top of page
Mana Telugu Kathalu - Admin

జోక్స్ - 2


Jokes Published By manatelugukathalu.com











1) " అన్నయ్యకు మతిమరుపు ఎక్కువని కారం పొడి తెమ్మని చెబుతూ, గుర్తుండటానికి చేతిలో పిడికెడు కారంపొడి ఇచ్చిపంపడం మంచిదయిందా .... జ్ఞాపకం పెట్టుకొని తెచ్చారా వదినా" అడిగింది పక్కింటావిడ.

"మరచిపోయారు కానీ , రోడ్లో ఎవడో రౌడీ వెధవ కత్తి చూపెట్టి ఒక అమ్మాయిని బయపెట్టుతుంటే మా అయన వాడికంట్లో కారంపొడి చల్లగానే అందరూ ఒక్కసారిగా ఆ రౌడీని పట్టుకొని ఉతికేశారట . కారంపొడి చేతులో ఎందుకు తీసుకొనివచ్చావని అక్కడివారడిగితే గుర్తురాక బుర్ర గోక్కున్నాడట " అంది.

*** *** ***

2 ) “కంప్యూటర్ జాతకం ఏమని సమాధానమిచ్చింది"

“ అమ్మాయి అబ్బాయి పాన్ కార్డు జాతకాలు బాగా కలిసిందట,పెళ్ళైతే వారికీ డబ్బే డబ్బు ...

కానీ ఆధార్ కార్డు జాతకాలు సరిగ్గా కలవలేదు .పెళ్ళైతే వారికీ గొడవలే గొడవలు “ *** *** ***

3) " పబ్ లో వారందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తే, జడ్జిగారు అందరినీ పబ్ కు ఎందుకెళ్లావని అడిగారా. అందరిలా నీవూ ఒక అబద్దం చెబితే, నీవు అందరికన్నా పెద్ద అబద్దం చెప్పావంటూ నీకు పెద్ద శిక్ష వేసారా. నీవేమని చెప్పావు "

"అంబిలి తాగడానికి పబ్ కు వెళ్ళనని చెప్పాను "

*** *** ***

4) “మీ పీ టీ మాస్టర్ మీకు ఎటువంటి గేమ్స్ నేర్పించారు " అడిగాడు అధికారి

“వీడియో గేమ్స్ "తరగతి పిల్లలందరూ ఒక్కసారిగా సమాధానమిచ్చారు.

*** *** ***

5) “స్వర్గంలో టూ వీలర్స్ నడపడం నిషేదించారా ...పెట్రోల్ ధర పెరిగినందుకా” “ అందుకు కాదు . నడవడం మరచి ఎప్పుడూ వెహికల్స్ లో వెళ్లడం వలన చాలామందికి చక్కర వ్యాధి వచ్చిందట “

*** *** ***

6) “నీవు గవర్నర్ అయితే మంత్రుల పదవీ ప్రమాణాన్ని రద్దు చేస్తావా ... ఎందుకూ” “చాలా మంది మంత్రులు అలా నడచుకోవడం లేదుగా “

*** *** ***

7) " యువరానర్ నా క్లయింట్ హంతకుడు కాడు. అతని చేతిలోని కత్తిని ఆమె బలవంతంగా తీసుకొని తన వీపులో తానే పొడుచుకొని చనిపోయింది "

"ఇంకొక్కమాట మాట్లాడావంటే నీకు జైలు శిక్షావిధిస్తాను "లాయర్ వైపు చూస్తూ కోపంగా అన్నారు జడ్జి

*** *** ***

8) "మనిషి నవ్వడంవలన గుండె వేగంగా కొట్టుకోవడం తగ్గుతుందన్నారు .పెట్రోల్ ధర తగ్గాలంటే ? "

"మీ కేసు మంత్రిగారికి ఫార్వర్డ్ చేస్తాను వెళ్లి అడగండి "అంటూ సమాధానమిచ్చాడు డాక్టర్.

*** *** ***

9) " నిదురపోవడానికి ముందు పావుగంట నడవాలని చెప్పారు . మా ఆఫీసులో నడవడానికి స్థలం లేదు డాక్టర్ “

"మీరున్న సీటులోంచి లేచి నిలబడి అక్కడే మెల్లగా జాగింగ్ చెయ్యండి”


పంపినవారు: ఓట్ర ప్రకాష్ రావు


ప్రచురించిన తేదీ: 01/05/2022

-------------------------------------------------------------------------------------------------------------------------------

10) కోవై సరళ: ఏమండీ! మర్చిపోయారా! ఈ ఉగాదికి నాకు మామిడి పిందెల హారం చేయిస్తామన్నారు... (గోముగా అడిగింది)

బ్రహ్మానందం: ఇదిగో...తెచ్చానే తీసుకో...పండగ చేస్కో! (అన్నాడు జాలీగా హారం పైకి విసిరేస్తూ) కోవై సరళ: ఇదేంటి? నేనడిగింది బంగారు హారం... మామిడి పిందెలను దారంతో కుట్టింది కాదు..( కోపంగా)

బ్రహ్మానందం: ఓ రోజు సుస్తిగా ఉంది.. ఏదైనా పండ్ల రసం తెమ్మంటే నువ్వేం తెచ్చావే?చింతపండు రసం! పైగా చింతపండు మాత్రం పండు కాదా... అని సెటైర్ ఒకటి! చూడు ఇది మాత్రం హారం కాదా?

కోవై సరళ: !!!?

*** *** ***

11) సూర్యుడు: చూసావా చంద్ర... పగలు నేను, రాత్ర నువ్వు సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నామా?అసలు మన కష్టం గుర్తించే వాళ్ళే లేకుండా పోయారు. మనకిదేం ఖర్మయ్యా!

చంద్రుడు: మరీ అంత బాధ పడకు సూర్య! వాళ్ళచేతుల్లో చూసావా.. వాటిని మొబైల్స్ అంటారు. ఇంతకు మునుపు వాళ్లకు చీకటైతే నిద్ర వచ్చేది. ఇప్పుడు మొబైల్ డాటా అయిపోతేగాని నిద్ర పోవాలన్న ఆలోచన రాదు. వాళ్ళను అని ఏం లాభం... ఆ మొబైల్ ఫోన్ కనిపెట్టిన వాణ్ణి అనాలి. ప్చ్.....!!

*** *** ***

12) వెంకి అలియాస్ వెంకటేశ్వర్లు తన లీవ్ ముగించుకొని మరుసటి రోజు యధావిధిగా ఆఫీస్కి వెళ్లాడు. తన సీట్లో కూర్చోబోతుంటే ప్యూన్ వచ్చి "మేనేజర్ గారు రమ్మంటున్నారు" అని చావు కబురు చల్లగా చెప్పి వెళ్ళాడు.

మళ్లీ ఏం కొంప మునిగింది అని కాళ్ళలో వణుకు ప్యాంట్ కింద దాచుకుంటూ మేనేజర్ రూంలోకి వెళ్ళాడు.

తనకేసి ఎగాదిగా చూస్తున్న మేనేజర్ ను చూస్తూ "వీడి ముఖం మండ! వీడు... వీడి చిల్లీ ఫేసు... కాస్త చిల్ గా ఉండొచ్చు కదా! " అనుకున్నాడు మనసులో..,

"ఏమయ్యావెంకీ! లీవ్ పెట్టే ముందు రోజే నాకు ఇన్ ఫార్మ్ చేయాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి" కోపంగా అరుస్తున్న బాస్ అరుపుకి ఈ లోకంలోకి వచ్చి, "సారీ సార్! మా ఆవిడకి వంట్లో బాగాలేదు. ఇంటిపనికి , వంటపనికి లీవ్ పెట్టక తప్పలేదు" అంటూ మెల్లిగా నసిగాడు వెంకీ.

"నేను అడుగుతున్నదేంటీ, నువ్వు చెప్తున్నదెంటీ? అయినా ఆడంగిలా ఇంటిపని, వంట పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు? పోనీ..నీ ఖర్మ చేసావే పో... ఆ తర్వాతైనా నీ పనులన్నీ అయ్యాక, ఆఫీస్ అవర్స్ తర్వాతనైనా నాకు కాల్ చేసి చెప్పాలన్న ఙ్ఞానం లేదా?" అంటూ అరిచాడు మరింత కోపంగా!

"అదే విషయం చెబుదామని మార్నింగ్ మీకు కాల్ చేశాను సార్! కానీ, మీరు బట్టలు ఉతుకుతున్నారని, తర్వాత కాల్ చేయమని మేడం గారే చెప్పారండి " అంటూ అమాయకంగా అంటున్న వెంకీని తెల్లబోయి చూడటం తప్ప పాపం! మేనేజర్ మాత్రం ఏం చేయగలడు. ��������!!?

*** *** ***

ప్రచురించిన తేదీ: 16/05/2022

పంపినవారు: పద్మావతి తల్లోజు

-------------------------------------------------------------------------------------------------------------------------------

13) వంద జంటలు విడిపోకుండా కలిపి "జిగురు రత్న"అవార్డుకు ఎంపికయ్యాడు లాయర్ బంక గుర్నాథం.

"కనీసం ఈ రోజైనా మీ విజయ రహస్యమేంటో చెప్పాల్సిందే..."అంటూ పట్టుబట్టారు జర్నలిస్టులు.

"ఏముందండీ!నేను అందరి లాయర్లలా ఆర్నెల్లు కలిసి వుండండి... లాంటి రొటీన్ డైలాగులు చెప్పను. ఒక్కరోజు మీ భార్యను షాపింగ్ తీసుకెళ్ళండి. క్రెడిట్, డెబిట్ కార్డులు పాస్ వర్డ్స్ తో సహా ఆమెకు హ్యాండ్ ఓవర్ చేయండని చెబుతాను. ఆ సూత్రంతో విడాకుల కోసం నా దగ్గరికి వచ్చిన ఏ ఒక్క జంట ఇప్పటి వరకు విడిపోయింది లేదు" కళ్ళెగరేస్తూ గర్వంగా చెప్పాడు గుర్నాథం. హాట్స్ ఆఫ్ టూ యు... బంక గుర్నాథం!

������

*** *** ***

14) "మా ఆవిడతో వేగలేకపోతున్నా... సుబ్బారావ్! మానసిక ప్రశాంతతకు మెడిటేషన్ ఎలా చేయాలో నాకు నేర్పుతావా?" అని అడిగాడు అప్పారావు, యోగా చేస్తున్న తన ఫ్రెండ్ సుబ్బారావును.

"మొదట ప్రశాంతంగా కళ్లు మూసుకోవాలి. శ్వాస మీదే మన ధ్యాస ఉంచాలి. అలా పది నిమిషాలు గడిచాక.. నెమ్మదిగా కళ్ళు తెరిచి... ఆ తర్వాత మీ భార్య ఏం చెబితే అది వినాలి. అప్పుడే నీకు మానసిక ప్రశాంతత" అని కూల్ గా చెప్పడం ముగించాడు సుబ్బారావు.

*** *** ***

15) హాస్య కవిత


అంతర్జాలంలో పరిచయమై ఆలుమగలుగా మారాలనుకున్న ఇద్దరి ప్రేమకథ ఇది. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా.. అనేంతగా ఉన్న ఊరును, కన్నవాల్లను వదిలేసి ఋతువులెన్ని మారినా, ఎవరు తమను కాదన్నా ఏకమైన ప్రేమలా, ఎడబాటులేక ఐకమత్యంగా ఉండాలనుకున్నారు.

ఒకసారి ఏకాంతంలో కలుద్దాం ఓకేనా.. అడిగాడు అబ్బాయి..

ఔను..కలుద్దాం అంది అమ్మాయి!

అందగత్తె స్థానంలో అరవై ఏళ్ల బామ్మని

కండలవీరుడుకాక, కాటికి వెళ్ళే ముసలోన్ని చూసి ఖంగుతిన్నారిద్దరూ...!

అంతర్జాలం ఏమి గతి పట్టించిందంటూ...వగచి ,

ఇలాంటి ఘరానా మోసగాళ్లను నమ్మొద్దంటూ

మంచి జ్ఞానోపదేశాన్ని అంతర్జాలంలో పొందుపరిచారు!!

*** *** ***

16) "ఒసేయ్ కాంతం! పప్పులో ఉప్పు వేసావా? ఉప్పులో పప్పేసావా" అంటూ ఒళ్ళు మండి అరిచాడు హాల్లో టీవీ చూస్తూ భోజనం చేస్తున్న రామారావు.

"ఫ్లూటు జింక ముందు ఊదు. సింహం ముందు కాదు" అంటూ టీవీ లో బాలయ్య బాబు డైలాగ్,

"ఏంటి గొంతు లేస్తుంది" అని కాంతం అరుపు.. రీమిక్స్ లో ఒకే సారి వినిపించాయి రామారావుకి.

పై ప్రాణాలు పైనే పోయాయి.

"ఏం లేదు బంగారం! పప్పు ఇంత బాగా చేయడం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాను అంతే!" అంటూ..గబగబా అన్నం గొంతులో కుక్కేసి, బ్రతుక జీవుడా...! అనుకుంటూ అక్కడి నుండి పారిపోయాడు రామారావు.

ప్రచురించిన తేదీ: 17/05/2022

పంపినవారు: పద్మావతి తల్లోజు

-------------------------------------------------------------------------------------------------------------------------------

17) పార్క్ లో ఓ ప్రేమ జంట కబుర్లు...

"రాజ్! నీ గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో చెప్పవా?" అంటూ బుంగమూతి పెట్టి అడిగింది స్వీటీ.

"నాకు గుడ్ హ్యాబిట్స్ లెక్క లేనన్ని ఉన్నాయి బంగారం! కాకపోతే బ్యాడ్ హ్యాబిట్ ఒక్కటే ఉంది" అన్నాడు రాజ్ ఒకింత గర్వంగా .,

"హో...సో స్వీట్! మచ్చుకు ఒక్కోటి చెప్పవా రాజ్! ప్లీజ్ .."అంటూ అడిగింది స్వీటీ మరింతగా గారాలు పోతూ..,

"గుడ్ హ్యాబిట్ వచ్చేసి ఇంతందమైన నిన్ను, అంతే అందంగా ప్రేమించటం.."

"మరి బ్యాడ్ హ్యాబిట్...!?"ఆనందంతో లోలోపల తబ్బిబ్బవుతూ..,

"అబద్ధాలాడటం"అని నిజం చెప్పేసి తర్వాత నాలుక్కర్చుకున్నాడు రాజ్!

*** *** ***

18) భార్య: (కోపంగా)పాలు పొంగి పోయాయి. ఏం చేస్తున్నారు? వాసన తెలియడం లేదా? కొంపదీసి కరోనా గానీ వచ్చి చచ్చిందా ఏంటి? (అదే రోజు మధ్యాహ్నం భార్య సీరియల్ చూడటంలో మునిగి పోయింది. కూర మాడి పోయింది.)

భర్త: (మరింత కోపంగా) నా మీద ఊరికే అరవడం కాదు. ఇప్పుడు నువ్వు చేసిందెంటి? భార్య: అయితే, మీకు వాసన తెలుస్తోంది అన్నమాట. హమ్మయ్య! మీకు కరోనా సోకిందనుకొని ఎంత కంగారు పడిపోయానో.., (అని తాపీగా సీరియల్ చూడటంలో మునిగిపోయింది.)

*** *** ***

19) హాస్య కవిత

మతి మరుపు మనిషితో పడ్డాను ప్రేమలో

ప్రేమలో పడ్డాక కానీ తెలియలేదు కష్టమేంటో

కష్టమెంటో తెలిసినా తనపై ఇష్టం పెరిగింది

పెరిగింది ప్రేమని ఇంట్లో చెప్పి ఒప్పించా పెళ్లికై

పెళ్ళికై కొన్న పంచెను కట్టుట మరిచెను మా వారు

మా వారిని చూసి పగలబడి నవ్విరి బంధువులు

బంధువుల నవ్వుల తడబాటులో ముళ్ళు మరిచెను

మరిచి మూడు ముళ్ల స్థానంలో రెండేసి మురిసెను

మురిపాల కాపురంలో ఇలా మరిచిన వెన్నొన్నో

ఎన్నెన్నో మరిచినా సర్దుబాటు చేసుకున్నా ప్రేమతో

ప్రేమతో ఈ రోజు స్పెషలెంటనీ అడిగా ఓ రోజు

రోజులన్నీ ఒకటే స్పెషల్ రోజు ఏంటని అడిగాడు

అడిగాడు మర్చిపోయి అనుకొని చెప్పా పుట్టినరోజనీ

పుట్టినరోజని చెప్పినా కనీసం విషెస్ చెప్పడం మరిచాడు

మరిచాడు ఆ టైంలో నా చేతిలో ఉన్న అట్లకాడను

అట్లకాడే కాదు... అన్నీ గుర్తుంటున్నాయిప్పుడు!!

ప్రచురించిన తేదీ: 19/05/2022

పంపినవారు: పద్మావతి తల్లోజు

-------------------------------------------------------------------------------------------------------------------------------

20) రాజేష్ , కమలిని ఈ మధ్యే ప్రేమలో పడ్డారు. మనసువిప్పి అన్నీ మాట్లాడుకునే వారు. కానీ, ఒక్క వయసు విషయానికొస్తే కమలిని తన వయసు బయట పెట్టేది కాదు. ఎలాగోలా ఫ్రెండ్స్ ద్వారా తన పుట్టిన రోజు మాత్రం తెలుసుకోగలిగాడు రాజేష్.

తనను సర్ప్రైజ్ చేద్దామని కేకు, క్యాండిల్స్ ప్యాకెట్ తీసుకెళ్లి ఇచ్చాడు ఆ రోజు. అతన్ని చూడగానే ఆమె కళ్ళల్లో సంతోషకరమైన కన్నీళ్లు!

"సరే! ఆ కన్నీళ్లు తుడుచుకొని ఇది ఎన్నవ పుట్టినరోజో అన్ని క్యాండిల్స్ కేక్ పై పెట్టు అన్నాడు.


'ఈ రోజుతో తన వయసెంతో బయట పడి పోతుంది' అని మనసులో అనుకుంటూ..,

"వయసుతో పనేముంది రాజేష్! మన ప్రేమ పుట్టాక ఇది నాకు మొదటి పుట్టిన రోజు!"అంటూ నవ్వుతూ ఒకటే క్యాండిల్ కేక్ పై పెట్టీ వెలిగించింది కమలిని.

'ఎంత ఎమోషనల్ సిట్యుయేషన్ అయినా కూడా, ఎంత క్లారిటీ గా ఉంటారో కదా ఈ ఆడాళ్ళు!'అనుకుంటూ మనసులోనే నవ్వుకున్నాడు రాజేష్!

ప్రచురించిన తేదీ: 30/05/2022

పంపినవారు: పద్మావతి తల్లోజు

-------------------------------------------------------------------------------------------------------------------------------

21) ఉపాద్యాయుడు : జీవితంలో ఎవరూ ఎదగనంత ఎత్తుకు ఎదగాలంటే ఏమ్చేయ్యాలిరా రామూ? రాము : గిన్నిస్ బొక్క్ లోకి ఎక్కిన నిచ్చెన ఎక్కాలి సర్!

ప్రచురించిన తేదీ: 16/06/2022

పంపినవారు: కొత్తపల్లి ఉదయబాబు

-------------------------------------------------------------------------------------------------------------------------------

22) " కుటుంబ రాజకీయాలు నడపనంటూ పార్టీ ప్రారంభించారు. సొంత తమ్ముడిని పార్టీ సెక్రటరీ గా చేయడం గురించి మీ పై విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ సమాధానము ఏంటి సార్ " అడిగాడు విలేఖరి

" ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఉంటుంది కానీ తండ్రీ కొడుకుల మధ్య ఉండదు. కన్న కొడుకుకు ఆ పదవి ఇస్తే కుటుంబ రాజకీయం, నా తమ్ముడు నాకు శత్రువైనా పార్టీ బలపరచడం కోసం ఆ పదవి ఇచ్చాను " అన్నాడు పార్టీ నాయకుడు.

-------------------------------------------------------------------------------------------------------------------------------

23) ఒక ఆటో వెనుక ఇలా వ్రాసి వుంది.

“పెట్రోల్ ధరలు పెరిగినా గర్భణీ స్త్రీలకు ఉచితం. మామూలు డెలివరీ అయితే ఐదువందల రూపాయలు కానుకగా చెల్లించవలెను. సిజేరియన్ అయితే రెండు వందల రూపాయలు చెల్లించవలెను.”

ఆ ఆటో అతనికి ఇప్పుడు మంచి లాభమే.

------------------------------------------------------------------------------------------------------------------------------- 24) "ఈ పట్టణములో ఆ రాజకీయ పార్టీ వారు నిరాహార దీక్ష చేస్తే మొదట మిమ్మల్ని సంప్రదిస్తారా ...ఎందుకూ"

" నిరాహార దీక్షలో కూర్చున్నవారికి మేము పూల మాలలు వేస్తాము."

