top of page
Writer's pictureA . Annapurna

కదిలించిన ఆత్మీయత


'Kadilinchina Athmiyatha' Written By A. Annapurna

రచన: ఏ. అన్నపూర్ణ


లహోయాలోని ఆ డోయల్ పార్క్ అంటే మహతికి ఎంతో ఇష్టం.ఎన్నో ఏళ్లుగా పార్కులో వాకింగ్ చేస్తూ ఎవ్వరూ రాని ప్రదేశంలో సిమెంట్ బెంచ్ మీద కూర్చుని రచనలు చేసింది. కవితలు రాసింది. బెంచ్ ముందు హోటల్లో టిఫిన్చేయడానికి వుండే టేబుల్లాకూడా ఉంటుంది. అందువల్ల రాసుకోడం వీలు. వింటర్లో అయితే సన్ సెట్ అయ్యే వరకూ అక్కడ ఎండా పడుతుంది. ఎవరైనా వచ్చి పలకరిస్తే కాసేపు మాట్లాడేది. సాధారణంగా ఎవరూ అటు వచ్చేవారుకాదు కనుక ఏనాడూ ఆమె అలవాటుకి ఆటంకం కలగలేదు.


ఆరోజు ఎప్పటిలా వాకింగ్ పూర్తిచేసి తన ప్లేసుకి వచ్చేసరికి అక్కడ బెంచ్ మీద ఒక ఎంగ్ మాన్ కూర్చుని వున్నాడు. మహతి ఇబ్బందిగా ఫీలై వేరే చోటుకి వెళ్లి కూర్చుంది. కానీ కొత్తచోట రాసుకోడం ఇబ్బందిగా తోచింది..ఏకాగ్రత కుదరలేదు.ఫోనులో సాంగ్స్ వింటూ టైం పాస్ చేసి ఇక ఇంటికి వచ్చేసింది.


అలా రెండు రోజులు గ అతడు కూర్చుంటున్నాడు. అయితే అతను మామూలుగా లేడు.

ఎదురుగ పెద్ద పెప్సీ బాటిల్ వుంది. టేబుల్ మీద తల పెట్టుకుని రోదిస్తున్నాడు.

ఒకోసారి పగలబడి నవ్వుతాడు. ఒకోసారి ఆకాశంలోకి చూస్తూ ఎవరినో తిడుతుంటాడు.

అటు ఇటూ చూస్తూ కేకలుపెడతాడు. ఆమెకు అర్థం ఇఇంది. అతను డ్రగ్ ఎడిక్ట్ .


అలాటివారిని పబ్లిక్లో వదలరు .కొన్సిలింగ్ ఇస్తారు. లేదా వారికోసం వుండే హొమెస్ కి పంపుతారు.

మహతి ఇదంతా గమనించి దగ్గిరగా వెళ్లి పలకరిద్దామని అనుకున్నా కాస్త సందేహించింది.

వరుసగా నాలుగురోజులు వేచి చూసినా ఆచోటు విడిచి పోడంలేదు.

చివరికి తెగించి మాటాడాలని వెళ్ళింది.

''హలొ ...ఐంమ్ .... మహతి ....!అంది. చేయి చాపి .

అతను అయోమయంగా ఆమె వైపు చూసాడు.

కానీ చేయి అందించలేదు.


''ఇది నా ప్లేస్ ....రైటింగ్ ఈస్ మై హాబి. ప్లీస్ లీవ్ థిస్ ప్లేస్ ...అంది.

''నో...ఐ డోంట్ కేర్ .... అన్నాడు నిర్లక్ష్యంగా .పెప్సీ బాటిల్ ఖాళీ చేస్తూ.

ఎలా ..... మాట పట్టించు కునేలా లేడు పైగా నేను ఏషియన్ . కనుక అసలు లెక్క చేయడమో....

''వాట్స్ యువర్ ప్రాబలెం? టెల్ మీ ....ప్లీస్ ! అంది మహతి కొంచెం దూరంగా కూచుని.

''ఎమ్ చదువుతున్నావు నీ పేరు?అంది.


'' అలెక్స్ ...అన్నాడు.

''నైస్ నేమ్.... మెల్లిగా మాట కలిపి రెండు రోజుల తరువాత అతడి బాధను తెలుసుకునే చనువు సంపాదించింది.

''అలెక్స్ ...నేను ఏషియన్. మీదేశంలో పన్నెండు ఏళ్లుగా ఉంటున్న. నాకు చాలా నచ్చింది .అమెరికన్స్ మంచివాళ్ళు . నాకు ఎవరూ లేరు. హోమ్ ఎలోన్. UTC మాల్ లో వర్క్ చేస్తాను.

రైటర్ని. నాతో ఫ్రెండ్ షిప్ చేస్తావా? నన్ను నీ మదర్ అనుకో...మహతి మాటను పూర్తి చేయకుండా ..

'అయి డోంట్ లైక్ మాం.మ్ ..'అన్నాడు.

''సారీ . ... . ఓన్లీ ఫ్రెండ్ .ఓకే?


అలెక్స్ కూల్ అయ్యాడు...మాటాడుతూనే మైకంలోకి వెళ్ళిపోయాడు.

''ప్లీస్ అలెక్స్ ....నువ్వు ఈ డ్రగ్స్ మానుకో .ఎందుకు నీ లైఫ్ పాడు చేసుకుంటావు?

చదువుకో లేకపోతె ఏదైనా స్పోర్ట్స్ నేర్చుకో...లేదా మ్యూజిక్ ...శింగింగ్ ...సోషల్ సర్వీస్ ...ఎన్నిలేవు?


ఎన్నో దేశాలవారు ఈదేశంలో ఉపాధి పొందుతున్నారు. చదువుకుంటున్నారు.

అటువంటిది ...ఈదేశవాసివి .నువ్వే ఇలా వ్యసనాలకు బలైపొతే ఎలా? నామాట వినవా ...

మనం మంచి ఫ్రెండ్సమి కదూ...అంది అలెక్స్ చేతిని తన చేతిలోకి తీసుకుని.

అలెక్స్ మహతి పట్టుకున్న చేతిమీద తలపెట్టి బాధ తీరేలా రోదించాడు.

కాసేపు అలాగే వుండి తేరుకున్నాడు.

చీకటిపడింది. మహతి ఇంటికి వచ్చింది. అలెక్స్ గురించే ఆలోచిస్త్తూ అతడిని మామూలు మనిషిని చేయాలని అనుకుంది.అదొక ఛాలెంజ్ గ తీసుకుంది.

అవును. అది ఛాలెంజ్ .మామూలుగా ఈదేశంలో ఎవరూ చేరువకారు.

రిచ్ ఐయ్యేనా కావాలి. లేదా పెద్ద జాబ్ అయినా ఉండాలి.

అలెక్స్ తల్లి-లేదా తండ్రి...తెలియనివాడు. ప్రభుత్వ వసతి గృహంలో ఆర్ఫాన్గా పెరిగాడు.

నాకు జీవం భృతి కల్పించిన ఈదేశానికి నావంతు గ అలెక్స్ని బాగుచేస్తే చాలు.

ఎన్ని అవరోధాలు వచ్చినా నిలబడతాను అనుకుంది.అయితే అలెక్స్ అందుకు సహకరిస్తాడా ...అన్నదే పెద్ద డవుట్.బట్ ఐ విల్ ట్రై...అనుకుంది.


రోజు వాక్ చేసివచ్చి అలెక్స్తో కాసేపు మాటాడి కొంతసేపు రాసుకునేది.

అతను ఇష్టం ఉంటే మాటాడేవాడు. లేకపోతె ఏదో బుక్ చదువుకునేవాడు.

మెల్లిగా అతడిలో మార్పు వస్తోంది....అతడి డ్రింక్లో డ్రగ్ కి విరుగుడు టాబ్లెట్స్ కలిపేది.

మహతి ఫ్రెండ్ లీసా నర్సుగా పనిచేస్తుంది. అలెక్స్ గురించి చెప్పి లీసాని టాబ్స్ అడిగి తెచ్చింది.


''నీకెందుకు కాప్ కి కాల్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు.'అన్నా ''లేదు లీసా అలెక్స్ని కరుణతో మనిషిగా మార్చాలి. అన్నదే నా ఆలోచన.


పదిమందిలో ఒకడుగా ఎవరో అనామకుడుగా వదిలిపెట్ట వద్దు. ప్లీస్ నాకు సపోర్ట్ ఇవ్వు''.అంది .

ఒకరోజు పార్కులో కొందరు స్వచ్ఛందంగా క్లీన్ చేసే గ్రూపుతో చేరి పని చేస్తున్న మహతి ''అలెక్స్!

నువ్వుకూడా రా ఇక్కడ హెవీ వర్క్ వుంది....అంటూ పిలిచింది.


అలెక్స్ బద్దకంగా ''నో మతీ బోర్...అన్నాడు.ఆమెను మతీ అని పిలుస్తూంటాడు.

''అలెక్స్ థిస్ ఈస్ అవర్ రెస్పాన్స్ బులిటీ . మనం రోజూ ఇక్కడికి వస్తున్నాం. ప్రయోజనం పొందుతున్నాం. మనవంతుగా పరిసుబ్రతా పాటిద్దాం...నాకు సహాయంగా రా ...ప్లీస్ అంది.

అక్కడ చెట్ల పొదల్లో పడవేసిన డ్రింక్ బాటిల్స్ కోక్ కేన్స్ ఒక బ్యాగ్లో వేసింది .వాటిని గార్బేజ్

డ్రమ్ములో వేయాలి. వక్కరే మోయలేరు.


