1). భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్యని " పోచంపల్లి, ధర్మవరం, ఉప్పాడ ఈ మూడింటిలో నీకేది ఇష్టం?"అని అడిగాడు.
భార్య ఆశగా " మూడూ ఇష్టమే! మూడు చీరలూ కొనిచ్చెయ్యండి"-అంది.
భర్త మొహం చిట్లించి, " చీరలా? చీరలేమిటి? నేను చెప్పినది ఊళ్ల పేర్లు!
మా ఆఫీసు వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ, ఈ మూడు ఊళ్ళల్లో ఒకటి కోరుకొమ్మన్నారు.
నీ అభిప్రాయం కూడా అడగాలికదా అనిఅడిగా" అన్నాడు.
పంపినవారు : వాడపల్లి పద్మప్రియ
ప్రచురించిన తేదీ : 22 /10 /2021
***
2). సీరియల్ కష్టాలు "హాయ్యో హాయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందొదినా, పాపం "తొక్కలో మొగుడు సీరియల్" లో సుజాతకి ఎన్ని కష్టాలు వచ్చాయో, చిన్నప్పటినుంచీ పాపం సవతి తల్లి ఎన్నో కష్టాలు పెట్టింది, చదువు కూడా చెప్పించలేదు. సతీష్ ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ కూర్చుంది శాంభవి. తనని అలా చూస్తూ కంగారు తిన్న సతీష్ "ఏమైందే.. ఎందుకలా ఏడుస్తున్నావు? అందరూ బాగానే ఉన్నారు కదా? అని అడిగాడు. సతీష్ ని చూసి భోరున ఏడుస్తూ, ముక్కు చీదుకుంటూ "మొన్నటికి మొన్న మణిక్యాంబ, రామరాజు ముగ్గురాడపిల్లలని పెంచలేక, అప్పుల బాధ పడలేక, అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక, పెళ్ళీడు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చెయ్యలేక,,, అందరూ కలిసి పాయసంలో విషం కలుపుకొని తిని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. పాయసంలో జీడిపప్పు లేకపోతే రుచి బాగోదు అని, జీడిపప్పు కొనలేక, గన్నేరు పప్పు తెచ్చుకుని మరీ వేసుకున్నారు అండి. ఎంత అన్యాయమో చూడండి. ఎంతమంది ఉన్నా పాపం ఎవరూ వాళ్ళకి సాయం చెయ్యలేదు!" అంది ఏడుస్తూ శాంభవి. "అయ్యో, ఎవరో చెప్పు ఎదో మనకు తోచిన సహాయం చేద్దాం. నువ్వు అలా ఏడవకే!" అని భార్యని ఓదారుస్తూ "ఇంతకీ ఎవరే వాళ్ళు, మన బంధువులా, తెలిసిన వాళ్ళా?" అన్నాడు. "అవునండి బాగా తెలిసిన వాళ్ళు, రోజూ చూసే వాళ్ళు, పాపం అలాంటి కష్టాలు పగవాళ్ళకి కూడా రాకూడదండీ. " అంటూ విలపిస్తోంది. "ఒసేయ్ ఇంతకీ వాళ్ళెవరో చెప్పవే?" "అదే అండి. ముద్ద గన్నేరు సీరియల్ లో హీరోయిన్ ఫ్యామిలీ అండి." "ఏంటి సీరియల్ వాళ్ళా, నేనింకా ఎవరో అనుకుని అనవసరంగా టెన్షన్ పడి, సాయం చెయ్యటానికి కూడా రెడి అయ్యాను కదే" అన్నాడు విసుక్కుంటూ. "అయ్యో అది కాదండి, ముగ్గురు ఆడపిల్లలు అండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదండి పాపం" అంది మళ్ళీ. "ఎహె ఆపు నీ గోల. ఎంతసేపు ఆ సీరియల్ గోలే కానీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన నా గురించి పట్టించుకోవా, నువ్వూ నీ సీరియల్..." అనగానే "నన్నేమన్నా అంటే అనండి గాని నా సీరియల్స్ ని ఏమైనా అంతర్ మాత్రం నేనూరుకోను" అంది. "ఆహ్ ఏం చేస్తావే, చెప్పు ఏం చేద్దాం అని?" కోపంగా అడిగాడు. వెంటనే బయటకి తోసి తలుపేసి "ఈరోజుకి అక్కడే ఉండండి, ఏం తింటారో, ఎక్కడ పడుకుంటారో మీ ఇష్టం" అని డోర్ లాక్ చేసుకుని పడుకుంది. "రాత్రంతా ఈ దోమలతో గడపాలా?" అనుకుంటూ తను చేసిన పనికి తనని తనే తిట్టుకుంటూ పడుకున్నాడు సతీష్. ****
భర్తల్లారా కాస్త జాగ్రత్త, సీరియల్స్ గురించి శ్రీమతి దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్త!
పంపినవారు : పరిమళ కళ్యాణ్
ప్రచురించిన తేదీ : 31 /10 /2021
3}. మొహాన కొట్టరాదూ
"ఏమేవ్ కాంతం కాసిన్ని టీ నీళ్లు నా మొహాన కొట్టరాదూ" అన్నాడు రావు. "ఇదుగోనండీ ఇప్పుడే వస్తున్నా" అంటూ పది నిముషాలకి భయం భయంగా వచ్చి, భర్త ఎదురుగా నిలబడింది కాంతం. "ఏమిటే ఇంత లేటు, బొత్తిగా లెఖ్ఖ లేకుండా పోయింది నీకు నా మాటంటే" అని అరుస్తున్నాడు రావు. "కాచిన పాలు లేవండి, ఇప్పుడే పాలు కాచి తీసుకువచ్చా, అందుకే ఇంత సేపు పట్టింది" అంది ఆ టీ కప్పు చేతిలోనే పట్టుకుని. "అఘోరించావులే, ఇంకా ఏంటి అలా పట్టుకుని నించున్నావు, ఇలానా మొహాన తగలెయ్యి" అన్నాడు కోపంగా. "వేడిగా ఉన్నాయండి బాగా" అని నచ్చచెప్పబోయింది కాంతం. "అదంతా నేను చూసుకుంటా కానీ, నువ్వా టీ నా మొహాన కొట్టి ఇక్కడినుంచి ఫో!" అన్నాడు మరింత కోపంగా.. "అలాగే అండి, మీరేం చెప్తే అదే" అంటూ వేడి వేడి టీ రావు మొహాన కొట్టి, వెంటనే అక్కడినుంచి వెళ్ళిపోయింది కాంతం.. *** కాంతం చేసిన దాంట్లో తప్పేమైన ఉందంటారా చెప్పండి? *****
పంపినవారు : పరిమళ కళ్యాణ్
ప్రచురించిన తేదీ : 12/11 /2021
4. నవ్వుల జల్లులు ( వీటిని జోకులుగానే తీసుకొండి.ఎవరూ ఎవరికీ అన్వయించుకోకండి. ) ఓ భక్తుడు : స్వామీ వైరాగ్యం కలగాలంటే ఏం చేయాలి? స్వామీజీ: నీకు పెళ్లయిందా? భక్తుడు: లేదు స్వామీ స్వా: అయితే వెంటనే పెళ్లి చేసుకో భ: అదేంటి స్వామీ పెళ్లి చేసుకుంటే జీవితం మీద ఆశ పుడుతుంది కాని విరక్తి ఎలా కలుగుతుంది? స్వా: నన్నుచూస్తే తెలీడం లేదూ? అనుభవం మీద చెప్తున్నాను. అర్ధం చేసుకుని తెలుసుకో ------------------------------------------------------------------------------------ 5. ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్: మిస్టర్ ఏంటిది? ఇంటర్వ్యూకి వచ్చిన వాడివి కూచుని అడిగిన వాటికి సమాధానాలు చెప్పాలి గాని ఇలా అటూ ఇటూ నడుస్తున్నావేంటి? అభ్యర్ధి: మీరిచ్చిన ఏడ్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని ఉంది కద సార్. అందుకని ------------------------------------------------------------------------------------ 6. ( ఒక చోట డిన్నర్ లో) ఓ వ్యక్తి: ఏమండీ ఎప్పటినుండో నాకో డౌటు. ఈ బఫే డిన్నర్లో అందరూ నిలబడి తింటారెందుకు? అవతలి వ్యక్తి: కూచుని తింటే కొండలయినా తరిగిపోతాయిట. అందుకని ------------------------------------------------------------------------------------ 7. భర్త: భార్యా భర్తలిద్దరూ జీవితంలో కష్టసుఖాల్ని చెరి సగం పంచుకోవాలి తెలుసా? భార్య: అందుకే కదండీ కష్టసుఖాల్లో మొదటి సగం అంటే కష్టం మీకొదిలేసి రెండో సగం సుఖం నేను పంచుకుంటున్నాను. -------------------------------------------------------------------------------------------------- 8. ఓ రాజకీయ నాయకుడు (సభ ముగిసేక) : ఏంటోయ్ సెక్రటరీ వీళ్ళంతా నా వెనకబడ్డారు? సెక్రటరీ: వెనుక బడిన వాళ్ళందరికీ ఋణాలిప్పిస్తానని ఇప్పుడు మీరే కద సర్ చెప్పేరు. అందుకని..... --------------------------------------------------------------------------------- 9. తండ్రి (కొడుకుతో): నీ ప్రవర్తనవల్ల నాకెంత తలవంపుగా ఉందో తెలుసా? కొడుకు: లేదు నాన్నా! నీ తల బాగానే ఉంది. వంపుగా లేదు ------------------------------------------------------------------------------------ 10. ఒక వ్యక్తి: ఇంకెప్పుడూ నా గుమ్మం తొక్కొద్దని చెప్పలేదూ నీకు? వచ్చిన వ్యక్తి: అందుకే గుమ్మం తొక్కకుండా దాటి వస్తున్నాను ------------------------------------------------------------------------------------ 11. పేషంట్ భర్త( డాక్టర్ తో): మరి కొంచెం సేపు ఆ ధర్మామీటర్ మా ఆవిడ నోట్లో ఉండనివ్వండి డాక్టర్ గారూ! డాక్టర్: ఎంతసేపు ఉంచాలో నాకు తెలియదా? నువ్వు నాకు చెప్పాలా? పే.