'Kagithala Jivitham' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 29/01/2024
'కాగితాల జీవితం' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
చరణ్ స్కూల్ స్థాయి నుండే చదువు పై మంచి ఆసక్తి, అంకితభావం కలవాడు.. మధ్యతరగతికి చెందిన చరణ్, అతని తల్లిదండ్రులు ఒకటే నమ్మారు.. ఎంత కష్టం వచ్చినా.. బాగా చదివి మంచి మార్కులు సంపాదించగల్గితే జీవితం సుఖవంతం అవుతుంది అని చరణ్,
ప్రతి ఒక్కరి జీవితంలో చదువు అనేది అత్యంత ముఖ్యమైనదని తల్లిదండ్రులకు ఆస్తి ఏమీ లేకపోయినా పిల్లలు చదివే చదువే పెద్ద ఆస్తిగా భావించుకుని కాయ కష్టం చేసుకుంటు కొడుకుని చదివిస్తున్నారు.. వారి నమ్మకం వమ్ము చేయకుండా చరణ్ పదోతరగతి టాపర్ గా నిలిచాడు..
చరణ్ తో పాటే ప్రభా కూడా చదివాడు కానీ.. అతడికి నామమాత్రంగా మార్కులు వచ్చాయి.. ప్రభా అసలు పాఠశాలకు వెళ్ళడు వారానికి ముడు రోజులు వెళ్తే మరో మూడు రోజులు డుమ్మ కొడతాడు. ప్రభా స్నేహితులు కూడా డైలీ పాఠశాలకు వెళ్తారు.. ప్రభాను కూడ పిలుస్తారు.. కానీ.. ! ప్రభా "ఈరోజు రాను స్కూలుకు డుమ్మా కొట్టి పనికి వెళ్తా " అంటు పనికి పోతుంటాడు..
అలా వారి వారి ప్రస్ధానం సాగుతుంది..
అయినా అందరు విద్యార్థులు ఒకేలా ఉండరు కదా.. ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి పరిస్థితులు వారివి..
ప్రభా మాత్రం చదువుకు, పనికి రెండీంటికి సమయం కేటాయించటంతో అతడి మార్కులు రాను రాను తగ్గాయి..
ఇక చరణ్, పై చదువుల్లోను మంచి మార్కులు సంపాదించాడు..
అందరూ పెద్దవాళ్ళు అయ్యారు.. యుక్త వయస్సు వచ్చింది.. ఎవరి జీవితం గూర్చి వారు పోరాటం మొదలెట్టారు.. చరణ్ ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.. కారణం.. ?
నేటి ఉద్యోగాల కోసం కళ్ళు కాయలుకాసేలా ఎదురు చూడటంతోనే వయస్సు పరిమితి దాటిపోతుంది కదా..
పోనీ అలాగే ఉండిపోకుండా చరణ్ కంపెనీ ఇంటర్వ్యూలకు కూడా హజరవుతు వచ్చాడు..
చదివిన చదువుకు తగిన ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డాడు.. ఫలితం లేదు.. కనీసం కంపెనీ ఉద్యోగానికైనా సెలక్ట్ అయి ఫలితం రాబట్టాలనుకున్నాడు.. ఎందుకంటే ఇప్పుడు చరణ్ కి జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి..
ఇంటర్వ్యూకి వెళ్ళాడు..
ఇంటర్వ్యూ బాగానే చేశాడు అయినా.. మేనేజర్ పై నమ్మకం లేక
"సార్.. సార్.. నాకు జాబ్ ఇంపార్టెంట్ సార్.. మీ దయవల్ల అయితే నాకు జాబ్ వస్తుంది సార్" ప్రాధేయపడ్డాడు..
"జాబ్ ఇంపార్టెంట్ హ.. ! డబ్బులు ఎంత కడతావో చెప్పు..” అన్నాడు మేనేజర్..
"సార్! డబ్బులు ఏమీ ఇచ్చుకోలేను సార్. నా టాలెంట్ చూసి ఇవ్వండి సార్" అని తన సర్టిఫికేట్ లు ఇచ్చాడు..
ఆ మాటలకు మేనేజర్ చరణ్ పై చిందులు తొక్కుతూ
"చెప్తే అర్థం కాదయ్యా.. నీ టాలెంట్, నీ చదువు, నీ మార్కులు తో పని లేదు మాకు. డబ్బులు కడతానంటే అప్పుడు రా.. పో" అని సర్టిఫికేట్ లు ముఖం పై విసిరేశాడు మేనేజర్..
