#SudhavishwamAkondi, #HolyPandugaHolikaPournami, #హోలీపండుగహోళికాపౌర్ణమి, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticleOnHoli, #తెలుగువ్యాసం

అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు
Holy Panduga - Holika Pournami - New Telugu Article Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 14/03/2025
హోలీ పండుగ - హోళికా పౌర్ణమి - తెలుగు వ్యాసం
రచన: సుధావిశ్వం ఆకొండి
దేశమంతా వేర్వేరు కారణాలతో, రకరకాలుగా ఉత్సవాలు జరుపుకునే వాటిల్లో హోలీ పండుగ ఒకటి. త్రిమూర్తులను దంపతి సహితంగా పూజించే ఒకే ఒక్కరోజు ఈ ఫాల్గుణ పౌర్ణమి (హోళికా పౌర్ణమి).
ఫాల్గుణోత్సవం, కళ్యాణ పూర్ణిమ, డోలాపున్నమి, హుతశనీపూర్ణిమ, కాముని పున్నమి, అనంగపూర్ణిమ, హోళికాదహో, హోళికాపూర్ణిమ, వసంతపూర్ణిమ, హోలీ ఇలా...... రకరకాల
పేర్లతో పిలవబడినప్పటికీ అవన్నీ ఒక్కటే... అదే హోలీ పండుగ.
ఈరోజు జరిపే కార్యక్రమాలు, అనుసరించే ఆచారాలు, జరిపే పూజలు అన్నీ భిన్నమైనవే. అన్నింటి వెనుకా ఆనందంతో పాటు, ఆరోగ్య భావన, ఆధ్యాత్మిక తత్త్వం, సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణ వంటి ఎన్నో అనేక కథనాలు దాగి ఉన్నాయి.
శివపార్వతులను కలిపే ప్రయత్నంలో మదనుడు శివుని ఆగ్రహానికి గురై దహనమయ్యాడు. అతని భార్య రతీదేవి అభ్యర్థన చేసిన మీదట, ఆమెకు మాత్రమే సశరీరునిగా, మిగిలిన వారికి అనంగుడిగా వరం ఇస్తాడు శివుడు. అలా మన్మథుడు తిరిగి బ్రతికిన రోజు ఈ ఫాల్గుణ పౌర్ణమి. కనుక ఈరోజుకి 'కాముని పున్నమి', 'అనంగ పూర్ణిమ' అనే పేర్లు వచ్చాయని మనకు పురాణాలు వివరిస్తున్నాయి.
ఉత్తరాంధ్రా ప్రాంతాలలో శివాలయాల్లో శివపార్వతులను (విగ్రహాలను) డోలిక (ఉయ్యాల) లో వేసి ఊపుతూ ఉత్సవం జరుపుతారు. బృందావనంలో బాలకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి ఊపుతూ, రంగులు చల్లుకుంటూ ఉత్సవం చేస్తారు. ఈ రెండు కారణాల వలన 'డోలా పూర్ణిమ' అనే పేరు వచ్చింది.
మధుర మీనాక్షిదేవి తపస్సు చేసి, సుందరేశ్వర స్వామిని వివాహం చేసుకున్నరోజు కూడా ఫాల్గుణ పౌర్ణమి నాడే అని చెప్తారు. కనుక దక్షిణాది దేవాలయాలలో ఈరోజు కళ్యాణ (లక్ష్మీనారాయణ) వ్రతం చేస్తారు. అందుకే కళ్యాణ పూర్ణిమ అనే పేరు వచ్చిందని తెలుస్తోంది.
ఉత్తర హిందూప్రాంతంలో వసంతఋతువు ఆగమనాన్ని స్వాగతిస్తూ సృష్టికర్త అయిన బ్రహ్మను, జ్ఞానప్రదాత్రి అయిన సరస్వతిదేవిని పూజిస్తారు. దీనినే ఫాల్గుణోత్సవం అని కూడా అంటారు. తమ సంతోషాలని వ్యక్తం చేసుకునేందుకే ఒకరిపైఒకరు రంగుల పొడులు, రంగునీళ్ళు జల్లుకుంటూ "హోలీ హోలీ రే హోళీ.." అంటూ పాటలు పాడుతారు.
మోదుగపూలు తెచ్చి రోట్లో దంచి, కుండలో వేసి, రసం తీసి, వెదురు గొట్టాల్లో నింపుతారు. (ఆ రసం ఎర్రగా ఉంటుంది). దీనికి వసంతం అని పేరు. దాన్ని వారు అందరూ ఒకరిపై ఒకరు జల్లుకొని ఆనందిస్తారు.
అయితే ఇలా ఈ రసం చల్లుకోవడంలో అంతరార్థం... మోదుగపూలు దంచగా కషాయం ఈమాస వాతావరణంలో ఒంటిమీద పడటం వలన శరీరానికి కాంతి, వర్ఛస్సు ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. శరీరంలో కలిగే ఉద్రేకాలు (రక్తపోటు వంటివి) మానసిక దుర్వికారాలు వంటివి తగ్గుతాయి అని ఆయుర్వేదం చెబుతుంది.
హిరణ్యకశిపునికి సోదరి హోళికా అనే రాక్షసి అనీ, అతనికి ప్రహ్లాదుని దహించడంలో సహాయం చేయబోయి అగ్నికి తనే ఆహుతి అయిపోయిన అసురీ శక్తి. అందుకే హోళికా దహనం చేసి, చెడు అంతా దహనం అయిపోవాలని దహనం చేస్తారట.
మన ఆచారాల్లో ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాగివున్నాయి. కెమికల్స్ కలిసిన రంగులు చల్లుకోవడం ఆరోగ్యానికి హానికరం.
అందరికీ హోళికా పౌర్ణమి (హోళీ)
శుభాకాంక్షలు������
సుధావిశ్వం
###
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
コメント