భ: అది కాదు సార్. ఆ కాస్సేపయినా అది నోరు మూస్తుంది అని. లేకపోతే మళ్ళీ వాగడం మొదలుపెడుతుంది. అందుకని ------------------------------------------------------------------------------------ 12. ఓ వ్యక్తి: పూర్వం రాజులు కవీశ్వరుల్ని వాళ్ళ కవిత్వానికి అక్షరానికో లక్ష చొప్పున ఇచ్చి సన్మానించేవారట రెండో వ్యక్తి: పాపం ఆ రోజుల్లో అక్షరాలు వ్రాయడానికి అంత కష్టపడే వారన్నమాట ---------------------------------------------------------------------------------------- 13. ఓ దగ్గర నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి. ఒకాయన అనౌన్స్ చేస్తున్నాడు." డియర్ ఫ్రెండ్స్ ఈ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా ముందుగా మన హాస్యబ్రహ్మ హరీష్ గారు మనకు పొట్ట చెక్కలయ్యే జోకులు చెప్తారు" అనగానే ఇంతలో "ఒక్క క్షణం ఆగండి" అన్నాడొకాయన " ఏంటండీ దేనికీ" అడిగేడా పెద్ద మనిషి " ఫోన్ చేస్తున్నానుండండి" అన్నాడాయన " ఎవరికండీ?" " 108 కి" చెప్పేడాయన " న్యూ ఇయర్ తో 108 కి ఫోన్ అంటావేంటి మిత్రమా? ఇంతకీ దేనికీ"ఉండబట్టలేక అడిగేడాయన " ఇంక దేనికీ అంబులన్స్ కోసం" " అంబులన్స్ ఎందుకండీ ఇప్పుడు" " ఆయన జోకులు చెప్పగానే పొట్ట చెక్కలయిన వాళ్ళందర్నీ హాస్పిటల్ కి చేర్చొద్దూ?" ------------------------------------------------------------------------------------ 14. తండ్రి(కొడుకుతో): ఒరేయ్ పెద్దా, చిన్నాలేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడేయడమేనా? కొడుకు: నోటికొచ్చినట్లు మాట్లాడకపోతే రానివి ఎలా మాట్లాడుతాను నాన్నా? ---------------------------------------------------------------------------------- 15. ఓ వ్యక్తి: నేను శాకాహారినీ నువ్వు మాంసాహారివీ అంటుంటాను మా ఆవిడతో అవతలి వ్యక్తి: అదేంటీ మీది లవ్ మేరేజా? మొదటి వ్యక్తి: కాదు ఆవిడ నా మెదడు తినేస్తుంటుంది మరి ----------------------------------------------------------------- 16. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ ఓ ప్రజా నాయకుడు " ఈ సంవత్సరం నేను మీ ఊళ్ళో రోడ్లన్నీ బాగు చేయించడం, డ్రైనేజి కాలువలు త్రవ్వించడం, వీధి లైట్లు పెట్టించడం, మంచి నీటి సదుపాయం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాను. దానికి నా సాయశక్తులా కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను" అన్నాడు. అప్పుడు సభలోంచి ఒక ఆసామీ లేచి " అయ్యా ఈ మాటలు మీరు ప్రతి సంవత్సరమూ చెప్తున్నవేకదండీ" అన్నాడు. దానికి జవాబుగా ఆ పెద్దమనిషి " అవునయ్యా నేను గడియకో మాటా గంటకో మాటా ఆడే రకం కాదని ముందే చెప్పెను కదా. నాదెప్పుడూ ఒకటే మాట. అంచేత ప్రతి సంవత్సరం నేను ఇదే మాట చెప్తుంటాను అంతేకాని సంవత్సరానికో మాట మార్చను" అన్నాడు. ------------------------------------------------------------------------------------ 17. తల్లి: ఏంట్రా నానీ చేస్తున్నావ్? కొడుకు: నాన్నగారు అన్నయ్యకు పొట్ట పొడిచినా అక్షరం ముక్క లేదన్నారు. పొడిచిచూస్తున్నా ఎక్కడైనా ఉందేమోనని. -------------------------------------------------------------------------------------------------------------------------------- 18. ఓ రాజకీయ నాయకుడు ( ఉపన్యాసమిస్తూ ): ఏమిటోయ్ సెక్రెట్రీ ఒక్కసారిగా కూచున్నవాళ్ళంతా లేచి స్టేజి దగ్గరకు వస్తున్నారు సెక్రటరీ: ఇప్పుడు మీరే కదండీ అన్నారు మన దేశ సమైక్యతకు యువకులంతా నడుము బిగించి ముందుకు రావాలని. అందుకే.... ------------------------------------------------------------------------------------ 19. తండ్రి ( కిరాణా షాప్ వాడితో ) : ఏమోయ్ ఓ కేజీ కందిపప్పుఇయ్యి. కొడుకు: అదేంటి నాన్నా ఆమధ్య నీ పప్పులు మా దగ్గర ఉడకవ్ అని మళ్ళీ ఇతని దగ్గరే కందిపప్పు తీసుకుంటున్నారు? ------------------------------------------------------------------------------------ ------------------------------------------------------------------------------------ 20. తల్లి: మీ అన్నయ్యకు రెక్కలొచ్చివెళ్లిపోయేడురా కొడుకు: ఆ మధ్య నాన్నగారు కూడా అంకుల్ తో ఇదేమాట అన్నారు. మరి నాకెప్పుడొస్తాయమ్మా రెక్కలు? ------------------------------------------------------------------------------------ 21. ఓ వ్యక్తి: అతను నాతో మాట్లాడినప్పుడల్లా చేతులు నలుపుకుంటూ మాట్లాడుతాడు. ఎంత వినయమో? రెండో వ్యక్తి: వినయమా పాడా? నిన్నునలపలేక చేతులు నలుపుకుంటున్నాడు. --------------------------------------------------------------------------------------- 22. భార్య : ( భర్తతో ) మీకు బొత్తిగా సెలెక్షన్ తెలియదు సుమండీ! భర్త : అవును.నిజమేనే! ఆ సంగతి నాకు నిన్ను చేసుకున్నాకే తెలిసింది. 23. రమేష్ : నేను తెలిసీ ఎవరికీ ఉపకారం చేసేనో లేదో తెలియదు కానీ తెలియకుండా ఒకరికి మాత్రం చాలా ఉపకారం చేసేను. సోమేష్ : ఏంటది? ఎవరికీ? రమేష్ : నేను పెళ్ళిచేసుకుని మా ఆవిడ బారి నుండి మరొకరిని కాపాడేను. రవి : ఏంట్రా రాజూ!అలా క్రిందకు చూస్తున్నావ్?ఏమైనా పడిపోయిందా? రాజు : మన ఇంటాయన వచ్చి అద్దె ఇవ్వలేదని నిప్పులు క్రక్కుతూ వెళ్ళేడన్నావు కదా! త్రొక్కేస్తానేమోనని చూసుకుంటున్నాను. ------------------------------------------------------------------------------------------------ 24. మహేష్ : మీ ఆవిడ నోరు చెడ్డది కాదంటున్నావ్. గయ్యాళి కాదంటున్నావ్.మరేంటి నీ బాధ? సతీష్ : మా ఆవిడ నోరు చెడ్డది కాదు. మహా చెడ్డది. గయ్యాళి కాదు పరమ గయ్యాళి. అదే నా బాధ. ------------------------------------------------------------------------------------------------- 25. అప్పారావు : వెంకట్రావుగారూ! బాగున్నారా? వెంకట్రావు : ఏం బాగుండడమోయ్ అ : ఏమండీ? ఏమైంది? అంత నిరాశా నిస్పృహలతో మాట్లాడుతున్నారు జీవితం మీద విరక్తి పుట్టినట్లు వెం : మరి వైరాగ్యం వస్తే అలాగే ఉంటుంది.పై నుండి పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అ : అదిగో వచ్చింది చూడండి. వెం ; ఆ! అ : అదేనండీ! మీ ఆవిడ మేడ మీదనుండి పిలుస్తున్నారు.
