ఐ లవ్ మై ఫాదర్
- Pitta Govinda Rao
- Dec 28, 2023
- 3 min read

'I Love my Father' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 28/12/2023
'ఐ లవ్ మై ఫాదర్' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
స్వతంత్రం రాక ముందు, స్వతంత్రం వచ్చిన మొదట్లో, ఇప్పుడు ప్రజలు జీవన ప్రమాణాలు ఎంత అమాంతం మారిపోయాయో... ప్రజలు కూడా అంతే మారిపోయారు.
ఒకప్పుడు కుటుంబ సభ్యులనే కాదు సమాజాన్ని ప్రేమించే మనుషులు. నేడు తోబుట్టువులను కూడా తెంచుకునే మనుషులు.
అంతెందుకు జన్మనిచ్చి, కష్టపడి పెంచి పెద్ద చేసి, మంచివిద్యాబుద్దులు నేర్పించే తల్లిదండ్రులుకే విలువనివ్వని మనుషులు నేటి తరంలో కోకొల్లలుగా ఉన్నారు.
అప్పట్లో ఏ చదువులు లేకపోయినా మనుషులు సంస్కారవంతులుగా పేరుగాంచితే.. !
ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నామని చెప్పుకున్నోళ్ళకి కాసింత క్రమశిక్షణ కూడా ఉండదు
ఇక ప్రస్తుతం చదువుకోటానికి వెళ్ళే ప్రతి విద్యార్థి- విద్యార్ధినిలు ఎంతో చక్కగా, ఫ్యాషన్ గా వెళ్తున్నా..
వారిలో చాలామంది కుటుంబాలు మాత్రం పేదవే. వాళ్ళ తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం ఏదో చిన్న చితక పనులు చేసుకుంటున్నవాళ్ళే.
అలాంటి తల్లిదండ్రులు కోసం కొందరు పిల్లలు త్యాగాలు చేస్తారు, మరికొందరు తల్లిదండ్రులు వాలకం పదిమందికి చెప్పుకోటానికి, పదిమందికి పరిచయం చేయటానికి ఇష్టపడరు.
అసలు బాదపడాల్సిన విషయం ఏంటంటే
" మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు " అని ఎవరైనా అడిగితే.. !
కూలిపని చేసుకునే తల్లిదండ్రులును తలుచుకుని అసలు విషయమే చెప్పటానికి సిగ్గు పడే లోకం ఇది.
శేషు అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయవాదిగా పట్టా పొందబోతున్నాడు. శేషుతో పాటు మరికొందరు కూడా పట్టా అందుకోబోతున్నారు.
ఈ కార్యక్రమాలకు తమ తమ తండ్రులకు కానీ తల్లులకు కానీ హజరుపరిస్తే బాగుంటుందని న్యాయమూర్తులు అనుకున్నారు.
అయితే ఎంపికైన వారిలో చాలామంది పేద కుటుంబాల పిల్లలే ఉండటంతో అంతటి బారీ అంతర్జాతీయ కార్యక్రమానికి, వారికి తీసుకొస్తే తమ పరువు పోతుందని ఎవరు తమ తల్లిదండ్రులుకు ఆహ్వానం పంపలేదు.
కానీ శేషు ఎలాగైనా తండ్రిని న్యూయార్క్ రావాలని తనకు పట్టా ఇచ్చినప్పుడు తాన దగ్గర ఉండాలని కబురు పంపాడు.
చదువు తెలిసిన మూర్తి శేషుకి స్నేహితుడైన విజయ్ సహయంతో న్యూయార్క్ లో సభా స్థలానికి చేరుకున్నాడు. కానీ అక్కడ ఉన్న సెక్యురిటి మూర్తి వాలకం చూసి లోపలికి ఆనుమతివ్వలేదు. దీంతో కుమారుడు పట్టా పొందటం చూడలేక ఎల్ ఈ డి స్రీన్ లో వేదికపై కనబడుతున్న తన కుమారుడ్ని చూసి మూర్తి మురిసిపోతుండగా. తండ్రి రాక కోసం వేచి చూసి ఫోన్ చేయగా విషయం తెలుసుకుని శేషు తండ్రి, స్నేహితుడు వద్దకు వచ్చి స్వయంగా తండ్రి పై చేయి వేసి వేదిక పైకి తీసుకెళ్ళి అందరికి పరిచయం చేశాడు.
" ఇతని పేరు విష్ణుమూర్తి. నా తండ్రి. ఒక రిక్షా కుటుంబలో పుట్టి పెరిగాడు. తల్లి పల్లవి. ఇల్లరికం తప్ప తనకేం తెలియదు.
అన్ని నాన్నే చూసుకునేవాడు.
రిక్షా తొక్కకుంటే పూట గడవని పరిస్థితి నా కుటుంబానిది.
ఇతను కూడా చదువుకున్నవాడే అయినా పేదరికం, వలన పెద్ద చదువులు చదవలేకపోయాడు. అలాగే మా తాతగారు, నాన్నమ్మ గారిని స్వయంగా దగ్గరుండి తానే చూసుకోవాలనే గొప్ప ఆలోచన వలన ఉద్యోగం కోసం ప్రయత్నం కూడా చేయక తాతగారికి ఉన్న రిక్షా బండితో నెట్టుకొచ్చి నేటికీ దానితోనే బతుకు బండి లాగుతు నన్ను పెద్ద చదువులుకు పంపి ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టిన నా యెక్క హీరో ఇతడే.
తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని అడిగితే చెప్పటానికి సిగ్గు ఎందుకు.
సభకు వచ్చిన ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు కంటే గొప్పవాళ్ళు కావొచ్చు కానీ.. నాకంటే కాదు. అంటే.. !
నా తండ్రి గొప్పవాడు కాకపోయినా నన్ను గొప్పవాడ్ని చేశాడు.
మీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళైనా.. మిమ్మల్ని ఎందుకు గొప్పవాళ్ళని చేయలేదు.. ?
నా చిన్నప్పుడు నాన్నతో బజారుకు వెలితే కనపడిన ప్రతి బొమ్మలు కొనమని అల్లరి చేశాను. కానీ.. నాన్న కొనకుండా ముందుకు పోయాడు. అప్పుడు నాన్న పై ఎంత కోపం వచ్చింది. తర్వాత నాన్నే కనపడకుండా పోయాడు. ఆ క్షణంలో నా ప్రాణం పోయినట్లు అయింది. నాన్న ఆంటూ బిగ్గరగా ఏడ్చాను. అసలు నాకు ఈ బొమ్మలు ఏమీ వద్దు నాన్న కనపడితే చాలు ఆనుకున్నాను. అద్రుష్టం కొద్దీ నాన్న కనిపించాడు. అసలు నాకు ఏ బొమ్మలు వద్దు నాన్న నువ్వు ఉంటే చాలని నాన్నని హత్తుకున్నాను " అంటూ మూర్తిని సభా వేదికపై హత్తుకున్నాడు శేషు.
మరలా
" ఇరువై ఏళ్ళు వయసు దాటినా.. ఒక వ్యక్తికి కష్టం టచ్ చేయలేదు అంటే ఆ ఆపదకు అడ్డుగా ఒకరు నిలబడ్డారని అర్థం. అతడే నాన్న. ఐ లవ్ యు నాన్న"
అంటూ కంటనీరు తుడుచుకుని తన పట్టాను నల్లకోటును తండ్రికి వేసి శేషు మురిసిపోగా అంతమంది జనంలో చప్పట్లతో మారుమోగుతుండగా ఏమీ మాట్లాలేక ఆనందభాష్మాలతో శేషుని చూస్తూ ఉండిపోయాడు మూర్తి.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comentarios