top of page
Writer's picturePitta Govinda Rao

ఐ లవ్ మై ఫ్యామిలీ



'I Love My Family' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 02/02/2024

'ఐ లవ్ మై ఫ్యామిలీ' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


మన దేశంలో వివాహం అనేది చాలా చాలా పవిత్రమైనది. దంపతులు ఇద్దరు సీతారాముల్లా జీవించాలని ఇరువురు పెద్దలు ఆశీర్వదిస్తారు. ఈరోజుల్లో అక్కడి వరకు మాత్రమే ఈ వివాహం పవిత్రమైనది. ఆ తర్వాత భార్యా భర్తలు మద్య చనువు ఉండదు. అందులోను అత్తా కోడళ్ళు మద్య అంతర్యం మరీ ఎక్కువ. దాదాపు తొంభై తొమ్మిది శాతం అత్తాకోడళ్ళు మద్య విపరీతమైన వైర్యం ఉంటుంది, కొనసాగుతుంది కూడా. ఇదే చాలా కుటుంబాలకు శోకం మిగులుస్తుంది. 


దేవుడి శాపమో.. ఏమో కానీ.. ! నిజంగా అత్తాకోడళ్ళు మధ్య విభేదాలు వర్ణనాతీతం. కొడుకు భార్య అని అత్తకు ఉండదు, భర్త తల్లే అని కోడలికి ఉండదు. కుటుంబ సభ్యుల్లా భావించుకోరు. ఒకవేళ ఏ కొద్ది మందో అలా భావించుకున్నా అత్త మంచిదైతే కోడలు, కోడలు మంచిదైతే అత్త గుణం మంచిగా ఉండదు. 



అచ్చం అలాంటి కుటుంబం నేపధ్యమే శ్రీధర్ ది. 

ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కాపురం ఉండగల పెద్ద ఇళ్ళు ఉన్నాయి. అన్నదమ్ములు ఇద్దరు మంచి ఉద్యోగస్తులు. భార్యలతో శ్రీధర్, అతడి తమ్ముడు ఎంతో ప్రేమగా ఉంటారు. తల్లిదండ్రులు కూడా తమతోటే ఉంటారు. ఇటు తల్లిదండ్రుల, అటు భార్యల రాక వారికి ఎంతో ఆనందం తెచ్చి పెట్టింది. 


అయితే శ్రీధర్ ఎప్పుడు డ్యూటీ నుండి వచ్చినా.. వంటింట్లో కేవలం తన తల్లి జయసుధ మాత్రమే ఉంటుంది. తమ్ముడి భార్య కానీ.. తన భార్య కానీ.. ఏనాడూ వంటింట్లో కనపడలేదు. 


ఒకనాడు రాత్రి ఏదో పండగ సందర్భంగా వంటకాలు ఎక్కువ చేయటంతో ఇంట్లో అందరి భోజనాలు పూర్తి అయ్యాక జయసుధ భోజనం ముగించుకుని గిన్నెలు తోమటం మొదలుపెట్టింది. చిన్న చిన్న చప్పుళ్ళు రాకుండా అన్ని సామాన్లు ఒక్కతే తోమటం అసాధ్యం కదా.. అవేమి ఆలోచించకుండా పెద్ద కోడలు శిరీష భర్తతో 

" ఏవండీ మీ అమ్మతో మేం వేగలేకపోతున్నాం. ఏంటీ ఆ గిన్నెలు చప్పుడుతో మాకు నిద్ర కూడా సరిగ్గా పట్టనివ్వదు. మరలా తెల్లవారి 4గంటలకే పూజ గదిలో భక్తి పాటలతో మా నిద్ర పాడుచేస్తుంది. వెళ్ళండి. కాస్త మెల్లగా తోమమని చెప్పండి" అంటుంది. 


శ్రీధర్ వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడికి తమ్ముడు కూడా వచ్చాడు. బహుశా అతడి భార్య కూడా అలానే అని ఉంటుంది. 


వంటింట్లోకి వెళ్ళిన ఇద్దరు అన్నదమ్ములు తల్లితో సహా గిన్నెలు తోమటం మొదలుపెట్టారు. 


ఆశ్చర్యంగా 

"ఒరేయ్ మీరు ఇక్కడికి వచ్చి ఈ పని చేసేకంటే మీ భార్యలకు చెప్తే సరిపోతుంది కదరా " అంటుంది తల్లి. 


