top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

కాకతి రుద్రమ ఎపిసోడ్ 4

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Kakathi Rudrama Episode 4' New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము




గత ఎపిసోడ్ లో…

రుద్రమ దేవి, చాళుక్య ప్రభువు వీరభద్రుడు - ఇద్దరూ వేటకు వెళ్ళినప్పుడు కలుస్తారు.

వీరభద్రుని విలువిద్యా కౌశలాన్ని అభినందిస్తుంది రుద్రమదేవి.

పురుష వేషంలో రుద్రదేవుడిగా ఉన్న రుద్రమదేవిని తన స్నేహితుడిగా భావిస్తాడు వీరభద్రుడు.

ఇక చదవండి..

"ఓహోహో! చాళుక్య వీరభద్రప్రభు వెంత యందగాడు. ఎంతటి వీరుడీయన. ఆయన

మనముష్టి వినిర్ముక్తశరము ఇనుప కుడ్యాలనైనా భేధించుకుపోగలదు. ఆ పెద్దపులి

కళ్ళమధ్యనుంచి మెదడులోకి సువ్వున దూసిపోయింది. ఒక్క ఏటుతో గిర్రున

తిరిగిఆ అటవిరాజు నేల కూలింది. ఈ ప్రభువెంత చదువుకున్నాడు. ఎంత

శాంతము! ఏవిషయములోనూ చెక్కుచెదరడు. కోపము వీరి జీవితంలో ఎప్పుడైనా వచ్చునా?


కాని, పనిపట్టినప్పుడు మెరుము వేగాన్ని తాంబేలువేగంలా కనిపింపజేయగల అఖండ

వేగం! ఉత్తమధర్మం అంతా ఈయనలోనే మూర్తమై ఉందా! ఎంతటి మహాపురుషుడు! సింహం లాంటి బలంకలవాడు. సింహాలను కుక్కలవలె తోలగల విక్రమం గలవాడు" అని రుద్రమదేవి ఆలోచనలో చిక్కి తలవాల్చి వాలుగన్నులతో అపాంగ

వీక్షణాలు పరపుచు వీరభద్ర ప్రభువును గమనించింది.


అప్పుడామె దేవ స్త్రీయైపోయినది. ఆమెకేదో వివశత్వం కలిగినది. తానిట్లా శిఖండి వలె

ఉండడమేనా? పురుషునికి స్త్రీ వేషం తో ఉండడం ఎంత అసహ్యమో స్త్రీకి పురుష

వేషంతో ఉండడం అంత భరింపరానిదే! ఆమె జఘనఘనత్వమేమగును? ఆమె

పురుషేషంలో చిన్న బాలుడుగా కనిపిస్తుంది. ఆమె తొడలు తమ రంభాత్వాన్ని పురుషవేషంలో మాయంచేసుకోలేవు. పర్వతసానువులై, సౌంధర్యవంతమై

గంభీరమైన విశాలఫాలంతో, రక్తపుజీరలు నిండిన విశాలమైన కన్నులతో వెరగు

గొల్పే పురుషులమోము లోని పారుష్యము, నున్నగా చంద్రబింబంలా, తామరపూవు

లోని రేకలా, లేతజే చిరుగులపోవులా, ఉదయం లో మంచుతో తడిసి కాశ్మీర

కుసుమపు చేనులా- లాలిత్యపు మూటలు కట్టే స్త్రీ ముఖంలో పురుషవేషం వేసిన

ఎలా వస్తుంది.


కాని ఈ మహాభూమి శాలివాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, పల్లవులు,

కాకతీయులు ఏలిన ఈ పవిత్రమహాంధ్రభూమి తాము రాజ్యం చేయకపోతే విచ్ఛిన్న

మైపోతుంది అంటారు శివదేవయ్య దేశికులవారు. బలమైన రాజ్యం, రాజు లేకపోతే

సామంతులు పాలు విరిగినట్లు మహారాజ్యం నుంచి విడిపోతారట. ఎవరికివారే స్వ

తంత్రులు అవుతారు. ఏకత్వం లేని చిన్నరాజ్యాలు వేనకువేలు ఈ భరతఖండం అంతా

నిండి ఉంటే, వారిలో వారికి సర్వకాలాలా యుద్దాలు మండిపోతాయి. యుద్దాలవల్ల

ధర్మనాశనం అవుతుంది.


అటు సింహాద్రి నుండి ఇటు కంచి వరకు, తూర్పుతీరం నుండి కళ్యాణకటకం వరకూ తన తండ్రిగారి దివ్యచ్ఛత్రంక్రింద వికసించి ఉన్న ఈ మహాంధ్రభూమి క్రిందపడిన మృణ్మయపాత్రలా కోటి శకలాలు కావలసిందేనా?


రుద్రదేవి ఆలోచన చాళుక్యవీరభద్రుడు గమనించాడు. ఈ బాలిక, ఈ వీరయోషా

రత్నము తండ్రితో సమంగా రెండుమూడు యుద్దాలలో పాల్గొన్నది. ఎంతో కాలం

ఈమె బాలుడనే తా ననుకున్నాడు. ఎందుచేతనో ప్రధమంనుండి ఈ బాలుడు తన

హృదయం చూరగొన్నాడు. అని తానా దినాలలో అనుకొనేవాడు.


తన కామె స్త్రీ అని తెలిసినట్లు, నన్ను వీరంతా ఆమెపతిగా నిర్ణయించినట్లు

ఈ మహాబాగురాలికి తెలియదు. ఇదంతా రాజధర్మమా? చిన్నతనంలో ఈమె

బాలుడనుకొన్నదినాలలో తనకు కలిగిన స్నేహవిరహవేదన ప్రేమవిరహవేదన

కాబోలు!యువకుని జ్ఞానం నిజం గ్రహించలేకపోయినా, హృదయం గ్రహించగలిగింది.

ఆమె చక్రవర్తి. తాను సాధారణ సామంతుడు. తన్నేల ఆమె ప్రేమించవలెను?


బాలికయైనా ఆమె పరిపాలనా జ్ఞానమూ, దక్షతా వర్ణనా తీతము. బాలికయై కూడా బాలుని

వేషంలో ఎంత అందంగా ఉన్నది. ఈమెలో సత్యభామాదేవి అందాలన్నీ కూడుకొని

ఉన్నాయి. ఈమెలో లలితాదేవి మహాసౌందర్యము మూర్తీభవించింది. ఆదిశంకరుల

వారు ( భారతీ తీర్థ స్వామి) రచించిన సౌందర్యలహరే ఈమెగా మూర్తీభవించినది.

పురుషవేషంలో ఉన్న ఈ మహాదేవి తన నడకలో, తన ఠీవిలో, తన మాటలలో,

తన అశ్వారోహణ నైపుణ్యం లో ఈషణ్మాత్రం ఇటు బాలికాత్వానికి గాని అటు పురు

షత్వానికి గాని అపశ్రుతి కలిగించటం లేదు.


ఇద్దరూ ఇలా వేరు వేరు ఆలోచనలతో గుర్రాలను నడుపుకుంటూ వస్తున్నారు.

ఈయన తన్ను బాలికఅని గ్రహించాడా అనుకున్నది ఆమె. స్త్రీ అని గ్రహిస్తే తనకు

ఎప్పుడూ లేని భయమూ, సిగ్గూ వస్తూందేమో! ఈయన అంటే తనకింత ప్రీతి

ఏమి? ఇంతలో యువరాజు అంగరక్షకులు తంత్రపాల మల్లినాయకుడు, విరియాల

ముమ్మడిరాజు అక్కడికి అశ్వాలపై స్వారి అవుతూ వచ్చారు. భటులు, వేటకాండ్రు,

సైనికులు, బోయమన్నీలు, కోయదొరలు రుద్రదేవమహారాజు కడకు వచ్చారు.

అందరూ కలిసి అక్కడ దగ్గరఉన్న తమకు విడుదులు ఏర్పరచబడిన ఒక పల్లెకు

వేంచేసినారు. ఆ విడుదులలో తాటియాకుల గుడిసెలలో యువ మహారాజును

శ్రీచాళుక్యవీరభద్రప్రభువు రక్షించిన సంఘటననే చెప్పుకొనుచుండిరి.


" ఆ పెద్దపులి ఎక్కడనుండి వచ్చినది?"

" ఆకాశం నుండి ఉరికినట్లు వచ్చింది".

" మన వాళ్ళెవరూ ఆ వైపు కాపు ఉండలేదు. ఆ వైపునంచే ఠీవిగా నిర్భయంగా

నడిచివచ్చింది".


" ఎదురుగుండా మహారాజులు కనపడ్డారు. గాండ్రుమని ఆ పెద్దపులి వారిమీద ఉరి

కింది. బాణాలు ఎక్కుపెట్టే వ్యవధి లేక కత్తి దూశారు వారు. ప్రక్కనే ఉన్న వీరభద్ర

రాజులు పెద్దపులిపై సువ్వున బాణం వేస్తే ఆ పెద్దపులి ఒక దొర్లు దొర్లి పడింది. "


" అవును! మళ్ళీ చెంగునలేచి వీరభద్ర మహారాజు పైన దుముకబోతే కళ్ళ మధ్య

నుంచి దూసిపోవ బాణం వేశాడు. "


ఈ విధంగా విడుదులన్నింటిలో మహారాజు ను రక్షించినందుకు చాళుక్యభూపతిని

పొగిడినారు. గండం తప్పినందుకు భగవంతుని ప్రార్థించారు.


ఇంతలో ఎక్కడనుండో ప్రసాదిత్యనాయని వారు సంరంభంగా విచ్చేసారు. ఆయన

శ్రీరుద్రదేవమహారాజువారికి నమస్కరించి " ప్రభూ! నేనూ తమతో వేటాడాలని

అంచెలలో వచ్చాను" అని మనవి చేశారు. రుద్రదేవప్రభువు తమ తండ్రిగారైన

సార్వభౌముని గూర్చి అడిగినారు.


ప్రసాదిత్య ప్రభువు రెండు దినాలవేట ఆనందాన్ని పొంది అక్కడినుండి రుద్ర

ప్రభువుతో కలిసి ఓరుగల్లు పయనమయ్యెను.


కాకతీయరాజులు, వారి సామంతులు ఆంధ్రభూమిలో అనేక మహాసరోవరాలు

నిర్మంచారు. వ్యవసాయం వృద్ధి చేశారు.


వీరి ప్రయాణంలో అనేకమగు చెరువులు, గ్రామాలు చూస్తూ ప్రయాణం చేశారు. తమ

భావి చక్రవర్తి యువరాజు శ్రీరుద్రదేవుడు వస్తున్నారని గ్రామాలకు తెలియగానే ప్రజలు

ఉత్సవాలతో ఎదుర్కొనే వారు. పళ్ళు, పూవులు, కూరగాయలు, బలిసిన మేకపోతులు,

పోతరించిన కోడిపుంజులు, ముత్యాలులా మిలమిల లాడే రాజనాలు తెచ్చి ప్రభువు

నకు ప్రజలు ప్రాభృతము సమర్పించుకునేవారు.


భూమి ప్రజలది. ఆ భూమిని సంరంక్షించినందుకు ప్రభువు ఆరవభాగం పన్ను

తీసుకునేవాడు. ఆ పన్నైనా ప్రజలకోసమే ఖర్చు. ఆ దినాలలో వ్యవసాయం

అనేరరీతులుగా చేసేవారు.


ఇంక ప్రభువుకి వచ్చే రాబడి సుంకాలు, అడవులు, గనులు, సొంతభూములు మాత్రమే.

వ్యవసాయం ఏ కరవు వచ్చి పంట పండకపోయినా, ఆ పంట సగం పండినా

వ్యవసాయదారులు పన్ను చెల్లించనవసరం లేదు.


ఈ విషయాలన్నీ గమనిస్తూ రుద్రదేవులు, ప్రసాదిత్యులను, చాళుక్య ప్రభువు

లను ప్రశ్న లడుగుతూ అనుమానాలు అంతరింపచేసుకుంచూ ప్రయాణం చేస్తున్నారు.

----------------------------------------------------

తాను స్త్రీనని, తను ఈ పురుష నటనా జీవితాన్ని వదిలివేసే క్షణం ఆసన్నమైందని,

రుద్రమదేవి భావించింది.

ఎంతకాలం ఈ నటన? ఇది ఎంత అమానుషము!


వరదవలె ఉధృతమై ఉప్పొంగి, తన రక్తనాళాలు తెంచుకుని వికసించబోయే పరి

మళభరితమైన పువ్వుకుమల్లె - తూర్పు మబ్బును కదిలించి - మెరిపించి,

ఉదయించబోయే ఉదయ సంధ్యకీమల్లే- తనలోని యవ్వన హేల - తనని కోరికల

మధ్య ఊపిరిఆడనివ్వక చంపకుంటే - ఎట్లా తను నిలవగలుగుతుంది.!


తాను చక్రవర్తి కూతురు కావచ్చును. భావి చక్రవర్తిణి కావచ్చును. ఈ విశాల కాకతీ

సామ్రాజ్యానికి తను తిరుగులేని మహారాణి కావచ్చును. కానీ యిన్ని వుండి, తన

స్త్రీత్వం తనలోని లాలిత్వం, నిర్దయగా, ఈ రాజ్యపు క్రూరకట్టకులకింద, ఈ పరదాల చాటునా అంతరించిపోతే!!------

ఇదేమి క్రీడ?

ఇదేమి అన్యాయము?

ఉహూ, అట్లా జరగడానికి వీలులేదు!

చాళుక్యవీరభద్రుడు చూపులతో ప్రతీ బాగాన్నీ రసప్రఫుల్లం చేశాడు. ఒక ఉన్మత్త

స్థితి, ఒక విభావరి. ఒక ఆనందడోల;


" ఓ పురుషవేషధారిణీ; యిహ నీ ఉక్కు కవచాన్ని విసర్జించు. అతి సుందరమైన నీ

సౌందర్యాన్ని ప్రదర్శించు నీవు దాయలేనిది దాయకు. నీవు యివ్వగలిగినది ఇవ్వక

తప్పదు" అని మనస్సు హెచ్చరిస్తున్నది .


ప్రేమకు యింతటి బలము వుంటుందని, మనస్సుకు యింతటి కదలబారే

స్వభావం వుందని తెలిసింది ఆమెకు యిప్పుడే.!

ఇన్ని ఆలోచనలు ఆలోచిస్తూనే వుంది.

ఇంతలో కోట ద్వారం రానే వచ్చింది.

రుద్రమదేవికి కోట ద్వారం దగ్గరే, అఖండస్వాగతం పలికారు. వీర గీతాలు ఆల

పించారు.


" మా ప్రభువులి మా రాజు మహావీరుడయ్య

అరి వీరులకు ఆజి అపరరుద్రుడు

శౌర్యాన అర్జునుడు ధైర్యాన నంది

వీర్యాన భైరవుడు వితరణ దధీచి

జయజయా జయజయా జయరుద్రదేవ

జయకాకతీవంశ జలరాశిచంద్ర".


ఆమె ముఖమున మున్నెన్నడు కానరాని మెరపు, మెరపుతో తళ తళ లాడుతున్న

విశాల నేత్రాలు.

ఆమె గంభీరంగా గుర్రం దిగింది. అంతకన్నా గంభీరంగా- యువరాజువలె నడచి

వచ్చింది.


ఆమె నడచిన మార్గాన పువ్వులు జల్లుతున్నారు.

ఆనందకోలాహలోత్సవాలు, గీతాలు, వాయిద్యాల మోతలు. ఎటు చూసినా

సందడే. సంరంభమే.

ఇంకా ఉంది.....


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


99 views1 comment

1 Comment


balakameshwararao
balakameshwararao
Jul 17, 2022

Nice story telling

Like
bottom of page