top of page

జీవన రాగాలు ఎపిసోడ్ 16



'Jeevana Ragalu Episode 16'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 29/07/2024

'జీవన రాగాలు ఎపిసోడ్ 16' తెలుగు ధారావాహిక చివరి భాగం

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

కొడుకు దశరథ నందన మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను, పోస్ట్ ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు. ఆయన భార్య పేరు సుందరి. దశరథరామయ్యగారి తండ్రి వెంకటరామయ్య, తల్లి పార్వతమ్మ. సోదరి సుశీల, బావ శంకరయ్య. 


గతంలో అయన వివాహం కౌసల్యతో జరుగుతుంది. వారికి కవలలు పుడతారు. ఆ పిల్లలకు దశరథ నందన, సునంద అని పేర్లు పెడతారు. గుర్రపు బండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య, బండి నడిపే ఫకీరా మరణిస్తారు. 


పిల్లల్ని, దశరథ రామయ్యను చూసుకోవడానికి అతనికి కౌసల్య చెల్లెలు సుందరితో వివాహం జరిపిస్తారు పెద్దలు. వారి పిల్లలే గోపినందన, హిమబాల. పిల్లలు పుట్టాక సుందరి ప్రవర్తనలో మార్పు వస్తుంది. 



తాగిన మైకంలో దశరథనందన, భానుప్రియను బలాత్కారం చేసినట్లు ఆరోపిస్తారు మన్మధరావు, అతని భార్య మంగ. నందనను ఇంటినుంచి వెళ్లిపొమ్మంటాడు దశరథరామయ్య. తాను ఏ తప్పూ చేయలేదని విశ్వసిస్తాడు నందన. సర్కిల్ ఇన్ స్పెక్టర్ మురారి సహాయంతో నిజం నిరూపిస్తాడు. ఫణీంద్ర తను తప్పు చేసినట్లు అంగీకరిస్తాడు. 


దశరధనందన నిర్దోషి అని అందరికీ తెలుస్తుంది. తను ప్రేమించిన భారతిని కలకత్తా నుండి తీసుకొని వస్తాడు నందన. భారతిని తీసుకొని వెళ్ళడానికి ఆమె బావ బీహారీ, స్నేహితుడు బిస్వాస్ తో వస్తాడు.


ఇక జీవన రాగాలు ధారావాహిక ఎపిసోడ్ 16 చదవండి. 


వారి హృదయాంతరాళాల్లో.. వారి ఆశ.. భారతిని వారితో తీసుకుని వెళ్లే విషయం సందేహంగా మారిపోయింది.


అంతే కాదు, అక్కడి అందరి మాట తీరు, మంచితనం, ఇరువురిని ఆ ఇంటివారు గౌరవించిన తీరు ఆశ్చర్యం లో ముంచేసాయి.


యదార్థం చెప్పాలంటే.. వారు ఊహించి వచ్చింది ఒకటి, అక్కడ దశరథ రామయ్య గారి భవంతిలో వారి బంధుజాలం ముందు జరిగినది మరొకటి. బిశ్వాస్, బీహారీ లు విప్పలేని స్థితి.

భోజనానంతరం.. పుండరీక, దశరథ రామయ్య, ఆదినారాయణ, మురారి దశరథ నందన, శాంతారామ్, సునంద, శంకరయ్య సుశీలలు ఒక గదిలో సమావేశం అయ్యారు. 

భారతిని బీహారీ, బిశ్వాస్ లతో పంపించే విషయంపై చర్చ జరిగింది.


శాంతరామ్ సునంద (భార్య - భర్తలు), శంకరయ్య సుశీల (భార్య - భర్తలు). దశరథ నందన మేనత్త, మామలు, పంపించ వద్దు అన్నారు.


ఆదినారాయణ, మురారి దశరథ రామయ్యలు పంతాలకు పోకుండా పంపించాలని.. వెంటనే మనం వెళ్ళి భారతి కుటుంబ సభ్యులతో చర్చించి, వారిని ఒప్పించి దశరథ నందన, భారతి ల వివాహాన్ని అందరూ ఇరువర్గాల వారు కలిసి ఆనందంగా జరిపేల నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించు కున్నారు.


గెస్ట్ హౌస్ లో ఉన్న బిహారీ జి, బిశ్వాస్ లను ఆ గది కి పిలిపించారు. అక్కడ వున్న వారందరినీ చూచి వారిరువురు భయంతో ఏం అనబోతారో అని తల దించుకున్నారు. వారు చూపిన చోట కూర్చున్నారు.


