#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న#కదలండికలపండి, #KadalandiKalapandi
Kadalandi - Kalapandi - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 23/11/2024
కదలండి - కలపండి - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
భుజం భుజం తట్టండి
చేయి చేయి కలపండి
జగదైక కుటుంబమని
చెలిమితోడ మెలగండి
విభేదాలు వీడండి
విద్రోహాలు మానండి
జగతి ప్రగతి కోసమే!
మనసు పెట్టి నడవండి
వివాదాలు తరమండి
విశ్వశాంతి కోరండి
సమ సమాజం కొరకు
సతతం కృషి చేయండి
ప్రేమగుణం చాటండి
వైరాన్ని పోగొట్టండి
క్షమాపూలు వెదజల్లి
శాంతిని స్థాపించండి
సమైక్యతకు పూనండి
కదలండి! కదలండి!!
కదం తొక్కి కదలండి!
దేశ రక్షణ కోసం
సైనికుల్లా కదలండి!
సత్యమునే పలకండి
అహింస బాట పట్టండి
దైనందిన జీవితాన
భగవంతుని కొలువండి
-గద్వాల సోమన్న
Comentários