జయహో! వీరసైనికా!
- T. V. L. Gayathri
- 7 minutes ago
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #జయహో, #IndianJawan, #నవనాగరికత

గాయత్రి గారి కవితలు పార్ట్ 13
Jayaho Veera Sainika - Gayathri Gari Kavithalu Part 13 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 21/04/2025
జయహో! వీరసైనికా! - గాయత్రి గారి కవితలు పార్ట్ 13 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
జయహో! వీరసైనికా!
(కవిత )
వీరులెవరు మనలో బింకమును చూపండి!
చేరి మనసీమలకు చేవ నొసగగరండి!
ధారుఢ్యవంతులై ధరలోన శూరులై
తేరి పారగ చూచి దిక్కులను గెలవండి!
మంచుకొండలలోన మార్గాన్ని వెదుకుచూ
కంచెగా మారుతూ కలిసి పయనించాలి!
మనదేశ రక్షణకు మరతుపాకులతోడ
వెనుకముందుగ నడిచి భీతి పోగొట్టాలి!
తనువుపై గాయాలు తగులుతుంటే మీరు
వెనుకంజె వేయకనె వీరతను చూపాలి!
తల్లి దండ్రుల వీడి దారసుతులను వీడి
చల్లగా మాకు మీ సాయమందించాలి!
భరతమాతను గాచు బాహుదండాలతో
బరువైన గోడలై బలముతో నిలవాలి!
మీరు రక్షణ చేయ మేము నిదురోతాము!
భారములు వదలి మా బాధలను మరిచెదము!
ఆరారు కాలములు హాయిగా బ్రతికెదము!
వీరులకు వందనము ప్రేమనే పంచెదము!
సైనికుల సాహసము చరితలో నిలుచులే!
వేనోళ్లతో మిమ్ము వినుతించుతాములే!//
************************************
నవనాగరికత
(కవిత )

నాటి చదువులు లేవు నైతికత లేదులే!
కోటి విద్యలు నేర్వ గుర్తింపు రాదులే!
పరుల సంస్కృతి పైన వ్యామోహమెందుకో?
పరుగు పెట్టుచునుండి బాధపడుటెందుకో?
నవనాగరికతమని నాశనం బొందెదరు
భవితవ్య మెరురుగరీ వారసులు మనవారు
కుఱచదుస్తులు వేయు కుఱ్ఱలే మిగిలారు
తరతరాలచరితను తగులబెట్టేశారు
క్లబ్బు పబ్బులు తిరిగి కాలమును మరిచెదరు
గబ్బు పట్టించుకొని కలతలో మునిగెదరు
మన చదువులే మంచి మార్గమును చూపులే!
ఘనమైన కీర్తినే కట్టబెడతాయిలే!
పెద్దవారి పలుకులు బిడ్డలెపుడు వినాలి!
బుద్దిగా చదువుకొని పుణ్యులై మెలగాలి!
భారతీయుల ఘనత వసుధలో నిలపాలి!
గౌరవముగా బ్రతికి కలిసి జీవించాలి!//.
*******************************

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments