళు పెట్టుకుందే పాపం” అంది అనన్య.
“ఏమిటే ఇదంతా! అసలేం జరుగుతోంది మన చుట్టూరా! పచ్చని చెట్లు ప్రకృతి మనకిచ్చిన అమూల్య వరాలని వీళ్ళెందుకు మర్చిపోతున్నారు? మన చుట్టూ ఉన్న ప్రకృతికి ఇంత అన్యాయం జరుగుతున్నా, చేతకాని వాళ్ళల్లా మౌనంగా చూస్తూ ఊరుకోవడానికేనా మనం ఈ పర్యావరణ శాస్త్రం చదువుతున్నాము?” అనన్య చెప్పినది విని కలత చెందింది కారుణ్య.
“ఎంత చిత్రమో చూసారా! ఇంత జరుగుతున్నా కూడా అందరూ నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంటున్నారు. ఇదిలాగే కొనసాగితే మన ముందు తరాలకి మనం ఏమని సందేశం ఇచ్చినట్లు?” అనన్యలో ఆవేదన.
“అవునే నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసేకంటే మనమే పూనుకుని ఈ దిశగా ఏదైనా చెయ్యాలి. చేద్దాము. ఏమంటారు?” స్నేహితులని అడిగింది కారుణ్య.
“తప్పకుండా చేద్దామే. నీకెమైనా ఆలోచన ఉందా ఏం చేయాలో?” ప్రశ్నించింది శరణ్య.
“అవును ఒక ఆలోచన వచ్చింది” అంటూ తన ఆలోచనని అనన్య, శరణ్యలతో చెప్పి, “మీకిద్దరికీ అంగీకారమైతే మన డిగ్రీ పరీక్షలు ముగియగానే, దీనిని అమలుపరుద్దాము. ఈలోగా మన ఇంట్లో వాళ్ళకి తెలియపరచి, వాళ్ళ సహకారాన్ని కూడా అడుగుదాము” అంది కారుణ్య.
“నువ్వు చెప్పినట్లే చేద్దామే. ఇవాళే మావాళ్ళతో చర్చిస్తాను ఈ విషయం” అంది అనన్య.
“నేను కూడా అమ్మానాన్నలకి చెప్తాను” అంది శరణ్య.
“మనం చేయబోయేది ఒక బృహత్కార్యం. అందుకు అవసరమైన ధన, వస్తు సహాయం మా నాన్నని అడుగుతాను. తక్కప ఒప్పుకుంటారని నా నమ్మకం” అంది కారుణ్య.
!+!+!
కాలచక్రం నాలుగు నెలలు గిర్రున తిరిగింది. డిగ్రీ పరీక్షలు దిగ్విజయంగా ముగించుకున్నారు అనన్య, శరణ్య, కారుణ్య. తదుపరి, ముందుగానే నిశ్చయించుకున్న ప్రకారం, పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలలో అవగాహన కలిగించాలనే సంకల్పంతో, తమ ద్వి చక్ర రథాలు, సైకిళ్ళ, పైన యాత్రను ప్రారంభించారు ముగ్గురూ.
స్నేహితురాండ్ర హరిత యాత్రాసంకల్పం నెరవేరాలని ఆశీర్వదిస్తున్నట్లుగా మలయమారుతాలు వీచాయి!
*****
దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya
పేరు: దినవహి సత్యవతి
విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;
వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.
ప్రవృత్తి : రచనా వ్యాసంగం.
సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.
పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.
గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.
పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.
ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.
6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.
ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &
గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);
పంచామృతం!(సత్య! పంచపదులు)
స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in
Comments