ఇప్పుడెందుకు పెళ్ళి
- Pitta Govinda Rao
- Apr 29, 2023
- 1 min read

'Ippudenduku Pelli' New Telugu Story
Written By Pitta Gopi
'ఇప్పుడెందుకు పెళ్ళి' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
వనజ ఎన్నో ఆశలతో పదో తరగతిలోకి అడుగు పెట్టింది. ఎందుకంటే తాను పేదింటి పిల్ల. గొప్పగా చదువుతుంది. వనజ కుటుంబం మద్య తరగతి అయినా, లేదా కాస్త ధనవంతులు అయినా ఈపాటికి ఎక్కడో అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో చదువుకునే అవకాశం వచ్చేది. అంతబాగా చదువుతుంది. చదువుకోని తల్లిదండ్రులు వలన వనజ అందరి పిల్లలు లాగానే చదువుకోవల్సి వచ్చింది. అయితేనేం గొప్ప ఉపాద్యాయులు ఉండటం వల్ల వనజ టాలెంట్, మేధాశక్తి వారికి ఆకట్టుకుంది. ఉపాద్యాయుల మద్దతు తో పదోతరగతి లో రాణిస్తు వస్తుంది. ఇదిలా ఉంటే.. ఒకరోజు పాఠశాల ఉపాద్యాయులు కు అర్జెంట్ మీటింగ్ ఉండటంతో ఒక పూట అనంతరం పాఠశాల విడిచారు. వనజ మధ్యాహ్నం ఇంటికి రాగా.. ఇంట్లో తాను ఎప్పుడూ చూడని బంధువులు ఉన్నారు. "ఎవరమ్మా వీళ్ళంతా".. అని అమ్మ శాంతమ్మను అడుగుతుంది. "నీకు కాబోయే అత్తగారి కుటుంబం, బంధువులు" అంటుంది శాంతమ్మ. "అంటే?.. " ఆశ్చర్యంగా అడుగుతుంది వనజ. "అవునమ్మా.. నీకు పెళ్ళి సంబంధం చూశాం" అంటాడు తండ్రి రామయ్య. "నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. కావాలంటే ఇప్పుడు ఒప్పుకుంటాను, నా లక్ష్యం పూర్తయ్యే వరకు చదివిస్తానంటేనే" అని అంటుంది వనజ. "ఏమే! పేదోళ్లం.. మంచి సంబంధం తెస్తే.. కాదంటావా? అలా అయితే రేపు ఎవడో గొర్రెలు కాచేవాడు వస్తాడు. అర్దమైందా.. " అని గసిరాడు రామయ్య "చూడండి నాన్న.. మీరు ఎంతో కష్టపడి నన్ను పదివరకు చదివిస్తు వచ్చారు. చదువు విలువ ఏంటో నాకు తెలిసింది. అలాగే మీ కష్టం కూడా అర్థమయింది. కాస్త ఓపిక పడితే మంచి రోజులు వస్తాయి" నచ్చజెప్పుతుంది. "మేమింక ఓపిక పట్టలేం. వాళ్ళకి ఇవ్వాల్సిన కట్న కానుకలు ఇప్పుడే నా దగ్గర ఉన్నాయి. అవి ఖర్చు అయిపోతే మళ్ళీ నేను సంపాదించలేను. ఎవడి కాళ్ళమీద పడి ఏడవలేను" కరాకండిగా చెప్పేస్తాడు రామయ్య. వనజ తల పట్టుకుని కుర్చిలో కూర్చున్న వరుడి వద్దకు వెళ్ళి, "చూడండి.. నన్ను పెళ్ళి చేసుకుని చదివిస్తారా".. "నీకెందుకు శ్రమ నా సంపాదన ఉండగా" "అంటే.. మీరు ఉద్యోగం చెయ్యవచ్చు కానీ ఆడవాళ్లు ఉద్యోగం చేయకూడదంటావ్ అంతేనా.. " "అలా ఏం లేదు. ఏ ఆదారం లేని ఆడవాళ్ళు ఉద్యోగంలో ఉంటే అర్థం ఉంది కానీ.. నీకు అన్నీ మేం చూసుకుంటాం