“మిస్టర్ బీహారీ జీ, మిస్టర్ బిశ్వాస్ జీ.. మేము భారతిని మీతో పంపదలిచాము. ఆమె వెంట మా మనిషి మురారి మీ కలకత్తాకు వచ్చి భారతిని మీ వాళ్ళకి అప్పగించి, ఆమె విషయంలో మా నిర్ణయాన్ని అంటే, మేము ఆమెకు మా దశరథ నంద కు వివాహం జరిపించ నిశ్చయించు కున్నామని మీ వారికి తెలియచేసి.. వారి సమ్మతి తీసుకుని మా మురారి తిరిగి వస్తాడు. ఇది మా అందరి నిర్ణయం. మీరు ఇప్పుడే బయల్దేరండి. మురారి, భారతి మా కార్లో వస్తారు. మీరు వచ్చిన టాక్సీ వాకిట్లో ఉంది. మీరు అందులో బయల్దేరండి!" చిరునవ్వుతో చెప్పాడు ఆదినారాయణ.


ఆడవారందరికి భారతిని తిప్పి పంపటం ఇష్టం లేదు. వారి కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ భారతి వెళ్ళక తప్పదు. దశరథ నందన కళ్ళలో కన్నీటి జీరలు. మురారి భారతి కారును సమీపించారు.

అందరూ వారి చుట్టూ చేరారు.


“అమ్మా భారతి నువ్వు నిర్భయంగా వెళ్ళు, మీ వారితో మాట్లాడటానికి నేను త్వరలోనే వస్తాను!” చిరునవ్వుతో చెప్పాడు దశరథ రామయ్య.


బిహారీ జి, బిశ్వాస్ లు టాక్సీ లో కూర్చున్నారు.

మురారి కార్ ముందు సీట్ లో కూర్చున్నాడు.

భారతి దీనంగా అందరి ముఖాలను కన్నీటితో చూసింది.


“భయపడకు, బాధపడకు.. త్వరలోనే వస్తాను!” భారతి చెవి దగ్గర దశరథ నందన మెల్లగా చెప్పాడు.

భారతి తల ఆడించి, నిట్టూర్చి కార్లో కూర్చుంది.


ముందు బిహారీ జి, బిశ్వాస్ ల టాక్సీ.. వెనకాల మురారి డ్రైవింగ్ లో భారతి కార్ మద్రాస్ ఎయిర్ పోర్ట్ వైపు బయల్దేరాయి. ఫ్లైట్ లో కోల్ కత్తా చేరారు.


మురారి భారతిని వారి ఇంట ఆమె తల్లి తండ్రులు ఛటర్జీ, ఈశ్వరిలకి అప్పగించాడు. 


"సార్!.. ఛటర్జీ గారు! మా వాడు దశరథనంద మీ అమ్మాయిని లేపుకుని మా ఊరికి తీసుకుని రాలేదు. ఆమె మా వాడిని ప్రేమించింది. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మీరు అంగీకరించరనే అభిప్రాయంలో మా వాడితో కలిసి వచ్చింది. మా అందరికీ బాగా నచ్చింది. మీ అమ్మాయిని మీ బావమరిది గారితో పంపటం మాకేవరికి ఇష్టం లేదు. ఆ కారణంగానే నేను భారతిని తీసుకుని వచ్చాను. మీ అమ్మాయిని మీకు అప్పగించాను. ఇక నేను వెళతాను. మీరు మీ వారంతా కలిసి మాట్లాడుకుని మాకు తెలియజేయండి. యదార్థం చెప్పాలంటే.. మీరు మా ఊరికి, మా ఇంటికి వచ్చి మా అబ్బాయికి, మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి జరిపించాలని మీ నిర్ణయం, ఆ నిర్ణయం అంగీకరించాలని మా బాబాయి గారి పిన్ని గారిని మీరు అడగాలి. అది మా ప్రాంతపు సాంప్రదాయం. సావధానంగా ఆలోచించి మంచి నిర్ణయంతో రండి. శెలవు!” నమస్కరించి మురారి బయటకి నడిచాడు. 


అతను మాట్లాడిన తీరుకు వారంతా ఎంతో ఆశ్చర్యపోయారు.

“అమ్మ, నాన్నా!.. నాకు వివాహం అంటూ జరిగితే అది దశరథనంద తోనే. అమ్మా!.. నీ తమ్ముడితో కాదు.. నన్ను బలవంతంగా అతనికిచ్చి పెండ్లి చేయాలని మీరు నిర్ణయం తీసుకుంటే.. నేను విషం త్రాగి చచ్చిపోతాను.” ఆవేశంగా కన్నీటితో చెప్పి భారతి తన గదిలోకి ప్రవేశించింది. కోపంతో ఏడుస్తూ మంచం మీద పడుకుంది.


భారతి మాటలు విన్న బిహారీ, ఛటర్జీ పక్కకి చేరాడు.

నవ్వుతూ “బావ..బావా..!" ఏదో చెప్ప బోయాడు.


“నోరుముయ్.. నీవు చెప్పబోయేది నాకు తెలుసు. నేను నా బిడ్డను నీకు ఇచ్చి పెండ్లి చేయను. నీవు వెంటనే నా ఇంటి నుంచి వెళ్లిపో. ఇక ఎప్పుడూ నా ఇంటికి రాకు." ఎంతో ఆవేశంతో చెప్పాడు ఛటర్జీ.

బీహారీ బిత్తరపోయాడు. మెల్లగా మౌనంగా అక్క ముఖాన్ని చూసి, తల దించుకుని ఆ ఇంటి నుండి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న బిశ్వాస్ కూడా బిహారీ ని అనుసరించాడు. 


ఛటర్జీ భార్య ఈశ్వరి ను పిలిచాడు.


“ఈశ్వరి.. నీ తమ్ముడు మనకి చెప్పకుండా ఆంధ్రకు వెళ్ళి తప్పు చేశాడు. నా కూతురి పెండ్లి ఆ ఆంధ్ర అబ్బాయితో నే. ఈ నా నిర్ణయం మారదు. అమ్మా భారతి.. ఇలా రామ్మా!..” ప్రీతిగా పిలిచాడు.

భారతి వచ్చి తండ్రి పక్కన నిలబడింది.

“అమ్మా!” 


“బాపూ..!"


“నీ వివాహం.. నీవు కోరిన ఆ ఆంధ్రా అబ్బాయితో నే.. మీ తాతయ్య ఆరోగ్యం సర్దుకున్న తరువాత, నేను, అమ్మ కలిసి ఆ ఊరికి వెళ్లి వారితో అన్ని విషయాలు మాట్లాడి త్వరలో మీ వివాహం జరిపిస్తాను. సంతోషమే నా తల్లి ? ఆప్యాయంగా కూతురి చేతులను తన చేతిలోకి నవ్వుతూ తీసుకున్నారు ఛటర్జీ.


“నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నాను. అయ్యవారు కూతురుని చూచుకుంటూ నన్ను మరిచిపోయారు.” వ్యంగ్యంగా నవ్వింది ఈశ్వరి.


“ఈసు!.. నిన్ను నేను మరిచిపోగలనా!.. ఈ బంగారాన్ని నాకు ఇచ్చింది నువ్వే కదా!” ఆనందంగా నవ్వాడు ఛటర్జీ.


తల్లి కూతుళ్ళు ఛటర్జీ తో చేరి పరమానందంగా నవ్వుకున్నారు.

*

తిరుమల కొండ పైన దశరథ రామయ్య, ఛటర్జీ నిర్ణయం ప్రకారం, ఇరువర్గాల బంధుమిత్రుల సమక్షంలో దశరథ నంద, భారతిల వివాహం ఘనంగా జరిగింది. పెద్దలందరూ ఆ దంపతులని సహస్ర కోటి అంక్షింతలతో, నిండు నూరేళ్ళు సకల సంపదలతో.. అస్టైశ్వర్యాలు తో పండంటి బిడ్డలకు తల్లి తండ్రులయ్యి పరమానందంగా వర్ధిల్లాలి అని దీవించారు.


అది వారి తొలి రేయి.

గదిలో ఉన్న దశరథ నందనకు ఫోన్ వచ్చింది. కిటికీ దగ్గరకి వెళ్లి మాట్లాడసాగాడు. టైం జరిగిపోతూ ఉంది. భారతికి కోపంగా ఉంది. మంచంపై పడుకుని ఉంది. దాదాపు ఇరవై నిముషాలు తరువాత దశరథ నంద మంచాన్ని సమీపించాడు.


“భారతి..!” ప్రేమగా పిలిచాడు.


భారతి మంచంపైన వేగంగా జరిగింది. క్రిందపడింది. కళ్ళు తెరిచింది.

"అమ్మా..!" అంది. కమ్మనైన కల చెదిరిపోయింది.

*

ప్రపంచంలో అత్యధిక జనభాగల దేశం మనకి ఉత్తరం వైపున వున్న చీనా 142.24 కోట్లు. అమెరికా (బిగపవర్) జనాభా 33.19 కోట్లు. చీనాకు అమెరికాకి వైరం, పగ, ద్వేషం.. మన దేశ జనాభా 140.76 కోట్లు. పాకిస్థాన్ జనాభా 23.14 కోట్లు. బంగ్లాదేశ్ జనాభా 16.94 కోట్లు.


