top of page

జీవన రాగాలు ఎపిసోడ్ 12



'Jeevana Ragalu Episode 12'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 09/07/2024

'జీవన రాగాలు ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. ఆయన భార్య పేరు సుందరి. దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య. 


గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన. గతంలో అయన వివాహం కౌసల్యతో జరుగుతుంది. కౌసల్య, దశరథ రామయ్యలకు కవలలు పుడతారు. వారికి దశరథ నందన, సునంద అని పేర్లు పెడతారు. 


గుర్రపు బండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య, బండి నడిపే ఫకీరా మరణిస్తారు. 


పిల్లల్ని, దశరథ రామయ్యను చూసుకోవడానికి అతనికి కౌసల్య చెల్లెలు సుందరితో వివాహం జరిపిస్తారు పెద్దలు. వారి పిల్లలే గోపినందన, హిమబాల. పిల్లలు పుట్టాక సుందరి ప్రవర్తనలో మార్పు వస్తుంది. 


దశరథనందన వివాహం మన్మధరావు కూతురు భానుప్రియతో జరిపించాలనుకుంటుంది సుందరి. 


తాగిన మైకంలో దశరథనందన, భానుప్రియను బలాత్కారం చేసినట్లు ఆరోపిస్తారు మన్మధరావు, అతని భార్య మంగ. నందనను ఇంటినుంచి వెళ్లిపొమ్మంటాడు దశరథరామయ్య. 

తానూ ఏ తప్పూ చేయలేదని విశ్వసిస్తాడు నందన. నిజం నిరూపించడానికి సర్కిల్ ఇన్ స్పెక్టర్ మురారి సహాయం కోరుతాడు.


ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 12 చదవండి. 


నందన బావ శాంతారామ్, నందనకు తను తయారు చేయించిన ప్రాజక్టు రిపోర్టు..ప్లాన్సు.. ఎస్టిమేషన్.. బ్యాంక్ లోన్.. అప్రూవల్.. చూపించాడు.


“మన నిర్ణయం ప్రకారం నీ పరోక్షంలో నేను సునంద కలిసి వీటన్నింటినీ తయారు చేయించాము. నీకు సంతోషమే కదా!..” నవ్వుతూ అడిగాడు శాంతారామ్. 


నందన బావగారిని కౌగలించుకొన్నాడు. ఆనందంతో చెల్లెలి చేతులు పట్టుకొని ఆమె నొసటన ముద్దు పెట్టాడు.


“అనుకొన్న ప్రకారం ఎల్లుండి భూమి పూజ జరిపించాలి. యీ కట్టడ నిర్మాణాన్ని మీ మామయ్య శంకరయ్య చేయబోతున్నాడు. నేను ఆయనతోనూ మాట్లాడాను. నాలుగు నెలల్లో పూర్తి చేస్తానని నాకు మాట యిచ్చాడు.” 


గదిలో ప్రవేశిస్తూ ఆదినారాయణ దరహాసవదనంతో 'తథాస్తు..' అని పలికాడు. ప్రక్కన ఊర్మిళ కూడా వుంది. 


“నందనా!.. నీ మనస్సు చాలా మంచిదిరా!.. నీ కోర్కెలన్నీ తీరుతాయి. ఆ దేవుడు నీకు ఎప్పుడూ అండగా వుంటాడు.”


నందన అత్తమామల కాళ్లకు నమస్కరించాడు. అతని తోడే శాంతారామ్ సునంద అదే పనిని చేశారు. ఆ దంపతులు.. ఆ మువ్వురినీ హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.


అనుకొన్న సమయానికి భూమిపూజ జరిగింది. ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభం అయింది.

మామ శంకరయ్య పాదాలకు నమస్కరించాడు నందన. శంకరయ్య.. అతన్ని తన హృదయానికి హత్తుకొన్నాడు. సుఖ ఆశీస్సులను తెలిపాడు.


తమ్ముడు గోపీనందన.. చెల్లి హిమబాలా.. నారాయణ వచ్చారు. నందనను చుట్టుముట్టారు. కలిసి వుండనందుకు కంటతడి పెట్టారు. వారిని వూరడించి తన హృదయానికి హత్తుకున్నాడు నందన.

“ఆ దేవుడు అనే వాడుంటే.. త్వరలో మనం అంతా ఒక యింటి వాళ్ళమే అవుతాం. నాన్నగారికి సంతోషాన్ని కలిగిద్దాం. నాన్నను జాగ్రత్తగా చూచుకొండి గోపీ!.. అమ్మా బాలా!..” యిరువురి కళ్లల్లోకి చూచాడు నందన. 