కదా.. నీకెందుకు శ్రమ అని" "3×5 వయసు లో పిల్లల్ని కని మీకు చాకిరి చేసే బదులు, చదువుకోని నా తల్లిదండ్రులుకు చదువు ఎలా ఉంటుందో, దాని ఫలితం ఏంటో చూపించగల్గే సత్తా నాకుంది. మీరు ముందు బయటకు వెళ్తే మా వాళ్ళకి నేను నచ్చజెప్పుకుంటాను" అంటుంది వనజ. "అయితే పెళ్ళకి ఒప్పుకోనంటావ్. అంతేనా".. అంటాడు వరుడు. "నేనే కాదు, వయసుకి రాని ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. మీకంటు ఒక లక్ష్యం ఉంటే మాకంటు లక్ష్యం ఉండదా.. మీకు బార్యను, తల్లిదండ్రులను చూసుకోవాలనే కోరిక ఉన్నప్పుడు మాకూ తల్లిదండ్రులను చూసుకోవాలనే ఆశ ఉండదా.. అయినా.. చదువుకోని వాళ్ళు బాల్యవివాహం చేస్తుంటే.. చదువుకున్న మీ లాంటి వాళ్ళు చిన్న పిల్లల్ని పెళ్ళి చేసుకోవటంలో అంతర్యం ఏంటో చెప్తారా".. తడబాటు లేకుండా చెప్తుంది వనజ. ఆ మాటలకు శాంతమ్మ, రామయ్యలకు తన కూతురికి ఇంత దైర్యం, ఇంత మాటకారితనం ఎలా వచ్చాయి.. అవతలి వాళ్ళని తిరిగి మాట్లాడనివ్వని విధంగా తన మాటతీరు ఉంది. ఆమె మాటలకు వాళ్ళు చాలా ఆనందించారు. వనజ గూర్చి తాము తెలుసుకోలేకపోయామని, ఇప్పుడు ఈ పెళ్ళి రద్దు అయితే బాగున్ను అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కానీ.. బయటకు చెప్పలేదు. "నీకు అక్కా-చెల్లెలు ఉన్నారా" వరుణ్ణి అడిగింది వనజ. "చెల్లి ఉంది " అన్నాడు వరుడు. "ఏం చేస్తుంది" "ఇంటర్ పూర్తయింది" "నీ చెల్లిని ఇంటర్ పూర్తి చేయించావ్.. నన్ను మాత్రం పదిలో ఉన్నప్పుడు పెళ్ళి చేసుకుంటానని వచ్చావ్.. నీ చెల్లి పెళ్ళి బాధ్యతలు నువ్వు చూడకుండా, తనకు పెళ్ళి చేయకుండా.. నన్ను చూసుకుంటానంటున్నావ్, నమ్మదగినదేనా?".. అని ప్రశ్నించింది వనజ. ఆ మాటకు జవాబు రాలేదు. వనజ కోపంతో "నన్ను మన్నించండి. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి " చేతులు జోడించి చెప్తుంది. వాళ్ళు వెళ్ళిపోతారు. "అమ్మా వనజా! నీ తెలివితేటలు మాకు తెలియలేదమ్మా.. అందరి పిల్లల లాగే బడికెళ్ళి వస్తున్నావు అనే మాకు తెలుసమ్మా. నువ్వు ఏది చదివితే గొప్పదానివి అవుతావో.. మాకు తెలియదు కానీ.. గొప్పదానివి కావటానికి నువ్వు ప్రయత్నం చేసే ప్రతి పనికి మేం డబ్బులు కూడగట్టి ఇస్తానమ్మా.. ఈ కట్నం నాకు ఆదనపు డబ్బు. దీన్ని నీ భవిష్యత్ కే ఖర్చు చేస్తా" అంటాడు రామయ్య. ఆ మాటకు తల్లిదండ్రులను కౌగిలించుకుని ఓదార్చి అలా ఆడుకోటానికి బయటకెళ్తుంది వనజ. ***శుభం*** |
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం.
Y Ramu • 3 days ago
సూపర్ గోపి