1947 ఆగస్ట్ అర్ధరాత్రి మనకు తెల్లవారు స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. దేశాన్ని మూడు ముక్కలు చేశారు. భారత్(ఇండియా), పాకిస్థాన్, ఈస్ట్ పాకిస్థాన్ గా విడగొట్టారు.


ఆ నాటినుండి హిమాలయ పర్వత ప్రాంతంలోని కాశ్మీర్ విషయంలో మనకి, పాకిస్థాన్ కి వైరం. 1971 తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పశ్చిమ పాకిస్థాన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా మారిపోయింది. ఆ విభజన కు, బంగ్లాదేశ్ ఏర్పడేందుకు ఆ సమయంలో మన దేశం ఎంతగానో సహాయం చేసింది ధర్మం వారి ప్రక్కన ఉన్నందున. దాన్ని సహించలేని పాకిస్థాన్ మనలను బద్ద శత్రువుగా భావించింది. చీనా తో చేతులు కలిపి వారిరువురు మంచి స్నేహితులు అయ్యారు. ఆ ఇరువురు మనకు విరోధులై మన హిమాలయ పర్వత ఉత్తరాన దిగువున కొంత భూభాగాలను ఆక్రమించారు. మనకు విరోధులైనారు. అప్పుడప్పుడు సరిహద్దుల్లో పోరాటాలు రెండువైపులా సైనిక నష్టం జరుగుతూనే ఉంది.


2019 డిసెంబర్ 31 ప్రపంచ జనాభా వినాశనానికి చీనా వారి వ్యూహాన్ నగరం ల్యాబ్ లో విషవాయువు / క్రిములను తయారు చేసి గాలిలోకి వదిలారు. దానికి కోవిడ్ 19(covid 19) అని నామకరణం చేశారు.


అది ప్రపంచం లోని అన్ని దేశాలకు వ్యాపించింది. ఆ వ్యాధి లక్షణాలు జ్వరం, చలి, దగ్గు, శ్వాస సరిగా ఆడకపోవడం, శరీర కండరాలు నొప్పులు. (పూర్వం ఇన్ఫ్లుఎంజా ఫ్లూ లాంటి వ్యాధి).

మనదేశంలో ప్రప్రథమంగా జనవరి 27(2020) కేరళ లోని కేసు ప్రారంభం. అది కొద్దీ రోజుల్లోనే అన్ని రాష్ట్రాలు కి వ్యాపించింది. ఆ వ్యాధి గ్రస్తులు అధికమైనారు. కొన్ని మరణాలు సంభవించాయి.

యావత్ భారత ప్రజల సంక్షేమం కోసం మన దేశ ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించి లాక్డౌన్ ను మార్చి 24 2020 నుండి ఏప్రిల్ 14, 2020 వరకు మూడు వారాలు అనగా 21 రోజులు అమలు పరిచారు. వ్యాధి వేగంగా పెరిగింది. అంటువ్యాధి లాగా మారిపోయింది. అందరూ మాస్కులు ధరించి ఖటినంగా ఇళ్లలోనే ఉండి ఆత్మ రక్షణ చేసుకోవాల్సిన ఖటోర పరిస్థితి మన దేశ ప్రజలు అందరికీ ఏర్పడింది.


విపరీతంగా ఆ కేసులను ఉన్న ప్రాంతాలను రెడ్లైట్ గా నిర్ణయించి, వీధి మారి వీధిలో నడిచే దానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో జనాలు చిక్కుకున్నారు.


అన్ని ప్రాంతాలు కు మందుల సప్లై జరిగింది. ఎన్నో హాస్పిటల్స్, డాక్టర్స్ నర్స్ లు, పోలీస్ లు వ్యాధి సోకిన వారి రక్షణ కు.. ఎవరికి ఆ వ్యాధి సొకకుడదు అని జాగ్రత్త చర్యలతో దేశ ప్రజానీకానికి ఎంతగానో సేవ చేశారు, విశ్రాంతి లేని వారి కార్యాచరణతో. ఆ వ్యాధి సోకి కొందరు మరణించారు. ఎందరో మహనీయులు మట్టిలో కలిసిపోయారు. మనదేశం.. యావత్ ప్రపంచం అల్లకల్లోలం అయిపోయింది.


మూడు దశలుగా ఆ వ్యాధి జనాలను పీడించింది. అది ఒక ప్రళయం, ఎన్నో ఇతర దేశాలకు మనదేశం మందులు పంపింది. భారతి తాతగారు.. దశరథ నందన తండ్రి గారు ఆ వ్యాధికి గురయ్యారు.


ఆ కారణంగా వారు ఊహించుకున్న ప్రకారం వారి వివాహం జరగడం లేదు.

సెల్ఫోన్ లో పరస్పర యోగక్షేమాలు తెలుసుకోవడం తప్ప ఆ ప్రేమికులు దశరథ నందన భారతి లు కలుసుకొని మాట్లాడుకునే దానికి అవకాశం లేకపోయింది.


భారతి తాతగారు మరణించారు. ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆదినారాయణ గారు, చటర్జీతో మాట్లాడి అనునయించారు. రైళ్ళు, బస్సులు, విమానాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు, స్కూల్స్, కాలేజెస్, అన్ని రకాల విద్యాసంస్థలు మూతపడ్డాయి. దేశం స్తంభించిపోయింది. దశరథ రామయ్య గారికి ఆ వ్యాధి సోకింది.


దశరథ నంద తండ్రి దశరథ రామయ్య గారు కోలుకున్న తరువాత దశరథ నందన కూడా ఆ వ్యాధి తో మంచం పట్టాడు. రెండు నెలలకు కోలుకున్నాడు. ఇరువర్గాల వారు ఎక్కువుగా దైవ ప్రార్థన.. ఇల్లు విడిచి బయటకి పోకుండా ఉండటం, ఎక్కడి వారు అక్కడే. కదలికలు లేవు. యోగక్షేమాలు ఫోన్ లోనే తెలుసుకునే వారు. ఆ మహా ప్రళయం.. మహమ్మారి కరోనా దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు కాలం జన సాధారణ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.


ఛటర్జీ దాదాపు రెండు సంవత్సరాలు తరువాత విమానాలు నడవటం ప్రారంభం అవ్వటం తో నెల్లూరు వచ్చారు. అందరినీ చూచి మాట్లాడారు. ఆదినారాయణ తో కలిసి తిరుపతి వెళ్లి స్వామిని దర్శించారు.


“త్వరలో పిల్లల వివాహం ఇక్కడ జరిపిస్తాను సర్, అది నా మొక్కుబడి" చిరునవ్వుతో చెప్పాడు ఛటర్జీ.


ఆదినారాయణ ఆనందంగా సరే అన్నాడు. ఛటర్జీ గారు కలకత్తా వెళ్ళిపోయారు. ఆదినారాయణ దశరథ రామయ్యలు ముహూర్తాన్ని నిర్ణయించి ఛటర్జీ కి తెలియజేశారు. గంట గంటకు దశరథ నందన భారతిలో సెల్ టాక్స్.. ఆనందం పరమానందం. ఎప్పుడెప్పుడు కలుద్దామా అనే తపన.

రేపు వివాహం అనగా నేడు అందరూ తిరుపతి చేరారు. శ్రీమన్నారాయణలను.. కలియుగ వరదలను దర్శించి కానుకలను చెల్లించుకున్నారు.


దశరథ నందన భారతిల వివాహం ఎంతో ఘనంగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధిలో జరిగింది. అందరూ నవ దంపతులని హృదయ పూర్వకంగా ఆశీర్వదించారు. పేద్దలందరికీ వారిరువురు పాదాభివందనం చేశారు.


తొలిరేయి..

దశరథ నందన మంచంపై పడుకుని ఉన్నాడు. భారతి ప్రక్కన పడుకుని అతన్ని గట్టిగ కౌగిలించుకుంది.


“భారతి ఊపిరి ఆడడం లేదు.” 


“మీరు నన్ను అల పట్టుకోండి!”


“ఎందుకు?”


“లేకపోతే నేను క్రింద పడిపోతాను మాస్టారు!" గల గల నవ్వి, గతంలో ఒకనాడు తొలి రేయి కలగని మంచం పై నుంచి తాను క్రింద పడ్డ విషయాన్ని దశరథ నంధనకు చెప్పింది భారతి.


నంద నవ్వుతూ “ఇక నేను ఎప్పుడూ నీ పక్కన ఉంటాను కదా భారతి!” భారతిని తన హృదయానికి హత్తుకుంటూ దశరథ నందన ఆనందంగా నవ్వాడు. సంతోషముగా జాజి లతలా అతన్ని చుట్టేసింది భారతి.


===============================================================================

సమాప్తం

జీవన రాగాలు ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య గారి తరఫున మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాము.

===============================================================================


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



22 views0 comments

Comments


bottom of page