“అలాగే అన్నయ్యా!..” ఏక కంఠంతో పలికారు గోపీబాలలు.


“నందనా! నేనూ నీతో వస్తాను.” చేతులు పట్టుకొన్నాడు. నారాయణ ప్రాధేయ పూర్వకంగా.


“సరేరా!..” నవ్వుతూ పలికాడు నందన.


ఆది నారాయణ, ఊర్మిళ.. శాంతారామ్.. సునంద, భానుప్రియ.. దశరధనందన.. నారాయణ.. నెల్లూరులోని ఆదినారాయణగారి నిలయానికి చేరారు. 

నందన ఒంటరిగా గదిలో వున్నప్పుడు.. నారాయణ గదిలోకి వచ్చాడు.

“బావా!.. నీకో వుత్తరం వచ్చింది. తాతయ్య నీకు యిమ్మన్నాడు.” జేబునుంచి ఒక కవర్ తీసి నందనకు అందించాడు నారాయణ.


కవర్ చించి చూసిన నందన ఆశ్చర్యపోయాడు. వదనంలో కంగారు. అందులో..


'ప్రియాతి ప్రియమైన.. నందనకు..

మా తల్లిదండ్రులు నా వివాహాన్ని ఓ బెంగాలీ బాబుతో నిర్ణయించారు. వివాహం యీ నెల 28వ తేదీన. నా సెల్ ఫోన్ తీసుకొన్నారు. నన్ను హౌస్ అరస్టు చేశారు. యీ రోజు తేదీ పదహారు. నీవు వచ్చి నన్ను నీతో తీసుకొని వెళ్ళకపోతే.. నేను ఆత్మహత్య చేసుకొంటాను. నా ఆవేశం.. నా పట్టుదల.. నా నిర్ణయాలను గురించి నీకు బాగా తెలుసుగా!!! యిక పై నీ యిష్టం. నా ప్రాప్తం.. నీకు యిదే నా ఆఖరి వుత్తరం.

ఇట్లు

నీ.. భారతి.


లెటర్ చదవడం ముగిసేసరికి నందనకు చెమట పట్టింది. తలపై పిడుగు పడినట్లయింది. నయనాల్లో అశ్రువులు నిండాయి. చేతిలోని కాగితం జారిపోయింది.


నందన స్థితిని చూచి నారాయణ ఆశ్చర్యపోయాడు. క్రిందపడ్డ కాగితాన్ని చేతికి తీసుకొన్నాడు. అందులోని చివరి అక్షరాలు.. నీ భారతి.' ఆ లైన్ను చూచాడు.


నందన సోఫాలో కూలబడ్డాడు. విచారంతో తలను పట్టుకొని ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. కొన్ని క్షణాలు నందనను పరీక్షగా చూచిన నారాయణ.. “బావా!” ఎవరు యీ భారతి?.." ప్రక్కన కూర్చొని మెల్లగా అడిగాడు.


అశ్రుపూరిత నయనాలతో.. కొన్ని క్షణాలు నారాయణ ముఖంలోకి చూచి.. తల దించుకొన్నాడు నందన. “బావా!.. చెప్పు.. ఎవరు యీ భారతి?..” నందన రెండు చేతులు పట్టుకొని కుదిపాడు నారాయణ.


దీనంగా చూస్తూ. “నీకు అక్క వరస అవుతుంది.” మెల్లగా చేతి రుమాల్ తో కన్నీళ్ళు ఒత్తుకుంటూ చెప్పాడు నందన.


“అంటే!..’’


“నేను ఆమెను ప్రేమించాను. ఆమె నన్ను ప్రేమించింది.” 


“యిప్పుడు ఎక్కడ వుంది?..”


“కలకత్తా!.. ఆమె యం.టెక్ లో నా క్లాస్ మేట్. వాళ్ళ నాన్నగారు ప్రొఫెసర్ ఛటర్జీ.. సెకండ్ యియ్యర్లో.. ట్రాన్స్ ఫర్ చేయించుకొని వారు.. భారతీ కలకత్తాకు వెళ్ళిపోయారు. మా యిరువురి మధ్యనా వుత్తరాలు నడిచాయి. సెల్ ఫోన్లో మాట్లాడుకొనేవాళ్లం. ఆమెను చూడాలని.. 

