top of page

జోరుగా హుషారుగా

#SurekhaPuli, #సురేఖ పులి, #JorugaHusharuga, #జోరుగాహుషారుగా, #TeluguStory, #తెలుగుకథ


Joruga Husharuga - New Telugu Story Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 07/04/2025

జోరుగా హుషారుగా - తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



ఆండాళ్ నేర్చుకున్న నాట్యం రాయుడు రంగనాయకులు గారితో పెళ్ళయ్యాక తాళం వేయబడ్డది. 


“మేము ఆర్.ఆర్. ఫ్యామిలీ!” మీసం మెలేసి హూంకరించాడు.


“అంటే?” అమాయకంగా అడిగింది. 


“రాయల్టీ.. రాయుళ్ల ఫ్యామిలీ, కుప్పిగంతులు కుదరవు” ముక్కు మీద కోపం మూతి మీసం మేలేస్తూ అన్నాడు. కనబడకుండా వీలైనన్ని కోణాల్లో మూతి తిప్పుకుంది.


“అత్తగారి ఇంట్లో నీ అలవాట్లు కొన్ని వదులుకోవాలి, మరి కొన్ని నేర్చుకోని పాటించాలి” అంపకం సమయంలో అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి.


మరి మగవాళ్లు ఏం వదులుకోవాలి? ఏం నేర్చుకోవాలి? మగరాయుళ్లకు అంపకం వర్తించదు కదా! వదులుకోవటం, నేర్చుకోవడం అన్నీ వాళ్ళ ఇష్టాలే నా??. 

***

‘అలస్కా’ పురమాయించగానే పాడుతుంది, మాట్లాడుతుంది. ఇంట్లో ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోగానే అలస్కా ను ఆజ్ఞాపించి గానం-తాళం-పల్లవులతో మనసు పరవశించి తృప్తి తీరా ఆండాళ్ నాట్యం చేసుకునేది.


వయసుతో పాటు సహజంగా వచ్చే ఆరోగ్య ఇబ్బందులకు తార్కాణంగా ‘టిన్నిటస్’ (చెవుల్లో హోరు శబ్దం) ఆమె చెవుల్లో తాళం వేయసాగింది. 


వినికిడి లోపం వల్ల తనకేం నష్టం? ఎదుటివారి మాట వినబడక పోతే చెవి సారించి, ముఖాన్ని ప్రశ్నార్ధకంగా పెడితే సరి.. అవసరమైతే మరో మారు గొంతు చించుకు అరుస్తారు లేదా మానేస్తారు. తనకేంటి బాధ?! 


‘ఇల్లాలే అరుస్తుంది’ పాత నానుడి; ఇప్పుడు మారిపోయింది, ఇల్లాడు.. (ముద్దు పేరు) కూడా అరవాల్సిందే! 


ఒకప్పుడు మగడనే ధీమాతో గర్జించేవాడు, ఇప్పుడు రిటైర్మెంట్ వలన మూగవాడు అనుకొని అవసరాలను తీర్చమని అరుస్తున్నాడు. తీరుబడి ఎక్కువై ‘ఐటెం-పాప్’ పాటల మోజు పెరిగింది. 


మెలేసిన మీసం మటుమాయమైంది. ఏకాంతం కరువై ఆండాళ్ నాట్యం నడవడం కూడా వెనుకబడింది. 


పెళ్ళైన నాటి నుండి ‘భర్తకు అనుగుణమైన భార్య’ అని బిరుదు పొందిన ఆండాళ్కు దిగులు మొదలైంది! ‘ఐటెం-పాప్’ పాటల రెపరెపల చలికి వణికించే ప్రక్రియ అలవర్చుకోవాలా? 


రిటైర్డ్ ఆర్.ఆర్. గారితో ఎలా వేగాలో?! ఎలస్కా లో ఆర్.ఆర్. గారికి నచ్చిన ఐటెం-పాప్ పాటలే వినాలా? ఖర్మ!

***

రింగరింగా పాట మొదలైంది, ‘రాయి లాగా ఉన్న నన్ను రంగసాని చేసినారుగా’ ఆండాళ్ ను పొదివి పట్టుకుని భార్యను అనుసరిస్తూ డాన్స్ హుషారుగా చేస్తున్నారు. 


తదుపరి షీలాకి జవాని పాటను ఆజ్ఞాపించాడు. ‘న, న.. తేరి హత్ న ఆయి’ 


“మీకు గెంతుల నాట్యం ఇష్టం లేదన్నారు?” అతని చెవిలో చెప్పింది. చెవిని తగిలిన ఆమె స్పర్శ గిలిగింత కలిగింది.


“ఉత్తేజ పరిచే పాటకు, సహధర్మచారిణితో నాట్యం రసవత్తరం! అందరికీ పసందైన పాట, ఆట!!” పాట అయిపోయి నాట్యానికి అంతరాయం కలిగింది.


“ఎలస్కా ప్లే కం సెప్టెంబర్ మ్యూజిక్” ఆండాళ్ ఆజ్ఞను శిరసా వహించింది.


“సూపర్” అంటూ మ్యూజిక్ అనుగుణంగా ఆదిదంపతుల వలె నాట్యమాడుతూ ఆనందంగా “అబ్బో నీకు వెస్ట్రన్ కూడా తెలుసా? అన్నాడు రాయుడు. 


‘మహిళ రిమోట్ మహిమకు రాయల్ కింగులు రింగులే, మాకు అనుగుణంగా నాట్యం చేస్తారు’ మనసులో అనుకుంది. ఇద్దరూ హావభావాల సోపానాల్లో మునుగుతూ తేలిపోయారు.


దేశీయ సంస్కృతి సంప్రదాయాలు అన్ని కోణాల్లో అన్వయించుకోవటం తెలిస్తే విదేశీ ఐటెం-పాప్ లు స్వదేశీయమే!!

***** 

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 

పేరు :సురేఖ  ఇంటి పేరు: పులి

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.

ప్రస్తుత నివాసం బెంగళూరు  విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.  స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008  లో స్వచ్ఛంద పదవీ విరమణ.

చందమామ, యువ, స్వాతి,  ఈనాడు,  మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే  లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.

Surekha Puli 


Comments


bottom of page