#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Hitokthulu, #హితోక్తులు
Hitokthulu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 06/12/2024
హితోక్తులు - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
పూలు పూస్తే సువాసన
మేలు చేస్తే దీవెన
తేలు వంటి స్వభావము
కలుగజేయు ప్రమాదము
కోరుము పరుల క్షేమము
పోరు వలన నాశనము
పేరు వచ్చు పనులెన్నో
జోరుగా తలపెట్టుము
పుస్తకమే చదివితే
మస్తకమే వెలుగుతుంది
బద్ధకమే వదిలితే
వృద్ధి మిగుల జరుగుతుంది
కన్నవారి సన్నిధిలో
ఉన్న వారు ప్రేమలో
మిన్న కదా! ఆనందము
ఎన్నతరమా! భాగ్యము
-గద్వాల సోమన్న
Commentaires