"అమ్మా.. మనస్ఫూర్తిగా మన కుటుంబం, మన బాధ్యత అనుకునేవాళ్ళు మనం చెప్పకుండా ఇంట్లో ఏ పనిలోనైనా సహయం చేస్తారు. మేము అడిగితే వాళ్ళకి కోపం రావొచ్చు, అలాగే మీపైన ఒక దురభిప్రాయం కూడా రావొచ్చు. అందువల్ల మన కుటుంబం సఖ్యత దెబ్బతినవచ్చు. కానీ ఏదో ఒకరోజు వాళ్ళే తెలుసుకుంటారు ఈ తప్పులన్ని.. అప్పటి వరకు నీకు ఈ కొడుకులు ఉన్నారు " అంటారు.

 

ఇంతలో అక్కడికి తండ్రి రఘరాం వచ్చి 

" ఒరేయ్ మీలాంటి కొడుకులను కన్నందుకు నేను గర్వపడుతున్నానురా. ఇదేరా.. ఇదే నిజమైన కుటుంబం " అని ఇద్దరు కొడుకుల భుజాలుపై చెయ్యి వేసి ఆనందాభాష్పాలు తుడుచుకుంటు పోయాడు. 


బెడ్ రూంలోకి వచ్చిన శ్రీధర్ కి భార్య

"ఇంత ఆలస్యం ఎందుకయ్యింది " అని ప్రశ్నించింది. 

ఆ ప్రశ్నకు శ్రీధర్ కి కోపం వచ్చినా.. ఏదో సమాధానం ఇచ్చి శాంతపరిచాడు. 


ఇక వేకువజామున జయసుధ దేవుడి గదిలో పూజలతో శిరీష నిద్రలేవగా పక్కన భర్త లేడు. దేవుడి  గదిలో చూడగా అత్త, మామ, భర్త, మరిది అందరూ గదిలో పూజ చేస్తున్నారు. 

ఇదంతా శిరీషకు నచ్చలేదు. 

అవన్నీ శ్రీధర్ కి తెలుసు. అయినా.. ! చిన్నప్పటి నుండి మంచిగా పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులును ప్రశ్నించే మనసు శ్రీధర్ కి లేదు. ప్రశ్నించటానికైనా వాళ్ళు తప్పు చేయటం లేదు కదా.. అలా అని పుట్టి పెరిగిన ఊరును, కన్నవాళ్ళని వదిలి నమ్మకంతో తనతో వచ్చిన భార్యను బాధపెట్టలేడు. మద్యలో ఇద్దరు కొడుకులు ముఖ్యంగా శ్రీధర్ సతమతమవుతుండేవాడు. 


అయినా.. ! కోడలు అంటే కేవలం అత్తని హింసించటానికి మాత్రమే వస్తుంది అనుకోవటం తప్పు. వాళ్ళిద్దరిలో తల్లి జయసుధకి కోడలిపై ప్రేమ ఉంది. కాబట్టే వాళ్ళు ఎన్ని తిట్టిన మౌనంగా తన పని చేసుకుంటు ఇంటిని నడిపిస్తుంది. ఇక కోడళ్లు మారుతారని ఎదురు చూస్తూ కూర్చుంటే అప్పటికి తన తల్లిదండ్రులు పోతారేమో అనుకుని భార్యని మార్చటానికి సమయం కోసం వేచి చూద్దామని నిర్ణయించుకున్నాడు. 


ఏమైందో ఏమో.. ఒకరోజు డూటి మద్యలో ఇంటికి వచ్చి. 

" శిరీష.. పద పద అమ్మకు ఒంట్లో బాలేదు. ఆసుపత్రిలో చేర్చాం. నువ్వు త్వరగా రెడీ అవ్వు.. హ.. శిరీష మొన్న నీకు ఖర్చులుకు ఇచ్చిన యాభై వేలు కూడా పట్టుకో, నావద్ద ఇప్పటికిప్పుడు ఏమీ లేవు "అన్నాడు. 


"అయ్యో.. ఆ యాభై వేలు ఖర్చు అయిపోయాయండి " అని చెప్పింది శిరీష. 


" సరే, అయినా పర్వాలేదు. రాగోలు లో జేమ్స్ హాస్పిటల్ లో అమ్మగారికి అడ్మిట్ చేశాము పదా వెళ్దాం " అన్నాడు.


