top of page
Writer's pictureShilpa Naik

ఇన్స్టాగ్రామ్ స్టాకర్ - పార్ట్ 1



'Instagram Stalker - Part 1/3' - New Telugu Story Written By Shilpa Naik

Published In manatelugukathalu.com On 18/05/2024

'ఇన్స్టాగ్రామ్ స్టాకర్ పార్ట్ 1/3' పెద్ద కథ ప్రారంభం

రచన: శిల్పా నాయక్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



రాధ హాస్టల్ లో ఉండి, ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతోంది. తను ఇంస్టాగ్రామ్ పెద్దగా వాడదు. బాగా చదివి క్యాంపస్ లో జాబ్ సాధించాలన్నది తన కల. ఎందుకంటే రాధ తన ఫ్యామిలీ ని ఫైనాన్సియల్ గా సపోర్ట్ చెయ్యాలని అనుకుంటుంది. ఏ బ్యాక్ లాగ్స్ లేకుండా ఉండడానికి తను రాత్రి పగలు కష్టపడి చదువుతోంది. అనుకున్నట్టుగా క్యాంపస్ జాబ్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కూడా అవుతుంది. ఇంకా లాస్ట్ సెమిస్టర్ లో కూడా పాస్ అయ్యిపోతే తనకి మంచి ప్యాకేజీ తో జాబ్ రావడం ఖాయం. 


ఇదిలా ఉండగా రాధ ఫ్రెండైన రష్మి తనకి, "సిలబస్ ఎలాగో కంప్లీట్ అయ్యింది కదా! ఇంస్టాగ్రామ్ డౌన్లోడ్ చేస్కొని కాసేపు లైఫ్ ని ఎంజాయ్ చెయ్. ఎక్సమ్ డేట్ రాగానే ఇంస్టాగ్రామ్ ని తీసేసి రివిజన్ స్టార్ట్ చెయ్. ఎందుకంటే జాబ్ లో జాయిన్ అయ్యాక నీ లైఫ్ కోసం కొంచెం టైం కూడా దొరకదు, అందుకే. " అని సలహా ఇస్తుంది. 


ఆ మాటలకి రాధ కూడా ఆలోచనలో పడింది, ‘నిజమే కదా! తన క్లాస్మేట్స్ అందరి ఫోన్స్ లో ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్ చాట్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ఉన్నప్పుడు తన ఫోన్ లో ఎందుకు ఉండకూడదు’ అని ఆలోచించి ఇంస్టాగ్రామ్ ని డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేస్తుంది. ఈ విషయాన్ని రష్మి కి కూడా చెప్పడంతో తనెంతో సంతోషించి ఇంస్టాగ్రామ్ లో రాధ అకౌంట్ ని ఫాలో అవుతుంది. 


రాధా కూడా కేవలం రష్మి అకౌంట్ ని మాత్రమే ఫాలో అవుతూ అప్పుడపుడు మీమ్స్, రీల్స్ చుస్తూ టైం స్పెండ్ చేస్తుంది. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి. ఒక రోజు రాధ క్లాస్ వింటున్నప్పుడు తన ఫోన్ కి ఏదో నోటిఫికేషన్ వస్తుంది. రాధ ఆ నోటిఫికేషన్ ని పట్టించుకోకుండా క్లాస్ వింటుంది. రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చెక్ చెయ్యడం రాధకి అలవాటు. 


అలవాటు ప్రకారమే ఫోన్ చెక్ చేస్తే అందులో ఇంస్టాగ్రామ్ లో ఎవరో మెసేజ్ చేసినట్టు చూపిస్తుంది. ఎవరో సాహీల్369 అనే ప్రొఫైల్ నుంచి హాయ్ అని మెసేజ్ చూసి రాధ కొంచెం కంగారు పడుతుంది. ఈ విషయాన్నే, ఫోన్ లో మూవీ చూస్తున్న రష్మికి చెప్తుంది. విషయం మొత్తం విన్న రష్మి నవ్వుతు, "ఇంత చిన్న దానికే ఇంతలా టెన్షన్ పడుతున్నావా?" అని చెప్పి మళ్ళీ నవ్వుతుంది. రాధ దిగులుగా, "నేను అసలు ఎవరికీ మెసేజ్ చెయ్యను. నాకెవ్వరు, ఎందుకని మెసేజ్ చేస్తారు? " అని రష్మిని అడుగుతుంది. 


