కాకతి రుద్రమ ఎపిసోడ్ 1
- Ayyala Somayajula Subramanyam
- Jun 28, 2022
- 4 min read
Updated: Apr 23, 2023
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Kakathi Rudrama Episode 1' New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
కాకతీయ వంశానికి చెందిన రాణీ రుద్రమ దేవి కథను సీరియల్ గా మనకు అందిస్తున్నారు ప్రముఖ రచయిత, కవి శ్రీ అయ్యల సోమయాజులు సుబ్రహ్మణ్యం గారు.
పాఠకులు ఈ సీరియల్ పై తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయ వలసిందిగా కోరుతున్నాం.
ఇక మొదటి ఎపిసోడ్ ప్రారంభిద్దాం.
నవలకాల చరిత్ర
------------------------
పదమూడో శతాబ్దంలోనే కత్తి పట్టింది. కదనరంగంలో దూకింది. మత్తగజాన్నే కాదు
.. మగరాయళ్ళ అహంకారాన్ని అణచివేసింది. సమస్త స్త్రీజాతికి ఆదర్శమూర్తి
-- కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి. చెదిరిన ఆంధ్ర దేశాన్ని ఒక్కటిగా చేర్చిన గణపతి
దేవుని పెద్ద కూతురు. ఓరుగల్లు రాజదాని గా దక్షిణాదిని ఏలిన కాకతీయ వంశానికి చెందిన ధీరోదాత్తురాలు రుద్రమ దేవి.
ఆ వంశ మంత్రి శివదేవయ్య. ఆయనే రుద్రమదేవికి యుద్దవిద్యలన్నీ నేర్పించాడు.
రుద్రమదేవి సాహసాలను మాటల్లో వ్యక్తీకరించలేము. గణపతిదేవుడు బతికున్న కాలంలోనే , తండ్రి అనారోగ్య కారణంగా సైన్యాన్ని ముందుకు నడిపింది. దక్షిణ భాగం అధికం కాకతీయ సామ్రాజ్యం లో ఉన్న సమయమది. పురుషాధిక్యాన్ని తట్టుకుని పాలించడం సామాన్య విషయం కాదు.
నిరంతర కత్తిసాములు, ఈటెలు విసరడం, అశ్విక స్వారీలు, శరసంధానం లో మునిగి తేలిన రుద్రమదేవి ఎల్లప్పుడూ పురుష ఆహార్యం లోనే ఉండేది. 13 వ శతాబ్దపు కాలంలోనే రుద్రమదేవి తనను వివాహం ఆడదలచుకున్న వారు తన మీద కత్తి యుద్దం చేసి గెలవాలన్న షరతు పెట్టింది. చాళుక్య వీరభద్రుడు ఆమెను ఓడించి పెళ్ళాడినా, అతడు ఇల్లరికం వచ్చాడు ఓరుగల్లుకు.
ఎంతో వీరోచితంగా కనిపించే రుద్రమ.. భర్త ముందు స్త్రీ సహజమైన సౌకుమార్యాన్ని, ప్రేమను ఒలికించేది.
గొప్ప సామ్రాజ్ఞి. పరిపాలనాదక్షురాలు. ధీరవనిత.. ఎన్ని యుద్దాలు చేసినా, జన్మతః మహిళే కదా!
రుద్రమ లో పురషుడిలోని కాఠిన్యం ఉంది. కాబట్టే మదపుటేనుగును అణచ గలిగింది. ఆమె మీద తిరుగుబాటుకు ప్రయత్నించిన ప్రతీ వారినీ ఓడించిన ధీశాలి. గణపతి దేవుడు యుద్దవిద్యలు నేర్పించాడు. రాచతంత్రం లో మగవారికి ధీటుగా తీర్చి దిద్దాడు. ఇక యుద్దరంగంలో అపరకాళీ యే నంటారు చరిత్రకారులు.
" రాజ్యం పట్ల మనకు గల నిబద్దతను చూసి శత్రువులు భయపడాలి. కలలో కూడా కన్నెత్తి చూసే సాహసం చేయకూడదు" అని సేనానులలో ధైర్యం నూరిపోసేది.
శక్తి గా మారగలదు.. స్త్రీ ఎలా ఉండాలీ? అనే ప్రశ్నకు రుద్రమ నిలువెత్తు సమాదానం. మనం ఏ విషయం లోనూ మగవాళ్ళకి తక్కువ కాదు. ధైర్యసాహసాలు
అనేవి సాధారణ గృహిణికి నిత్య జీవితంలో అవసర పడకపోవచ్చు. తప్పని సరైతే మాత్రం ఆడపులిగా మారాల్సిందే. ఆ రెండు కోణాలని రుద్రమ లో మనం చూస్తాం.
