top of page

హోళి…..హోళి…..హోళి

Writer: Neeraja PrabhalaNeeraja Prabhala

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #Holi, #హోళి


Holi - Holi - Holi - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published In manatelugukathalu.com On 14/03/2025

హోళి…..హోళి…..హోళి - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) 


రంగుల సరదాహోళి….రసమయకేళి.

సరాగాల హోళి….సరస సయ్యాటకేళి.

పుడమినిండా  పున్నమికాంతులు  విరజిమ్మే   వివిధ వర్ణాల హోళి. 

 కడలి అలల  పొంగులతో  పోటీపడే  మానస  సంద్రకేళి  హోళి.

ఈ పండుగ  ఎప్పుడెప్పుడొస్తుందా   అని  వేయికళ్లతో  ఎదురుచూసే  హోళి. 

 ఆనందానుభూతులను  పెంపొందించే  అందాల హోళి.

పిల్లలు‌, యువతలు  ఉత్సాహంతో  ఛెంగున  గంతేసే  ఛాంగుభళా హోళి. 

ముదిమి వయసుని  మరిపించే  కేళి   హోళి. 

శారీరక, మానసిక  మనోరంజక  మధురహోళి.

కామదహనాన్ని  జరుపుకునే  హోళి.

వాడ వీధులు   సరదా కేరింతలతో  హోరెత్తించే  హోళి.

బావామరదళ్లు   సరస సల్లాపాలతో సయ్యాటాలాడే  హోళి.

ప్రేమికుల సరదాల కేళి  ఈ హోళి. 

మనుషుల మధ్య  స్నేహ  సౌభ్రాతృత్వాన్ని  పెంపొందించే  హోళి.

శతృవులను  మిత్రులుగా  చేసే సహేళకేళి  ఈ హోళి.  

రంగురంగుల  పువ్వులతో  రంగరించే హోళి.

దాండియా, కోలాటాలు, డప్పు నృత్యాలతో  నాట్యమాడే నయనానంద  హోళి. 

అందరి  పెదవులపై  చిరునవ్వు దరహాస కాంతి  వెలిగే హోళి. 

మనుషుల  ముఖకవళికలను  రంగుల మయం చేసే  రసకేళి హోళి. 

సరాగరంజిత  రంగుల హోళి  అంటే  సరదా  ఎవరికుండదు? 

నవరస మిళితమైన  సమ్మోహన హోళి. 

మరలా మరలా  రావాలని  వాంఛించే  వాంఛకేళి  హోళి.

అహర్నిశలు  శ్రమకోర్చే సైనికులు  సైతం  సంతోషంగా  జరుపుకునే  మధురానుభూతుల హోళి.  

పామరులు, శ్రామికులు  గజ్జలకాళ్లతో  చిందేసే  చిత్తరాల  రంగుల   హోళి.  

నిత్యం  మన  జీవితాలలో  ఉండాలి  ఈ  రంగులహోళి. 

రావాలి  మళ్లీ మళ్లీ   హోళి. 

మదినిండా  కావాలి  రంగు రంగుల  హోళి. 


-నీరజ  హరి ప్రభల


 
 
 

コメント


bottom of page