'Jeevana Datha' - New Telugu Poem Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 16/10/2023
'జీవన దాత' తెలుగు కవిత
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
కొమ్మలతో రెమ్మలతో బలమైన వేళ్ళతో విస్తరించిన వృక్ష రాజమా నీవే మాకు పెన్నిధి
ఆ కొమ్మల గుబురుల్లో గూడుకట్టి ఆగూటిలో కాపురం వుంటూ గుడ్లు పెట్టి సాకిన పక్షుల జంటలు ఎన్నో
వానలొచ్చినా వరదలువచ్చినా అదరక బెదరక నీ నీడలో చేరిన వారిని కాపాడే ప్రాణదాతవు
నీ చెట్టుకుపూచిన పూలమకరందం తేనెటీగలకు జీవనాధారం మానవులకు ఆరోగ్య ప్రదానం
నీ చెట్టుకు కాచిన ఫలాలు సకల జీవులకు కడుపు నింపే అపూర్వమైన వరాలు
నిగనిగలాడే నీహరిత పత్రాలు మాఇంటికి అలంకారమైన మంగళ తోరణాలు
నీ చెట్టు కొమ్మల్లో ఊయలలూగే పిల్లలను మురిపించి నీనీడలో సేదదీరిన పెద్దలతో ఊసులాడుతావు
నువ్వే అయ్యావు అందరికీ ఆధారం నీ ఆదర్శాల నీడలో ఎదగాలినవతరం
పుడమితల్లి పుట్టుక నిచ్చింది నీకు ఆతల్లికి నీడనిచ్చి తల్లి ఋణం తీర్చుకున్నావు
మనుషులంతా నేర్చుకోవాలి నీ సహనం నీ త్యాగం నీదయాగుణం పుట్టుక ప్రయోజనం
రుతువులు ఎన్నిమారినా ప్రళయాలెన్ని ముంచుకు వచ్చినా దృఢంగా నిలిచి ఉంటావు
నీ చెట్టు కొమ్మలు ఎందరికో ఇల్లుకట్టుకోడానికి పంచి ఇచ్చే పెన్నిధివి
ఎండిన నీకొమ్మలుసైతం చలికాచుకోడానికి ఇస్తావు వంటచెరకుగా వాడుకునేవారికి పంచుతావు
అందరికీ అన్ని విధాలా ఆధారం అయ్యేవు నీ జీవితమే పవిత్రం నీవులేనిదే జీవనం దుర్భరం !
********
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
Коментарі