top of page

కాల వాహినిలో - పార్ట్ 15

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #KalaVahinilo, #కాలవాహినిలో, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika


'Kala Vahinilo - Part 15'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 19/10/2024

'కాల వాహినిలో - పార్ట్ 15' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల. గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు. 


ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలను కుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య. తన చిన మామయ్య రఘునందన్ రావు మరణంపై పరిశోధన ప్రారంభిస్తుంది. కొత్తగా వస్తున్న జిల్లా కలెక్టర్ పేరు చందా సింగ్ అని తెలియడంతో తన బావ చంద్రం గుర్తుకు వస్తాడు కావ్యకు.


తిరుమల, కావ్యాలకు తానే చందూనన్న విషయం చెబుతాడు చందా సింగ్. తిరుమల దివ్యల వివాహం గురించి నందాదేవితో మాట్లాడుతానంటాడు.


ఇక కాల వాహినిలో.. పార్ట్ 15 చదవండి. 


కలెక్టర్ చందాసింగ్... ఐదుగంటలకు లేచి తన దినచర్యలో మొదటి భాగమైన యోగా, కాలకృత్యాదులు, స్నానంచేసి వరండాలోకి వచ్చారు. ఆ ఉదయం నుంచీ చందాసింగ్ చాలా ఆనందంగా వున్నారు. దానికి రెండు ముఖ్య కారణాలు.... తనను పెంచి చదివించి ఇంతటి వాణ్ణి చేసిన తన మారు తల్లిదండ్రులు ఇక్కడికి తనను చూడాలని వస్తున్నారు. ఇది మొదటిది. రెండవది..... తాను పన్నెండు సంవత్సరాల అనంతరం తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తన ఇంట కలుసుకొనబోతున్నాడు.


సెల్ మ్రోగింది.


"బావా! గుడ్ మార్నింగ్!"


"గుడ్ మార్నింగ్ చిన్నీ... చెప్పు"


"అమ్మా నాన్నలతో చెప్పనా!"


"వద్దు అన్నాను కదా!"


"నా సంతోషాన్ని చూచి వారు కారణం అడుగుతున్నారు."


"చిన్నీ!.... కొన్ని గంటలు ఓపిక పట్టు, సరేనా!"


"సరే! బావా ఈ పిల్ల..."


"ఆ... ఏ పిల్ల!"

"దివ్య నీతో మాట్లాడుతుందట"


"ఓహో.... సెల్ ఇవ్వు"


"నమస్తే సార్!"


"దివ్య కదూ!"


"అవును సార్!"


"సార్ కాదమ్మా! అన్నయ్యా" చిరునవ్వుతో చెప్పాడు చందాసింగ్.


"మీరు నాకు పెండ్లి చేయాలి" దీనంగా అడిగింది దివ్య.


"తప్పకుండా. నీవు కోరిన వాడితో.. అదే... మన తిరుమలతో నీ వివాహం జరిపిస్తాను" నవ్వుతూ చెప్పాడు చందాసింగ్.


"చాలా సంతోషం అన్నయ్యా! ధన్యవాదాలు"


"దివ్యా! నీ నోటి తెలుగు పలుకులు వినడానికి ఎంతో మధురంగా ఆనందంగా వున్నాయి."


నవ్వింది దివ్య... "నేను మిమ్మల్ని కలిసేందుకు వస్తున్నా అన్నయ్యా!"


"కలుద్దాం రా!" సెల్ కట్ చేశాడు చందాసింగ్.


ఆటో దిగి పరుగున దివ్య కలెక్టర్ బంగళాలోనికి ప్రవేశించింది. ఓ గదిలో కూర్చోబెట్టాడు దివ్యను చందాసింగ్.


టైం ఏడు యాభై అయిదు.....

నందాదేవి కారు గేటు ముందు ఆగింది.

గుర్ఖా వరండావైపు చూచాడు.


’లోనికి వదులు’ అన్నట్టు చందాసింగ్ ఎడం చేతిని పైకెత్తి లోనికి వెళ్ళిపోయాడు. 


నందాదేవిగారి కారు లోనికి ప్రవేశించింది. పోర్టికో వద్ద ఆగింది. నందాదేవి కారు దిగి వరండా వైపు చూచింది. ఐదు మెట్లు ఎక్కింది. 


కాలింగ్ బెల్ నొక్కాడు డ్రైవర్.

పాండు వచ్చి తలుపు తీశాడు.


"కలెక్టరు గారికి మా అమ్మగారు వచ్చారని చెప్పండి" అన్నాడు నందాదేవి డ్రైవర్.


పాండు లోనికి వెళ్ళి చందాసింగ్‍తో విషయం చెప్పాడు.

"లోనికి పిలువు" అన్నాడు చందాసింగ్.


కొన్ని సెకండ్లలో నందాదేవి సింహద్వారాన్ని సమీపించింది.

ద్వారం ముందు నిలబడివున్న నందాదేవిని సగౌరవంగా ’ప్లీజ్ కమ్!" అంటూ ఆహ్వానించాడు చందాసింగ్.


నందాదేవి హాల్లో ప్రవేశించింది.


"టేక్ యువర్ సీట్"


నందాదేవి సోఫాలో కూర్చుంది.


"వాట్ డూ యు లైక్ టు హ్యావ్... కాఫీ... టీ... మిల్క్"


"నథింగ్ ఎట్ దిస్ టైమ్"


ఆమెను ఎదుటి సోఫాలో కూర్చుని కొన్ని క్షణాలు ఆమె ముఖంలోనికి పరీక్షగా చూచాడు.


"దిస్ మీటింగ్ ఈజ్ నాట్ అఫీషియల్. హ్యావ్ టు గో బ్యాక్ ట్వెల్వ్ ఇయర్స్. అందమైన గండవరం గ్రామం. సత్యానందరావు, రఘునందరావు అన్నదమ్ములు. యశోధనులు, కృష్ణారావుగారు వారి తండ్రిగారు. పదునెనిమిది ఏళ్ళ వయసున్న సత్యానందరావుగారి కొడుకు ’చంద్రశేఖరరావు’. 


వాడు.... ఆ వాడే వీడు... గుర్తువున్నాడా మేడమ్ గారూ!" చిరునవ్వుతో అడిగారు చందాసింగ్.


ఇంగ్లీషు నుంచి తెలుగులో ప్రసంగం ప్రారంభించిన చందాసింగ్‍ను చూచి ఆశ్చర్యపోయింది. చివరగా వారు ’గుర్తున్నాడా’ అన్న చందాసింగ్ ప్రశ్నతో అతను సత్యానందరావు కుమారుడు చంద్రశేఖరరావు అని గ్రహించింది. ఓరకంట అతని ముఖంలోనికి భయంతో చూచింది. శరీరానికి చిరుచెమట.


"ఇప్పుడు మీ వయస్సు ఎంత?" చంద్రం ప్రశ్న.


ఉలిక్కిపడింది నందాదేవి.


"ఎంత నందాదేవి గారూ! యాభయ్యా!"


"కాదు ఫార్టీ టూ"


"మైనస్ ట్వెల్... థర్టీ కదా!"


"అవును"


"థర్టీలో పదునెనిమిది పోతే ఎంత?"


ఆమె ముఖంలో అవమానభారం, ఆవేశం....


ఆశ్చర్యంతో చూచింది చంద్రం ముఖంలోకి నందాదేవి.

ఆన్సర్ చెప్పండన్నట్టు కళ్ళు ఎగరేశాడు చంద్రం.


"ట్వెల్వ్" అంది ఆవేశంతో యాంత్రికంగా నందాదేవి.


"కైకేయి మూలంగా శ్రీరాముడు సీతామాత లక్ష్మణులు పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేశారు."


"నా పాలిట కైక నందాదేవి మీరు... అవునా కాదా?"


నందాదేవి ఉలిక్కిపడింది. ఆమె ముఖమంతా చెమట. ముఖం కళావిహీనం తలదించుకొంది.


"నందాదేవిగారూ! కైకకు తన కుమారుడు రాజు కావాలనే ఆశ... మీకు మీ తండ్రిగారికి ఎదురు ఉండకూడదనే కోర్కె. మీ ఆ కోర్కె తీరేటందుకు పద్దెనిమిది సంవత్సరాల నేను ముఫ్ఫై సంవత్సరాల మిమ్మల్ని బలత్కారం చేసినట్టు ఎలా చెప్పగలిగారు? 


గతం గతః! నేను అడిగే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పి మీరు వెళ్ళిపొండీ. మీ తత్వం పన్నెండేళ్ళ క్రితం లాగానే వుందా లేకా మారిందా? పగ... ద్వేషం చంపడంలోనే మీకు ఆనందమా!.... వేరే మార్గంతో మీరు ఆనందాన్ని పొందలేరా!... రాక్షసతత్వంతో మా చిన్నాన్నను చంపారు. దానికి మీ సమాధానం?"


టీపాయ్‍పై వున్న ల్యాప్‍టాప్‍లో సి.డి ఉంచి స్విచ్‍ని ఆన్ చేశాడు.


జోగయ్యా, మీరా, సోమయ్య చెప్పిన యదార్థాలను విని నందాదేవి బెదిరిపోయింది. రఘునందారావు తన తండ్రి, అన్నల వల్లనే చనిపోయాడనే సత్యాన్ని గ్రహించింది. హృదయం ద్రవించి కన్నీళ్ళుగా మారింది.


మదిలో బాధ, అవమానం, అసహాయతతో ఏడ్చింది.

లాప్‍టాప్‍లో సి.డి ఆగిపోయింది.


"ఇక్కడినుంచి పోయేటప్పుడు పదవి, గొప్ప హోదాతో తిరిగి వచ్చి మీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకొన్నాను. కాలగతిలో సత్యా సత్యాలను గ్రహించాను. మంచి మనిషిగా బ్రతకాలని నిర్ణయించుకొన్నాను నందాదేవిగారు."


"మీ దివ్యకు మా తిరుమలరావునిచ్చి వివాహం జరిపిస్తే ఈ ’ఈ ట్వంటీ 20లో మన వూరంతా ఒకటవుతుంది. కాదని ఆ పిల్లను మీ అన్నకు నచ్చిన కావలి సంబంధంతో చేయాలనే నిర్ణయానికి వస్తే దివ్య చచ్చిపోతుంది. మన కుటుంబాల మధ్యన వున్న పగ, ద్వేషాలు అలాగే కొనసాగుతాయి. అలా జరగడం నాకు ఇష్టంలేదు నందాదేవిగారు" అని బిగ్గరగా చెప్పి రెండు క్షణాల తర్వాత మెల్లగా....


"ఇక మీరు వెళ్ళవచ్చు ఏ దారిన నడవాలనుకుంటున్నారో రేపటివరకు ఆలోచించుకోండి. నా దారి నచ్చితే రేపు ఉదయం మీరు, మీ సోదరుడు, వదినా ఏడుగంటలకల్లా మా ఇంటికి రావాలి."


"దివ్యా!" పిలిచాడు చంద్రం.


దివ్య వచ్చింది. అత్త నందాదేవిని చూచి తలదించుకొంది.

"దివ్యా!... మీ అత్తయ్యగారితో వెళ్ళు"


నందాదేవి మౌనంగా వరండా వైపునకు నడిచింది. బిక్కముఖంతో దివ్య ఆమెను అనుసరించింది. డ్రైవర్ డోర్ తెరిచాడు. నందాదేవి వెనుక, డ్రైవరు పక్కన దివ్య కూర్చున్నారు. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు.

విక్రమ్ చందాసింగ్ పెంపుడూ తండ్రి తల్లినీ చెన్నై నుంచి కార్లో తీసుకుని వచ్చాడు.


వారిని చూడగానే ఎదురేగి.... ఇరువురికి పాదాభివందనం చేశాడు చందాసింగ్. మనసారా దీవించారు ఆ దంపతులు. పరస్పరం క్షేమ సమాచారాలు మాట్లాడుకొన్న తర్వాత వారితో కలిసి టిఫిన్ తిని చందాసింగ్ ఆఫీసుకు బయలుదేరాడు.


నందాదేవి కలెక్టర్ బంగళా దాటి రోడ్ మీదకు వచ్చింది. అన్న రాంబాబు గారి ఫోన్....

"నందూ!..."


"చెప్పరా!"


"నాన్నకు జ్వరం, దగ్గు, జలుబు ఏం బాగాలేదు!"


"కరోనానా!" ఆశ్చర్యంతో అడిగింది నందాదేవి.


ఆ మాటలు విన్న దివ్య "అత్తయ్యా! తాతయ్యకు కరోనానా!" కన్నీటితో విచారంగా అడిగింది.


"నందూ! నాన్నను నెల్లూరికి తీసుకొని వస్తున్నాను."


"సరే. ఎంతసేపట్లో రాగలవు?"


"అరగంటలో!"


"సరే! జాగ్రత్తగా రా నీతోటి ఎవరున్నారు?"


"లక్ష్మి"


"భయపడకురా"


"హాస్పిటల్ దగ్గర నేనుంటాను"


"సరే!"


నందాదేవి హాస్పిటల్‍కు పావుగంటలో చేరింది. ఆ తర్వాత పావుగంటకు రాంబాబు వచ్చాడు.


సుబ్బారాయుడుగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.


డాక్టరు పరీక్షించి ప్రథమ చికిత్స తరువాత ఇవి కరోనా లక్షణాలేనని చెప్పాడు. దానికి తగిన ట్రీట్‍మెంటు ప్రారంభించారు.


సుబ్బారాయుడుగారి వయస్సు 80 సంవత్సరాలు. గట్టిమనిషి అయినా వయస్సురీత్యా ఆపాదించిన వ్యాధి రీత్యా అందరికీ భయం ఏర్పడింది. 


డాక్టర్‍లను జాగ్రత్తగా చూడవలసిందని ఎంతో వినయంతో రాంబాబు, నందాదేవీలు కోరారు.

"నిర్భయంగా ఉండండి, దేవుని ప్రార్థించండి. మా విధులను మేము సక్రమంగా నెరవేరుస్తాము" అంటూ వారు హామీ ఇచ్చారు. నందాదేవి తనకిష్ట దైవమైన షిర్డీ సాయిబాబాను వేడుకొంది. చందాసింగ్ గారికి ఫోన్ చేసి కారణం చెప్పి ఈరోజు మీటింగ్‍కు రాలేనని చెప్పింది.

కలెక్టర్ ఆఫీస్.... కాన్ఫరెన్స్ హాల్.....

జిల్లా అన్ని శాఖల ముఖ్య అధికారులు జిల్లా పరిషత్ ముఖ్యులు. కలెక్టరు గారి మీటింగ్‍కు హాజరైనారు. అందరూ కూర్చొనివున్నారు.


కలెక్టర్ చందాసింగ్ ప్రవేశించి తన కుర్చీ ముందు నిలబడి అందరికీ నమస్కరించారు. కూర్చుని వున్నవారు లేచి వారికి ప్రతినమస్కారం చేశారు.


"పెద్దలందరికీ నా నమస్కారాలు. పిన్నలందరికీ నా శుభాశీస్సులు. ఇది ఒక అత్యవసర సమావేశం. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీలో చాలామందికి తెలిసినవే.


ప్రపంచంలో వున్న దేశాలు 197. జనాభా 730 కోట్లు. భాషలు 6500. మతాలు 4200. సృష్టిలో వున్న అన్నిరకాల జీవరాసుల సంఖ్య 84 కోట్లు.


అందులో మానవుడు, మనం మహోన్నతులం. ఆ సర్వేశ్వరుడు మనకు ప్రసాదించిన వేరే జీవరాశికీ లేని గొప్ప లక్షణాలు, ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి, మంచీ చెడుల విచక్షణా శక్తి, మృధుమధురంగా మన మనోభావాలను ఎదుటి వారికి తెలియజేయగల మహాశక్తి ఈ నాలుగు మన సొంతం. వీటిని స్వాధీనంలో వుంచుకొనే మన పూర్వీకులు ఎన్నో అద్భుతాలను సాధించారు. వాటి ఫలితాలను సాటి మానవ సముదాయానికి అందించారు. తమ విజయానికి ఆనందించారు. 


కానీ... కొందరు స్వార్థం, ఈర్ష్య, జుగుప్సలతో తమలో వున్న ఆ దైవిక గుణాలను విస్మరించి సాటివారిని వారూ తమలాంటి వారే అనే ఐక్యతాభావనకు వ్యతిరేక రీతిలో హింసించి వారికి నష్టం, కష్టం కలిగించి తాము ఆనందాన్ని పొందాలనే దుష్టచింతన, ఆకాంక్షతో మనదేశం పట్ల మన హైందవ ప్రజానీకం పట్ల చిన్నచూపుతో వర్తిస్తున్నారు’.. అంటూ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు చందు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


24 views0 comments

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page