 శిరీష ఆశ్చర్యంతో 

"అదేంటీ అది మా అమ్మగారు ఏరియా కదా "అంటుంది. 


"హ.. అవును ఆసుపత్రిలో ఉంది మీ అమ్మగారే. అయినా మీ అమ్మ, మా అమ్మ నాకు ఒక్కటే కదా. అందుకే అమ్మగారు అని మాత్రమే అన్నాను " 


" ఏంటండీ ఇంతవరకు మాట్లాడింది మా అమ్మ గూర్చా.. " 


 " శిరీష.. అవును. టైం అవుతుంది వెళ్దామా.. " 


“ఒక్కనిమిషం అండీ! నన్ను క్షమించండి.. మీ అమ్మగారికి అనుకుని యాభై వేలు ఖర్చు అయిపోయాయని అబద్ధం చెప్పాను " 


"పర్వాలేదు లే! నీకు తోచింది నువ్వు చెప్పావు, పదావెళ్దాం " అని తీసుకు వెళ్తాడు. 


శ్రీధర్ చొరవతో శిరీష అమ్మగారికి ప్రాణాపాయం తప్పుతుంది. 


జరిగింది తన తోటికోడలికి చెప్తుంది శిరీష. 


ఇద్దరు కోడళ్లు శ్రీధర్ వద్దకు వెళ్తారు.


" ఇన్ని తప్పులు చేసినా మీకు కోపం రాలేదా " భర్తని అడుగుతుంది శిరీష. 


" చూడండి.. మీరు మా కుటుంబ సభ్యులు. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుంటే వాటిని వాళ్ళే త్వరగా సరిదిద్దుకుంటారు. అదే ఇతరులు చెప్తే మనిషిలో తప్పొప్పులు వెతుకుతున్నారని ప్రేమలేదని అంటారు. 

కన్నవాళ్ళని వదిలొచ్చిన మీరు కావాలి. , కనిపెంచిన వీళ్ళు కావాలి. నేను మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నేనే కాదు.. నా తమ్ముడు, నా తండ్రి, నా తల్లి కూడా మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు. అందుకే వాళ్ళు, నేను మిమ్మల్ని నిందించలేదు "ఆన్నాడు శ్రీధర్. 


ఇక్కడ శ్రీధర్ కుటుంబం కేవలం ఒక్క కుటుంబాన్నే కాదు.. తమ కన్నవాళ్ళని కూడా ప్రేమగా చూశారు. కానీ..  మేము మాత్రం జీవితాంతం అత్తగారింట్లో ఉంటు ఆ కుటుంబాన్ని మా కుటుంబంగా స్వీకరించలేదు. అత్తగారు పనులు చేస్తుంటే సహయపడకుండా తిట్టాము. తమ యోగక్షేమాలు కోసం రాత్రింబవళ్లు పూజలు చేస్తే ఆమె భక్తిని వక్రీకరించాం. మమ్మల్ని క్షమిస్తే మా మనసులు మార్ఛుకుంటాం " అని వేడుకున్నారు. 


అంతే.. అప్పటి నుంచి ఆ ఇంట్లో శ్రీధర్ డ్యూటీ నుండి రాగానే ఏదో కొత్త కళ కనిపిస్తూ ఉండేది. 

ప్రేమగా చూసుకునే భర్త, 

మంచి చెప్పే అత్తగారు, 

మందలించే మామగారు, 

ఆపదలో ఆదుకునే అన్నదమ్ములు, 

ఆప్యాయతలు పంచే తోటి ఆడపడుచులు, 

తోడుగా ఉండే తోటికోడళ్ళు. 

ఇవన్నీ ఉండే ఇల్లు ఎప్పటికీ ఆనంద నిలయమే. 

నిజంగా కుటుంబం అంటే అదే కదా.. అలాంటి కుటుంబంను కుటుంబ సభ్యులే కాదు భయటవాళ్ళు కూడా ప్రేమిస్తారు. 


 ***** ***** ***** ***** 


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం 





41 views1 comment

1 Comment


"ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుంటే వాటిని వాళ్ళే త్వరగా సరిదిద్దుకుంటారు. అదే ఇతరులు చెప్తే తప్పొప్పులు వెతుకుతారు" ... కరెక్ట్ !

Like
bottom of page