రష్మి మళ్ళీ నవ్వి, "ఇంస్టాగ్రామ్ లో ఇంతే, అమ్మాయి పేరు కనిపిస్తే చాలు, కొంత మంది అబ్బాయిలు ఇలాగే మెసేజ్ చేస్తారు. నువ్వు ఓ పని చెయ్. ఆ సాహిల్ ప్రొఫైల్, ఫాలో లిస్ట్, పోస్ట్స్ ఇవ్వన్ని చెక్ చెయ్. నీకు ఓకే అనిపిస్తే రిప్లై ఇవ్వు. లేకుంటే బ్లాక్ చెయ్. అండ్ నన్ను డిస్టర్బ్ చెయ్యకు ప్లీజ్.. అసలే ఇది థ్రిల్లర్ మూవీ. ఒక పాయింట్ కూడా మిస్ అవకుండా చూస్తేనే కిల్లర్ ఎవరో తెలిసేది. ప్లీజ్. "అని హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని ఫోన్ లో మూవీని ప్లే చేసుకుని శ్రద్దగా చూస్తూ ఉంటుంది. 


రాధ కూడా రష్మి చెప్పినట్టుగా సాహిల్ ప్రొఫైల్, ఫాలో లిస్ట్, పోస్ట్స్ చెక్ చేస్తుంది. అన్ని నార్మల్ గా ఉండడంతో రాధ, సాహిల్ కి హాయ్ అని రిప్లై ఇస్తుంది. 5 నిమిషాల తర్వాత సాహిల్ నుంచి మళ్ళీ మెసేజ్ వస్తుంది, "ఎలా ఉన్నావ్ రాధా" అని. 


రాధ కూడా, "నేను బాగానే ఉన్నాను అసలు నేనెవరో మీకు తెలుసా? "అని అడుగుతుంది. 


దానికి సాహిల్, "లేదు, కాని రష్మి ఫాలో లిస్ట్ లో నీ అకౌంట్ చూసి మెసేజ్ చేశాను అయినా టైం పాస్ కోసం ఇలా రాండమ్ అకౌంట్స్ కి హాయ్ మెసేజ్ పంపుతుంటాను. " అని రిప్లై ఇస్తాడు. 


ఇద్దరూ కాసేపు అలా సరదాగా చాట్ చేస్తుంటారు. అప్పుడే వార్డెన్ విసిల్ సౌండ్ వినిపించడం తో రాధ 'బై' అని మెసేజ్ పెట్టి, లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటుంది. 


తరువాతి రోజు పొద్దున్నే రాధ ఫోన్ చెక్ చేస్తే, అందులో సాహిల్ నుంచి 2 మెసేజెస్ ఉంటాయి. రాధ మెసేజెస్ ని ఓపెన్ చేసి చదువుతుంది, 

"ఏమైంది? అప్పుడే బై ఆ? " 

"సరే గుడ్ నైట్". 


రాధ, "గుడ్ మార్నింగ్, నిన్న లైట్స్ ఆఫ్ చేసి పడుకునే టైం ఐయ్యింది. అందుకే బై అని మెసేజ్ చేశా. సారీ" అని స్మైలీ ఈమోజీ తో మెసేజ్ చేస్తుంది. 


సాహిల్ నుంచి కూడా వెంటనే ఇట్స్ ఓకే అనే మెసేజ్ వస్తుంది. 


రాధ ఇలాగే సాహిల్ తో చాటింగ్ చేస్తూ కాలేజీకి రెడీ ఐయి వెళ్తుంది. ఇలా 3 వారాలు గడిచిపోతాయి. 


రాధ కి సాహిల్ తో చాటింగ్ చెయ్యడం ఎంతో నచ్చుతుంది. రాధ ఎప్పుడు చూసినా ఫోన్ లో సాహిల్ తో చాటింగ్ చేస్తూనే ఉండడం గమనించిన రష్మి సెమిస్టర్ ఎగ్జామ్స్, రివిజన్ గురించి గుర్తు చేస్తుంది. అయినా రాధ ఇవేవీ పట్టనట్టుగా సాహిల్ తో మనసు విప్పి మాట్లాడుతూనే ఉంటుంది. ఒక రోజు సాహిల్ ‘కలుద్దామా’ అని అడుగుతాడు. రాధ ఈ విషయం రష్మి కి చెప్తుంది. రష్మి ‘వెళ్ళద్దు’ అని సలహా ఇస్తుంది. 


అయినా రాధ తన మాటలు పట్టించుకోకుండా సాహిల్ తో ‘ఏ లొకేషన్ లో కలుద్దాం’ అని అడుగుతుంది. సాహిల్ తనని ఒక గ్రౌండ్ కి రమ్మని చెప్తాడు. చెప్పినట్టుగా రాధ కూడా మరుసటి రోజు గ్రౌండ్ కి వెళ్తుంది. కాని సాహిల్ మాత్రం అక్కడికి రాడు. తను కోసం రాధ 3 గంటలు ఎదురు చూసినా సాహిల్ జాడ కూడా కనిపించదు. 


రాధ మెసేజ్ చేస్తున్నా సాహిల్ రిప్లై ఇవ్వట్లేదు. ఇంక వెయిట్ చేసినా వాడు రాడని తెలుసుకున్న రాధ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాని వెళ్తూ ఉండగా తన దుప్పటా గ్రౌండ్ గేట్ లో చిక్కుకుంటుంది. ఎంత లాగినా దుప్పటా రాకపోవడంతో, సాహిల్ మీద కోపంతో ఆ దుప్పటా ని అక్కడే వదిలేసి హాస్టల్ కి వెళ్ళిపోతుంది. 


రూమ్ లోకి వెళ్లలాగే రష్మి రాధకి తన ఇంటర్నల్ మార్క్స్ చూపిస్తుంది. రాధ సాహిల్ కోసం కాలేజీకి వెళ్లలేదు కాబట్టి తన ఇంటర్నల్ మార్క్స్  గురించి రష్మిని అడుగుతుంది. రష్మి తన ఫోన్ లో రాధ మార్క్స్  ఉన్న పిక్చర్ చూపిస్తుంది. అది చూసిన రాధకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. 


అన్ని సబ్జక్ట్స్ లో మినిమం పాస్ మర్క్స్ వచ్చాయి. రష్మి ఇప్పుడు కూడా రాధకి, "కొన్ని రోజులు ఫోన్ పక్కన పెట్టి చదువు మీద ఫోకస్ చెయ్" అని సలహా ఇస్తుంది. ఈసారి రాధ దానిని సీరియస్ గా తీసుకొని ఇంస్టాగ్రామ్ అన్ ఇన్స్టాల్ చేసి రివిజన్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడప్పుడు సాహిల్ గుర్తొచ్చినా వెంటనే తన మైండ్ ని డైవర్ట్ చెయ్యడానికి వేరే పనులు చేసేది. 


సెమిస్టర్ లాస్ట్ ఎగ్జామ్ రోజు రాధ ఎగ్జామ్ సెంటర్ కి బస్ లో వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి తన పక్కన వచ్చి కూర్చుంటాడు. రాధ ఎవరు అన్నట్టు వాడి వైపు చూస్తోంది. 


అప్పుడు ఆ అబ్బాయి, "హాయ్.. నేను సాహిల్. గుర్తుపట్టావా?" అని చెప్తాడు. 


రాధ షాక్ అవ్వుతుంది. ఎందుకంటే ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఉన్న అబ్బాయి వేరు, ఈ అబ్బాయి వేరు. రాధ కంగారు పడడం చూసిన సాహిల్, "ఏమైంది? నా మెస్సేజెస్ కి ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు?" అని క్యాజువల్ గా అడుగుతాడు. రాధ లో కొంచెం భయం మొదలవుతుంది. 


అప్పుడే బస్సు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఆగి "దిగే వాళ్ళు దిగాలి" అని కండక్టర్ అరవడంతో రాధ సీట్ నుంచి లేచి డోర్ వైపు వెళ్తుంది. కాని సాహిల్ రాధ చేయి పట్టుకొని తన వైపు లాగి, "చెప్పు రాధ.. ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? " అని కొంచెం కోపంగా అడుగుతాడు. 


సాహిల్ బిహేవియర్ కి రాధ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. కానీ అప్పుడే రాధ క్లాస్ మేట్  అయిన వంశీ, సాహిల్ ని చెయ్ వదలని గట్టిగా చెప్తాడు. 

=======================================================================

ఇంకా వుంది.. 

=======================================================================


శిల్పా నాయక్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

 విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

 


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు శిల్ప. నేను రచయిత్రిని అని చెప్పలేను. కానీ అప్పుడప్పుడు ఫాంటసీ, భయం కల్పించే కథలు రాస్తుంటాను. కథలు రాయడం ఇప్పుడే నేర్చుకుంటున్నా.


39 views0 comments

Comments


bottom of page