మరో మాట మాట్లాడకుండా చరణ్ ఆ సర్టిఫికేట్ లను ఏరుకుని బయటకు వచ్చాడు.. వస్తే వచ్చాడు గాని
రాత్రనక పగలనక కష్టపడి చదివి సంపాదించిన ఈ కాగితాలును ఏవో న్యూస్ పేపర్లలా ముఖాన విసిరేశాడు చూడు.. చదువు, సర్టిఫికేట్ లు అంటే అంత చులకనా.. ? డబ్బు మాత్రమే గొప్పదా.. ? అని బాదపడ్డాడు చరణ్..
ప్రభా మాత్రం చదువుతో పాటు నేర్చుకున్న పనితో డబ్బులు బాగా సంపాదించటం మొదలెట్టాడు.. అతడు, డ్రిల్లింగ్, వెల్డింగ్, బైక్ రిపేర్లు తదితర పనులు నేర్చుకున్నాడు.. ఇలా ఐదు, ఆరేళ్ళ తర్వాత ఆ పనుల్లో బాగా ప్రావీణ్యం సంపాదించి మంచి షాపులు పెట్టుకుని తానే మేనేజర్ గా చెలామణి అవుతు ఆపరేటర్ తదితర పనుల కోసం మరికొంతమందికి పని కల్పిస్తూ బాగా సంపాదిస్తున్నాడు..
ఒకనొక సందర్భంలో ప్రభా యొక్క జీవితం గూర్చి తెలుసుకుని అతడిని మనసులో మెచ్చుకుంటు
‘ఏం చదువు.. ! ఉద్యోగం రాలేదు .చక్కగా ఏదైనా పనైనా నేర్చుకుంటే జీవితంలో బాగుపడేవాడ్ని. ఇప్పుడు ఉద్యోగం తెచ్చి పెట్టలేని ఈ సర్టిఫికేట్ లు దేనికి.. ?’ అంటు వాటిని ముఖానికి అడ్డం పెట్టుకుని బాదపడ్డాడు చరణ్..
నిజమే మన దేశంలో ఉద్యోగం రావాలంటే శక్తికి మించిన పని.. ఒకటి రెండు ప్రయత్నాలతో ఉద్యోగం రాదు.. , అలా ఆని పదే పదే నోటిఫికేషన్ లు ఉండవు.. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే ఏ కేసు ఉండకూడదు, అదే నాయకులు, పాలకులు పై ఎన్ని కేసులు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వంను నడపవచ్చు.. ఇదెక్కడి వ్యవస్థ.. ?
డిగ్రీ పూర్తి చేసి పని లేకుండా ఖాళీగా ఉన్నవాళ్లు మన దేశంలో కోట్లమంది ఉన్నారు.. ప్రపంచంలో ఎంత ఎక్కువ విద్య ఉంటే అన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.. కానీ.. ! మన దేశం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది.. ఏమీ చదువుకోకపోతే పని, కాయకష్టం చేసుకుని బతకవచ్చు.. అంతేకాని స్కూలుకు వెలితే దేనికి పనికిరాడు..
బుద్ధి వికసించాలంటే విద్య తప్పనిసరి.. అది దాటి డిగ్రీలుకు పోతే ఇంక దేనికి పనికిరాడు.. అంటే.. ?
కాగితం పై ఎంత ఎక్కువ మార్కులు ఉంటే అంత పనికిరాకుండాపోతున్నారు.. ఇది పవిత్రమైన మన దేశంలో జరుగుతున్నది.. విద్య వారిలో శక్తిని పెంచటంలే కాగితాలను మాత్రమే ఇస్తుంది.. ఇదే ఇలా కొనసాగితే.. రేపటి రోజు ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు డిగ్రీలు చదివించరు ఏ కాయకష్టమో నేర్పుకుంటారు..
జీవితంలో స్థిరపడాలంటే.. కేవలం చదువు తెలివితేటలు ఉంటే సరిపోదు.. మంచి క్రమశిక్షణ, జీవననైపుణ్యాలు కూడా అలవర్చుకోవాలి.. అప్పుడే జీవితంలో విజయం సాదిస్తారు.. ప్రస్తుతం అంతంతమాత్రంగానే చదువుకుని, పని కూడా నేర్చుకున్న ప్రభా పదిమందికి జీవనోపాధి కల్పిస్తుండటమే అందుకు నిదర్శనం..
****** ****** ****** ******
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments