#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్ర రావు, #IdandiIdannamataTwistAnte, #ఇదండీఇదన్నమాటట్విస్ట్అంటే, #అతివలఅష్టకష్టాలకథ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

'Idandi Idannamata Twist Ante' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 15/10/2024
'ఇదండీ.. ఇదన్నమాట ట్విస్ట్ అంటే' తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కోర్టు హాలు జనంతో కిటకిట లాడుతుంది. జడ్జి గారు, రెండు పక్షాల లాయర్లు ఏదో కేసు విషయ వాదనలో గడబిడగా ఉంటూ తలలు పట్టుకొని ఆ కేసు ఒక కొలిక్కి రాకపోవడంతో కొట్టుకున్నంత కంగారుగా ఉన్నారు.
నలుగురు క్లైంట్లు సుబ్బారావు మీద కేసు పెట్టారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది.
''జగన్నాధంగారు, గౌరవనీయులైన జడ్జి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ బాధ ఏమిటో కోర్టు ముఖంగా తెలియజేయండి' అన్నాడు లాయర్ ప్రదీప్ కుమార్.. బాధాతప్త హృదయంతో బోనులో నిలబడ్డ జగన్నాథం వైపు చూస్తూ.
జగన్నాథం అత్యంత బాధగా ఇంచుమించు ఏడుస్తు న్నట్లు ఇలా చెప్పబోయాడు.
''అయ్యా గౌరవనీయులైన జడ్జిగారు.. ఆ బోన్లో నిలబడి ఉన్న సుబ్బారావు రెండు సంవత్సరాల నుండి మా కాలనీ లో ఉంటున్నాడు సార్. అతని వల్ల మాకు పెద్ద సమస్య వచ్చి పడింది. అతను ప్రతి రోజు రాత్రి తాగి వచ్చి తెల్లవారే వరకు తన భార్యను తిడుతూ ఉంటాడు. నేను అతని ఎదురింటి వాడిని. అతను తిట్టే తిట్ల పురాణం వల్ల నాకు, మా ఇంట్లో ఉండే అందరికీ తెల్ల వారులు నిద్ర పట్టడం లేదు సార్. చాలా న్యూసెన్స్ గా ఉంది.. '' అంటూ విన్నవించుకున్నాడు.
లాయర్ ప్రదీప్ కుమార్.. 'సరే జగన్నాధం గారు మీరు చెప్పవలసింది చెప్పారు కదా వెళ్లి కూర్చోండి' అన్నాడు.
వెంటనే లాయర్ ప్రదీప్ కుమార్ అనంతశర్మ అనే వ్యక్తి కూడా తన బాధను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వ వలసిందిగా జడ్జి గారి దగ్గర పర్మిషన్ తీసుకుని అనంత శర్మని పిలిపించాడు.
అనంతశర్మ వచ్చి.. బోనులో నిలబడ్డాడు. లాయర్ అతని వైపు చూసి.. ''అనంతశర్మ గారు, మీరు జడ్జి గారికి ఏమి చెప్పదలుచుకున్నారు అది చెప్పండి'' అన్నాడు లాయర్ ప్రదీప్ కుమార్.
అనంతశర్మ తన దగ్గర ఉన్న జేబురుమాలతో కళ్ళు తుడుచుకొని ఇలా చెప్పనారంబించాడు.
“అయ్యా! నేను సుబ్బారావు వెనుక ఇంటి వాడిని. అతని భార్య చాలా ఉత్తమ ఇల్లాలు. సుబ్బారావు ఏమన్నా.. నోరు ఎత్తి మాట్లాడదు. సతీ సక్కుబాయి అన్నమాట. ఆ తల్లి పేరు సుందరమ్మ. ఆవిడ ఎలా పడుతుందో కానీ ఈయన తెలవార్లు తిట్టే తిట్ల దండకం వల్ల మా ఇంటిల్లపాదికి ఉరిపోసుకుని చచ్చిపోవాలని పిస్తుంది సార్'' అంటూ జడ్జి గారికి విన్నవించు కున్నాడు.
' సరే ఇంక మీరు వెళ్ళవచ్చు అనంతశర్మ గారు. '.. అంటూ జడ్జి దగ్గర అనుమతి తీసుకుని మరో ఇద్దరు క్లైంటులను బోనులోకి రప్పించాడు లాయర్ ప్రదీప్ కుమార్. వాళ్ళిద్దరూ సుబ్బారావు ఇంటికి అటు ఇటు పక్క వాళ్ళు. ఇద్దరూ ఒకేసారి ఏడుపు మొదలుపెట్టి ఇంతకుముందు జగన్నాథం, అనంత శర్మలు చెప్పిన బాధలనే సేమ్ డిటో చెప్పి కళ్ళు తిరిగి బోనులోనే పడుపోబోయారు.
''ఇక చాలు మీరు వెళ్ళండి.. సో యువరానర్. నోట్ దీస్ పాయింట్స్. మా క్లైంట్స్ నలుగురు చెప్పిన దానిని బట్టి వాళ్ల బాధలను గ్రహించి కోర్టు వారు ఆ బోనులో ఉన్న ముద్దాయి సుబ్బారావుని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాను. '' అంటూ చెప్పడం ముగించిన లాయర్ ప్రదీప్ కుమార్, కోటు బటన్ లను సరి చేసుకుంటూ తన కుర్చీలో కూర్చున్నాడు.
''సుబ్బారావు తరపు లాయర్ గారు ఏమన్నా చెప్పదలుచుకున్నారా” అంటూ జడ్జిగారు ప్రశ్నించారు.
సుబ్బారావు తరపు లాయర్ గారు ని.
''వస్తున్నాను సార్.. నేను కూడా ఈ కేసుకు సంబం ధించిన అత్యంత ముఖ్యమైన ఒక సాక్షిని మాత్రమే ప్రశ్నించదల్చుకున్నాను. సుబ్బారావు భార్య సుంద రమ్మను బోన్ లోనికి రప్పించవలసిందిగా కోర్టు వారిని పర్మిషన్ కోరుతున్నాను. ' అంటూ సుబ్బారావు తరుపు లాయరు అప్పల నరసింహం జడ్జి గారికి విన్నవించు కున్నాడు.
వెంటనే పర్మిషన్ గ్రాంట్ చేశారు జడ్జిగారు. దాంతో కోర్టు గుమస్తా '' సుందరమ్మ సుందరమ్మ ''
' సుందరమ్మ సుందరమ్మ ''.. ' సుందరమ్మ సుందరమ్మ ''
అంటూ మూడుసార్లు గట్టిగా కేకలు పెట్టడంతో సుబ్బా రావు భార్య సుందరమ్మ బోను ఎక్కి నిలబడింది.
లాయర్ అప్పల నరసింహం సుందరమ్మ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు.
'' చూడండమ్మా నేను చెప్పినట్టు చెప్పండి.. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను అనండి.. '' అన్నాడు.
సుందరమ్మ భయపడుతూ లాయరు గారు చెప్పి నట్టు.. '' అయ్యా నాకు అబద్ధం ఆడడం చేతకాదు
బాబు ఇదిగో చెబుతుండా. దేవుని మీద పెమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను గాక చెప్పను'' అంటూ చేతులు కట్టుకుని నిలబడింది.
'' సుందరమ్మ గారు.. సుబ్బారావు మీ భర్త అని అంటున్నారు కదా.. సదరు సుబ్బారావు గారు రోజు రాత్రి తాగి వచ్చి అతని భార్య అయిన మిమ్మల్ని తెల్లవారే వరకు భరించరాని బండ తిట్లు, బూతులు తిడుతున్నారు అని ఇక్కడ చాలామంది చెప్పారు. అంతా నిజమేనా మీ భర్త మిమ్మల్ని తిడుతున్నాడా లేదా. భయ పడకండి ధైర్యంగా చెప్పండి.. '' అంటూ ప్రశ్నించాడు.
'' అయ్యా నా భర్త నన్ను తిడుతున్నాడా ఏమో నాకు తెలియదండి బాబు'' అంది జడ్జి గారికి నమస్కారం పెడుతూ.
'' నోట్ దిస్ పాయింట్ యువరానర్. దోషి అంటూ ఈ కోర్టులో సుబ్బారావు అనే ఒక అమాయకుడిని, పాపం భయపడే మనస్తత్వంతో బిక్కు బిక్కుమంటూ తన బ్రతుకేదో తాను బ్రతుకుతున్న సుబ్బారావు అనే ఒక అమాయకపు చక్రవర్తిని నిలబెట్టారు ఈ బోనులో.
ఈ కేసు నుండి అతడిని వదిలిపెట్టిన వెంటనే ఈ మన దేశంలో ఒక్క నిమిషం కూడా బ్రతకలేక సప్తసముద్రాలు
దాటి సరికొత్త స్వేచ్ఛ ప్రపంచంలోకి వెళ్లిపోవాలని ఎంత పిచ్చి వాడిలా చూస్తున్నాడో.. అతను చూడండి.
అగ్నిసాక్షిగా ఏమాత్రం కల్తీ లేని అసలు సిసలైన బంగారపు సూత్రంతో తాళి కట్టించుకున్న అతని సొంత భార్యే తనకు ఆ విషయం తెలియదు అని ఖచ్చితంగా చెబుతుంది. తనను ఎవరూ తిట్టడం లేదులేదు.. లబోదిబోమని చెబుతుంది.
