#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #జరజాగ్రత్తబిడ్డా, #JaraJagratthaBidda, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు
Jara Jagrattha Bidda - New Telugu Story Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 27/11/2024
జర జాగ్రత్త బిడ్డా - తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
“మీరంతా ఇవాళ ఈ ఎస్టేట్లో కాపలా ఉండాలి రా.. నలుగురు ఇంటి చుట్టూ తిరుగుతూ లైట్ పట్టుకొని చేతిలో దుడ్డు కర్రలు పెట్టుకొని ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి”
“ప్రతిరోజు అట్లానే ఉంటాము కదయ్యా! మాకు ఆ పనికొత్తేమీ కాదు. మీ రక్షణే మా బాధ్యత.. అన్నీ ఉన్నా మాకు మీ మీద ఎప్పుడూ శ్రద్ధ ఉంటుంది. మీకు అడుగడుగునా జాగ్రత్తగా అన్ని చూసుకుంటూ, మీకు ఎలాంటి హాని కలగకుండా చూసు కుంటాము..” అన్నారు పనివాళ్ళు.
“ఇదంతా నాకు తెలుసు.. నేను ఉన్నప్పుడు గురించి చెప్తున్నారు.. ఈరోజు నుండి నాలుగురోజులు ఊళ్ళో ఉండటం లేదు.. కొన్ని పైరవీల మీద పక్కన నగరానికి వెళ్లాల్సి వస్తుంది. రెండు రోజుల వరకు నేను రాకపోవచ్చు. అప్పుడు జర జాగ్రత్త గా ఉండండి”.
వెంటనే వెనుక సూట్ కేస్ లు పట్టుకుని, ఒకడు షూస్ వేస్తూ, మరొకడు ముందు నడుస్తూ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చో బెట్టారు.
******************
రాజగోపాల్ ఊరిలో సంపాదించిన అంత ఎవరు సంపాదించ లేదు.
(నిన్న టి రోజున)
“నాన్న! నేను పరీక్షలు ముగించుకుని సరదాగా ఇక్కడ ఎంజాయ్ చేయాలని వచ్చాను.
సెలవులు అంతా మీరు నన్ను స్వేచ్ఛగా తిరగనియ్యాలి. ఏఆంక్షలు పెట్టవద్దు” అని వైష్ణవి అనగానే..
“నీ ఊర్లో నీకు నచ్చిన్నట్లు ఉండ వచ్చు. కాకపోతే నువ్వు నాకూతురు అని తెలియకుండా కొంచెం వేషం మార్చు.. జర జాగ్రత్తగా ఉండాలి. పట్నంలో ఎలా తిరిగినా ఎవరు నిన్ను పట్టించుకోరు. అక్కడ అంటే అందరూ సమానమే.. కానీ ఇది పల్లెటూరు. నువ్వు ఊరిలో కార్లో తిరుగుతావు. ఇక్కడ ప్రత్యేకంగా అనిపిస్తుంది. మరి ఈ నాలుగు రోజులు నేను ఊర్లో ఉండను” అనగానే..
“నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకు నాన్న. నిశ్చింతంగా వెళ్లి రా నాన్న”
‘ఎలా నమ్మా! నా భయాలు నాకు ఉంటాయి’.. అని మనసులో అనుకున్నాడు.
వచ్చే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్లయితే వెంటనే నాకు వెంటనే ఫోన్ చేయండి అని చెప్పుదామని అనుకున్నాడు.. కానీ బాగుండదు బిడ్డ ముందు అల మాట్లాడితే, అదీ చాలా రోజుల తరువాత. అనుమానస్తుడిగా అనుకుంటుంది..
నాన్న నా విషయంలో ఇలా ఆలోచిస్తున్నాడు.. అని అనుమానం వస్తుంది కావచ్చు.. నేను మరీ అంత చీప్ గా బయటపడ కూడదు. ఊరిని ఉద్దరిస్తానని మంచి పనులు చేసి చూపించే గ్రామ సర్పంచ్ ను.. అయినా ఊళ్ళో చిన్న చిన్న కమతాలు అన్నిటిని పేదల పేరిట వ్రాసి వాళ్ల చేత మంచి వాడిని అని అనిపించుకున్నాను. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళ చేత గ్రామాభివృద్ధికి కోసం ఆరోగ్య, విద్యా, సాంఘిక కార్య క్రమాలు దిగ్వి జయంగా ఉండే దాంతో సహకారంతో అన్ని పనులు చక్కబెట్టుతూ, ఇప్పుడు ఎమ్మెల్యేగా ముందంజలో ఉండి పల్లెల్లో కుటుంబాలకు గురించి చేయూతనిస్తూ ముఖ్యమంత్రి కావడానికి చేసే ప్రయత్నాలు కోసం సీఎం కార్యాలయానికి తరచుగా ప్రయాణాలు చేస్తున్నాను.
*************
ఎలాగో నాన్న లేరు కాబట్టి ముందుగా నా ఊళ్ళో ప్రజలకు ఆరోగ్యం పట్ల ఎంతగా అవగాహన చేసుకుంటున్నారని చూద్దామని.. వెళ్లి..
“అమ్మా, పెద్దమ్మా! మీ ఆరోగ్యం ఎలా ఉంది?” అని దగ్గరికి వెళ్లి “నేను ఈ ఊరికి హెల్త్ సైడ్ కి పని చేయాలని వచ్చాను. ముందుగా మీ సమస్యలు చెప్పండి" అని అడిగింది.
“ఏముందమ్మా! మాకు మీరు మీ లాంటి వారే దయ చూపాలి. " అని దీనంగా చూస్తుంటే..
“వాడే మందులు చూపించండి” అని వాటిని చూచి, “అస్తమా కోసం వేసుకుంటున్న టాబ్లెట్స్ అన్ని ఎక్స్పైరీ అయినాయి. ఇలాంటివి వాడటంవల్ల ప్రాణానికి ప్రమాదం..” అంటూ ఆ హాస్పిటల్ నర్సులను పిలిపించి వారిని శ్రద్ధగా, సరిగా చూసుకోవాలని మంచి మందులు ఇవ్వాలని వారికి హెచ్చరిక చేసింది.
ఆరోగ్య సూచనలు చేయాలంటూ “ఆహారం ఏం తీసుకుంటున్నారు?” అని వారికి సమతుల ఆహారాన్ని ఎక్కువగా ప్రోటీన్లు, తాజా కూరగాయలు, పండ్లు ఆహారాలను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియ జేసింది.
వచ్చిన కొద్ది రోజుల్లో “అమ్మ.. ఎన్ని కొత్త విషయాలు ఉపయోగ కరమైన వన్నీ తెలుసుకున్నాము.. మీ వల్ల.. మీరు ఎక్కడికి వెళ్ళకండి. మా వెనక ఉంటే మాకు ఎంతో ధైర్యం తల్లి” అన్నారు.
“మీరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఎవరున్నారో నాకు లిస్ట్ ఇవ్వండి..”
“అంటే ఏంటమ్మా?”
“మీ పేర్లు చెప్పండి. నేను రాసుకుంటాను. మీకు ఒక బడి పెట్టిస్తాను” అని అందరికీ ఒక పెద్ద గదిలో తనతో వెంట వచ్చిన ఫ్రెండ్స్ ను టీచర్స్ గా నియమించింది.
“మహేష్! నువ్వు వీళ్లకు తెలుగు రాయడం చదవడం నేర్పించాలి” అని చెప్పింది.
“నాలుగేళ్లుగా చదువు తున్న వాడిని వీళ్లకు చదువు చెప్పలేనా?” అన్న ఫ్రెండ్ మాటలకు బుంగ మూతి పెట్టు చూసింది వైష్ణవి.
రెండు రోజుల్లో వస్తానన్న తండ్రి నాలుగు రోజుల వరకు రాక పోయేసరికి చేయవలసిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసింది. కొంతమందినీ పిలిచి వారి భూమి పత్రాలన్ని తీసుకురమ్మని చెప్పింది.