"అందరూ మాలలు వేస్తారుగా, అందులో ఏమి గొప్పతనం "

"మేము వేసే పూలమాల లోపల ఎవరికీ తెలీకుండా బిరియాని పొట్లం ఉంచి వేస్తాము "

------------------------------------------------------------------------------------------------------------------------------- 25) " మన నాయకుడు ప్రసంగిస్తూ మీరు ఊహించినది త్వరలో వస్తోంది ... త్వరలో వస్తుంది అంటూ మధ్య మధ్యలో అలా చెబుతున్నాడు ఎందుకు "

" బిరియాని పొట్లం , క్వార్ట్రర్ బాటిల్ వస్తుందని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నాడు"

------------------------------------------------------------------------------------------------------------------------------- 26) " నేనిచ్చిన ట్యూబ్ మాత్రలన్నీ పంచర్ అయిందా... ఎలా చెబుతున్నావు " అడిగాడు డాక్టరు.


"అనుమానంతో గ్లాస్ నీటిలో వేసి చూసాను . ట్యూబ్ మాత్ర పగిలి మందు బయటకు వచ్చింది. పై అధికారులకు మనం పీర్యాదు చేద్దాం డాక్టర్ " అన్నాడు అమాయకపు సైకిల్ షాప్ వ్యక్తి .


" మీరు ఆ ట్యూబ్ మాత్రలు వాడకున్నా బతకగలరు. కానీ ఫిర్యాదు చేస్తే మనమిద్దరం బతకము . ఎందుకంటె మన మంత్రి గారి బావమరిది ఆ ట్యూబ్ మాత్రల ఏజెంట్ . ఫిర్యాదు చేద్దామా "


"వద్దులెండి డాక్టర్. నాకు మామూలు మాత్రలు ఇవ్వండి " అంటున్న అతని వైపు చూస్తూ బతుకుజీవుడా అనుకొంటూ ఊపిరి పీల్చుకున్నాడు డాక్టర్ .

-------------------------------------------------------------------------------------------------------------------------------

27) " మనింటికి నిన్న వచ్చిన 'కం..టూ' వెధవలు వస్తున్నారు నాన్నా" అన్నాడు చింటూ.


" కంటూ వెధవలు ఏమిట్రా "అడిగాడు తండ్రి.

"నిన్న ముగ్గురు వచ్చినప్పుడు 'కంత్రీ' వెధవలు అన్నవుగా... ఇప్పుడు ఇద్దరే వచ్చారు కాబట్టి 'కం ..టూ' అన్నాను నాన్నా " ఆంగ్ల బాష చదువుతున్న అబ్బాయి.

-------------------------------------------------------------------------------------------------------------------------------

28) "పెళ్లి కొడుకు స్కూటర్, బైక్ మాకు అక్కరలేదు . పెట్రోల్ ధరలు భరించలేము, అని చెప్పారా! మీరు అదృష్టవంతులు వదినా "

" పెట్రోల్ లేకుండా బాటరీతో నడిపే ఈ కారు కావాలంటున్నారు " అంది బాధగా.

------------------------------------------------------------------------------------------------------------------------------- 29) " మీ ఆఫీసులో నీ సీటు ప్రక్కన వున్న కిటికీకి స్క్రీన్ వేయమంటే మీ మేనేజర్ ఒప్పుకోలేదని నీ డబ్బుతో స్క్రీన్ కొని వేసావా. నీకేమైనా పిచ్చా నీ డబ్బుతో కొని వేశావు. "

" ఆఫీసులో నేను నిదురపోతున్న సమయాన బయటివాడు ఎవడో ఒకడు వీడియో తీసి వాట్స్ అప్ నందు వైరల్ చేసి నా పరువు తీస్తున్నారు "

-----------------------------------------------------------------------------------------------------------------------------

30) "నీ పుస్తకావిష్కరణకు ఆ రాజాకీయ పార్టీ నాయకుడిని పిలిచావా, వస్తాననన్నాడా..."


" వాళ్ళ పార్టీ పేరును ఆ పుస్తకంకు పెడితే వస్తన్నన్నాడు." అన్నాడు రచయిత.

------------------------------------------------------------------------------------------------------------------------------- 31) "మీ ఇంటికి ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిపి మొత్తం తీసుకెళ్లిపోయారా ...మన మంత్రి గారేమన్నారు "

" మంత్రిగా వున్న నాకన్నా ఇంత ఎక్కువ ధనం మన పార్టీ పేరుతో సంపాదిస్తావనుకోలేదు. నా దిష్టి నీకు తగిలేటట్లుంది. వెంటనే మీ ఆవిడను పిలిచి దిష్టి తీయించుకోమని చెప్పారు ."

-------------------------------------------------------------------------------------------------------------------------------

32) " సార్ నేను టికెట్ తీసుకొన్నాను " అన్నాడు బస్సు ప్రయాణికుడు.


"తెలుసు సార్ , ఇప్పుడే పెట్రోల్ ధర పెరిగిందని చెప్పడంతో బస్సు చార్జీలు మరలా పెంచాము" అన్నాడు ప్రైవేటు బస్సు కండక్టర్.


పంపినవారు: ఓట్ర ప్రకాష్ రావు


ప్రచురించిన తేదీ: 29/06/2022

-------------------------------------------------------------------------------------------------------------------------------

😆😆😆😆😆😆😆😆🤩

"రాఘవేంద్ర హాస్యతోరణం"..1

😅😅😅😅😅😅😅😅🤩

😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡


33) "పిన్ని గారు మీ ఇంట్లో చారు ఉందా?"


"లేదమ్మా.. ఇంకా కాయలేదు."


"ఇహిహి... నేను అడిగేది మీ చారులత గురించి."


🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩


34) " ఒరేయ్.. నీ దగ్గర అగ్గి పెట్టి ఉందా?"


" ఉంది ..నాకు ఓ సిగరెట్ ఇవ్వరా.."


" రోజుకొక సిగరెట్ అంటే చాలా కష్టంరా."


" సరే నేను వెళ్తా.. రోజు ఒక అగ్గిపుల్ల ఇవ్వాలి అంటే నాకు మరీ కష్టం "


😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘


35) వెంకట్రావు చచ్చిపోవాలని స్మశానానికి వెళ్ళాడు.


అక్కడ రాము కనిపించాడు


" రాము..జీవితం మీద విరక్తి పుట్టింది రా. నేను చచ్చిపోతాను."


" నాకు చెప్పడం దేనికి ...నేను ఎప్పుడో చచ్చి పోయాను కదరా.."


అంతే... వెంకట్రావు పరిగెత్తుకొని ఇంటికొచ్చేసాడు


😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍


36) సగం తెలివితేటలు సత్తిపండు మార్కెట్ కు

వెళ్ళాడు


" జామపళ్ళు డజను ఎంతకు ఇస్తున్నారు"


" డజను 40 రూపాయలు.... అరడజను

తీసుకున్న 40 రూపాయలే..

అయితే అరడజను కొన్నవారికి ఇంకో

అర డజను ఫ్రీ!!!"

"అయితే నాకు అరడజను ఇచ్చి అరడజను ఫ్రీగా ఇవ్వండి."


ఎగిరి గంతేసిన సత్తిపండు 40 రూపాయలు అందిస్తూ అడిగాడు.

😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄


37) "హలో.. వెంకట్రావు బాగున్నావా?"

" అస్సలు బాగాలేను రా.."


"అదేంట్రా..అలా అంటావ్..!"


"అవును..ఓ పదివేలు ఉంటే పడేయ్..