గౌర వనీయజడ్జిగారు ఇక్కడే ఒక ధర్మ సూత్రం గ్రహించ వలసి ఉంది. స్వయంగా సుబ్బారావు భార్య ఈ విధంగా చెబుతున్నప్పుడు.. ఇంకా ఈ కేసులో పస ఏమి ఉంది సార్. సుబ్బారావు నిరపరాధిగా నిరూపణ అయింది కనుక వెంటనే అతనిని ఈ కేసు నుండి విము క్తుడిని చేసి.. అతని మీద కేసు డిస్మిస్ చేయవల సిందిగా కోరుతూ ఉద్దేశపూర్వకంగా అతని మీద తప్పుడు కేసు పెట్టి తప్పుడు సాక్ష్యాలు ఇచ్చిన ఆ నలుగురిపై క్రిమినల్ కేసు ఫైల్ చేసుకునే అవకాశం మా క్లైంట్ సుబ్బారావుకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. '' అంటూ జడ్జి గారికి నమస్కరించి తన స్థానంలో కూర్చు న్నాడు సుబ్బారావు తరపు లాయరు అప్పలనర సింహం.
జడ్జిగారు ఆ విధంగానే చేయడం జరిగింది వెంటనే కేసు వాయిదా పడింది.
***
. ఆ మధ్యాహ్నం లాయర్లకు సంబంధించిన విశ్రాంతి మందిరంలో ప్రదీప్ కుమార్.. అప్పల నరసింహం పక్కపక్కనే కూర్చుని భోజనాలు చేస్తున్నారు.
'' అప్పల నరసింహ నువ్వు చాలా గ్రేట్ చాలా తెలివిగా మీ సుబ్బారావు మీద కేసు కొట్టించేసావు.
అతను ప్రతిరోజు రాత్రి తాగి వచ్చి భార్యను బండ బూతులు తిట్టడం ఈ ఊరిలో అందరికీ నీకు నాకు కూడా తెలుసు కదా.. మరి అతని భార్య ఎందుకు అలా సాక్ష్యం ఇచ్చింది అంటావు. అసలు ఆవిడ ఎందు కు అలా అబద్ధం ఆడింది.. మనకు మనకు ఇవన్నీ మామూలే కానీ నీ తెలివితేటలు కొంచెం తెలుసుకుం దాం అని అడుగుతున్నాను అంతే ఫ్రెండ్లీగా. '' అంటూ నవ్వుతూ అడిగాడు లాయర్ ప్రదీప్ కుమార్.
వెంటనే అప్పల నరసింహ ఇంకా గట్టిగా నవ్వేస్తూ ఇలా చెప్పాడు.. '' సుబ్బారావు భార్య సుందరమ్మ ఏ మాత్రం అబద్ధం ఆడలేదయ్యా బాబు. ఏమయ్యా నువ్వు జూని యర్ వి నేను సీనియర్ ని. నా నుండి ఇలాంటి విష యాలు తెలుసుకునే ఉత్సాహం నువ్వు చూపిస్తు న్నావు చూడు అందుకు నేను అభినందిస్తున్నాను నిన్ను.
సరే.. విషయం ఏమిటి అంటే సుబ్బారావు రోజు తాగి వచ్చి బండ బూతులు అతని భార్యను తెల్లవారులు తిట్టడం నిజమే.. అలా ఒక సంవత్సరం ఆవిడ మహా కర్మ అనుభవించింది. తర్వాత ఆవిడ ఒక ఉపాయం ఆలోచించింది.. అదేమిటి అంటే తన భర్త సుబ్బారావు వస్తున్నట్టు శబ్దం అవుతున్న ప్రతిసారి.. ప్రతిరోజు గబగబా రెండు దూది ఉండలు తీసుకొని రెండు చెవులలో పెట్టేసు కోవడం అలవాటు చేసుకుంది. మరి అతను తెల్లవారులు తిడుతున్నట్టు నీకు నాకు తెలుసు కానీ ఆవిడకు తెలియదు కదా. మరి ఆవిడ అబద్ధం చెప్పినట్టు ఎలా అవుతుంది. తనకు తన భర్త తాగి వచ్చి తెల్లవారులు తిడుతున్న విషయం తెలియదు కనుక '' నాకు ఏమీ తెలియదు మహాప్రభో నా భర్త నన్ను తిట్టడం లేదండి'''' అంటూ జడ్జిగారికి ఆమె ప్రమాణం చేసినట్లు అంతా నిజమే చెప్పింది.
'' నేను కూడా నిజాయితీగా వాదించే ఈ కేసు గెలి చాను కానీ తప్పుడు మార్గం కాదు కదా నువ్వే ఆలోచించు. '' అంటూ కాలర్ ఎగరేసి చెప్పి పైకి లేచి చేతులు కడుక్కుని బయటకు వెళ్లిపోయాడు సుబ్బా రావు తరపు లాయర్ అప్పల నరసింహం.
ఇంకేముంది కథ.. సమాప్తం అయిపోయింది.
అయితే సుబ్బారావు తరపు లాయర్ ప్రదీప్ కుమార్ గారు బార చాపి ఉంచిన నోటి నుండి చొంగలు కారిపో తున్నట్టు తనకు తానే గ్రహించు కోలేకపోతున్నాడు.
సమాప్తం
***************
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comentarios