top of page

జీవితమే సార్థకము!

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #JivithameSarthakamu, #జీవితమేసార్థకము, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 58


Jivithame Sarthakamu - Somanna Gari Kavithalu Part 58 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 14/04/2025

జీవితమే సార్థకము! - సోమన్న గారి కవితలు పార్ట్ 58 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


జీవితమే సార్థకము!

----------------------------------------

ఆత్మీయత,అనురాగము

ఉంటేనే జీవితము

రాగద్వేషాలు లయము

అయితేనే స్వర్గమయము


ఉన్నచో శత్రుత్వము

మనశ్శాంతి మటుమాయము

ఉంటే దానవత్వము

శూన్యము మానవత్వము


దురాలవాట్లు బ్రతుకులో

ఇస్తాయి దుష్ఫలితము

ఈర్ష్యాళువు మనసులో

కోల్పోతాడు సంతసము


ప్రశాంత చిత్తం భాగ్యము

ఉరకలేయును హృదయము

అంత కన్న ఏముంది!

జీవితమే సార్థకము








నాలుకతో జాగ్రత్త!

----------------------------------------

అదుపు చేస్తే నాలుకను

అతడే కదా వీరుడు

నిలబెట్టుకున్న మాటను

అగును గౌరవనీయుడు


మాటకుంది మహాశక్తి

తెలుసుకున్న మానవుడా!

మెదడుకుంది మిగుల యుక్తి

నిజము నమ్ము స్నేహితుడా!


నోటిపైన నియంత్రణ

జీవితానికి రక్షణ

అనుక్షణం నేర్పాలి

అవసరమే క్రమశిక్షణ


జారితే గనుక నోరు

ఇక అమితమైన పోరు

జాగ్రత్తగా ఉండాలి

అవసరమున్న వాడాలి


నోటితోనే యుద్ధాలు

తెగిపోవును బంధాలు

కడు ప్రమాదకారి నోరు

కూల్చునోయ్! కాపురాలు


ఖడ్గం వంటి నాలుక

చీల్చునోయ్! కుటుంబాలు

అగ్ని పర్వతం నాలుక

విరజిమ్ము లావా ద్రవము


అగ్గిపుల్లలాంటి నాలుక

తగలబెట్టును సమస్తము

ఎముక లేనిది నాలుక

పాములా ప్రమాదకరము


శరీరంపై అధికారి

ఆదమరిస్తే అపకారి

ఇకనైనా మేలుకో!

నాలుకను సాధు చేసుకో!











మేటి సత్యాలు-ఆణిముత్యాలు

----------------------------------------

నీ గురించి మంచిగా

చెప్పాలోయ్! గొప్పగా

నీ సాక్ష్యమవ్వాలి

నీ పనులు నిజముగా


ఎంత హేళన చేసినా

వద్దోయ్! తొందరపాటు

నిందలెన్ని వేసినా

చెందవద్దు క్రుంగబాటు


వెనుక జనం ఉన్నారని

ఎగిరి ఎగిరి పడబోకు!

వెన్నుపోటు పొడుచు వారు

వెనుకుంటారని మరువకు!


నేర్చుకున్న పాఠాలు

బాగు చేయు జీవితాలు

చిన్న చిన్న అపజయాలు

గెలుపుకు సోపానాలు















బాతు సందేశం

----------------------------------------

వాడిపోతే పూవులకు

రాలిపోతే ఆకులకు

నైతిక విలువలు పోతే

విలువ ఉండదు బ్రతుకులకు


మోసగించే మనుషులకు

రాతి వంటి మనసులకు

కరుణకటాక్షాలుండవు

కరుడుగట్టిన దుష్టులకు


సాయపడని చేతులకు

మలినమైన చేతలకు

గౌరవమే ఉండబోదు

మంచి చేయని వ్యక్తులకు


వదరుబోతుల మాటలకు

పనికిమాలిన చేష్టలకు

ప్రయోజనమే శూన్యము

నికృష్టమైన తలుపులకు








అక్షరాల చురకులు

----------------------------------------

తలదించుకునే రోజు

రాకూడదు ఏనాడు

రావాలోయ్! రారాజు

పొరుషమే ఈనాడు


జగతిలో చీడపురుగులు

కారాదు చిన్నారులు

దేశభక్తితో నిండాలి

వారి లేలేత మనసులు


అభివృద్ధికవసరమే

ఉడుకు రక్తమున్న యువత

సద్వినియోగం కావాలి

అది మనందరి బాధ్యత


పెద్ద వారి అనుభవం

అందరికీ ఆదర్శం

నిర్లక్ష్యం వదలాలి

బాధ్యతగా ఉండాలి


-గద్వాల సోమన్న


Comments


bottom of page