కావలసినవి అన్నీ కొనుక్కుని హాయిగా ఉంటా..అప్పుడు అడుగు నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను".


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


38) "పిల్లలు.. మీరంతా హోంవర్క్ లు చేశారా? "


" అందరూ హోంవర్క్ లు చేశాం టీచర్ గారు ..

ముక్తకంఠంతో చెప్పారు పిల్లలందరూ.


"వెరీగుడ్..మీరు చాలా బుద్ధిమంతులు... ఏది... మీరంతా హోం-వర్కులు చూపించండి"


" హోం వర్క్ లు కదా టీచర్.. హోమ్ లోనే పెట్టి వచ్చేసాం." ఏక కంఠంతో చెప్పారు పిల్లలందరూ


ముఖంలో ఆశ్చర్యం మార్కు పెట్టుకున్నాడు..

ఆ టీచర్.

🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪

39) "ఒరే బావ.. నాకు పదివేలు అప్పు కావాలి

అర్జెంటురా....రేపు మధ్యాహ్నం ఇచ్చేస్తాను

రా""


"అరేరే.. నాకు రేపు మధ్యాహ్నమే అందు

తాయి ....అప్పుడైతే ఇవ్వగలనురా""



"సరే.. రేపు మధ్యాహ్నం ఎన్ని గంటలకు

ఇవ్వగలవు?"


"రేపు మధ్యాహ్నం నాకే ...'తిరిగి ఇచ్చేస్తాను'

అంటున్నావుకదా... మళ్లీ నా దగ్గర అప్పుదేనికి? ఆ డబ్బులు అలా సరిపెట్టుకో.."


😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡



40) " ఏమోయ్... ఈరోజు టిఫిన్ ఎన్ని పెసరట్లు వేశావు??"


"మూడు వేశానండి"


"నాకు ఒకటి పెట్టావు నువ్వు ఎన్ని తిన్నావు?"


" నేను ఒకటే తిన్నానండి.."


" మిగిలింది..?"


" మీరు అడిగితే పెడదామని పక్కన పెట్టాను."


" అడగకపోతే..?"


"????????????"


😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁


41) "లతా..నిన్ను నేను ప్రేమిస్తున్నాను.." అన్నాడు

రవి.


"రవీ... కుదరదు ...కిరణ్.. నిన్ననే నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు... "


"అదేలాగా.. కిరణ్ జయ ని ప్రేమిస్తున్నాడు గా..!"


" ఇదేలా సాధ్యం .. జయ..కృష్ణమూర్తి ని ప్రేమిస్తుంది కదా !!


" అవునా... ఒకప్పుడు ఆ కృష్ణమూర్తి.. నిన్ను ప్రేమించి మోసం చేసాడు కదా..!"


" అవును రవి.. ఆ జయ కూడా మొన్నటివరకు నిన్ను ప్రేమించి.."


" అది ఎందుకులే.. లతా.. ఇప్పుడు మనిద్దరం ప్రేమించుకుందామా?"


" సరే.. సతీష్ తో నేను ఒక్కసారి మాట్లాడి ఏ విషయము నీకు చెప్తాను... రవీ"... అంది లత.


" సరే అలాగే చెయ్యి..ఈ లోగా నేను కూడా రమ్య తో అటో ఇటో తేల్చి పడేస్తాను."...

అన్నాడు రవి.



😀😀😀😀😀😀 😀😀😀😀😀😀


42) రామాపురం....రచ్చబండ..పెద్దన్నరాయుడు హోదాగా గుర్రపుబండి దిగాడు. ఆ అన్న దమ్ముల ఆస్తితీర్పు ఈరోజే....


" మీ ఇద్దరు అన్నదమ్ముల కు వాటాల పంప కాలు ఒక్క పైసా ఎక్కువ తక్కువ రాకుండా... చెరొక కాగితంలో రాసి ఇస్తున్నాను... ఆ ప్రకారంగా పంచుకొని సుఖంగా ఉండండి ..." అంటూ చెరొక కాగితం ఇచ్చి వచ్చినంత హోదాగా వెళ్ళిపోయాడు.


" తెలివితక్కువ సన్నాసులు.. వాళ్లలో వాళ్లు పంచుకోకుండా.. రచ్చబండ ఎక్కారు..ఈడు.. మూడు వాటాలు వేసి ఒక వాటా నొక్కేసి

నట్టు.. ఈ తింగరబుచ్చిగాళ్లకు తెలియదు పాపం"


అంటూ పుసుక్కున ఎవరో మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం... ఆ ఇద్దరు అన్నదమ్ముల చెవిన పడింది.. ఏం చేయగలరు పాపం.. కాదంటే తల నరికేస్తారట...ఆ ఊర్లో!!??

😁😊😁😊😁😊😁😊😁😊😁😊😁

పంపినవారు: నల్లబాటి రాఘవేంద్రరావు


ప్రచురించిన తేదీ: 29/06/2022

-------------------------------------------------------------------------------------------------------------------------------


 🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩                                                                   రాఘవేంద్ర  హాస్యతోరణం-2

             

🤪🤪🤪🤪🤪🤪🤪🤪🤪

        

              

43) హలో మీ స్వీట్ స్టాల్ లో ఏమున్నాయి?


అన్ని..ఉన్నాయండి.


మరి.. ఈగలు లేవేమిటి?.. ఆలాంటి షాపు ఎక్కడ ఉంది?

అదేమిటలా అడుగుతున్నారు..?


ఏం లేదు ఈ స్వీట్స్ మా శత్రువుకి పట్టుకెళ్ళాలి.

-------------------------------------------------------------------------------------------------------------------------------


44). గురునాథం.. ఈరోజు నుండి సిగరెట్టు ముట్టుకోనని ప్రతిజ్ఞ చేసేవంట ఏమిటి??


అవును నిజమే మా పెద్ద మనవడు సిగరెట్ నా నోట్లో పెడతానన్నాడు..

చిన్న మనవడు అగ్గిపుల్లతో వెలిగిస్తా నన్నాడు.

-------------------------------------------------------------------------------------------------------------------------------


45). బీరకాయలు కేజీ ఎంత అండి?

బేరం ఆడకపోతే 30 రూపాయలoడి.


బేరమాడితే...


బేరం ఆడితే 20 రూపాయలకే ఇస్తానండి.


బేరం ఆడడం మా ఇంటా వంటా లేదు .

ఒక కేజీ ఇవ్వండి.

-------------------------------------------------------------------------------------------------------------------------------


46) నమస్తే సార్.. బయట బోర్డు ఇచ్చట సన్మానములు చేయబడును..... అని ఉంది.


మీరు ఎందులో టాలెంటు..?


ఎందులోనూ కాదు. మీరే ఎందులో ఒక దానిలో ఇవ్వచ్చుగా..


సరే.. లోపలికి రండి.


అదేమిటి చెప్పుతో దెబ్బలు కొడుతున్నారు..?


అన్నిటిలో అందరికీ ఇచ్చేశాo. ఇది ఒక్కటే మిగిలింది. చెప్పుదెబ్బలు తినడం లో మీకే ఫస్ట్ బహుమతి.. సన్మానం..!