పంపినవారు : మురళీధర శర్మ పతి
ప్రచురించిన తేదీ : 17/12/2021 ------------------------------------------------------------------------------------------------------- 26. నా పాట పంచామృతం కామెడీ (సరదా) కోసం రాసిన జోక్ "అమ్మా! పూజకి అందరూ సిద్ధమా, అన్ని ఏర్పాట్లు చేసారా?" అడిగారు పంతులు గారు. "అన్ని ఏర్పాట్లు చేసామండి. ఇదుగో వస్తున్నాం" అంది ఆవిడ. పూజ దగ్గర పెట్టిన సామగ్రి అంతా పరిశీలించిన పంతులు గారు, "అమ్మా! అన్ని వస్తువులు ఉన్నాయి కానీ, పంచామృతం రాలేదు అమ్మా. అది కూడా ఏర్పాటు చేస్తే పూజ మొదలు పెడదాం" అన్నారు. "అయ్యో, పంచామృతం రాలేదా, ఇప్పుడే చేస్తాను అండి" అంటున్న ఆవిడతో, ఓ పెద్దాయన "పంచామృతమే కదా, నేను ఏర్పాటు చేస్తాను. మీరు పూజ కానివ్వండి" అన్నారు. అందరూ పూజలో కూర్చున్నారు. ఆయన గారు వీణ తీసుకుని వచ్చారు. "ఇదేమిటండీ, వీణ తెచ్చారు, పంచామృతం తెమ్మంటే?" అందావిడ. "నువ్వు కంగారు పడకమ్మా. మీరు ప్రశాంతంగా పూజ కానివ్వండి" అన్నారాయన. "అయ్యా! ఆ పంచామృతం ఏదో ఇస్తే పూజ చేస్తా!" అన్నారు పంతులు గారు. "అలాగే పంతులు గారూ" అంటూ గొంతు సవరించుకుని, వీణ ఒడిలో పెట్టుకుని మొదలు పెట్టారాయన... "నా పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ,,, నా పాట పంచామృతం..." అంటూ.. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మాయమైపోయారు, పూజచేసే పంతులు గారితో సహా... "ఏమిటో బొత్తిహా సంగీత జ్ఞానం లేకపోయింది ఎవ్వరికీ!" అనుకున్నాడా పెద్దాయన.
-------------------------------------------------------------------------------------------------------------------------------
27. బిజినెస్ మాన్:
బ్యాంకులో తన పక్కనే కూర్చున్న వ్యక్తిని పరిచయం చేసుకుందామని అనుకున్నాడు వెంకట్.
వెంకట్: హాయ్, మీరేం చేస్తూ ఉంటారు?
పక్కన వ్యక్తి: నేను బిజినెస్ చేస్తాను అండి.
వెంకట్: గ్రేట్ అండి, ఏం బిజినెస్?
బిజినెస్ మాన్: ఆపిల్ ప్రొడక్ట్స్ బిసినెస్ చేస్తుంటాను సర్.
వెంకట్: వావ్ గ్రేట్, ఆపిల్ ప్రొడక్ట్స్ అంటే ఐపాడ్, ఆపిల్ ఐ-ఫోన్ ఇవేకదా?
బిజినెస్ మాన్: అబ్బే కాదండి
వెంకట్: మరి?
బిజినెస్ మాన్: సిమ్లా ఆపిల్, గ్రీన్ ఆపిల్, ఆపిల్ జ్యూస్
వెంకట్ షాక్స్, బిజినెస్ మాన్ రాక్స్...
-------------------------------------------------------------------------------------------------------------------------------
28. అమ్మో భయం
సడెన్గా మా కాలనీలో Ambulance సౌండ్ వినిపించింది,,,
అందరం బయటకి వచ్చి, ఎవరికీ ఏమైందో అనుకున్నాం..
మొన్నామధ్య ఈశ్వరరావు గారికి ఒంట్లో బాలేదు అన్నారు వాళ్ళింటికేమో అని ఒకరు, కనకమ్మ గారి కూతురు డెలివరీకి వచ్చింది కదా వాళ్ళ కోసమేమో అని ఒకరు అనుకున్నాం..
తర్వాత కాసేపటికి పోలీస్ బండి సౌండ్ వినపడింది,,, అమ్మో దొంగ దొరికిపోయాడు,
మన కాలనీ వాళ్ళలోనే ఎవరో ఉన్నారేమో?
పోలీసులు పట్టుకెళ్ళి బడిత పూజ చేస్తారు లే,,, అనుకున్నాం
ఇంకాసేపట్లో ఫైర్ ఇంజన్ సౌండ్,,,
అమ్మో ఏమో ఏ ఇల్లు కాలిపోతుంది బాబోయ్,, అందరం బయటకి వెళ్లిపోవడం మంచిది,,,
లేదంటే వాటర్ ట్యాంక్ తెప్పిద్దాం,,, అనుకున్నాం
చివరికి ఒక పిల్లాడు నడుస్తూ వచ్చి, మా సందు మొదట్లో నుంచొని ఫోన్ ఆన్ చేసి నడుస్తున్నాడు. అప్పుడు వచ్చింది ఇందాకటి నుంచీ మాకు వినిపిస్తున్న అదే సౌండ్...
*****
పంపినవారు : పరిమళ కళ్యాణ్
ప్రచురించిన తేదీ : 29/12/2021
-------------------------------------------------------------------------------------------------------------------------------
29. కరెక్టే కదా సార్
ప్రసాదు: ఎమ్మోయ్ రత్నం!! ఈరోజు నిన్ను బయటికి తీసుకెళ్తాను...... రెడీ అవ్వు ��
రత్నం: ఎక్కడకండి? కూరగాయాల మార్కెట్ కే కదా!!......��
ప్రసాదు: అలా ఎందుకు అంటున్నావు?...��
రత్నం: నేను అడగకుండా తీసుకెళ్లే చోటు అదే కదా...����
పంపినవారు : పట్నాయకుని నీహారిక
ప్రచురించిన తేదీ : 03/01/2022
-------------------------------------------------------------------------------------------------------------------------------
30) "ఉగాది రోజు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అని మీ అబ్బాయికి వాట్స్ అప్ లో మెసేజ్ పెట్టావా...మీ అబ్బాయి ఎక్కడున్నాడు " "మా ఇంటిలోనే ...చదివేది ఆరవ తరగతి అయినా ఉదయం పది వరకు నిదురపోతుంటాడు " "పదిగంటలకు మీ అబ్బాయి ఏమని సమాధానం ఇచ్చాడు " మీరు పెట్టిన మెసేజ్ అర్థం కావడం లేదు ఇంగ్లీష్ లో మెసేజ్ పెట్టండి అని సమాధానమిచ్చాడు "
-------------------------------------------------------------------------------------------------------------------------------
31) “ ఉగాదిరోజు నూతన సంవత్సర శుభాకంక్షాలు చెప్పి అలాగే నీ ప్రమోషన్ విషయమై సిఫారసు చేయమని అడగడంకోసం మీ మేనేజర్ ఇంటికి వెళ్లడం మంచిదైందా ...ఎలా " “ నేను వెళ్లే సమయాన ఆయన వాళ్ళ ఆవిడ దగ్గర దెబ్బలు తినడం చూసాను . ఎవరికీ చెప్పకు నీకు ప్రమోషన్ వచ్చేలా చేస్తాను అని మాటిచ్చారు.
-------------------------------------------------------------------------------------------------------------------------------
32) “ఒకప్పుడు పండుగరోజు టీ వీ లో ఛానల్ పెట్టె విషయంలో పెద్ద గొడవ జరిగేది .ఈ ఉగాది రోజు ఎవరూ టీ వీ చూడలేదు"
“ఎందుకూ “
"అందరికీ సెల్ ఫోన్ ఉందిగా... వాట్స్ అప్ పేస్ బుక్ ,ఈ మెయిల్స్ చూడటంలో మునిగిపోయారు”
-------------------------------------------------------------------------------------------------------------------------------
33) “మా అబ్బాయి ఉగాది రోజు స్నేహితులతో గుడివాడ వెళ్తానంటున్నాడు . అక్కడ అంత ముఖ్యమైన గుడి ఏముంది "
“ ???? “
-------------------------------------------------------------------------------------------------------------------------------
34) “ఈ ఉగాది రోజున జైలు అధికారి నిన్ను విచారించడానికి బదులు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడా ...ఎందుకూ "
“ ఈ రోజు నుండి నా కేసు సి బీ ఐ వారు చూస్తారంట “
-------------------------------------------------------------------------------------------------------------------------------
35) డాక్టర్ : " సార్ మంత్రి చనిపోయి మూడు రోజులయింది ఈ రోజయినా బయటి వారికీ చెప్పమంటావా ."
మంత్రి బావమరిది : “పరకాయ ప్రవేశ విద్య తెలిసిన సాధువును పిలుచుకొని రమ్మని మా మనుషులను పంపాను .రాగానే నేను మా బావ శరీరంలోనికి ప్రవేశించి మంత్రిగా కోట్లు కోట్లు సంపాదించాలని వున్నాను "
------------------------------------------------------------------------------------------------------------------------------- 36) "మన నాయకుడు జైలు దుస్తులతోనే ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్నాడు “ “బెయిల్ దొరకలేదట ...జైలు నుండి పారిపోయి వచ్చి మాట్లాడుతున్నాడు"
------------------------------------------------------------------------------------------------------------------------------- 37) “మీ అత్తగారికి కోపం వచ్చినప్పుడు కట్టుడు పళ్ళ సెట్ తీసి పెడుతుందా ...ఎందుకూ " “ కోపంలో ఆమెకు గొంతు పెద్దదవుతుంది. ఆ సమయాన కట్టుడు పళ్ళ సెట్ ఎక్కడ మింగేస్తానోనన్న భయం “
------------------------------------------------------------------------------------------------------------------------------- 38) “బెయిల్ అక్కరలేదు అని మొండికేసిన మన పార్టీ నాయకుడు ఇప్పుడు ఎందుకు కావాలంటున్నాడు”
“ ఆయన భార్య విదేశాలకు వెళ్లిందట “
------------------------------------------------------------------------------------------------------------------------------- 39) “ఎన్నికలలో నిలబడటానికి అప్లికేషన్ ఫారం పూర్తి చేసే సమయాన అతని పేరు వ్రాయడానికి బదులు ఏదో నంబరు వేశాడా ...ఎందుకు "
“జైలులో ఆయన వున్నప్పుడు అతనికున్న ఖైదీ నంబరు”
------------------------------------------------------------------------------------------------------------------------------- 40) “మన నాయకుడు పయనించిన రైలు పట్టాలు తప్పినందుకు మన వ్యతిరేక పార్టీ నాయకుడి కుట్ర అని చెప్పాడా ...వాళ్ళు యేమని బదులిచ్చారు “
" మన నాయకుడు మద్యం మత్తులో ఆడిన ఆటకు రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పిందని చెప్పారు "
------------------------------------------------------------------------------------------------------------------------------ 41) “మీ వారు నిదురపోయేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారా ...మంచి ఆలవాటేగా ...” “ఆయన స్విచ్ ఆఫ్ చేసేది ఆఫీసులో నిదురపోయేటప్పుడు " అంది
పంపినవారు : ఓట్ర ప్రకాష్ రావు
ప్రచురించిన తేదీ : 25/01/2022
-------------------------------------------------------------------------------------------------------------------------------
42) " ఆ అపార్టుమెంట్లో ఇల్లు ఎందుకు వద్దన్నారు" అడిగింది భార్య.
