top of page

జున్నుకొచ్చిన తిప్పలు!


'Junnukochhina Thippalu' - New Telugu Story Written By Vijayasundar

Published In manatelugukathalu.com On 03/06/2024

'జున్నుకొచ్చిన తిప్పలు!తెలుగు కథ

రచన: విజయా సుందర్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కామాక్షమ్మ, మీనాక్షమ్మ అరుదైన వియ్యపురాళ్లు. కాక ఎవరన్నా ఇంత స్నేహంగా ఉంటారేమిటీ వియ్యపురాళ్లన్నవాళ్ళు! ఈ మధ్యనే ఇద్దరూ కలిసి ఈవిడ కొడుకూ, ఆవిడ కూతురూ కాపురం ఉన్న అమెరికా కూడా వెళ్ళొచ్చారు. అవునండీ అవును అచ్చంగా వీళ్ళిద్దరూనే.. అయితే దారిలో వీళ్ళ పాల పడ్డ వాళ్ళందరూ ఏ జన్మలోనో ఘోర పాతకాలెన్నో చేసుండాలి, ఈ భూమ్మీదే రౌరవాది నరకాలు చూసారు. సరే ఆ ప్రహసనం అయిపోయిందనుకోండి. !


కామాక్షమ్మగారితో, పల్లెటూర్లో వ్యవసాయదారుడైన ఆవిడ తమ్ముడి కొడుకు ఉంటున్నాడు. ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. 


మీనాక్షమ్మ దగ్గర ఆవిడ మేనకోడలు చదువుకుంటున్నది. మామ్మలిద్దరూ, ‘వీళ్ళిద్దరికీ ఈడూ జోడు, . వావి వరసా అన్నీ కలిసే ఉన్నాయిగా. ముడి పెట్టేస్తే పోలా’, అని ప్లాన్లు వేస్తున్నారు. ఇంకా అధిష్టాన వర్గాల దాకా సంగతులు వెళ్ళలేదు. ఏదీ.. ఈ యాడాది ఇద్దరికీ చదువులు గట్టెక్కుతాయి. 


ఇహ కదుపుతారు పావులు. 


"కామాక్షీ ఏం చేస్తున్నావే" అంత దూరంనించే పెద్దగా పిలుస్తూ వచ్చింది పక్క బజారులోనే ఉండే మీనాక్షమ్మ. 


"వచ్చావుటే, నిన్నంతా. రాకపోతివి, ఫోనన్నా. చెయ్యకపోతివి.. ఛస్తున్నా హడిలి పోయి. నా ఫోనేమో ఆ నెల తక్కువ వాడు కరెంటుకోత పెట్టాడుగా నిన్నంతా ఛార్జ్ కాలేదు". 


ఈ మధ్యే మామ్మలిద్దరికీ అమెరికాలో ఫోన్లు కొని పెట్టి క్షుణ్ణంగా నేర్పి పంపారు పిల్లలు. అమ్మో వీళ్లా! గుడినీ గుళ్ళో లింగాన్ని మింగేంత తెలివి తేట లాయె. 


ఇట్టే నేర్చేసుకున్నారు. అబ్బో రెండు మూడు గ్రూపుల్లో సభ్యులు కూడాను. వాళ్ళ వంటా వార్పులు, కబుర్లు, చిట్కాలతో యమా పాపులర్ ఫిగర్స్ అయిపోయారు!, 


"జున్ను తెస్తా కూర్చో".. కామాక్షమ్మ. లేస్తుంటే.. 

"ఎందుకే కామాక్షీ! మళ్లీ కొన్నావు.. ఎంత. కావాలి చెప్పు మన్ను? నాదగ్గిర ఉన్నదిగా"


"నీ మొహం తిన్నది ఎంత అని చూసుకుంటాముటే.. ఉండు చెప్తాను"


"కామాక్షీ! ఎంత అని కాదే ఉన్న వస్తువు మళ్ళా మళ్ళా కొండం దండగ అని. అంటున్నా. "


"దండెం మీద. వేసొచ్చావా.. ఏమిటీ మడి బట్ట ఇప్పుడు వెయ్యడమేమిటీ"


"మన్ను కి మడి ఎందుకే?.. రోజుకీ రోజుకీ చాదస్తం పెరిగి పోతోంది నీకు"


"జున్ను తినమంటే. చాద ఇమ్మంటావు.. ఇక్కడ బావి ఎక్కడున్నదే?" 


అప్పుడే కాలేజీవించి వచ్చి వెనకే నుంచున్న మేనల్లుడు, చెవిలోనించి బైటికొచ్చిన మిషను సరి చేసేసరికీ కామాక్షమ్మకి, . మీనాక్షమ్మ మాట వినిపించింది. 


ఆవిడకి తను జున్ను తినమన్న సంగతి వినిపించలేదని కామాక్షమ్మకి అర్థమయి, "మిషన్ పెట్టుకోలేదటే" అంటుండగానే, మీనాక్షమ్మని వెతుకుతూ వచ్చిన ఆవిడ మేనకోడలు ఆవిడ చెవి మిషన్ సరిచేసాక, 

"జున్ను. ఎందుకు తిననూ.. నిన్నెప్పుడన్నానే. చాదస్తమని, ఒక్క పూట. రాకపోతేనే అయ్యో, సంధి మాటలొస్తున్నాయే. ముందు జున్ను తీసుకురా ఓ పట్టు పడ్తా. " అన్నది. 


మామ్మలది జున్ను గోల.. ఆ లైలా. మజ్నూలది పెళ్ళిగోల!చూపుల సినిమా చూసిన మామ్మలు, పెళ్లికి తొందరలోనే పెట్టించాలి ముహూర్తాలు, వాళ్ళవాళ్ళకి చెప్పి అని తెల్లగా ఉన్న జున్ను నోటితోనే, చల్లగా ముసి ముసిగా నవ్వుకున్నారు!


విజయా సుందర్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar

నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.

'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!


45 views0 comments

Comments


bottom of page