'Itlu Mee Principal' - New Telugu Story Written By M. Laxma Reddy
Published In manatelugukathalu.com On 22/05/2024
'ఇట్లు మీ.. ప్రిన్సిపాల్' తెలుగు కథ
రచన: M. లక్ష్మా రెడ్డి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ప్రియమైన పేరెంట్స్ కి అభినందనలు..
ఈ విద్యా సంవత్సరం ముగింపుకు వచ్చింది..
పేరెంట్స్ గా మీ అద్భుత సహకారం వల్లే ఈ సంవత్సరం విజయవంతంగా గడిచింది.
ఒక విద్యా సంవత్సరం ముగింపు అంటే..
పరీక్షలు..
పరీక్షలు పిల్లలకేనా..
పరీక్షలు.. మీకు.. మాకు కూడా..
కానీ పిల్లలకి పరీక్షలంటే. కొంచెం భయం.. కాస్త కంగారు..
ఇంకాస్త టెన్షన్.. ఓ రకమైన నెర్వస్ నెస్..
మరి మాకు.. స్కూల్ లో వాళ్ళ ప్రతి క్షణం మాకు తెలుసు కాబట్టి.. ఎవరు ఎలా ముగిస్తారో.. అని భయం.. కూతుహలం..
మీకు.. మీ పిల్లలే మీ కలల సాధకులు.. మీ సోషల్ స్టేటస్ నిర్మాతలు.. కానీ.. అది సరైనదేనా.. ?
క్లాస్ ఏదైనా.. ఎగ్జామ్ ఎలాంటిదైనా..
పిల్లలకు భయాలు.. సందేహాలు.. సమస్యలు.. టెన్షన్లు.. సహజం.. మనం ఆ స్థాయి దాటే కదా వచ్చాం..
అయితే..
ఇప్పుడు పిల్లల పరీక్షల వేళ.. మనం చేయాల్సింది..
పిల్లలకి ఆ టెన్షన్ లేని వాతావరణం కల్పించడం..
వాళ్ళ పట్ల మన అటెన్షన్ చూపించడం..
ఇంకా..
మార్కుల కోసం.. మూర్ఖుల్లా పిల్లల్ని ఒత్తిడి చేయడం సరి కాదు.
అందరూ డాక్టర్లు.. ఇంజనీర్లు అవ్వాల్సిన అవసరం లేదు..
బిజినెస్ చేయబోయే వాడికి.. ఫిజిక్స్ రాకంటే ఏం.. లాజిక్స్ తెలిస్తే చాలు కదా.
డాక్టర్ అవ్వాలనుకునే అబ్బాయికి.. సోషల్ లో మార్కులు తగ్గితే కొంపలేం మునగవు కదా..
రేపు ఇంజినీర్ అవబోయే అమ్మాయి.. బయాలజీ బొమ్మలు సరిగా వేయకుంటే తప్పేం కాదుగా..
స్పోర్ట్స్ లో సత్తా చాటే పిల్లలకి.. మైక్ ముందు మాట్లాడే భాష వస్తే చాలుగా.. ఆ భాషలో మార్కులు అవసరం లేదుగా..
ఫ్యూచర్ లో C A అయ్యే పిల్లలకి.. అకౌంట్స్ ముఖ్యం కాని.. లాంగ్వేజ్ మార్క్స్ కౌంట్ కాదుగా..
ఇంకా సైన్స్ లో మార్క్స్ కన్నా.. కామన్ సెన్స్ ముఖ్యం..
మాథ్స్ స్కోర్ కన్నా.. బతికే లాజిక్ కే ప్రాముఖ్యం..
హిందీ ఇంగ్లీష్ రాకుంటే.. తెలుగు ఉందిగా.. మాట్లాడ్డానికి..
తెలుగులోనే మార్కులు రాకుంటే.. మార్కులే రాలేదు.. మాట్లాడ్డం కాదు కదా..
పిల్లలని ఎదగనిద్దాం.. వారికి నచ్చిన దారిలో..
ఉత్సాహంగా ఎగరనిద్దాం.. లక్ష్యం సాధనలో..
పసిమనసుల శ్వేతపత్రం లాంటి మనసు కాన్వాసుపై మీకు నచ్చిన.. మీరు సాధించలేని డాక్టర్లు.. ఐఐటీ ల బొమ్మలేయకండి.. ఆ అవకాశాన్ని.. వారికే వదిలేద్దాం.. కాకుంటే తోడుగా ఉందాం..
చేజారిపోకుండా.. చూస్కుందాం..
దానికోసం.. ఈ క్షణం.. ఈ రోజు.. మనం చేయాల్సింది..
ఈ పరీక్షల వేళ.. వాళ్ళతో ఉండడం..
ఫోన్ లు పక్కనెట్టి.. పిల్లలతో గడపడం..
చివరగా.. రిజల్ట్ రోజు.. ,
మార్కులు కాదు.. టీచర్ నుండి రిమార్క్ లు తెలుసుకోండి.. మంచి చెడు రెండూ..
ర్యాంకులు కాదు.. తోటివారి పట్ల మీ పిల్లల ప్రవర్తన తెలుసుకోండి..
ఇక..
నుదిటిపై ముద్దు పెట్టి.. చిరంజీవా అని దీవించి.. స్వేచ్చగా ఎదగనీయండి..
మీరు ఇలా సహకరిస్తే.. మేము మరింత అందంగా వాళ్ల భవిత తీర్చిదద్దగలం..
భావి భారత పౌరుల నిర్మాణంలో..
మీ పాత్రకి.. నమస్సులతో..
ప్రిన్సిపాల్..
***
M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నేను లక్కీ.. లక్మారెడ్డి
రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా..
అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు..
నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను..
నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను...
ధన్యవాదాలు...
ఇది కథ కాదు, సత్యం!