ఇదే ఇప్పుడు ట్రెండ్!
- Mohana Krishna Tata
- Nov 10, 2023
- 2 min read

'Ide Ippudu Trend' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 10/11/2023
'ఇదే ఇప్పుడు ట్రెండ్' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఏమండీ! మన అమ్మాయికి ఆ దేవుని దయ వలన మంచి సంబంధం కుదిరింది. ఏమంటారు?"
"ఏమంటాను..ఆ దేవుని దయ తో పాటు..ఈ దేవుని కష్టం కుడా ఉంది సునీత!"
"సరే లెండి! మీరు చెయ్యకుండా ఇంట్లో ఏ పని అవుతుంది చెప్పండి! అయితే..పెళ్ళి ముహూర్తాలు పెట్టించండి మరి!"
"రేపే పంతులుగారిని రమ్మన్నాను..మంచి ముహూర్తం చూస్తారు లే!"
మర్నాడు పంతులుగారు వచ్చి..సోఫా లో కూర్చొని.. పంచాంగం అటూ ఇటూ తిరగేస్తున్నారు.
"ఒక పది రోజుల్లో మంచి ముహూర్తం ఉందండి!"
"కానీ..సమయం మరీ తక్కువ కదా! పంతులుగారు"
"అదేమీ ప్రాబ్లం కాదండీ! పెళ్ళి పనులు వెడ్డింగ్ ప్లానర్ కు ఇచ్చేస్తే సరి ..అన్నీ వాళ్ళే చూసుకుంటారు...మీరు షాపింగ్ చేసుకుంటే సరిపోతుంది..పెళ్ళి రోజు పట్టు బట్టల తో ఫోటోలు దిగడమే..అంతే!..నో టెన్షన్!. నాకు తెలిసిన వెడ్డింగ్ ప్లానర్ ఉన్నాడు!"
(సర్ దగ్గర ఆస్తి బాగానే ఉంది..మనకి తెలిసిన వెడ్డింగ్ ప్లానరే కాబట్టి, బాగా కమిషన్ వస్తుంది..మనసులో అనుకున్నాడు పంతులు)
"ఖర్చు ఎక్కువ అవుతుందేమో?"
"ప్లీజ్ !ఒప్పుకోండి నాన్న!" అంది పెళ్ళికూతురు శిరీష.
"అమ్మాయి అడుగుతుంది కదా!..ఒప్పుకోండి..ఈ ముహూర్తం దాటితే మళ్ళీ ఆరు నెలల వరకు లేవంటా..." అంది శ్రీమతి సునీత.
మర్నాడు వెడ్డింగ్ ప్లానర్ రానే వచ్చాడు..
మాకు మా పరిధిలో పెళ్ళి పనులు చేయించాలని శ్రీనాథ్ అడిగాడు..
"ఓకే.. అలాగే చేద్దాం! ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ చేద్దాం.."
"అంటే ఏమిటి?" అని అడిగాడు శ్రీనాథ్.
"పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు-పెళ్ళి కూతురు కలసి ఫోటో, వీడియో షూట్ చేస్తాము.."
"పెళ్ళి కాకుండా..అలా ఎలా కుదురుతుంది చెప్పండి!"
"అదే ట్రెండ్ ఇప్పుడు సర్..ఎంత ముట్టుకుంటే అంత ట్రెండ్ ఇప్పుడు.."
"నేను ఒప్పుకోను!" అన్నాడు కోపంగా శ్రీనాథ్.
"ఇదే ట్రెండ్ నాన్న..ఒప్పుకోండి".
"తర్వాత..పెళ్ళి మండపం...ఆ డెకొరేషన్ ..ఫుడ్ అరేంజ్‌మెంట్స్ అన్నీ మేమే చేస్తాము.."
"ఫుడ్ మటుకు మన సంప్రదాయమైన ఫుడ్ ఉంటుంది కదా!"
"అన్నీ ఉంటాయి సర్, సౌత్, నార్త్, అవసరమతే చైనీస్, జపనీస్, అన్నీ పెట్టేదాము.."
"ఇది అవసరమా శిరీష?"
"ఇదే ట్రెండ్ నాన్న..ఒప్పుకోండి!"
"ఒప్పుకోండి సర్!..సూపర్ గా చేద్దాం పెళ్ళి"
"ఏదో మా అమ్మాయి ముచ్చట పడుతుంది కనుక..ఒప్పుకుంటున్నాను.."
ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయింది. బాగా ఖర్చు పెట్టి...వివిధ లొకేషన్స్ లో..విచిత్రమైన కాస్ట్యూమ్స్ లో తీసారు.
“వీడియో బాగా వచ్చింది సర్ చూడండి!”
"ఏమిటి ఇది...ఇంత చిన్న బట్టలు వేసి..తీసారు.."
"అది ట్రెండ్ సర్.."
"బిల్ ఎంత అయ్యిందో?" భయపడుతూ అడిగాడు శ్రీనాథ్.
"లాస్ట్ లో చెబుతాము..ఒక పది లక్షలు ఇప్పుడు ఇవ్వండి!"
పెళ్ళిమండపం బుక్ అయ్యింది...అన్నీ సూపర్ అని అందరూ మెచ్చుకున్నారు..సినిమా సెట్టింగ్స్, రిసెప్షన్ స్టేజి మీద పొగలూ, అనేక రకాల విచిత్ర మైనా డాన్స్ లు, గోరింటాకు భాగోతము.. భోజనాలలో వింత వెరైటీలు ..పెళ్ళి గ్రాండ్ గా జరిగింది..
"పెళ్ళి బాగా జరిగింది సర్.. ఇదిగోండి సర్ బిల్.."
"యాభై లక్షలా? నీకు ఈ డబ్బులు కట్టాలంటే, ఈ ఇల్లు అమ్మాలి.."
"అమ్మేయండి!.. అమ్మాయి సంతోషం కన్నా, మనకి ఏమిటి కావాలి చెప్పండి!" అంది భార్య సునీత.
సరే.. అని ఇల్లు అమ్మేసి బిల్ క్లియర్ చేసాడు.
ఒక ఆరు నెలలు పోయాక… కూతురు పుట్టింటికి వచ్చేసింది..
"ఏమిటమ్మా! ఇలాగ వచ్చావు? అల్లుడు ఎక్కడ?"
"నేను మాత్రమే వచ్చాను...అయన రారు"
"ఎందుకు?"
"విడిపోయాము నాన్నా!"
"నేను మాట్లాడతాను అల్లుడితో..."
"నో..నాన్న..విడాకులకు ఏర్పాటు చెయ్యండి..దాని తర్వాత మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకుంటాను!"
"ఇంకో పెళ్ళా??"
"ఇదే ఇప్పుడు ట్రెండ్ నాన్న! నచ్చకపోతే వదిలెయ్యడం..ఇంకొక పెళ్ళి చేసుకోవడం!"
"నీ పెళ్ళికి ఒక యాభై లక్షలు అయ్యింది...ఇప్పుడు మళ్ళీ ఇంకో పెళ్ళా? నా మాట వినుంటే బాగుండేది..ఆ డబ్బంతా బ్యాంకు లో వేసుకున్నా..ఉపయోగపడేది..నా కర్మ!" అని తల పట్టుకున్నాడు శ్రీనాథ్..
*****
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments