Introduction To The Serial 'The Trap'
Written By Pandranki Subramani
రచన : పాండ్రంకి సుబ్రమణి
నవలకు ముందు మాట
అప్పుడూ యిప్పూడూ అని కాదు, కాలానికతీతంగా ఎప్పుడూ కానవచ్చే వాస్తవం; మనషికి ఆత్మీయతలు అనుకున్నంత సులభంగా అందుబాటులో ఉండవు. ముఖ్యంగా మనిషికి కావలసినప్పుడు అందుబాటులో ఉండవు. అంతే కాదు, ఎదురు చూసిన తీరున లభించవు. థార్ ఎడారి మధ్యన ఎక్కడో యెప్పుడో కానవచ్చే ఒయాసిస్సులా అరుదుగానే గోచరిస్తాయి. వాటిలో కొన్ని చిరస్థాయిగా నిలచి నిలకడగా ఆదుకునేవి మరింత అరుదుగా ఉంటాయి.
బంధువులే రాబందులుగా మారి, ధర్మ ధిక్కార వంచితులుగా రూపాంతరం చెందుతూన్న ఇప్పటి సామాజిక ప్రపంచంలో హెచ్చుతగ్గులకు అతీతంగా చిన్ననాటి స్నేహాలకు బాంధవ్యాలకు విలువనిచ్చే ఆత్మబంధువులు ఎదురు కావడం అత్యంత స్వల్పం— జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తింటే గాని ఈ నగ్నసత్యం సగటు మనిషికి సాధారణంగా అవగాహనకు రాదు-- ఎత్తున ఉన్నప్పుడు అందరూ ఆత్మబంధువులే-- దిగువున ఉన్నప్పుడే మనిషికి ఎవరు ఆప్తులో ఎవరు అపరిచితులో తెలిసి వస్తుంది.
”ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్--”
సుమతీ శతకకారుడు మనకు ఆది నుంచి చెప్తున్న సూక్తి ఇదే కదా! ఆత్మబంధువుల్ని కోల్పోయి కన్నీటి చుక్కల్ని ఎడతెగకుండా కారుస్తున్నట్లున్న ఆకాశం క్రింద అనాధలా తడుస్తూన్న చాప్లిన్ మహాశయుడు అనలేదూ— “వర్షంలో నడుస్తాను. తడుస్తూనే నడుస్తాను. అప్పుడు నా కన్నీళ్ళు యెవరికీ కనిపంచవు కదా!”
ఇది హృదయాన్ని కలచివేసే దు:ఖ సాగరం కదూ!
ఈ నవల ముఖ్యంగా రెండు కుటుంబాల చుట్టూ తిరిగే రచన. వేద మూర్తి వయసు మళ్ళిన తల్లిదండ్రులను చూసుకుంటూ ఉన్నఊరులో కిరాణా షాపు నడపుతుంటాడు. అతడికి ముగ్గురు కొడుకులు ఒక కూతురూను—పెద్ద కుటుంబం లో సహజంగా యెదురయే పరిస్థితుల రాపిడి వల్ల పెద్ద కొడుకు కామేశ్వరరావు, కడపటి కొడుకు పవన్ ఓ మోస్తరుగా చదువుకున్నామనిపించి తండ్రికి కిరాణా కొట్టులో చేదోడు వాదోడుగా ఉంటారు.
ఐయితే రెండవ వాడు పరమేశ్వర్ పట్టు వదలని విక్రమార్కుడిలా ఢక్కామొక్కీలు తింటూ అడ్డంకులు యెదుర్కుంటూ తండ్రి నుండి అప్పుడప్పుడు చీవాట్లు తింటూ చీదరింపు లకు లోనవుతూ బామ్మవత్తాసుతో గ్రాడ్యుయేషన్ లెవల్ కి చేరుకుంటాడు. పరమేశ్వర్ తరవాతి తోబుట్టువు కమల కూడా హైస్కూలు వరకూ చదువుకుంటుంది.
ఇక పరమేశ్వర్ విషయానికి వస్తే విద్యావిషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా నగరంలో మరొక చోట ఉంటూన్న పెద్దన్నయ్య భువనేశ్(వేదమూర్తి అన్న కొడుకు)నుండి సలహాలు ఆదేశాలు తీసుకుంటూ ముందుకు సాగుతాడు. ఒకానొక సమయంలో ఒక ముఖ్యమైన టెక్నికల్ కోర్సు పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు దాని కోసం తండ్రిని సమీపించినప్పుడు వేదమూర్తి చేతులు విదిలిస్తాడు తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదని. అప్పుడతను సమయస్ఫూర్తితో నగరంలో ఉన్న పెద్దన్నయ్య భువనేశ్ ని దిశానిర్దేశం చేయమని అడుగుతాడు.
హయ్యర్ టెక్నికల్ స్కిల్ కోసం ఒక ప్రొఫెసర్ సహాయం కావలసి వచ్చిందని చెప్తాడు. అప్పుడు భువనేశ్ అమెరికాలో కంపెనీ వ్యవహారం చూసుకోవడానికి బసచేస్తాడు. ఐనా—విసుగు కనబర్చకుండా పరమేశ్వర్ పైనున్న వాత్సల్యంతో పరమేశ్వర్ సూచించిన ప్రొఫెషర్ తో మాట్లాడి పరమేశ్వర్ కి కోచింగ్ యిప్పిస్తాడు. దాని ఫలితంగా పరమేశ్వర్ కి కంప్యూటర్ డెటా సెంటర్ లో ఉద్యోగం లభిస్తుంది.
అంతవరకూ- “విద్యావాన్ ధనవాన్ భవేత్!“అన్న నానుడి మాత్రమే బడిరోజుల్లో చదువుకున్న వేదమూర్తి; కొడుక్కి దొరికిన ఉద్యోగం గురించి, ముఖ్యంగా మేనేజ్మెంటు యివ్వ జూపిన జీతభత్యాల మొత్తం విని ఆశ్చర్యపోతాడు. విద్యకు అంతటి విస్తారమైన శక్తి ఉందా అని అబ్బుర పడతాడు. ఆ పైన యింట్లోకి కొత్త కొత్త వస్తువులు రానారంభిస్తాయి. అంతేకాక- పరమేశ్వర్ ఉద్యోగంలో కుదరకముందే ఒకప్పటి వేదమూర్తి బడి నేస్తం- ఫార్మా కంపెనీ పారిశ్రామిక వేత్తగా యెదిగిన దివాకర్ తన కూతురు వినోదినిని యివ్వడానికి సంకేతం యిస్తాడు.
ఎటు తేల్చుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతున్నప్పుడు వేదమూర్తి మరొక బడినేస్తం- ప్రభుత్యోద్యోగి విశ్వం కూడా తన కూతురు వసంతను వేదమూర్తి యింటి కోడలుగా యివ్వటానికి భార్యతో సహా వచ్చి అనుకూల సంకేతం యిస్తాడు. తమకంటే సామాజికంగా పై అంతస్తున ఉన్న కుటుంబాలు తమ ప్రమేయం లేకుండానే తమ యింటి సంబంధాలు వెతుకుతూ రావడం యింటిల్లిపాదినీ దిగ్భ్రాంతికి లోను చేస్తుంది. క్రమ క్రమంగా వాళ్ళకు అసలు విషయం అవగాహనకు వస్తుంది; వాళ్ళిద్దరి కుటుంబాలకూ వేదమూర్తి పట్ల ఉన్నది స్నేహభావం మాత్రమే కారణం కాదని, తమ కుటుంబం పట్ల దివాకర్ కుటుంబానికీ, విశ్వం కుటుంబానికీ అపార గౌరవ భావం సద్భావం ఉందని. వాళ్ళ అమ్మాయిల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తమ కుటుంబంతో వియ్యం పెట్టుకునేందుకు వస్తున్నారని.