"కుక్క ను పెంచ కూడదు అన్న నిబంధన ఉన్నందువల్ల "
"మనం కుక్కను పెంచడం లేదుగా "
" కుక్కలాగా అరవకూడదంట " అసహనంగా భార్యవైపు చూస్తూ చెప్పాడు.
------------------------------------------------------------------------------------------------------------------------------ 43) " నన్ను ప్రేమించానని చెప్పి చివరకు నా ప్రేమను సముద్రం లో కలిపేసిన వాడ్ని నీవు బీచ్ లో చూసావా ...ఏం చేస్తావున్నాడు"
" సముద్రంలో వినాయకుడి బొమ్మను వేయడానికి వచ్చాడు".
------------------------------------------------------------------------------------------------------------------------------- 44) "ఎనిమదవ తరగతి కూడా పాస్ కాని మన పార్టీ నాయకుడికి డాక్టరు బిరుదు ఇవ్వడం పొరపాటయిందా ...ఎలాగా "
" నేను ఆపరేషన్ చేస్తాను అని ఒకటే గొడవ...వేరే దారిలేక ఆపరేషన్ చెయ్యడానికి అంగీకరించారు. "
"అయ్యయ్యో ...ఎవరా దురదృష్టవంతుడు "
" చనిపోయిన శవాన్ని పడుకోబెట్టి రోగి అని చెప్పగానే ఆపరేషన్ చేసాడు . ఆపరేషన్ తరువాత చనిపోయాడని చెప్పగానే మౌనంగా వెళ్ళిపోయాడు "
------------------------------------------------------------------------------------------------------------------------------- 45) "మీ ఇంటి పనిమనిషి ఎన్నికల బోనస్ అంటూ అడిగితే వందరూపాయలు ఇచ్చావా ..ఎందుకలా "
"ఆ పార్టీ వెధవలు ఓటుకు నోటు అంటూ నాకూ మా ఆవిడకు కలిపి ఐదువేల రూపాయలు మా పనిమనిషి ముందే ఇచ్చారు"
------------------------------------------------------------------------------------------------------------------------------- 46) "మిమ్మల్ని చూడటానికి వచ్చిన మీ భార్యతో ఏమన్నారు , కోపంతో మీ చెంప మీద కొట్టి వెళ్ళింది "
" జీవితంలో ఇక్కడే మంచి భోజనం తింటున్నానన్న తృప్తి కలిగింది అని చెప్పాను " అన్నాడు ఖైదీ.
------------------------------------------------------------------------------------------------------------------------------- 47) " పుష్పానికి నానార్థములు ఏమిటి అని అడగడం తప్పయిందా ... ఎందుకు టీచర్ " అడిగాడు హెడ్ మాస్టర్ .
" అందరూ పువ్వు , నిప్పు(ఫైర్) అని చెప్పారు "
------------------------------------------------------------------------------------------------------------------------------- 48) " పెన్సిల్ బదులు పెన్సిల్ టపాకాయ తీసుకెళ్ళావా ... పెన్సిల్ ముక్క లేదని షార్పనేర్ లో పెట్టి తిప్పమని టీచర్ చెప్పారా ...ఆతరువాత "
" పెన్సిల్ ముక్క రాలేదని చెపితే నా చెవులు బాగా తిప్పారు "
------------------------------------------------------------------------------------------------------------------------------- 49) "ఏంటయ్యా మా ఇంటి ముందు నిలబడి బిక్షం అడగకుండా వెళ్తున్నావు" "ఈ రోజు మీ ఇంట్లో వంటలు బాగోలేదని మా గ్రూలో మెసేజ్ వచ్చింది తల్లీ"
------------------------------------------------------------------------------------------------------------------------------- 50) "ఏంటి సార్ పోయిన సంవత్సరం అక్కడ ప్రారంభోత్సవం చేసినందుకు పది లక్షలు ఇచ్చారు . మీకు ఉచితంగా ప్రారంభోత్సవం చెయ్యమని అడుగుతున్నారు " కోపంగా అంది నటి.
"అమ్మా ,అది చీరల అంగడి, 365 రోజులూ వ్యాపారం ఉంటుంది . నేను వ్యాపారాస్థుడిని కాను రచయితను ... మీకు సాహిత్యంతో పరిచయముందని ఎవరో చెబితే నేను వ్రాసిన కథల పుస్తకానికి ప్రారంభోత్సవం చెయ్యమని వచ్చాను . నాకు ఖర్చు తప్ప లాభం లేదమ్మా "
------------------------------------------------------------------------------------------------------------------------------- 51) " ఆ టపాకాయల అంగట్లో ధర చాలా తక్కువని అందరూ చెప్పగా వెళ్లాను ... ఎక్కువ గుంపు ...ఆ గుంపులో వెళ్లి కొనే లోపున ఊపిరి ఆగిపోతుందన్న భయం ... ఎలాగోలా కష్టపడి కొనడం తప్పయిపోయింది "
" ఏం జరిగింది "
“ అది చైనా టపాకాయలంట...కాలుస్తున్నప్పుడు వచ్చే పొగవలన మా ఇంటిలోనివారందరికీ ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో అందరం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాము "
------------------------------------------------------------------------------------------------------------------------------ 52) "ఉగాది పండుగరోజు మీ ఇంట్లో గాస్ అయిపోయిందా ... పండుగ రోజు సిలెండర్ కూడా దొరకదే ...ఏం చేశారు "
"ఆ రోజంతా ఉగాది పచ్చడి తిన్నాము "
------------------------------------------------------------------------------------------------------------------------------- 53) "ఉగాది పండుగరోజు మీ ఇంట్లో గాస్ అయిపోయిందా ...పండుగ రోజు సిలెండర్ కూడా దొరకదే ...ఏం చేశారు "
"ఇరుగు పొరుగు వారు ఇచ్చే పలహారముల కోసం ఎదురుచూడవలసి వచ్చింది "
పంపినవారు : ఓట్ర ప్రకాష్ రావు
ప్రచురించిన తేదీ : 28/01/2022
-------------------------------------------------------------------------------------------------------------------------------
54) “ నీవు వాడి పెళ్ళికి వెళ్లడం పొరపాటయిందా ...ఎలాగ “
“ అందరూ వాట్స్ అప్ లో పెళ్లి శుభాకాంక్షలు పంపారు , ఈ కరోనా సమయంలో బుద్ధిలేకుండా వస్తావా అంటూ అక్కడి వారందరూ నన్ను తిట్టి పంపారు”
-------------------------------------------------------------------------------------------------------------------------------
55 ) "నేను చదువుకోకపోయినా కొంతయినా తెలివివుంది ... ఎందుకు అబద్దాలు చెబుతారు అంటూ మీ ఆవిడ నిన్ను కొట్టిందా . ?"
“పాత జీతంకన్నా కొత్త జీతం తగ్గింది అంటూ నిజం చెప్పినా నామాటలు నమ్మక కొత్త జీతం అంటే పెరుగుతుంది కానీ తక్కువవుతుందా అంటూ నన్ను కొట్టింది "
------------------------------------------------------------------------------------------------------------------------------- 56) “పది రోజుల క్రితం మన ఊరి అరటిపండ్ల వ్యాపారి క్రికెట్లో సెలెక్ట్ అయ్యాడా ...బౌలరా ...బ్యాట్స్ మన్ గానా "
“ ఆటలో అరటిపండులా సెలెక్ట్ అయ్యాడు”
“ నిన్నటి రోజున కుళ్లిపోయిన అరటి పండులా ముఖం పెట్టుకొన్నాడేందుకూ “ “ ఆటలో అరటిపండులా ఇద్దరినీ ఎన్నిక చేసి అందులో ఒకడిని తీసుకొని మన ఊరి వాడిని ఇంటికిపొమ్మన్నారు “
-------------------------------------------------------------------------------------------------------------------------------
57 ) “అదేమిటండీ ఐదువందల రూపాయల నోటు ఇచ్చి చిల్లర ఇమ్మంటే నాలుగువందలే ఇచ్చారు “
“ఈ రోజు పండుగసందర్బముగా అన్నింటికీ ఇరవై శాతం తగ్గింపు అన్న ప్రకటన బోర్డు బయట పెట్టాము చూడండి “
------------------------------------------------------------------------------------------------------------------------------- 58) “ఇంటికొచ్చిన దొంగను గట్టిగా కొరకమని మీ ఆవిడ సైగ చేసిందా ... నీవు పల్ సెట్ తీసి వాడిని కొరికినావా... ఎందుకూ " అడిగాడు
" నేను మా ఆవిడ చెప్పినట్లు కొరికితే వాడు నన్ను ఉతుకుతాడని తెలుసు . నా పల్ సెట్ తీసి వాడిని కొరికితే వాడికి గిలిగింతలు పెట్టినట్లనిపించి నవ్వుతున్న సమయాన మా ఆవిడ వాడి కాళ్ళు చేతులు కట్టి వేసింది "
------------------------------------------------------------------------------------------------------------------------------- 59) “ ఈ రోజు జరగబోయే ఎన్నికలకు మా నాన్న ముంబై నుండి రాలేక పోయారు ... నాన్న ఓటు వేయలేరు అని నిజం చెప్పావా... ఆ పార్టీ వారు ఓటుకు నోటు అంటూ మీ నాన్న ఓటు కోసం ఇచ్చిన రెండువేల రూపాయలు తిరిగి ఇవ్వబోతే తీసుకోలేదా ...నీవు నిజం చెప్పినందుకా?"