-------------------------------------------------------------------------------------------------------------------------------


47) స్వాతంత్ర దినోత్సవం ముగ్గుల పోటీలకు ఆ గ్రౌండ్లో ఆడవాళ్ళు అందరూ తమకు కేటాయించిన భాగాల్లో రంగు రంగుల ముగ్గులు వేస్తున్నారు.


సడన్ గా పెద్ద గాలి దుమ్ము వచ్చి, అందరి ముగ్గులు గత్తర బిత్తర అయి పోయాయి.


ఇచ్చిన టైం అయిపోవడంతో చివర్లో బహుమతులు ఈ విధంగా ప్రకటించారు


1. ఉత్తమ ప్రథమ చెత్త ముగ్గు

2. ఉత్తమ ద్వితీయ చెత్త ముగ్గు

3. ఉత్తమ తృతీయ చెత్త ముగ్గు.



పంపినవారు: నల్లబాటి రాఘవేంద్రరావు


ప్రచురించిన తేదీ: 26/07/202

-------------------------------------------------------------------------------------------------------------------------------

48) "మన మంత్రి గారికి జెయింట్ వీల్ నచ్చదా ...ఎందుకూ "



" ఎంత పైకి వెళ్లినా మరలా కిందికి వస్తుందట"

-------------------------------------------------------------------------------------------------------------------------------

49) " సినిమా చూడటానికి వెళ్లి తిరిగి వచ్చేసావు టికెట్ దొరకలేదా"

" మన మధ్యతరగతి వారికి టికెట్లు లేవని తెలుసుకొని తిరిగివచ్చాను "

" మధ్యతరగతి వారికి లేవా... ఎవరు చెప్పారు"

" హై క్లాస్ టికెట్ ,లో క్లాస్ టికెట్ అని వుంది మిడిల్ క్లాస్ టికెట్ లేవు "

-------------------------------------------------------------------------------------------------------------------------------

50) “మా కోడలు కొట్టిందంటే మొదట్లో ఒక్క క్షణం కళ్ళు తిరిగినట్లు అనిపించేది "

"ఇప్పుడు ."

" ఆలవాటయిపోయినందువల్ల కొడుతున్నా కళ్ళు తిరగడంలేదు, "

" అంటే ఇప్పుడూ కొడుతుంటుందా ...ఈ వయసులో ఎలా భరిస్తున్నావు "

" కొడుతున్నది నన్ను కాదు ... మా అబ్బాయిని "

-------------------------------------------------------------------------------------------------------------------------------

51) "మన మంత్రి గురించి మీకు తెలిసింది వ్రాయమని పరీక్షలో అడగడం తప్పయిందా..ఎందుకూ ?

"మంత్రి గారు ఓటుకు నోటు ఇచ్చి గెలిచారు అని చాలామంది వ్రాసారు"

-------------------------------------------------------------------------------------------------------------------------------

52) " మీ ప్రైవేట్ బడిలో పిల్లలకు శని ఆదివారాల్లో మాత్రం చెయ్యమని చెప్తారా హోమ్ వర్క్ " "మా బడిలో చదివే పిల్లల తల్లితండ్రులు చాలామంది వర్క్ ట్ హోమ్ పనిలో సోమ వారం నుండి శుక్రవారం వరకు ఉంటారట .హోమ్ వర్క్ ఇవ్వద్దని తల్లితండ్రులు అడగడం వలన " -------------------------------------------------------------------------------------------------------------------------------

53) “క్రికెట్ అంపైరుగా పని చేస్తున్న మీకు డీ విటమిన్ లోపమా, ప్రతిరోజూ ఎండలో నిలబడమని చెప్పారా... ఆశ్చర్యంగా వుందే...డాక్టరు చెపింది నిజమనిపించడంలేదే "

" డాక్టరు చెప్పింది నిజమే. నేను క్రికెట్ ఆటలో థర్డ్ అంపైర్ గా ఏ సి గదిలో కూర్చొని పనిచేస్తుంటాను"

-------------------------------------------------------------------------------------------------------------------------------

54) " వీడియో గేమ్స్ ఆడటం వలన బరువు తగ్గలేదని డాక్టరుతో చెప్పవా ...డాక్టరు ఏమన్నాడు " " అలాగే ఆ వీడియో గేమ్స్ ఆడితే తగ్గుతావని చెప్పాడు ".

" ఎలాగా "

"తొందరలో ఏదో ఒక జబ్బు వస్తుంది అప్పుడు బరువు తగ్గుతావని చెప్పారు " -------------------------------------------------------------------------------------------------------------------------------

55)" మన నాయకుడు పైన చెప్పులు విసిరివేసినందుకు బాధపడలేదా, మరెందుకు బాధపడుతున్నారు ? "

"బిక్షగాళ్లు తమ దగ్గరున్న చిల్లర నాణేలను ఆయన పైన విసిరివేశారంట " -------------------------------------------------------------------------------------------------------------------------------

56) "వాడికి నడుమునొప్పి ఇప్పట్లో తగ్గదా, ఎలా చెబుతున్నారు డాక్టర్ "

" వాడు రాజకీయ పార్టీలో వున్నాడు . పార్టీ నాయకులు వచినప్పుడు మెప్పుకోసం వంగి వంగి కాళ్ళమీద పడుతున్నాడు . వంగకూడదు చెప్పినా వినిపించుకోవడం లేదు . కాళ్లమీద పడకుంటె నాకు పార్టీలో భవిష్యత్తు ఉండదు అని ఏడుస్తున్నాడు . సరే నీవు నడుమునొప్పితోనే ఏడువ్ అని వదిలేసాను"

-------------------------------------------------------------------------------------------------------------------------------

57 ) "మీ మంత్రి గారు ఎన్నికల ముందు మీ ఊరి వారందరినీ మార్చివేస్తానన్నాడు .ఎలా మార్చాడు"

" మా ఊరు వారందరూ తాగుబోతుల్లా తయారయ్యేలా మద్యం షాపు తెరిచారు " -------------------------------------------------------------------------------------------------------------------------------

58 ) "మీ ఆవిడకు తెలీకుండా నేను వంట గదిలో దాచుకొంటాను .నీవు ఎక్కడ దాచుకుంటావు " "నా దగ్గర దాచుకొనడానికి డబ్బులు ఎక్కడుంది .జీతం రోజు ఇంటికి రాగానే జేబులోవున్న డబ్బంతా తీసుకొంటుందిగా " కోపంగా సమాధానం ఇచ్చాడు.

-------------------------------------------------------------------------------------------------------------------------------

59 ) "సార్ మీ ఇల్లు ఎక్కడుంది"

"మా ఇల్లు ఎక్కడుంటే నీకెందుకు " కోపంగా అడిగాడు

"మీ ఇంటికి పక్కనవుండే సుబ్బారావు మా బంధువు వాడింటికి వెళ్ళడానికి "

"ఆ సుబ్బారావు ఇంటి పక్కింటిలో నేనున్నానని ఎవరు చెప్పారు "

"మా పక్కింటి వ్యక్తి తేలు కుట్టిన కోతిలాగా చిందులేస్తుంటాడని మా సుబ్బారావు చెప్పాడు. ఈ బజారులో మిమ్మల్ని గుర్తుపట్టాను. చెప్పండి సార్ "

-------------------------------------------------------------------------------------------------------------------------------


60 ) "మా వారు జైలు నుండి వచ్చాక పూర్తిగా మారిపోయారు "

" ఎలా "

" ఎన్ని తిట్టినా , కొట్టినా ఏమాత్రం ప్రయోజనం కనిపించడంలేదు "

-------------------------------------------------------------------------------------------------------------------------------

61 ) మహా మంత్రీ ఈ యుద్ధంలో మనం తప్పకుండా ఓడిపోతాము , ఎలాగైనా పొరుగు రాజ్యం వారితో సంధి కుదిరేలా ప్రయత్నించాలి "

"మహారాజా! ఆ ఇన్సూరెన్సు అధికారిని పంపితే ఎలాగైనా రాజీ కుదుర్చగలడు . ఎందుకంటె మన సైనికులందరూ వారిదగ్గర ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొన్నారు. యుద్ధం జరిగితే వారు దివాలా తెస్స్తారన్న భయం వుంది "

-------------------------------------------------------------------------------------------------------------------------------

62 ) "నీ పిసినారితనం పాతిపెట్ట . రైల్వే లో సీనియర్ సిటిజెన్ కు తగ్గింపు ధర ఇప్పుడు ఇవ్వడం లేదంట నీవిచ్చిన డబ్బులు సరిపోలేదు ." కోపంగా అన్నాడు భర్త. " అంతః తొందరగా ఎలా వచ్చారు "

"నీవిచ్చిన డబ్బులతో ఎంత దూరం వస్తుందో అంతవరకు ఇవ్వండి అని చెప్పి టికెట్ తీసుకొన్నాను . ఇంకా ట్రైన్ రావడానికి అర్ధగంట టైం వుంది. డబ్బులు తీసుకొనివెళ్ళడానికి ఆటోలో వచ్చాను "

పిసినారి భార్యకు మూర్ఛ వచ్చినట్లయింది.

పంపినవారు: ఓట్ర ప్రకాష్ రావు


ప్రచురించిన తేదీ: 29/07/2022

-------------------------------------------------------------------------------------------------------------------------------

63) ఎన్నికల వేదికపై ప్రసంగిస్తూ మంత్రినైతే ఏమేమి చెయ్యదలచుకొన్నాడో చెప్పసాగాడు.


ఒక వ్యక్తి అడ్డుపడి "అయ్యా మీలాగే ఎన్నో వాగ్దానాలు ఎందరో చేశారు. అవన్నీ అబద్ధాలని మాకు తెలుసు. ఒకే ఒక్క హామీ ఇవ్వండి. ఈ ఊరి ఓట్లన్నీ మీకే వస్తుంది"

" ఏమిటయ్యా అది"


" ప్రతినెల రెండు సార్లు మీరు ఈ వేదికపైన బహిరంగ ప్రసంగం చేస్తానని ప్రమాణం చేస్తే చాలు"


" ఏమీ చేయకుండా ఏమని మాట్లాడాలి"


"మీకు తోచిన అబద్దాలు చెప్పండి. కానీ ఈ రోజులాగా వచ్చిన వారికి బిరియాని, మందు పంచడం మాత్రం మరచిపోవద్దు"

-------------------------------------------------------------------------------------------------------------------------------

64) టీచర్ : ఏ బీ సి డీ లు అన్నీ చెప్పారా

ఎల్ కె జీ విద్యార్ధి: A, B, C, D, E, F, G, G2, G3, G4, G5, H. . . .

-------------------------------------------------------------------------------------------------------------------------------

65) "సర్వర్ తెచ్చిచ్చిన కాఫీ నందు చక్కెర తక్కువగా ఉందని అడిగావా. . . తెచ్చాడా"


" షుగర్ వ్యాధి ఉంచుకొని చక్కెర అడుగుతావా అంటూ చెంప చెళ్ళుమనిపించాడు"


"వాడికెలా తెలుసు"


"మా ఆవిడ ముందుగానే చెప్పి వెళ్లిందట. అడిగితే చెంప చెళ్లుమనిపించమని. . ."

-------------------------------------------------------------------------------------------------------------------------------

66) "మన మంత్రి చందమామ కథలు చదవడం ప్రారంభించాక చాలా మారిపోయారు"

"ఎలాగా"

" రాత్రి వేళలో మారు వేషంలో వెళ్తున్నారు."

"ప్రజల కష్టసుఖాలు తెలుసుకొనడానికా"

"అదేం కాదు మీడియా కళ్ళలో పడకుండా క్లబ్ కు వెళ్తారు"

-------------------------------------------------------------------------------------------------------------------------------

67)"మహారాజు గారు యుద్దానికి వెళ్తున్న సమయాన పెద్ద భార్య, రాజు నుదిట వీర తిలకం దిద్దింది”

"రెండవ భార్య ఏం చేసింది”

" విడాకుల పత్రంలో సంతకం తీసుకొంది."

"చిన్న భార్య ఏం చేసింది”

"ఇన్సూరెన్స్ పత్రంలో సంతకం తీసుకొంది"

-------------------------------------------------------------------------------------------------------------------------------

68) "వర్షం కురిసినా వచ్చిన వారందరూ వర్షంలో తడుస్తూ మంత్రి గారి ప్రసంగం విన్నారా. . . అంత బాగా మాట్లాడారా"


"ప్రసంగం పూర్తిగా విన్న తరువాతనే బిరియాని మందు ఇస్తామని చెప్పినందువల్ల. . ."

-------------------------------------------------------------------------------------------------------------------------------

69)"పెళ్ళికి ఇస్తామన్న గ్రైండర్ ఇంకా మీ నాన్న కొనివల్లేదు"భార్యతో చెప్పాడు


"మీరు ఎలాగూ వర్క్ ఫ్రేమ్ హోమ్ లో వున్నారు. గ్రైండర్ ఇప్పట్లో అవసరం లేదుగా. . . నేనే వద్దన్నానండీ" అంది

-------------------------------------------------------------------------------------------------------------------------------

70)" వర్క్ ఫ్రేమ్ హోమ్ పని అంటే అందరూ లావు ఔతారు. మీరేంటి సన్నబడ్డారు"ఆశ్చర్యంగా అడిగాడు


"మా ఆవిడకు సోమరితనం కాస్త ఎక్కువ. ఇంట్లో నేనుంటే చిన్న చీపురుపుల్ల కూడా ఎత్తదు. అన్ని పనులు నేనే చేయవలసి వస్తోంది"

-------------------------------------------------------------------------------------------------------------------------------

71)" వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ రేపు పదకొండుగంటలకు వద్దంటున్నావు. . . ఇటువంటి వాటికి ముహూర్తాలు అంటూ చూడకూడదు"


" నాకు పెళ్లి ముహూర్తం సార్ ,ఆ సమయాన పెళ్ళిపీటల మీద కూర్చొని వుంటాను"


" పెళ్ళిపీటల మీద కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ చేయకూడదని రూల్ లేదు. మీరు తాళి కట్టే ఆ రెండు నిమిషాల సమయంలో మేము సర్దుకొంటాము. మిగిలిన సమయాన కాన్ఫరెన్స్ లో పాల్గొనండి"

-------------------------------------------------------------------------------------------------------------------------------

72) "నీకు పెళ్లయ్యేనేతవరకు వర్క్ ఫ్రమ్ హోమ్ లో పని చేస్తావా ఎందుకూ"

"వర్క్ ఫ్రేమ్ హోమ్ పని అంటే పిల్లనివ్వడానికి చాలామంది సిద్ధంగా వున్నారు సార్"


పంపినవారు: ఓట్ర ప్రకాష్ రావు


ప్రచురించిన తేదీ: 28/08/2022

-------------------------------------------------------------------------------------------------------------------------------

రాఘవేంద్ర హాస్య తోరణం 3

🔯🔯🔯🔯🔯🔯🔯🔯

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


73


బస్సులో ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు


అబ్బాయి🔯 హలో మీరు ఎక్కడ దిగుతారు?


అమ్మాయి🔯మీరు దిగిన తర్వాత స్టేజీ లో


అబ్బాయి🔯 నేను కూడా మీరు దిగిన తర్వాత స్టేజిలోనే దిగుదాము అనుకుంటున్నాను



🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

74


టీచర్🔯పిల్లలు నిలబడి ఒక్కొక్కరు మీ

అమ్మానాన్నల పేరు చెప్పండి.


రాజు🔯లక్ష్మీ ,రామారావు


మూర్తి🔯రమ, దుర్గారావు


కిరణ్🔯 మాస్టర్ అండి..రాజు గాడి అమ్మానాన్నలేమా అమ్మానాన్నలు.


టీచర్🔯అదేమిటి రాజు నువ్వు అన్నతమ్ము లా.


కిరణ్🔯కాదండి.. కానీ రాజుగాడు అమ్మా

నాన్నల పేర్లే మా అమ్మ నాన్నల పేర్లు.



తలకిందులు అయ్యాడు

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

75


సూరిబాబు🔯ఒరే వెంకట్రావు నీ అభిమాన

హీరోయిన్ ఎవరు?


వెంకట్రావు🔯సమంత


సూరిబాబు🔯సరే నీ అభిమాన హీరో ఎవరు?


వెంకట్రావు🔯నా అభిమాన హీరో మాత్రం

నాన్న

అది సరే నీ అభిమాన హీరో

ఎవరు?

సూరిబాబు🔯 నువ్వేరా..నీకు మించిన వారు ఎవరున్నారు నాకు


వెంకట్రావు🔯 ఎంత కావాలి ఏమిటి అప్పు?


సూరిబాబు🔯1000 రూపాయలు... సదురు.


🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


76


బాబు కూల్ లేకుండా ఉన్న డ్రింక్ ఉందా?


ఉందండి


సరే ఇవ్వు


అదేమిటి గ్లాసు నీళ్లు ఇచ్చావ్?


కంగారు పడకండి ఇదిగో కూల్ డ్రింక్.. రెండు కలిపేయండి


🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


77


అదేంటి నీ భార్య పుట్టింటికి వెళ్ళింది అని సంబరపడుతున్నావు.


బయటకు వెళ్ళి శుభ్రంగా నాకు కావాల్సినవన్ని

కొనుక్కు తినొచ్చు... మరి నీ భార్య ఎప్పుడూ పుట్టింటికి వెళ్లలేదా?


వెళుతుంది వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్లి అక్కడ కూడా నా చేత అన్ని పండించుకుని తింటుంది.



🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


78


చందు ఏం చేస్తున్నావ్ రా


ఏముంది రా ఖాళీగా కూర్చుని గోళ్ళు గిల్లుకుంటున్నాను.


సరే నా గోళ్లు కూడా తీసిపెడుదూ కాస్తంత.



🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

🏵️🏵️🏵️🏵️🏵️🔯🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


79


జీవితం అంటే అర్థం తెలుసా వెంకట్రావు


బాగా తెలుసు..జీవితం అంటే జీవితమే.


నేను అడిగేది జీవితానికి నిర్వచనం చెప్పమని


తప్పకుండా చెబుతాను జీవితానికి నిర్వచనం జీవితమే.


అది కాదు రా కొంచెం ప్రశాంతంగా ఆలోచించి చెప్పు జీవితం అంటే.. కష్టసుఖాల కలబోత కదా


ఏ కాదు జీవితం అంటే జీవితమంతా జీవితం అనుభవించడమే.


దీనమ్మ జీవితం!!!! ఇంక చెప్పకు రా బాబు.


,

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


80


నువ్వు పరీక్ష పాస్ అయ్యావా?


పాస్ ఐ.. ఫెయిల్ అయ్యాను రా


అదేమిటి కొంచెం అర్థమయ్యేలా చెప్పు.


నేను చెప్పింది పరీక్ష పాస్ అయిన వాళ్ళకి అర్థం అవుతుంది. నీలాంటి వాడికి అర్థం కాదు



🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


81


జగమే మాయ బ్రతుకే మాయ


నిజమే నువ్వు మరి నేను ..మాయే


ఇదంతా మాయ ప్రపంచం రా


అదే కదా నేను అనేది. నీ జేబులో డబ్బులు నా

జేబులో డబ్బులు అంతా మాయే.


అలాంటప్పుడు నీ దగ్గర జేబులో డబ్బులు నాకు ఇచ్చేయ్ .


ఇవ్వనన్నానా ...ధైర్యం ఉంటే తీసుకో ఇవి దొంగనోట్లు.



🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️



82


మీ ఆయన పేరు ఏమిటి అన్నావు


జోగినాధం


అరే మా ఆయన పేరు కూడా జోగినాధ మే


బాగుంది ఇద్దరి చేత బూడిద వ్యాపారం పెట్టిస్తే ఎలా ఉంటుంది?


సూపర్ ఐడియా


🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️



83


విజయ నీకు అరిసెలు వేయడం వచ్చా?


వచ్చు.


సున్నుండలు..


వచ్చు.


గజ్జి కాయలు.


వచ్చు


అమ్మయ్య నీలాంటి అమ్మాయి గురించే మా అన్నయ్య వెతుకుతున్నాడు



నేను వండి పెడితే అతను కూర్చుని తిండిడా?


తప్పుగా అర్థం చేసుకోకు. నీ చేత అన్నీ వడ్డించి పెద్ద పిండి వంటలు బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాడు.


పంపినవారు: నల్లబాటి రాఘవేంద్రరావు


ప్రచురించిన తేదీ: 30/08/2022



🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯💥🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


-------------------------------------------------------------------------------------------------------------------------------

84) వినాయకుడు : మూషికా! ఎక్కడున్నావు?.. మనం నా పుట్టినరోజైన వినాయకచవితి నాటికి భూలోకం వెళ్ళొద్దా!! బయలుదేరు.

మూషికుడు : స్వామీ! ఈసారి నేను భూలోకంకి రావడంలేదు, నీవు వేరే రోబోటిక్ మూషిక వాహనంలో వెళ్ళండి.

వినాయకుడు : ఏంటి? ఎందుకు?!!

మూషికుడు : రెండేళ్ళ నుండి ఈ మాస్కులతో భూలోకంకి వెళ్ళటం, మళ్ళీ భూలోకం నుండి వచ్చినప్పటి నుండి క్వారెంటైన్లో వుండటం, ఇంక నా వల్ల కాదు స్వామీ.


పంపినవారు: లావణ్య కుమారి పెండేకంటి


ప్రచురించిన తేదీ: 16/09/2022







717 views0 comments

Comments


bottom of page