“ఈ పేపర్లన్నీ మీ పేరు మీద ఉన్నా, అవి కొన్ని రోజుల వరకు అక్కడ పెద్ద ఫ్యాక్టరీ కట్టబోతున్నారు. అప్పుడు మీ భూములకు ఎంతో కొంత నష్ట పరిహారం చెల్లించి వాటిని తీసుకుంటారు.
అప్పుడు మీరు వలస పోవాల్సి వస్తుంది. లేదా ఆ ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి కుదుర్చుకుంటారు”
“అమ్మా! ఇలాంటి కుతంత్రాలు చేస్తున్నారా? అజ్ఞానంతో విద్య రాక పోవడం కారణంగా మేమంతా వాళ్ళు చెప్పేదంతా చేసేదంతా నిజమే అనుకుంటున్నాము. దీనికి మేము ఎవరము ఒప్పుకోము”
“అయితే ఈ రెండు రోజుల్లో మీరందరూ మీ భూములను మీ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించు కోండి. అప్పుడు పేరుకే ప్రభుత్వ భూములను ఇచ్చినట్టే ఇచ్చి తీసుకోవాలనుకుంటున్న వాళ్ల బండారం బయటపడుతుంది”
“అమ్మా! మీరు మా పాలిట దేవతలా వచ్చి మాకోసం ఎన్నో చేశారు. మేము మీ మేలు మరువలేం అమ్మా. మీకోసం మేము చిన్న బహుమతులు తెచ్చాము” అంటూ కొన్ని చేనేత చీరలు తెచ్చి,
“అమ్మా, తీసుకోండమ్మా ! మా ప్రేమ అంతా కలబోసి చీరలు నేసాము. మీరు ప్రసాదించిన మరమగ్గాలపైన.. సులభంగా.. తయారయ్యాయి”
“చీరలన్నీ చాలా బాగున్నాయి. వచ్చేవారం పట్టణాల్లో పెద్దపెద్ద ఎగ్జిబిషన్లు ప్రారంభమవు తున్నాయి. మీకు అక్కడ పర్మిషన్ ఇప్పిస్తాను. మంచి ధరకు విక్రయించండి. ఆదాయం మీ పిల్లలు పాపలకు మంచి భవిష్యత్తు కోసం చదువుకోవడం కోసం ఖర్చు పెట్టుకోండి”
***********
“లేచారా? ఏమండీ! రెండు రోజులలో వస్తా అన్న మీరు వారం రోజుల వరకు రాక, చాలా పొద్దు పోయే సరికి మీతోటి మాట్లాడటానికి సమయం కూడా దొరకలేదు. ఈ హారతి తీసుకోండి” అంటూ పూజ ముగించుకుని హారతి పళ్ళెం చేతిలో పట్టుకుని వచ్చిన భార్యని చూచి “అమ్మాయి ఎలా ఉంది? వెళ్ళిన చోట ఫోన్ చేసి మాట్లాడుదామన్న తీరిక దొరకలేదు..” అంటూ హారతి కళ్ళకు అద్దుకున్నాడు.
హారతి పళ్ళెం పూజ గదిలో పెట్టి వచ్చి టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసుకొని చదువుతూ.. టీవీ న్యూస్ ఛానల్ ను ఆన్ చేసింది. ఇంతలో రంగమ్మ తెచ్చిన కాఫీని భర్తకు ఇచ్చి తను తీసుకుని తాగుతుండగా..
“మంగపేట మండలం క్రింద గ్రామాలన్నీ అభివృద్ధి మార్గంలో పయనిస్తున్నాయి. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారు. వైష్ణవి గారి ఆధ్వర్యంలో ఎన్నో గొప్ప పనులు విజయవంతం అయ్యాయి. గుడ్ న్యూస్” న్యూస్ రీడర్ చెబుతున్న మాటలు విన్న రాజగోపాలం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.
అభివృద్ధి మార్గంలో.. వైష్ణవి చేసిన పనులు ఈ విధంగా ఉన్నాయా?
“వైష్ణవి ఇంకా లేవలేదా? రంగమ్మ వెళ్లి చూడు..” అంటుండగానే..
ఇంటి ముందు గుంపులుగా జనాలు నిలబడి.. “రాజగోపాల్ గారు మనకు చేసిన అన్యాయాన్ని నిలదీయాలి. ఆయనకు ఇంక మరి సపోర్ట్ చేసేది లేదు.. వచ్చే ఎన్నికల్లో గెలిపించేది లేదు..” అని “రాజగోపాల్ గారు డౌన్ డౌన్” అంటూ గుమ్మం ముందు ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు.
వైష్ణవిని చూచి “ఏంటమ్మా! నిన్ను స్వేచ్ఛగా తిరగ మన్నాను.. కానీ ఊరంతటిని నాపైకి ఉసి గొలుపు తావని అనుకోలేదు. ఇప్పుడు నన్ను ద్రోహిగా నిలబెట్టావు. పిల్ల కుంక.. నీకు రాజ కీయాలు తెలవవు ? నాకు రాజకీయం లేకుండా చేశావు. నన్ను చీడ పురుగును చూసినట్లు చూస్తున్నారు..”
“మీరు వాళ్ళ ముందుకు వెళ్ళవద్దు జర జాగ్రత్త నాన్నగారు” అన్నది.
“అలా ఎన్నాళ్లు దాచుకుంటాం తల్లి.. ఎప్పటికైనా ఎదురు పడక తప్పదు. వెళ్లి.. చేసిన తప్పులు ఒప్పు కుంటాను” అని వెళ్ల బోతుంటే..
“వద్దు నాన్న. నేను వెళ్తాను” అన్నది.
“వద్దమ్మా! నా ఇంట్లో ఉన్నావని తెలిస్తే నీకు వచ్చిన మంచి పేరు కూడా పోతుందమ్మా. ఆ తప్పులన్నీ నావే.. నేనే బాధ్యుడిని” అని బతిమిలాడుతున్న తండ్రిని..
“ నాన్న! నిన్ను అవమానించింది నేను.. కదా.. మళ్ళీ మీకు గౌరవం తెప్పించాలంటే నేనే వెళ్లాలి..” అంటూ బయటికి వెళ్లి నిలబడింది.
వెంటనే అందరూ “అమ్మా, మీరా?” అని ఆశ్చర్యంగా.. చూస్తుంటే..
“ముందు నేను చెప్పేదంతా నిదానంగా వినండి. మా నాన్నగారు రాజగోపాల్ గారు.. వారే అని తన వారసురాలుగా నన్ను ఈ పనులన్నీ మా నాన్నగారే నా చేత చేయించారు. మీరంతా మా నాన్నగారి గొప్పదనాన్ని గుర్తించాలి. పార్టీని బలోపేతం చేయడానికి ఇలా నా సహాయం తీసుకున్నారు. ఇదంతా మా నాన్నగారే ఇష్టానుసారంగా చేయించారు.. అని అంతా వివరించి చెప్పింది.
అందరూ సంతోషించి రాజగోపాలం గారు జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ మీరే మాకు సీఎం. గా రావాలి అంటూ సంతోషంతో వెళ్లిపోయారు.
“ఏమిటమ్మా! ఇదంతా నాకు కలలా అనిపిస్తుంది. ఎదిగిన కొడుకు అయినా ఉండాలి, తరగని ఆస్తి అయినా ఉండాలి అంటారు.. కానీ నాకు ఈ రెండు కాకుండా కీర్తి ప్రతిష్టలు పెంచే కూతురు ఉంది” అంటూ గర్వంగా కూర్చుని ప్రేమగా చూస్తూ రెండు చేతులతో దగ్గరికి తీసుకున్నాడు.
“నాన్నా ఇందులో నాకు కూడా మంచే జరిగింది. నేను ఐఏఎస్ ట్రైనింగ్ లో ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేసి చూపించాలి. అలా ఈ గ్రామ అభివృద్ధిని ప్లాన్ చేసుకున్నాను.”
“సరేనమ్మ! మనం కలిసి జాగ్రత్తగా చేస్తే అంతా మంచికే జరిగింది" అంటూ సంతోషించారు అందరూ..
సమాప్తం.
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Comentarios