యీ రెండు సంవత్సరాల్లో ఐదుసార్లు నేను కలకత్తాకు వెళ్ళాను. మేమిద్దరం వివాహం చేసుకోవాలని నిర్ణయించు కొన్నాము. యీ సమయంలో యీ లెటర్ నాకు బులెట్ షాట్ లా వుంది. మనస్సుకు చాలా బాధగా వుందిరా!.. ఏం చేయాలో తోచటం లేదు.” ఎంతో విచారంతో చెప్పాడు నందన.


నందన వాలకాన్ని చూచిన నారాయణ చాలా బాధపడ్డాడు.

యింతలో.. శాంతారామ్ ఆ గదిలోకి వచ్చాడు. భారతీ వ్రాసిన లెటర్ ను నారాయణ అతని చేతికి అందించాడు. చదివి నవ్వుతూ.. శాంతారామ్ నందన వీపుపై తట్టాడు.


“నా అనుమానం నిజం అయింది బావా!..” గలగలా నవ్వాడు. 


దశరధనందన ఆశ్చర్యంతో శాంతారామ్ ముఖంలోకి చూచాడు. 

“ఏం చేయాలనుకొంటున్నావ్ నందన?..”


“నీవే చెప్పాలి బావా!..”


“కలకత్తాకి వెళ్ళు.. భారతిని యిక్కడికి తీసుకొని రా. ఆలస్యం చేయకూడదు. నీతో నారాయణను కూడా తీసుకొని వెళ్ళు. నేను మద్రాసులో వున్న మన ఆనంద్ కు ఫోన్ చేసి, రేపు ఈవినింగ్ ఫ్లయిట్లో మీ యిరువురికీ టిక్కెట్సు బుక్ చేస్తాను”.


శాంతారామ్ సెల్ తీసి నెంబర్ డైల్ చేశాడు. ఆనంద్ కాల్ ను రిసీవ్ చేశాడు. 

"హలో!.."


“ఆనంద్!.. ఎలావున్నావ్!..” 


“ఐయాం ఫైన్ బాస్”


“నీవో పని చెయ్యాలి!.."


“ఏమిటో చెప్పు.”


“రేపు ఈవినింగ్ ఫ్లయిట్ లో కలకత్తాకు రెండు టిక్కెట్లు బుక్ చెయ్యి. పేర్లు దశరధనందన.. నారాయణ. వయస్సు ఇరవై నాలుగు.”


“ఓకే.. డన్." ఆనంద్ జవాబు.


శాంతారామ్ నందన ముఖంలోకి చూచాడు.. నవ్వుతూ.. “బావా!.. సంతోషమేగా!..” సునంద గదిలోకి వచ్చింది. “నందన.. భారతీని కలవడానికి కలకత్తాకు వెళుతున్నాడు.” కన్నుకొట్టి నవ్వాడు శాంతారామ్.


“అలాగా!..” ఆశ్చర్యంతో అడిగింది సునంద.


"అవును. భారతి నీకు కాబోయే మరదలు.” నవ్వాడు శాంతారామ్. 


సునంద ఆశ్చర్యంతో నందన ముఖంలోకి చూచింది. నందన నవ్వుతూ తలదించుకొన్నాడు. శాంతారామ్ విషయాన్ని వివరంగా సునందకు వివరించాడు. 


“అయితే.. నా అనుమానం.. భర్తముఖంలోకి చూచింది సునంద.


“నిజం అయింది.” ఆనందంగా నవ్వాడు శాంతారామ్.. అందరి వదనాల్లో ఆనందం.

*

ఉదయాన్నే కార్లో దశరధనందన.. నారాయణ చెన్నైకి బయలుదేరారు. ఆనంద్ ను కలిసుకొన్నారు. టిక్కెట్లను వారికి అందించాడు ఆనంద్. కారును ఎయిర్ పోర్టులో పార్కు చేసి.. నందన, నారాయణలు కలకత్తాకు ఫ్లయిట్లో బయలుదేరారు. కలకత్తాలో దిగారు. టాక్సీలో కూర్చున్నారు.


“బావా!.. యిప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాం.”


“లేక్ మార్కెట్. ఆ ప్రాంతంలోనే భారతి యిల్లు.”


“లేక్ మార్కెట్ జానా హైనా సాబ్!..” డ్రయివర్ ప్రశ్న.


"జీహా” నందన జవాబు.


టాక్సీ లేక్ మార్కెట్ లో కోమల్ విలాస్.. ముందు ఆగింది. యిరువురూ టాక్సీ దిగి డబ్బులు డ్రయివర్ కు యిచ్చి.. రూమ్ నెంబర్ 306లో ప్రవేశించారు. స్నానం టిఫిన్ చేశారు.


“నారాయణా పద.. భారతి యింటిని చూపిస్తాను.” 


“సరే బావా!..”


యిరువురూ గదికి తాళం వేసి వీధిలో ప్రవేశించారు. 

“యిల్లు దగ్గరే. నడిచి వెళదాం.”


“అలాగే బావా!.”


పదినిముషాల్లో భారతి యింటి ముందు చేరారు.

“నారాయణా! అదే భారతి యిల్లు.” చూపుడువ్రేలితో చూపించాడు నందన. 


“యిల్లు చాలా బాగుంది బావా!..” ఆశ్చర్యంతో పలికాడు నారాయణ. క్షణం తర్వాత “బావా!.. మనం భారతిని కలవడం ఎలా!..”


“పద రూమ్కు వెళదాం.. ఆలోచిద్దాం..”


యిరువురూ మౌనంగా తమ రూమ్ వైపుకు నడవసాగారు. నారాయణ మెదడులోకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది.


“బావా!.. యిల్లు బాడుగకు కావాలని ఆ యింట్లోకి ప్రవేశిద్దాం.”


“యస్.. గుడ్ ఐడియా!.. రేపు ఉదయం తొమ్మిది గంటలకు వెళదాం.” ఆనందంగా పలికాడు నందన.


యరువురూ తమ రూముకు చేరారు. భోజనానంతరం శయనించారు.

"హే.. కాళీమాతా!.. రేపు వుదయం తమర్ని దర్శించి మేము మా ప్రయత్నాన్ని సాగిస్తాము. నీవు ముందు నడిచి.. భారతి మాకు కనబడేలా చేయాలి.” మనస్సున వేడుకొన్నాడు నందన.

*

వుదయాన్నే లేచి స్నానం చేసి యిరువురూ కాళీమాత ఆలయానికి వెళ్ళారు. ఆ తల్లిని దర్శించారు. తీర్ధప్రసాదాలను సేవించారు. తమ కోర్కెను నెరవేర్చమని వేడుకొన్నారు. ఆలయ ప్రాంగణం నుంచి బయటికి వచ్చి భారతి యింటిని సమీపించారు.


భవంతి ముందున్న ఆవరణంలో ఒక డెభ్భైఏళ్ళ వ్యక్తి అటు యిటూ పచార్లు చేస్తున్నాడు. గేటును సమీపించారు నందన నారాయణులు.

“సార్!..” పిలిచాడు నారాయణ.


ఆ వ్యక్తి గేటును సమీపించాడు.

“వాట్!..” గంభీరంగా అడిగాడు.


“కిరాయికా ఘర్.” వినయంగా పలికాడు నందన.


“ఓహో!.. హోమ్ ఫార్ రెన్ట్!..”


“యస్సార్!..”


"క్యా కామ్ కర్ రహే హై.”


“యింజనీర్సు.. ఏర్ పోర్టు..” నవ్వుతూ పలికాడు నందన.


“అందర్ ఆయియే.” గేటు తెరిచాడు ఆ పెద్దమనిషి.


నందన.. నారాయణా.. లోనికి ప్రవేశించారు. భవంతి తలుపు తెరిచి.. 

“ప్లీజ్ కమ్.” సాదరంగా పలికాడు. హాల్లోని సోఫాను చూపుతూ “భయిటియే.”


యిరువురూ ఒక సోఫాలో కూర్చున్నారు..

“ఆప్ కహాకే వాలే హై?..” పెద్దాయన ప్రశ్న.


“ఏ.పి. సార్!..” వినయంగా చెప్పాడు నందన. 


"పోర్షన్ యీజ్.. యిన్ ఫస్టు ఫ్లోర్.”


“నో ప్రాబ్లమ్ సార్!..” నందన జవాబు.


“మిట్టూ.” కాస్త హెచ్చుస్థాయిలో పిలిచాడు పెద్ద ఆయన.


"కిరాయ్ దస్ హజార్. ఏక్ లాక్ అడ్వాన్స్..”


“ఫరవానై సార్!..” వినయంతో కూడిన నారాయణ పలుకు.


మిట్టూ ప్రక్క గదిలో నుంచి హాల్లోకి వచ్చింది.

నందన వదనంలో ఆశ్యర్యం, ఆనందం.. నవ్వుతూ నారాయణ ముఖంలోకి చూచాడు. నోటిని నారాయణ చెవి దగ్గరకు చేర్చి “భారతి” మెల్లగా పలికాడు నందన.


"షో దీస్ బాయిస్.. ఫస్టు ఫ్లోర్ మిట్టూ!.."


“యస్ గ్రాండ్ ఫా!..” ఆ క్షణంలో ఆమె వదనంలో కోటి దీపాల కాంతి. నవ్వుతూ “ఆయిఏ..” భవంతి వరండాలోకి నడిచింది. భవంతి ప్రక్కన, మేడ మీదకి మెట్లు వున్నాయి. నందన, నారాయణలు ఆమెను అనుసరించారు.


భారతి వేగంగా మెట్లు ఎక్కి పోర్షన్ తలుపు తెరిచింది. నందన ముఖంలోకి నవ్వుతూ చూచింది. నందన ఆమెను సమీపించాడు. యిరువురూలోనికి వెళ్ళారు. నారాయణ బయటనే వుండిపోయాడు.


“కాళీమాతా!.. నీవు మహాశక్తి సంపన్నురాలివి తల్లీ!..” ఆ తల్లి గుడి వుండే వైపుకు తిరిగి చేతులు జోడించాడు ఆనందంగా నారాయణ.


భారతి నందనను గట్టిగా కౌగలించుకొంది..

“యీ రోజు నీవు రాతకపోతే.. నేను రేపు చచ్చిపోయుండేదాన్ని." బోరున ఏడ్చింది.


"భారతీ!.. నేను నిన్ను నాతో తీసుకువెళ్ళేదానికే వచ్చాను. ఏడవకు.. యిది మనం సంతోషించాల్సిన సమయం కదా!..” తన రుమాలతో భారతి కన్నీటిని తుడిచాడు. జేబునుంచి సెల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు.


“నా ప్లాను ప్రకారం మనం రేపు సాయంత్రం ఫ్లయిట్ లో హైదరాబాద్ గాని.. చెన్నైకాని వెళ్లిపోతాం. నేను వెళ్ళి టిక్కెట్సు బుక్ చేసి నీకు ఫోన్ చేస్తాను. నీవు నేను చెప్పిన చోటికి రావాలి. కలసి మనం ఏయిర్ పోర్టుకు వెళదాం. యిక పద.. ఆలస్యం అయితే మీ తాతయ్య మేడ మీదకి వస్తే..”


"అవునవును.. పద క్రిందికి వెళదాం.” వేగంగా భారతి బయటికి నడిచింది. నందన ఆమెను అనుసరించాడు.


ముందుగా నందన, నారాయణా మెట్లు దిగి.. భారతి తాతయ్యను సమీపించారు. తాళం వేసి భారతి హాల్లోకి వచ్చింది.


"పోర్షన్ పసంద్ హై నా?..”


“బహుత్ అచ్చాహై..” నవ్వుతూ భారతి వైపు చూస్తూ చెప్పాడు నందన. 


“కబ్ అడ్వాన్స్ దియేంగే..”


“డే ఆఫ్టర్ టు మారో.” దరహాస వదనంతో నారాయణ చెప్పాడు.


భారతి కళ్ళతో సైగ చేసి.. ప్రక్క గదిలోకి వెళ్ళిపోయింది. నందన నారాయణలు తాతయ్య నమస్కారాలు అర్పించి వీధిలో ప్రవేశించారు. టాక్సీ ఎక్కారు. చెన్నైకి ఏయిర్ టిక్కెట్సు బుక్ చేశారు. లాడ్జికి చేరారు. నందన భారతికి మేసేజ్ పంపాడు. 


మరుదినం.. భారతి స్నేహితురాలితో కలసి లేక్ మార్కెట్ ప్లవర్ బజార్ చేరింది. నందన, నారాయణలతో టాక్సీ ఎక్కింది. స్నేహితురాలికి.. బెంగాలీ భాషలో.. ఆ ముగ్గరు ఎక్కిన ఫ్లయిట్ సకాలంలో చెన్నై వైపుకు బయలుదేరింది. యీ మధ్య కాలంలో తను ఎదుర్కొన్న సమస్యలను నందన భారతికి వివరించాడు. నందన తాతగారు వెంకటరామయ్యగారి మరణానికి భారతి ఎంతగానో బాధపడింది.


విమానం చెన్నై ఎయిర్ పోర్టు చేరింది. ముగ్గురూ కార్లో నెల్లూరికి బయలుదేరారు. నందన తన బావ శాంతారామ్ కు ఫోన్ చేసి భారతితో తాము మరో రెండున్నర గంటలలో నెల్లూరు చేరబోతున్నామని చెప్పాడు. ఆ విషయాన్ని శాంతారామ్ అందరికీ చెప్పాడు. అందరి వదనాల్లో ఆనందం.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



23 views0 comments

Comments


bottom of page