“ పదహారేళ్ళ వయసు కల మా అబ్బాయికి మానాన్న వేషం వేయడానికి మేకప్ మెన్ పంపుతాము ... మా అబ్బాయిని ఓటు వెయ్యమన్నారు "
------------------------------------------------------------------------------------------------------------------------------- 60) “ మీ అబ్బాయి ఎదగడం లేదని జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళావా ...ఏం చెప్పారు “ "మెగా సీరియల్ పేరు మా అబ్బాయికి పెట్టడం పొరపాటయిందట , పేరు మార్చమన్నారు “ “పేరు మార్చాక మీ అబ్బాయిలో ఎదుగుదల కనిపించిందా “
“ అలాగే ఉండటంతో మరలా ఆ జ్యోతిస్కుడి దగ్గరకు వెళితే పేరు మార్చడంతో పాటు మెగా సీరియల్ చూడటం మాన్పించండి అన్నారు. అవి చూడటం మాన్పించాక వాడి ఎదుగుదలలో అభివృద్ధి గమనించాము.”
---------------------------------------------------------------------------------------------------------------------------- 61 ) “మన మేనేజర్ గారికి అప్పుడప్పుడు కరోనా సోకడం,.హోమ్ క్వారంటైన్ లో ఉండటం , గత రెండేండ్లుగా జరుగుతోంది . ఒకేసారి మంచి వైద్యం చేసుకోవచ్చుగా "
“ ఆయన భార్య పెద్ద గయ్యాళి ...అందుకే అలా .. ఆయనకు ఏ రోగమూ లేదు."
------------------------------------------------------------------------------------------------------------------------------- 62 ) "పోలీసుస్టేషన్ నందు న్యాయమే లేదురా .. పర్సు దొంగలించిన వాడిని బెల్టు తో కొట్టారు ... కల్తీ సారాయం అమ్మిన వాడినీ బెల్టుతో కొట్టారు.... కారు దొంగలించిన నన్నూ బెల్టుతో కొట్టారు " " ? ? ? "
------------------------------------------------------------------------------------------------------------------------------- 63 ) “మన పార్టీల కూటమి చాలా బలమైనది . ఏడు జన్మలైనా విడిపోదు” “మీరేమి చెప్పారో సరిగ్గా వినపడలేదు . మన కూటమి ఏడు గంటల దాకానా ...ఏడు రోజుల వరకా ...ఇంతకు మేరీమి చెప్పారో మరొక్కసారి చెప్పండి "అడిగాడు మరో పార్టీ నాయకుడు
------------------------------------------------------------------------------------------------------------------------------ 63 ) "వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారుకదా... ఇప్పుడు ఎందుకు పార్కుకు వెళ్తున్నారు" "వాళ్ళు ఆన్ లైన్ ప్రేమికులంట. ఇప్పుడే లాక్ డౌన్ తీసేసి పార్క్ తెరచినందువల్ల పార్కుకు మొదటిసారి వెళ్తున్నారు "
------------------------------------------------------------------------------------------------------------------------------ 64 ) “ మీ అత్తయ్యకు కరోనా అని తెలిసాక ఆసుపత్రికి పంపలేదా ...ఎందుకూ” “ ఎల్లుండి జరుగబోయే ఎన్నికలకు ఆ పార్టీ వారు ఓటుకు పట్టు చీర ఇస్తారంట.”
పంపినవారు : ఓట్ర ప్రకాష్ రావు
ప్రచురించిన తేదీ : 25/01/2022
-------------------------------------------------------------------------------------------------------------------------------
65) "ఉగాదిరోజు మీ ఆవిడ కోపంగా ఉందా ...ఎందుకూ "
" ఆవిడ అడిగిన పట్టు చీర కొనివ్వలేదని ... ఆ కోపంతో టిఫిన్ కు బదులుగాఉగాది పచ్చడి పెట్టింది "
------------------------------------------------------------------------------------------------------------------------------- 66) "మహారాజుగారు పేస్ బుక్ నందు ఆయన ఫోటో పెట్టడం తప్పయిపోయిందా ఎలాగా" “రాజ్యంలో ప్రజలెవ్వరూ లైక్ పెట్టలేదని బాధపడుతున్నారు "
------------------------------------------------------------------------------------------------------------------------------- 67) “ ఉగాదికి మీ మామగారు స్కూటర్ కొనివ్వలేదన్న కోపంతో పాత స్కూటర్ టైర్ చేతితో దొర్లించుకొంటూ వెళ్ళావా ...ఎందుకూ "
“ ఎవరైనా అడిగితే మా మామ మీదున్న కోపంతో ఇలా చేస్తున్నాన్నాని చెబుతామనుకొన్నాను " “ ఎవరైనా అడిగారా “
“ అడగలేదు కానీ ఆ ఊరివారు నన్ను పిచ్చివాడనుకొని కాళ్ళు చేతులు కట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించారు”
------------------------------------------------------------------------------------------------------------------------------- 68) "అతను నిజాయితీ గల మాస్టారన్నావు . నా పుత్రుడు పరీక్షలో కాపీ కొడుతుంటే మాస్టారు ఎందుకు పట్టుకోలేదు "
" పట్టుకొంటే మీకు కోపం కలుగుతుందన్న భయం ఒక ప్రక్క, ఫెయిల్ అయ్యే వాడిని ఎందుకు పట్టుకోవాలని వదిలేసాడంట "
" కాపీ కొట్టినా ఎలాగ ఫెయిల్ అవుతాడు. తెలుగు పరీక్షకు ఆంగ్లములో సమాధానములు వ్రాయడం గమనించాడంట "
------------------------------------------------------------------------------------------------------------------------------- 69) “మీ కాలంలో పెళ్లిమండపం లోనికి ప్రవేశించడానికి ముందు తట్టలో కలకండ పూలు పెట్టేవారు .. నిన్న వెళ్లిన పెళ్ళిలో అలా చేస్తారని ఊహించలేదా ...తెలిసివుంటే ఆ పెళ్ళికి వెళ్లకుండా వుండేవాడివా ...ఏం చేశారు "
"తట్టలో చదివింపుల కవర్లు ఉంచారు."
" అది మామూలు విషయమేగా "
" కవరు మీద వెయ్యిరూపాయలు తక్కువకాకుండా చదివించవలెను అని ప్రింట్ చేసి వుంది "
------------------------------------------------------------------------------------------------------------------------------- 70. "మహారాజా , మీకు రాణిగారు వివాహారద్దు ఇస్తున్నట్లు వర్తమానం పంపుతుందని దూరంగా వస్తున్న పావురాన్ని చూడగానే ఎలా చెప్పగలిగారు"
“ ఉత్తరం తెచ్చిన పావురం మెడలో నల్లటి గుడ్డ చుట్టివుండటం గమనించాను "
------------------------------------------------------------------------------------------------------------------------------- 71. "ఏంటయ్యా ఒక సారి చీర దొంగలించి మరుసటి రోజు అదే అంగడికి దొంగిలించడానికి పోయి దొరికిపోయావా ....మీ ఆవిడ రెండవ చీర అడిగిందా "
“ ఒక చీర కొంటె మరో చీర ఉచితం అన్న బోర్డు మా ఆవిడ ఉదయం చూసిందట ఉచితంగా వచ్చే చీర ఎందుకండీ వదులుకోవాలి అంటూ చెప్పడంవలన మరలా వెళ్లి దొరికిపోయాను”
------------------------------------------------------------------------------------------------------------------------------- 72) “ పెళ్ళికి ముందు మంచి అల్లుడు దొరికాడు... కట్నం వద్దని పెళ్లి చేసుకొన్నాడు అని గొప్పగా పొగిడావు ,ఇప్పుడు మీ అమ్మాయి అతనిని పెళ్లిచేసుకొన్నందుకు ప్రతిరోజూ బాధపడుతూ ఉందా ... ఏం చేసాడు "
"వాళ్ళ ఆఫీసులో అందరూ లంచం తీస్తున్నా ...మా అల్లుడు మాత్రం నీతి నిజాయితీ అంటూ లంచం తీసుకోకుండా పని చేస్తున్నాడట . అంతా నాఖర్మ "
------------------------------------------------------------------------------------------------------------------------------- 73) “ మీకాలుకు ఆపరేషన్ చెయ్యవలసిన చోట మాత్రం మత్తు ఇంజక్షన్ ఇస్తాము . మీకు మత్తు ఉండదు . జరిగేదంతా చూస్తూ వుంటారు "అంటూ విసనకర్ర ఇచ్చాడు
" విసన కర్ర ఎందుకు ఇస్తున్నారు డాక్టర్"
“పవర్ కట్ అయితే ఏ సి పనిచేయదు .ఆ సమయంలో మీరు విసురుకొనడానికి”
------------------------------------------------------------------------------------------------------------------------------- 74) “ ఆ కొత్త పార్టీకి కరోనా పార్టీ అన్న పేరు పెట్టాడా ...ఎందుకట ”
“ కరోనాకు కులమతాలు , ధనవంతుడు బీదవాడు అని చూడకుండా అందరినీ సమానంగా చూస్తున్నట్లు ఆ పార్టీ లో కులమతాలు లేవని చెప్పడంకోసం కరోనా పార్టీ అన్న పేరు పెట్టారట "
------------------------------------------------------------------------------------------------------------------------------- 75) "మన కుటుంబం గురించి అందరికీ తెలిసిపోయిందనా.. ఎలా చెబుతున్నారు "అడిగింది భార్య
“ పంటి నొప్పి వలన దవడ వాచింది అంటే ఎందుకోయ్ అబద్దం చెబుతావు అంటూ సానుభూతి తెలిపారు
------------------------------------------------------------------------------------------------------------------------------- 76) “ ఉల్లిపాయలు ఉదయాన కోస్తే కంట్లో నీరు వస్తుందా ...ఆ తరువాత కోస్తున్నప్పుడు నీ కంట్లో నీరు రాదా ఆశ్చర్యంగా వుందే..."