ఐతే—ఇక్కడ ఎదరు చుక్క అడ్డు వస్తుంది. అంత యెత్తున ఉన్న దివాకర్ కూతురు వినోదినితో దగ్గరవడానికి పరమేశ్వర్ విముఖత చూపిస్తాడు. వివాహానికి ఔననకుండా తొలగి పోతుంటాడు. అలా దూర దూరంగా వినోదినినుండి తొలగిపోవడానికి అతడికంటూ కొన్ని స్పష్టాస్పష్టమైన కారణాలు ఉంటాయి. దివాకర్ పట్ల అగౌరవ భావం వల్ల గాని, వినోదిని పట్ల అయిష్టత గాని కారణాలు కావు. అంతేకాక— అంత యెత్తున ఉన్నవాళ్ళ అమ్మాయి వల్ల- సకల సౌకర్యాలతో మాలిమితో పెరిగి ఉన్నత చదువులు వెలిగించిన అమ్మాయి కోడలు పిల్లగా వస్తే యెదురు చూడని అవాంతరాలు కుటుంబంలో యెదురు కాక తప్పవని సంకేత రూపంలో హెచ్చరికలు కూడా విడుస్తాడు.
కాని అతడి మాటను ఇంట్లోవాళ్ళందరూ తోసి పుచ్చుతారు. కారణం- వినోదిని తన సౌమ్య ప్రవర్తన వల్ల యింట్లోవాళ్ళను ఆకట్టుకోగలగుతుంది, నిజానికి తన సౌమ్య ప్రవర్తనతో యింట్లోని పెద్దవాళ్లందర్నీ ఆశ్చర్యపరుస్తుంది కూడాను. మరి, ఎటువంటివి అతడికున్న ఆ కారణాలు?ఆ ప్రతికూల కారణాలు యెలా తొలగిపోతాయి?నవలలో వివరించడమైంది .
ఇక భువనేశ్ విషయినికి వస్తే—అతణ్ణీ అతడి భార్య ప్రభావతినీ ఎదురు చూడని దురదృష్టం వెంటాడుతుంటుంది. వాళ్ళ ఒక్కగానొక్క కూతురు సుమారు యేడేండ్ల ప్రాయంలో మృత్యు దేవత పిలుపందుకుని వెళ్ళిపోతుంది. భార్యాభర్తలిద్దరూ తీవ్ర దు:ఖానికి లోనవుతారు. ఇది చాలదని, కుండపోతకి తుఫాను తోడైనట్లు ప్రభావతికి గర్భం దాల్చడానికి కొన్ని శారీరక బయోలాజికలే అడ్డంకులు యెదురవుతాయి. రాను రాను ప్రభావతికి కూడా తెలిసొస్తుంది తనకు “కలడు కలండనెడు వాడు కలడో లేడో!“అన్న రీతిన బిడ్డలు కలగడం అంత సులభ తరమైన కార్యం కాదని. కాని—దైనందిన పూజా పునస్కారాలతో బాటు వైద్య చికిత్సలు కూడా తీసుకుంటూనే ఉంటుంది.
ఫలితం మాత్రం రాను రాను దూరమయిపోతూనే ఉంటుంది. చనిపోయిన కూతురు సుభాషిణి రూపం ఆమెనూ భర్త భువనేశ్ నీ అనవరతమూ బాధిస్తూనే ఉంటుంది. అటువంటి గడ్డు పరిస్థితిలో వాళ్ళెవరూ ఊహించడానికి కూడా సాధ్యం కాని సంఘటన యెదురవుతుంది. పార్కులో ఇద్దరూ వాహ్యాళికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వాళ్ళమ్మ నుండి దూరంగా పరుగెత్తుతూ పరుగున వచ్చి భార్యాభర్తలను ఆదమరుపున ఢీ- కొడ్తుంది. ఆ పిల్ల సారీ అంకుల్ అని చెప్తున్న మాట కూడా గమనించకుండా నిశ్చేష్టులై చూస్తూ నిల్చుంటారు.
కారణం— పరుగెత్తుకుంటూ వచ్చి వాళ్ళను ఢీ- కొట్టిన అమ్మాయి అచ్చు వాళ్ళ దివంగత కూతురు సుభాషిణిలాగే ఉంటుంది;ఎత్తులో వయసులో రూపంలోనూ--
అప్పుడా అమ్మాయి(మందాకిని) తల్లి(వరూధినిః- బిజినెస్ ఉమనె) అక్కడకు వస్తుంది. అప్పుడు వాళ్ళకు పరిచయం యేర్పడుతుంది. చాలా త్వరగా పరిచయం స్నేహబంధంగా మారుతుంది. వరూధినికి భర్తలేడు. నిజానికి భార్యాభర్త లిద్దరికీ వరూధిని స్నేహం కన్నా ఆమె కూతురు మందాకిని దగ్గరితనం ఎక్కువగా అవసరం. సహజంగానే వాళ్ళకు మందాకినితో యెమోషనల్ బంధం పెంపొందనారంభిస్తుంది. ఈలోపల చాలా రోజులుగా భర్త సాహచర్యం లేకుండా కాలం గడుపుతూన్న వరూధినికి ప్రభావతి భర్త భువనేశ్ తో సాన్నిహిత్యం పెరగనారంభిస్తుంది.
ఇది గ్రహించిన తరవాత కూడా ప్రభావతి వాళ్ళ మధ్యకు అడ్డు రాకుండా ఉంటుంది, అంతా—ఒక పన్నాగం ప్రకారమే—పథకం ప్రకారమే--- తన భర్త అచ్చు తమ కూతురులాగే ఉన్న మందాకినికి దూరంగా ఉండలేకపోతున్నా డు. సహేతుకంగా చెప్పాలంటే—అతడికి వరూధినికి దగ్గరవడం కన్నా మందాకిని ఉనికే యెక్కువ అవసరం. ఇక విషయానికి వస్తే మందాకిని తనకు కూడా కావాలి. ఆ పిల్ల దగ్గరుంటే—ఆమెకు చనిపోయిన సుభాషిణి ప్రక్కనున్నట్టుంటుంది. కాని—ఇక్కడ మిలియన్ డాలర్ ప్రశ్న ఒకటుంది. ఏమిటది?
ఎన్నాళ్ళని ఈ ట్రైయాంగిల్ అనుబంధం సాగుతుంది? ఎంతైనా వరూధిని మందాకిని తల్లే కదా— కాలమంతా కూతుర్ని తమకు అప్పగించి దూరంగా తొలగి ఉండలేదు కదా-- అది సాధ్యమూ కాక పోవచ్చు కదా-- అప్పుడు ప్రభావతి ఈ ట్రైయాంగిల్ బంధానికి ఒక కడపటి పరిష్కారం తేవాలని నిర్ణయిస్తుంది. శాశ్వత పరిష్కారం చేకూర్చాలని పూనుకుంటుంది, దీనిని పన్నాగం అనే బదులు ట్రాప్”TRAP)- ఎమోషనల్ ట్రాప్ అంటే సబబుగా ఉంటుందేమో-
ఇక చివరి అంశం-- ప్రభావతి చిత్రించ బూనిన ఈ ట్రాప్ లో వరూధిని మాత్రమే చిక్కుకుపోతుందా! లేక తాను వేసిన అదే ట్రాప్ లో ప్రభావతి కూడా తానుగా చిక్కుకుపోతుందా! నవలలో ఒకటి తరవాత ఒకటిగా విషయ విశ్లేషణ చేసాను.
నవలలోని పాత్రలు- పాత్రల పేర్లు
1)అ- భువనేశ్—కార్పొరేట్ కంపెనీలో సీనియర్ మార్కెటింగ్ ఎగ్సిగ్యూటివ్. భార్యను మిక్కిలిగా ప్రేమిస్తాడు
ఆ- భార్య- ప్రభావతి
ఇ- సుభాషిణి- కూతురు- ఏడేండ్ల ప్రాయంలో చనిపోతుంది
ఈ- పనిగత్తె- భాగ్యం.
2- అ- రాము- యు ఎస్ కంపెనీ బ్రాంచాఫీసులో భువనేశ్ కి దగ్గరితనం గల కొలీగ్-
ఆ- సోనియా- న్యూజెర్సీలోని రాము గార్ల్ ఫ్రెండ్
3)అ- వేదమూర్తి- భువనేశ్ బాబాయి. ఉన్నఊళ్ళో చిన్నపాటి కిరాణా కొట్టు నడుపుతుంటాడు.
ఆ- కామాక్షి—భార్య
ఇ- కామేశ్వరరావు- పెద్ద కొడుకు- ఓ మోస్తరు చదువుతో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు కిరాణాకొట్టులో--
ఈ- పరమేశ్వర్- రెండవ కొడుకు- జీవితంలో యాంబిషన్ ఉన్న యువకుడు. ఎన్ని యిక్కట్లు యెదురు వచ్చినా క్రిందా మీదా పడి గ్రాడ్వేషన్ వరకూ చదువు సాగిస్తాడు, టెక్నికల్ కోర్యు కూడా పూర్తి చేస్తాడు. బామ్మ మంగళాదేవమ్మ వత్తాసుతో—
ఉ- కమల- కూతురు- తల్లి నోట నాలికలా ఉంటుంది. హైస్కూలు వరకూ చదువు పూర్తి చేస్తుంది-
ఊ- పవన్- కడపటి కొడుకు- ఇతను కూడా ఓ మోస్తరు చదువు చదివి తండ్రికి వత్తాసుగా ఉంటాడు. కోమటి కోదండం కూతురు ప్రణీతతో ప్రేమలో పడ్తాడు. అడపా తడపా చీవాట్లు తింటుంటాడు. చిన్నన్నపరమేశ్వర్ కి క్లోజ్ గా ఉంటాడు.
ఋ- మంగళా దేవమ్మ- వేదమూర్తి తల్లి- కామాక్షికి అత్తగారు
ఋ- 1- వినాయకం- వేదమూర్తి తండ్రి- కామాక్షికి మామగారు
4)అ- దివాకర్- వేదమూర్తి స్కూలు ఫ్రెండు- బాగా యెదిగిన వ్యాపారి. ఫార్మాకంపెనీలో పార్టనర్
ఆ- వినోదిని- విద్యావంతురాలు- దివాకర్ పెద్ద కూతురు. ఫారిన్ లో చదువుకున్న అమ్మాయి. సౌమ్యత సంస్కారం గల అమ్మాయి. ఆత్మాభిమానమూ ఆత్మ విశ్వాసమూ గల విద్యావంతురాలు.
ఇ- తులసి- వినోదిని పెద్దమ్మ కూతురు
ఈ- శారద- దివాకర్ పెద్దత్తయ్య- అప్పటి స్కూలు హెడ్ మిస్ట్సెస్.
5- సితార- భువనేశ్ కి బిజినెస్ మీట్ లో వరూధిని పరిచయం చేసిన స్టార్టప్ బిజినెస్ వుమెన్. ఈమెను యు యెస్ లోని తన క్లోజ్ కొలీగ్ రాముకి జీవన సహచరిగా జతచేర్చాలనుకుంటాడు భువనేశ్.
6- అ- వరూధిని- మామగారు నడుపుతూన్న కార్పొరేట్ కంపెనీలో బాధ్యత గల పోస్టుటో ఉంటుంది. భర్త- చనిపోవడం వల్ల ఒంటరి గా స్వంత యింట్లో ఉంటుంది. మిసమిసలాడే యవ్వన శోభతో అట్రాక్టివ్ గా ఉంటుంది. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల భువనేశ్ కి దగ్గరవుతుంది.
ఆ- మందాకిని- ఏడెనిమిదేండ్ల వరూధిని కూతురు- భువనేశ్ ప్రభావతులకు చాలా దగ్గరవుతుంది. అచ్చు వాళ్ళ కూతురు సుభాషిణిలాగే అదరిపోయేలా ఉంటుంది.
7- అ- విశ్వం- వేదమూర్తి స్కూలు ఫ్రెండు. పైచదువులు పూర్తి చేసి ప్రభుత్వోద్యోగిగా ఉంటాడు. హెచ్చు దగ్గులను లక్ష్యపెట్టకుండా తన కూతురు వసంతను వేదమూర్తి ఇంటి కోడలు గా పంపాలని ఉబలాటపడ్తాడు.
ఆ- సువర్చల- భార్య- విద్యావంతురాలు. సీనియర్ స్కూలు టీచర్.
ఇ- వసంత- కూతురు- చదువుకున్న అమ్మాయి. మాటలో నడచుకునే తీరులో నాజూకుతనం ఉట్టి పడుతుంటుంది. ఈమెను వేద మూర్తి పెద్ద కొడుకు కామేశ్వరరావుతో జత చేర్చాలని తీర్మానిస్తారు. వసంత కూడా సానుకూలంగానే స్పందిస్తుంది.
8- ప్రణీత- వేద మూర్తి చిన్న కొడుకు పవన్ లవర్- కోదండం కూతురు.
సీరియల్ త్వరలో ప్రారంభించబడుతుంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
Comments