ఏమనుకున్నాడో లేచి వచ్చి సాయం చేసాడు. మరునాడు తనంతగా తానె మహాతికంటె ముందుగా వచ్చి నాలుగు బ్యాగుల సామాను గార్బేజ్ లో వేసాడు.

మహతి అలెక్స్ని హాగ్ చేసుకుని గుడ్ బాయ్ అని మెచ్చుకుంది. UTC నుంచి తెచ్చిన డోనట్స్ ....పీజా పెప్సీ బాటిల్ ఇవ్వగానే ఆత్రంగా ఇష్టంగా తినేసాడు .


''అలెక్స్ నువ్వు నేను జనవరి వీకెండ్ సెమిష్టర్ కి కాలేజీలో చేరుదాము.నువ్వెక్కడ ఉంటావు?

అడిగింది.

''ఇక్కడే కమ్యూనిటీ ఆఫీసులో ....అన్నాడు అలెక్స్.

'' ఓ ఇకనేమి ....ఇద్దరం వెడదాం. రెడీగా వుండు. ఓకేనా ? నేను మర్ణింగ్ వచ్చేస్తా.

నీ క్లోత్స్ లేక్స్. బాగాలేవు. నేను కొన్ని తీసుకువస్తాను.'' అని చెప్పింది.

అలెక్స్ని కమ్యూనిటీ కాలేజీకి తీసుకువెళ్లి అన్ని డిపార్ట్ మెంట్స్ చూసి లంచ్ చేసాక అడిగింది.

నీకు ఏది ఇష్టం?


''డ్రోన్ టెకనాలజీ కోర్స్ చేస్తాను....అన్నాడు.

చిన్నపిల్లలు విమానాలతో ఆడుకున్నట్టుగా ఉండటం చూసి చెప్పాడు .

''వొకే.. ఇంతకుముందు హై స్కూల్ పూర్తి చేసావా?

''అవును.''

''గుడ్ .పద అప్లికేషన్ ఇచ్చి వద్దాం ...అంటూ ఆఫీసులో ఇద్దరి అప్లికేషన్స్ ఇచ్చి మరునాటి నుంచి క్లాసులకు అటెండ్ అవుతామని చెప్పి వచ్చేసింది.

అలా అలెక్స్ని ఓపికగా సహనంతో దారికి తెచ్చింది మహతి.

లీసా చాల ఆశ్చర్య పడింది ఆమె పట్టుదల సహనానికి.

లీసాని అలెక్స్ని వీకెండ్కి ఇంటికి పిలిచి పరిచయం చేసింది.

ఆరునెల్లలో వాళ్లిద్దరూ బాగా దగ్గిర అయ్యారు. లీసా ఇంటికి మారేడు అలెక్స్.

మహతి అలెక్స్ల డ్రోన్ కోర్స్ కూడా పూర్తి ఇఇంది. మహతి టీవీ చానెల్కి పనిచేస్తే , లీసా వర్క్ చేసే హాస్పటల్లో చేరెడు అలెక్స్. విలేజ్ హాస్పిటల్స్ కమ్యూనికేషన్ అవసరం కావడంతో అలెక్స్ బిజీ అయిపోయాడు. ఇప్పుడు డ్రోన్ టెకనాలజీకి మంచి డిమాండ్ వుంది.

ఆరోజు క్రిస్మస్ పార్టీకి లీసా మహతిని పిలిచింది.


గిఫ్ట్ తీసుకుని పార్టీకి వెళ్ళినపుడు వాళ్ళు చెప్పారు....మేమిద్దరం త్వరలో నీకు వెడ్డింగ్ కార్డు పంపుతామని!.


''మహతీ ! నాకు మంచి లైఫ్ పార్ట్ నర్ ని చూపించావు.. నీవల్లనే అలెక్స్ బుద్ధిగా మారేడు.నువ్వు నాకు ఫ్రెండ్ కావడం నా అదృష్టం. నిన్ను నా జీవిత కాలం గుర్తు ఉంచుకుంటాను ''అంది లీసా.

''నాకూ చాలా హాపీగా వుంది లీసా. నువ్వు అలెక్స్కి సరైన జోడీవి .


అలెక్స్డి పసి పిల్లవాడి మనసు. జాగ్రత్తగా చూసుకో. అతడి గతాన్ని ఎప్పుడూ అడగొద్దు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే !అసలు అతను నామాట గౌరవించి వినడం.

అలాగే చదువుకోడం. ఇంత కంటే ఆనందం లేదు.నా వలన మీ ఇద్దరు కలుసుకోడం ......నా ఆశ తీరడం....


ఓహ్! అంటూ ఎమోషన్ ఫీలైంది మహతి.


''మహతి'' అంటే వీణ .అలెక్స్ లీసాల జీవన వీణను మధురంగా శ్రుతి చేసి ఒకటి చేసింది.

పేరును సార్థకం చేసుకుంది.

*******

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.






40 views0 comments

Comments


bottom of page