“ ఉదయానయితే మా ఆవిడ గొడవ పడదు . ఆ సమయాన కోస్తున్నప్పుడు కంట్లో నీరు ఉండటం వలన వస్తుంది ..."
పంపినవారు : ఓట్ర ప్రకాష్ రావు
ప్రచురించిన తేదీ : 25/01/2022
-------------------------------------------------------------------------------------------------------------------------------
77) "నేను క్రికెట్ ఆడి సెలెబ్రిటీ అయ్యాను"
"నేను అరుదైన రికార్డులు సృష్టించి సెలెబ్రిటీ అయ్యాను"
"మీరేం గొప్ప? నేను అప్పులు చేసి సెలెబ్రిటీ అయ్యాను హెహ..."
"ఆ....."
పంపినవారు : గాదిరాజు రంగరాజు
ప్రచురించిన తేదీ : 20/02/2022
-------------------------------------------------------------------------------------------------------------------------------
78) “కొత్తగా ఈ రోజు రిలీజు అయిన ‘న్యాయం -నీతి -నిజాయితీ ‘ సినిమాకు అభిమానులు ఆ హీరోకు పూలాభిషేకం చేయడానికి మార్కెట్లో పువ్వులన్నీ కొనేసారుగా! నీవు ఆ కల్యాణ మండపం అలంకరించడానికి పువ్వులు ఎలా తెచ్చావు? "
" ఆ హీరో అభిమాన సంఘం అధ్యక్షుడికి కొంత డబ్బు లంచంగా ఇస్తే పూవులు ఇచ్చాడు"
------------------------------------------------------------------------------------------------------------------------------- 79) “నేనిచ్చిన మందువలన తల నొప్పి పూర్తిగా తగ్గి పోయిందా ...ఇప్పుడు కడుపు మంట ఎక్కువగా ఉందా ... అది తగ్గడానికి వేరే మందు రాసిస్తాను”
“ కడుపు మంటకు మందు నా దగ్గర వుంది డాక్టర్ “
“ మీ దగ్గర ఉన్నదా చూపించండి “
“ తలనొప్పి అని చెప్పినందుకు రెండువేల రూపాయల ఫీజు తీసుకున్నందుకు కడుపు మంట ఉండకుండా ఉంటుందా "అంటూ డాక్టర్ చెంప చెళ్ళుమనిపించి “ఇప్పుడు కడుపుమంట తగ్గింది "అంటూ వెళ్ళిపోయాడు
------------------------------------------------------------------------------------------------------------------------------
80) " మన పార్టీ నాయకుడి దగ్గర ఆయన భార్య చనిపోయిన విషయం చెప్పావా ...ఆ తరువాత?"
" మొదటి భార్య ఆ ఊరిలో మాల్ యజమాని , రెండవభార్య ఫ్యాక్టరీ యజమాని , మూడవ భార్య వెయ్యి ఎకరాల భూ కబ్జా ...వీళ్ళలో ఎవరయ్యా...సరిగ్గా తెలుసుకొని చెప్పు అంటూ కోప్పడ్డాడు "
------------------------------------------------------------------------------------------------------------------------------- 81) "కరెంట్ బిల్ కట్టమని మేనేజర్ చెప్పాడుగా ...ఇప్పుడు కరెంటు బిల్ కట్టడానికి ఇంత ఆలశ్యమా..ఇక మీదట నీవు కట్టనక్కరలేదు అంటూ నీమీద కోప్పడ్డాడు ..ఎందుకలా " "కరెంట్ బిల్ కట్టడానికి వెళ్ళటప్పుడు బిల్లు డబ్బులు కూడా ఆయన దగ్గర అడిగి తీసుకున్నందుకు "
------------------------------------------------------------------------------------------------------------------------------ 82) " నీకు కరోనా సోకడం వలన ఆ క్రికెట్ టీం నుండి నిన్ను తీసేసారా ...టీం లో నీకొక్కడికే కరోనా ఎలా వచ్చింది "
"నేను ఆడిన ఆటల్లో వరుసగా ఒక్క రన్ తో అవుట్ అవడం వల్ల...కరోనా పేరుతొ తీసేసారు "
------------------------------------------------------------------------------------------------------------------------------- 83) “ అంతులేని కోపం’ సినిమాకు హీరోకై జరిగిన ఇంటర్వ్యూలో నిన్ను ఎన్నిక చేశారా ...ఆ తరువాత జరిగిన పరీక్షలో నిన్ను వద్దని చెప్పారా..ఏం పరీక్ష "
“ ఆ సినిమాలో హీరోకు కోపం ఎక్కువ వున్న పాత్ర, బీ పీ వున్న వారైతే సులభంగా కోపంతో నటిస్తారంట..మెడికల్ టెస్ట్ నందు నాకు బీ పీ లేదని వద్దని చెప్పారు .
------------------------------------------------------------------------------------------------------------------------------- 84) " దెయ్యం దిష్టి ..భూతం దిష్టి ...వెధవ దిష్టి ... పోరంబోకు దిష్టి ..కోతిముఖం దిష్టి ..అంటూ ఎన్నో చెబుతూ మా ఆవిడ నాకు దిష్టి తీసింది "
" ఎందుకూ " పక్కసీటులోని గుమాస్తా
"నిన్నటి రోజున నేను లంచం తీసుకొనడం మీరందరు చూసిన సంగతి మా ఆవిడకు చెప్పినందువలన ..."
------------------------------------------------------------------------------------------------------------------------------- 85) " మన రాజుగారు మారువేషంలో వెళ్లడం పెద్ద పొరపాటయిందా ఎలా "
“ మాఫియా గుంపు మన రాజుగారికి మత్తుమందు ఇచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయన కిడ్నీ దొంగలించారు "
-------------------------------------------------------------------------------------------------------------------------------
86) " ఆ గడ్డపాయన ప్రతి రోజూ మీ సెలూనుకు వస్తుంటాడా ...ఎందుకూ "
" తల వెంట్రుకలు కత్తిరించుకొన్నా ,గెడ్డం తీయించుకొన్నా నీ షాప్ లోనే తీసుకొంటాను అని చెబుతూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రతిరోజూ ఇక్కడ పేపర్ చదువుకొని , టీ వీ సీరియల్స్ చూసుకొని వెళ్తుంటాడు"
------------------------------------------------------------------------------------------------------------------------------- 87) "నీ ప్రియురాలు పంపిన వాట్స్ అప్ మెసేజ్ చూదామనుకొనే సమయాన సెల్ ఫోన్ పని చేయకుండా పోయిందా ...బాధతో పడుకొన్న సమయాన కలలో ఫోన్ పనిచేయడం ప్రారంభించిందా ...నీ ప్రియురాలు పంపిన మెసేజ్ చూసావా ..."
“చూద్దామనుకొనే సమయాన శనీశ్వరుడిలా నీవు వచ్చి నా నిదుర లేపావు “
------------------------------------------------------------------------------------------------------------------------------ 88) " భర్త పేరు చెప్పకూడదని మీ ఆవిడకు మీ అత్తయ్య చెప్పిందా ...అదృష్టవంతుడివిరా ... నిన్ను మీ ఆవిడ పిలవాలంటే ఎలా పిలుస్తుంది "
" కొట్టి పిలుస్తుంది "
పంపినవారు : ఓట్ర ప్రకాష్ రావు
ప్రచురించిన తేదీ : 28/02/2022
-------------------------------------------------------------------------------------------------------------------------------
89) "రేయ్ కరోనా ఇక మర్యాదగా పరుగెత్తి పో ...నేనిప్పుడే వాక్సిన్ వేసుకున్నాను"
"ఒరేయ్ పిల్లోడా , మర్యాదగా ముఖానికి మాస్క్ వేసుకొని మాట్లాడు ...లేకుంటే నీవే ఆసుపత్రికి పరుగెత్తవలసి వస్తుంది " కోపంతో అంది కరోనా
------------------------------------------------------------------------------------------------------------------------------- 90) " మన కొడుకు అంతా నా పోలికా... ఎందులో "అడిగాడు భర్త
" తెలుగు మీడియం లో చదివిన మీకు ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు, కానీ మీరు మందు తాగినప్పుడు ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడుతారు ."
" మన అబ్బాయిని ఇంగ్లీష్ మీడియం లో చదివించానుగా " . .
" మన అబ్బాయికి తెలుగు ఒక్క ముక్క రాకపోయినా మద్యం తాగాడంటే తెలుగులోనే మాట్లాడుతాడు "అంది భార్య
------------------------------------------------------------------------------------------------------------------------------- 91) " మన రాజుగారి పళ్ళు రాలేలా చిన్న రాణి కొట్టిందా ...పెద్ద రాణితో ఏమని చెప్పాడు " "చిన్నరాణి ఇంట్లో బిరియానీ తింటూ ఎముక కొరికేటప్పుడు పల్లు విరిగిందని చెప్పాడు"
------------------------------------------------------------------------------------------------------------------------------- 92) " బంగారు తట్టలో టిఫన్ పెట్టమని ఉగాదిరోజు కొత్త అల్లుడుగా మీ అత్తగారింట్లో అడిగావా ...ఆ తరువాత "
"బంగారు పళ్లెంలో టిఫన్ తిన్నతరువాత , తట్ట తీసుకొనబోతుంటే తిన్న తట్ట ఇంటి అల్లుడు ఎత్తకూడదు అంటూ మా మరదలు ఎత్తుకెళ్లింది"
------------------------------------------------------------------------------------------------------------------------------- 93) " మన పార్టీనాయకుడికి సభ్యులమీద చాలా కోపం వచ్చిందా ఎందుకు " "సభ్యులందరిలోనూ కులం మతం గొడవలు జరుగుతున్నందువల్ల "
"మన పార్టీ నాయకుడు ఏం చెప్పాడు"
"కులం,మతం లేని చోటుకు వెళ్తానని వెళ్ళిపోయాడు. ఎవరు పిలిచినా రావడం లేదు "
" అయ్యయ్యో ...అడవికి వెళ్లాడా "
"అడవికి కాదు కులం మతం లేని చోటు అదే... బ్రాందీ షాప్ కు. "
------------------------------------------------------------------------------------------------------------------------------- 94) " ఈ ఒక్క రోజు లాక్ డౌన్ సడలించారా ... ఈ రోజు గుడి తెరుస్తున్నారా ... గుడి మసీదు , చర్చిలు తెరుస్తారా "
" నాకు గుడి అంటే మద్యం అంగడి " సంతోషంతో అన్నాడు తాగుబోతు
------------------------------------------------------------------------------------------------------------------------------- 95) "నోరు తెరుచుకొన్నప్పుడు నీ కడుపులోనికి నాగుపాము పిల్ల వెళ్లిందా ... ఈ పట్టణంలోనున్న ప్రకృతి వైద్యుడి దగ్గరకెళ్ళావా ...నాగస్వరం ఊదాడా "
“ మినీ స్పీకర్ నా నోటిలో ఉంచి నాగస్వరం ఊదగానే పాము బయటకు వచ్చింది "
------------------------------------------------------------------------------------------------------------------------------- 96) “మన రాజుగారు యుద్ధంలో సులభంగా గెలిచారా ఎలాగ ...”
“ఎన్నికల్లో ఓటుకు నోటు ఇచ్చి గెలిచినట్లు మన రాజుగారు శత్రుసైనికులకు బంగారు నాణెములు ఇచ్చి ఆయుధములు తీసుకొన్నారు”
------------------------------------------------------------------------------------------------------------------------------- 97) “ ఆ డాక్టరు తెలివిలేని డాక్టరా ....ఎలా చెప్పగలుగుతున్నావు "
“ నడుమునొప్పి అని వెళ్తే పండుగరోజు ముగ్గులు వెయ్యద్దు అని తెలివిలేకుండా చెప్పాడు . భర్త ఉండగా భార్య ఎలా ముగ్గులు వేస్తుందని ఆలోచించలేదు "
------------------------------------------------------------------------------------------------------------------------------- 98) “మన పార్టీ నాయకుడికి కరోనా వచ్చిందా ...కరోనా రావడానికి వ్యతిరేక పార్టీ నాయకుడు కారణం అని ఇంకా ఎందుకు చెప్పలేదు "
“ ఆ వ్యతిరేక పార్టీ నాయకుడికి ఓమైక్రాన్ వచ్చిందని తెలిసింది “
------------------------------------------------------------------------------------------------------------------------------- 99) " కోవిడ్ సమయంలో దేవుడా నన్ను కాపాడు అనేవారు "
"ఓమైక్రాన్ వచ్చాక ..."
" ఓ మై గాడ్ నన్ను కాపాడు అంటున్నారు "
---------------------------------------------------------------------------------------------------------------------------
100) "నీటి కొరత వలన ఎవరూ నీళ్లు పోసుకోవడంలేదా అల్లుడూ ...మా అమ్మాయి...."
"మీ అమ్మాయి మాత్రం నీళ్లుపోసుకొంది...ఇప్పడు మూడోనెల "
---------------------------------------------------------------------------------------------------------------------------
101) "మూడవ బూస్టర్ మీ ఆవిడకు మాత్రం పని చేసిందా ...మీకు పనిచేయలేదా ..ఎలాగ " అడిగాడు డాక్టరు
" మూడవ బూస్టర్ వేసుకున్నాక మా ఆవిడ నన్ను కొట్టడం ప్రారంభించింది "
"మూడవ బూస్టర్ మీకూ పనిచేయడంవల్లనే మీ ఆవిడ కొట్టినా భరించగలుగుతున్నారు "
-------------------------------------------------------------------------------------------------------------------------
102) "మన పార్టీలో గూండాలు ఎవరూ లేరంటూ ప్రెస్ వారిముందు ప్రమాణం చేసి చెప్పాడా ...ఆ తరువాత "
"ముసుగు ధరించిన కొంతమంది మన నాయకుడిని చితకబాదారు "
" పోలీసులకు ఫిర్యాదు చేశారా ..."
"మన పార్టీ గూండాలపై ఎలా ఫిర్యాదు చేస్తారు ... "
పంపినవారు : ఓట్ర ప్రకాష్ రావు
ప్రచురించిన తేదీ : 28/02/2022
-------------------------------------------------------------------------------------------------------------------------------
103. “మీ ఊరిలో అందరూ కోవిద్ వాక్సినేషన్ వేసుకొన్నారా ...ఏం చెబితే వేసుకొన్నారు “ “ "రాబోయే ఎన్నికలలో ఇంజక్ట్షన్ వేసుకొన్నవారికే ఓటు వేయడానికి అనుమతిస్తామని మా ఊరి అధికారి చెప్పారు "
“ ఊరి ప్రజలకు ఎన్నికలలో మంచివారిని ఎన్నుకోవాలన్న శ్రద్దనా ...."
“ అలాంటిదేమీ లేదు మా ఊరి వారికి ఓటుకు నోటు తీసుకొనడంలో శ్రద్ద “
------------------------------------------------------------------------------------------------------------------------------- 104. " మీ వారిని కొట్టడం మీరు మానుకొంటే ఆయన త్రాగడం మానుకొంటారు "అన్నాడు డాక్టర్ "భర్తను కొట్టకుండా ఉండటం మా వంశంలోని లేదు .ఆయన త్రాగుడు మానడానికి వేరే మార్గం ఉంటే చూడండి డాక్టర్ "
-------------------------- ---------------------------------------------------------------------------------------------------- 105. "మన గ్రామంలో వాడిపైన బయోపిక్ షార్ట్ ఫిలిం తీయాలని ఆ జర్నలిస్ట్ అనుకోనున్నాడా అంత గొప్ప చరిత్ర అతనిలో ఏముంది"
"వాడొక్కడే మన గ్రామంలో ఓటుకు నోటు తీసుకోనివాడంట "
---------------------------- -------------------------------------------------------------------------------------------------- 106. " మా వారిమీద ప్రమాణం చేసి చెబుతున్నాను .ఆ చెత్తను మీ ఇంటిముందు నేను పోయలేదు "
"నువ్వు ఇల్లే ఊడవవని ఈ ఊరివారందరికీ తెలుసు. మీ ఆయనను పిలిచి నీ మీద ప్రమాణం చేసి చెప్పమని చూద్దాం "
" ? ? ? “
------------------------------ ------------------------------------------------------------------------------------------------ 107. "డాక్టర్ పది సంవత్సరాలకు ముందు ఈ ఊరికి వచ్చి మా బంధువులింటికి వెళ్లిన తరువాత ఈ రోజు వచ్చాను .ఇల్లు గుర్తు రావడం లేదు .మీరు మతిమరుపు పోగొట్టే డాక్టర్ అని బయట బోర్డు చూసి తెసులుకోని వచ్చాను .నాకు జ్ఞాపక శక్తీ తెప్పించారంటే వాడింటికి వెళ్తాను " డాక్టర్ అడిగిన ఫీజు ఇచ్చాడు
" సిస్టర్ అతని బందువుపేరు..వయసు కుటుంబ సభ్యుల పేర్లు తీసుకొని గూగుల్ లో వెతికి అతని చిరునామా తెలుసుకొని చెప్పండి." అంటూ ప్రక్కనున్న సిస్టర్ తో చెప్పాడు
----------------------- ------------------------------------------------------------------------------------------------------- 108. “ రాముడు నలభయ్ ఐదు రూపాయలు తీసుకొన్నాడు .మరుసటినెల వంద రూపాయలు తిరిగి ఇస్తే రాముడు చేతికి అతను ఎంత తిరిగి ఇస్తాడు “ అడిగాడు మాస్టారు
“ వడ్డీ ఐదురూపాయలు తీసుకొని మిగిలిన యాభై రూపాయలు ఇస్తాడు సార్ ."అన్నాడు వడ్డీ వ్యాపారి కొడుకు
“కమిషన్ ఐదురూపాయలు తీసుకొని మిగిలిన యాభై రూపాయలు ఇస్తాడు సార్ "అన్నాడు లంచం తీసుకొనే ఉద్యోగి కొడుకు
“ పార్టీ నిధికి యాభై తీసుకొని మిగిలిన ఐదు రూపాయలు ఇస్తాడు సార్ "అన్నాడు రాజకీయ వ్యక్తి కొడుకు
------------------------------------------------------------------------------------------------------------------------------ 109. "మల్లెపూల దండ కన్నా విడిపూలు ధర తక్కువగా ఉందా ... ఇప్పుడెందుకు చెబుతున్నావు " అడిగాడు శోభనపు పెళ్ళికొడుకు
"ముందు మల్లె పూల దండ కట్టి తలలో పెట్టుకోవాలి ..పూల దండ కట్టడానికి రెండు రెండు పువ్వులుగా ఉంచి ఇవ్వండి నేను దండ కడతాను "అంటూ పళ్లెంలో విడిపూలను అతని ముందు వుంచింది కొత్త పెళ్లి కూతురు.
-------------------------------- ---------------------------------------------------------------------------------------------- 110. "మన నాయకుడిని జైలునుండి విడుదల చేస్తే వద్దన్నాడా ...ఎందుకూ "
"ఈ రోజుతో తొంబై ఆరు రోజులు అవుతుందా ... ఇంకొక నాలుగు రోజులతరువాత వంద రోజుల పండుగ జరుపుకొని వెళ్తానంటున్నాడు "
------------------------------------------------------------------------------------------------------------------------------- 111. “ రాజా మన ఖజానా ఖాళీ అయింది ..ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు “
"వచ్చే వారం అన్ని రాజ్యాలలో రిలీజు చేయాలనుకొంటున్న ఆ సినిమాను మన రాజ్యంలో ఈ వారం రిలీజు అయ్యేలా చూడండి "
-------------------------------------------------------------------------------------------------------------------------------
112. “ఎన్నికల కోసం పార్టీల కూటమి చర్చలు ముగిసినట్లుంది ...బిరియాని ,మందు పంచుతున్నారు "
"ఇంకా ముగియలేదు ...వారి చర్చలు ప్రారంభించి యాభై రోజులు పూర్తయిన సందర్భముగా మందు బిరియాని పంచారు "
-------------------------------------------------------------------------------------------------------------------------
113. శోభనం రోజు భార్య గదిలోనికి ప్రవేశించి "ఈ గది అంతా మా నాన్న అలంకరించారు. నన్ను మా అమ్మ అలంకరించింది " అంటూ తలలోని మల్లె పూల దండను టేబుల్ మీదుంచింది .
"మీ నాన్న ఇంత పిసినారి అనుకోలేదు. పరువు దిండు మరకలు కాకూడదని ప్లాస్టిక్ పేపర్లతో కప్పి ఉంచాడు . మీ అమ్మ ఎలాగ "అడిగాడు
"మల్లెపూల ధర ఎక్కువగా ఉందని ప్లాస్టిక్ మల్లెపూల దండ తలలో పెట్టి పంపింది " అంది భార్య
-------------------------------------------------------------------------------------------------------------------------------114. "మీఅబ్బాయిని ఐ పీ ఎస్ అధికారి చేస్తానని చెప్పి పాతిక లక్షలు లంచం తీసుకున్నాడా ...తరువాత"
"మా అబ్బాయిని ఐ పీ ఎస్ అధికారిగా హీరో పాత్ర ఇచ్చి ఒక షార్ట్ ఫిలిం తీసి యూట్యూబ్ లో రిలీజ్ చేసాడు "
-------------------------------------------------------------------------------------------------------------------------------
115. "అల్లుడూ ఈ ఉగాదికి కొత్తగా పెళ్ళైన నీవు నా కూతురు మా ఊరికి వస్తారనుకొన్నాను . మా ఊరిలో ఉగాది పండుగకు కెసినో ఆరంభిస్తారని తెలియగానే మేమే ఇక్కడకు వచ్చాము" అంది అత్తయ్య
" మీరు నా మీద ఇలా అనుమాన పడటం మంచిది కాదు" కోపంగా అన్నాడు అల్లుడు
" మీ మీద పూర్తిగా నమ్మకం వుంది అల్లుడూ, .మీ మామయ్యా మీద నమ్మకం లేక ఆయనతో కలసి వచ్చాను "చెప్పింది అత్తయ్య
------------------------------------------------------------------------------------------------------------------------------- 116. “దెయ్యం సినిమాలు తీసే దర్శకుడిని పెళ్లి చేసుకొన్నావా ... ఆయన నీతో ఎలా ప్రవర్తిస్తుంటారు “
“ దెయ్యం సినిమాలోలాగా ఎప్పుడూ జోకులు వేస్తుంటాడు .... “
-------------------------------------------------------------------------------------------------------------------------------
117. " అయ్యా ముహూర్తం దగ్గరపడింది పెళ్ళికొడుకుని తీసుకొని రండి " అన్నాడు పురోహితుడు
" లాక్ డౌన్ వలన ఇక్కడకు రావడానికి మరో గంట పడుతుందని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు " " ఇది చాలా మంచి ముహూర్తం . ఆన్ లైన్ లో పెళ్లి జరిపిస్తాను టాబ్ తీసుకొనిరండి "
------------------------------------------------------------------------------------------------------------------------------- 118. "మన నాయకుడు గ్రానైట్ రాయి కుంభకోణంలో చిక్కుకున్నాడా ...చాలా జాగ్రత్తగానే ఉంటాడే ఎలా దొరికాడు "
"అతని కిడ్నీలో గ్రానైట్ రాళ్లు దొరికాయంట"
-------------------------------------------------------------------------------------------------------------------------------
119. “మామయ్యా ఈ ఉగాదికి మీకు కొత్త సంవత్సరం ఉగాది పంచాంగం పుస్తకం తెస్తున్నాను " "నీవడిగిన స్కూటర్ ,బంగారు చైన్ , దుస్తులు కొన్నాను . ఇక నాకు పంచాంగం చదివి నా జాతకం తెలుసుకోవలసిన అవసరం లెదల్లుడూ.నీవు మాస్క్ వేసుకొని వస్తే అదే పదివేలు “
పంపినవారు : ఓట్ర ప్రకాష్ రావు
ప్రచురించిన తేదీ : 20/03/2022
-------------------------------------------------------------------------------------------------------------------------------
వెంకి అలియాస్ వెంకటేశ్వర్లు తన లీవ్ ముగించుకొని మరుసటి రోజు యధావిధిగా ఆఫీస్కి వెళ్లాడు. తన సీట్లో కూర్చొ పోతుంటే ప్యూన్ వచ్చి "మేనేజర్ గారు రమ్మంటున్నారు" అని చావు కబురు చల్లగా చెప్పి వెళ్ళాడు.
మళ్లీ ఏం కొంప మునిగింది అని కాళ్ళలో వణుకు ప్యాంట్ కింద దాచుకుంటూ మేనేజర్ రూంలోకి వెళ్ళాడు. తనకేసి ఎగాదిగా చూస్తున్న మేనేజర్ ను చూస్తూ"వీడి ముఖం మండ!వీడు...వీడి చిల్లీ ఫేసు...కాస్త చిల్ గా ఉండొచ్చు కదా! " అనుకున్నాడు మనసులో..,
"ఏమయ్యా!వెంకీ..లీవ్ పెట్టే ముందు రోజే నాకు ఇన్ ఫార్మ్ చేయాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి" కోపంగా అరుస్తున్న బాస్ అరుపుకి ఈ లోకంలోకి వచ్చి, "సారీ సార్!మా ఆవిడకి వంట్లో బాగాలేదు . ఇంటిపనికి , వంటపనికి లీవ్ పెట్టక తప్పలేదు"అంటూ మెల్లిగా నసిగాడు వెంకీ.
"నేను అడుగుతున్నదేంటీ, నువ్వు చెప్తున్నదెంటీ? అయినా ఆడంగిలా ఇంటిపని, వంట పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు. పోనీ..నీ ఖర్మ చేసావే పో...ఆ తర్వాతైనా నీ పనులన్నీ అయ్యాక, ఆఫీస్ అవర్స్ తర్వాతనైనా నాకు కాల్ చేసి చెప్పాలన్న ఙ్ఞానం లేదా?" అంటూ అరిచాడు మరింత కోపంగా!
"అదే విషయం చెబుదామని మార్నింగ్ మీకు కాల్ చేశాను సార్! కానీ,మీరు బట్టలు ఉతుకుతున్నారని, తర్వాత కాల్ చేయమని మేడం గారే చెప్పారండి " అంటూ అమాయకంగా అంటున్న వెంకీని తెల్లబోయి చూడటం తప్ప పాపం! మేనేజర్ మాత్రం ఏం చేయగలడు. ��������!!?
పంపినవారు : పద్మావతి తల్లోజు
ప్రచురించిన తేదీ : 20/03/2022
-------------------------------------------------------------------------------------------------------------------------------
Comments