నాడు ఆడుదానికి సింహాసనం ఏమిటని దాయాదులు వ్యతిరేకించారు. ఆమె లేని సమయం చూసి కోటని ఆక్రమించుకున్నారు. తిరిగి వచ్చి రుద్రమ సివంగి లా విరుచుకుపడుతుంది. ప్రత్యర్థుల తల నరికి కోటగుమ్మానికి కట్టించింది.
" మన శత్రువులకు ఇదో గుణపాఠం. ఈ కోట గుమ్మాన్ని చూసి శత్రువులు , ప్రత్యర్థులు భయపడి పోవాలి" అని రౌద్రిస్తుంది.
' నేనొక తండ్రిలా రాజ్య ప్రజలని కాపాడుకుంటాను. కనురెప్పలలో పెట్టుకుని కాపాడు కుంటాను. ' అని అభయమిస్తుంది.
అంటే ఓ తల్లిగా ప్రేమ కురిపిస్తూ, తండ్రిలా ప్రజలని రక్షించుకుంటుంది.
అదీ ఆమెలోని ఔచిత్యం.
--------------------------------------------------------------------
శ్రీశ్రీశ్రీ రుద్రమదేవి ఆంధ్ర సమ్రాట్టయిన కాకతీయ గణపతిదేవుల పుత్రిక. ప్రపంచ చరిత్రలో పైతృకమైన రాజ్యసింహాసనం మీద అధివసించిన రాణులలో శ్రీరుద్రమ దేవి ఉత్తమ చరిత్ర, నిర్మల గుణగణాలంకార , శేముషీ సంపన్న నిర్వక్ర పరాక్రమధీర ఈ సామ్రాజ్ఞి.
త్రిలింగదేశాన్ని , సమస్తమూ తన చెప్పుచేతల కింద, అజమాయిషీ కింద వుంచుకుని "త్రిలింగదేశం" మనదేనోయ్- తెలుంగులంటే మనమేనోయ్" అని సగర్వంగా చెప్పించ గలిగిన ధీమంతుడు, నానారాజ్య విజేత, బహుబిరుదాంకితుడూ కాకతీయ
సామ్రాజ్యాన్ని కత్తుల వంతెనగా నిర్మించిన ధీశాలీ. - చక్రవర్తి కాకతీయగణపతి రుద్రదేవుడు.
గణపతి రుద్రదేవుడికి మగ సంతతి లేదు.
గణపతి రుద్రదేవుడు వృద్ధాప్యంలో ఉన్నారు. వారికి వారసులున్నారు. దాయాది
సోదరులు. ఈ రాజ్యం మీద కన్నేసి వుంచారు. అసలు కాకతీయ మహా సామ్రాజ్య లక్ష్మి మీద కన్నులేని దెవరికి. సామ్రాజ్యం అంటూ వుంటే, శత్రురాజులు దాన్ని ఏదో విధంగా ఆక్రమించాలని చూస్తారు. రాజ్యం వీరభోజ్యం కదా! బలవంతుడు బలహీనుణ్ణి జయించటమే కదా!
అసలు ఈ సామ్రాజ్యానికి, తామే కాబోయే రాజులమని ,ప్రభువుల మని హరిహర దేవుడు, మురారిదేవుడు , ప్రస్థుతం వృద్ధుడైన గణపతి దేవులను హతమార్చో రాజ్యభ్రష్టున్ని చేసో బంగారు గద్దెపై కూర్చోవాలనే ప్రయత్నం లోనే వున్నారు.
అయితే యిది అంత తేలిక కాదు. కడు దుస్సాధ్యము. అంతా మానవ ప్రయత్నాలు చేయకుండా వుండరు కదా!
మరొకరకం వాదనలో, పురుష సంతతి గణపతి రుద్రదేవులకు లేకపోవడం చేత, మగవాడు మాత్రమే రాజ్యాధికారానికి వారసుడు కాబట్టి , గణపతి రుద్రదేవుల తదనంతరం ఐనా , ఆరాజ్యం హరిహర, మురారి దేవులకే రావాలని
పట్టుబట్టేవారూ బయలుదేరారు.
అసలు కథ ఏంటంటే గణపతి రుద్రదేవుల తండ్రిగారైన , రుద్రదేవ చక్రవర్తి- కాకతీయ సామ్రాజ్య విస్తరణలో , తన పక్కలో బల్లెంగా బ్రతుకుతున్న, యాదవ చక్రవర్తిపై సైన్యాన్ని సమాయత్తం చేసి , దేవగిరిపై దండెత్తారు. ఆ యుద్రంలో యిరుపక్షాలకూ అపార నష్టం జరిగినా, జయం రుద్రదేవ చక్రవర్తులకే దక్కింది.
ఆయన కాస్త రసజ్ఞుడు. సంగీత ప్రియుడు. ఆ పైన కాస్త శృంగార పురుషుడు. దేవగిరిలో కొంతకాలం మకాం చేసి - ఈ రాజ్యాన్ని పరిపాలించటానికి అర్హత గల రాజుల కోసం గాలించి , తన పనుపున సామంతరాజుగా నియమించారు.
అప్పుడే రాజ్యానికి రావడం ఆలస్యమయింది.
ఆ రోజుల్లో , వారు అపురూప సౌందర్యవతి యైన ఒక మహారాష్ట్ర కన్నె వలలో పడి , గాందర్వ విధిలో వివాహమాడాడు.
గాందర్వరీతిలో పెళ్ళి చేసుకున్న రుద్రదేవ మహారాజు కు జన్మించిన సంతానం
సారంగ దేవుడు. -అయితే రుద్రదేవమహారాజు పట్టపు దేవేరి , తొలి భార్యయైన
ఆమెకు పుత్రసంతానం లేకపోయింది.
అయితే, ఈ విశాల కాకతీయ సామ్రాజ్యం పాలించటానికీ, తనకు జన్మించిన వాణ్ణి , సింహాసనం ఎక్కిస్తే - తోటి సామంతులకు , పరాయి రాజులకూ కోపం వచ్చి , ఎదురు తిరిగి ఎడతెగని దండయాత్రలు చేస్తారని భయం వుంది.
అది ఆయన పైకి అనక పోయినా మనసులో వున్న సంగతి. అందుచేత , ఆయన తన కిష్టుడైన మహాదేవుడిని పట్టాభిషిక్తుణ్ణి చేశారు.
ఇష్టం వున్నా లేకపోయినా మనసు మెత్తనివాడూ అయిన సారంగరదవుడు ఎదురు తిరగలేదు. కాబట్టి ప్రచ్ఛన్న యుద్దాలకు తావులేకుండా పోయింది.
మహాదేవరాయలు ఎక్కువకాలం రాజ్య చేయకుండానే కాలధర్మం చేశారు.
అప్పటికే ఆ రాజ్యన్ని పాలించే హక్కు , అదృష్టం సారంగ దేవుడికీ లభించ లేదు. ఆ సింహాసనాన్న పాలించే హక్కు ' గణపతి రుద్రదేప మహారాజుకి లభిచింది.
సారంగధేవుడు ప్రభువులకు వరుసకు అన్న. అదీగాక ఆయన ఎన్నడూ వివాదాస్పదమైన వాడు కాకపోవటం చేత- అంతా సవ్యంగానే జరిగిపోయింది. అంతేకాక సారంగధర దేవ ప్రభువు అయినా- గణపతి దేవ మహారాజుని సొంత అన్నకన్నా మినుమిక్కిలి ప్రేమించాడు. తనకి చెందవలసిన సామ్రాజ్యాన్ని కూడా మనసులో రానివ్వక , అన్నను అతి గాఢంగానూ, విశ్వాసం గానూ ఆరాధించటం చేత -" తమ్ముడు నా కుడిభుజం . . . . . . సారంగదేవుడంత విశ్వాసపాత్రుడు నాకు దొరకడు" . . అని ప్రభువులు బాహాటంగా చెప్పుకుంటూనే వుండేవారు.
అందుచేతనే, తమ్ముడికి గొప్పహోదా యివ్వటం కోసం , తన పర్యవేక్షణ'లోనే కొలనుపాక' రాజ్యాన్ని గోదావరీ తీరం వరకు పాలించుకునే ప్రభువుగా అనుమతి ఇచ్చారు.
సారంగదర దేవుడు కూడా రాజ్య పరిపాలనా విషయంలో, ఎగుడు దిగుడు లు లేకుండా - మంచి ప్రభువుగానే గణనీయమైన ఖ్యాతిని తెచ్చుకున్నారు.
అయితే ఆయన ఎక్కువ కాలం బతకలేదు. నాలుగేళ్ళక్రితం కన్ను మూసారు. ఇది
గణపతి చక్రవర్తికి పెద్దదెబ్బే. ఆయన సారంగధర దేవుణ్ణి తలచుకుని- "తమ్ముడా, సారంగదేవుడా"! అని చాలా కాలం దుఃఖించాడు.
ఇంకా ఉంది.....
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
మీ కాకతి - రుద్రమ చదవడం మొదలు పెట్టాను. చాలా బాగా వ్రాస్తున్నారు.
నాకు కథలో అర్థం కాని విషయమేమంటే, పూర్వము రాజు కొడుకే రాజయ్యేవారు కదా మరి సారంగదేవుడిని రాజుగా చేస్తే సామంతులు ఒప్పుకోకపోవటమనే పరిస్థితి ఎందుకో అర్థం కాలేదు.
మీరు అప్పటి రాజార్హత పరిస్థితులు ఏమనేది తెలుపమని కోరుతున్నాను.
అలాగే కథలో రుద్రదేవ చక్రవర్తి గురించి తెలుపుతున్నప్పుడు, గణపతి రుద్రదేవుడి తండ్రి గారైన రుద్రదేవ చక్రవర్తి అన్నారు. అదే కొద్దిగా అర్థం కాని విధంగా వుంది. తెలుపగలరు.