top of page

కాల వాహినిలో - పార్ట్ 16

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #KalaVahinilo, #కాలవాహినిలో, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika



'Kala Vahinilo - Part 16'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 25/10/2024

'కాల వాహినిలో - పార్ట్ 16' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




జరిగిన కథ:


సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల. గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు. 


ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలను కుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య. తన చిన మామయ్య రఘునందన్ రావు మరణంపై పరిశోధన ప్రారంభిస్తుంది. కొత్తగా వస్తున్న జిల్లా కలెక్టర్ పేరు చందా సింగ్ అని తెలియడంతో తన బావ చంద్రం గుర్తుకు వస్తాడు కావ్యకు.


తిరుమల, కావ్యలకు తానే చందూనన్న విషయం చెబుతాడు చందా సింగ్. తిరుమల, దివ్యల వివాహం గురించి నందాదేవితో మాట్లాడుతాడు.


కలెక్టర్ ఆఫీసులో కోవిడ్ గురించి తన ఉపన్యాసం ప్రారంభిస్తాడు.


ఇక కాల వాహినిలో.. పార్ట్ 16 చదవండి. 



తన ఉపన్యాసం కొనసాగిస్తున్నాడు కలెక్టర్ చంద్రాసింగ్.


“ఆంధ్రరాష్ట్రంలో 1610లో జన్మించి 1693లో జీవసమాధి పొందిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములు వారు రచించిన భవిశ్యవాణి - కాలజ్ఞాన తత్వంలో ఈ కరోనా ఈ 2020లో ప్రపంచాన్ని చుట్టుముట్టి లక్షల్లో జననష్టం జరుగుతుందని వ్రాశారు. వారు సాక్షాత్తు పరమేశ్వర అంశా స్వరూపులు. త్రికాల వేదులు, సుచరిత్ర పురుషులు, మహనీయులు, సద్గురువులు.


ఏనాడో అద్వితీయ విజ్ఞానం పుట్టింది ఈ మన భారతదేశంలోనే. అందుకు కారణభూతులు మన భారతీయులే. ఎందరో మహా ఋషులు, విజ్ఞానదాతలు మహోన్నత కీర్తిశేషులు మనకందరికీ పూజనీయులు. 

అనంతరం తరతరాల విదేశీ పరిపాలనలో ఎన్నో నిధి నిక్షేపాలు ఆ ముష్కరుల పాలైనట్లుగానే ఆ మహోన్నత అద్వితీయ శాస్త్ర రచనలూ విదేశీయుల పాలైనాయి. సైన్స్ విజ్ఞానం పేరుతో వారు పేర్లు ప్రపంచంలో మారుమ్రోగాయి. వారి ఆ అభివృద్ధి సాధనకు బీజం హైందవ ఈ భారత విజ్ఞానమే కారణం.


క్రీ.శ 1800 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో చిత్తూరు కలెక్టరుగా సర్. థామస్ మన్రో వచ్చిన సందర్భంలో ఆయన వీక్షించి ఆశ్చర్యపోయిన ఎప్పుడో జరిగిన మహోన్నత సంఘటన ఇది. ఆ ప్రాంతంలో ఉన్న గండిలోయలో వాయుదేవుడు ధ్యానంలో వున్న సమయంలో ఆంజనేయ స్వామి శ్రీలంకకు సీతామాతా అన్వేషణలో వెళుతుండగా ఆ విషయాన్ని గ్రహించిన పవనదేవుడు ఆంజనేయ స్వామిని కొంత సమయం ఇక్కడ విశ్రమించి బయలుదేరమని అనగా ’తాను స్వామికార్యంలో కార్యసాధన పూర్తి అగువరకు విశ్రమించేది లేదని’ పవనసుతుడు ముందుకు వెళ్ళిపోయాడు.


విజయాన్ని సాధించి వీరాంజనేయస్వామి తిరిగి వస్తాడని తెలిసిన వాయుదేవుడు ఆ గండిలోయపైన ఆంజనేయ స్వామికి స్వాగతం పలుకుతూ బంగారు ఆకుల తోరణాన్ని ఏర్పాటు చేశాడట.


మద్రాసులో గవర్నరుగా ఉండి చివరి దశలో చిత్తూరు కలెక్టరుగా వచ్చే సమయంలో వారికి ఆ బంగారు తోరణం కనిపించగా ఆశ్చర్యంతో అదేమిటని అక్కడివారిని అడిగి పైకథను తెలిసికొన్నారుట. థామస్ మన్రోగారికి మన హైందవ పురాణాలన్నా, విధానాలన్నా ఎంతో గౌరవం. వారి ఆ మహోన్నతత్వ కారణంగా వారికి ఆ మహోన్నత గౌరవం అది హైందవ తత్త్వాన్ని గౌరవించే వారికి సంక్రమించే మహోన్నత.


అలాగే లియో టాల్‍స్టాయ్ 1820-1890లో రష్యా వైజ్ఞానికుడు మన భారతావనిని సందర్శించి జ్ఞానము, విజ్ఞానాల కలయికే ’హిందూమతం’ అని, వారి వ్రాతప్రతుల్లో వ్రాశారు.

ఈస్టిండియా లండన్ కంపెనీ విక్టోరియా మహారాణిచే నియమించబడ్డ గవర్నర్స్ మన దేశాన్ని పాలించారు. అమూల్యమైన సంపదను దోచుకున్నారు. కానీ వారిలోనే థామస్ మన్రో లాంటి మహనీయులు కొందరున్నారు. 

ఆదినుండి మనకు రష్యాకు సత్సంబంధాలు. లియో టాల్‍స్టాయ్ వ్రాతలవలన ఆదేశంలోని జనం ’మన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని’ తెలిసికోగలిగారు. 

శ్రీ వివేకానందస్వామి చికాగో మహానగరంలో 1893లో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో అద్వితీయంగా మన హైందవజాతి ఔన్నత్యాన్ని మన తత్వంలోని అర్థపరమార్థం, దీక్ష యోగ, అద్వైత సిద్ధాంత గొప్పతనాన్ని విశిష్టతను వారికి తెలియజేసి ఆ దేశంలో పలుచోట్ల పర్యటించి, శ్రీరామకృష్ణ పరమహంస వారి గురుదేవుల ముఠాలను స్థాపించగలిగారు. ఎందరో తెల్లవారు స్త్రీ పురుషులు మన వివేకానందస్వామికి శిష్యులైనారు.


స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సరిహద్దు తగాదా మనకూ, చైనాకూ 1967లో జరిగింది. మనకు స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి వారు పాకిస్తాన్‍కు హితులైనారు. మనలను చిన్నచూపు చూస్తున్నారు.


మనదేశ మిలటరీ ట్రైనింగ్ విధానానికి ఈ కింది సంఘటన ఒక ఉదాహరణ. 


1965 భారత్ పాక్ యుద్ధపు చివరి రోజులు. పాకిస్తాన్ ఆయూబ్ ఖాన్ పాలన. మనదేశంలో నెహ్రూజీ ప్రధానమంత్రి. మన యుద్ధ వైమానికుడు కె.సి నంద కరియప్ప వారి విమానం ఫెయిలైన కారణంగా పాకిస్తాన్ సైన్యానికి దొరికిపోయారు. ఈ విషయం పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్సుకు తెలియజేశారు. వారు నందాగారిని మీ తండ్రి ఎవరని అడిగారు. ఫీల్డ్ మార్షల్ జనరల్ కరియప్ప (భారత సింహం) అని నందా జవాబు చెప్పారు. ఆ పేరు వినగానే పాక్ ఆర్మీ హెడ్ నందాను విడిచిపెట్టండని సిపాయిలను శాసించాడు. కారణం విభజనకు ముందు ఆ వ్యక్తి జనరల్ కరియప్ప కిందపనిచేసి.. వారి శక్తి సామర్థ్యాలను గుణగణాలను ఎరిగిన మనిషి.


సిపాయిల మాటకు జవాబుగా వైమానికుడు కె.సి నంద కరియప్ప ’నాతో పాటు పట్టుకొన్న నా వారినందరినీ వదలండి. నేను ఒక్కడినే పోను’ అన్నాడు. 


ఇది ఆ వీర నందకరియప్ప జవాబు.


ఆ తెగువ.. సాహసం మన వీర జవానుల తత్త్వం. మన చుట్టూ ప్రస్తుతంలో వున్న జటిల సమస్యలు కరోనా వైరస్ వ్యాప్తి, పాకిస్తాన్ చైనీయుల బేధ వైర భావాలు.. ఆక్రమణ.

ఈ విషమ పరిస్థితుల్లో కరోనా సోకి బాధపడుతున్న వారిని రక్షించేటందుకు మన దేశ రాష్ట్ర డాక్టర్లు.. నర్స్ లు పబ్లిక్ హెల్త్ వాలెంటరీ సర్వీస్ సిబ్బంది పోలీసులు ఎంతగానో పాటుపడుతున్నారు. రోజుకు ఇరవై గంటలకు పైగా కొందరు ఇరవైనాలుగు గంటలూ శ్రమిస్తున్నారు. వారిలో స్త్రీలు వున్నారు. పురుషులు వున్నారు. వివాహితులు ఉన్నారు.. అవివాహితులు ఉన్నారు. వారందరి లక్ష్యం కరోనా బాధితులను కాపాడటం. 


ఇంతవరకూ మీ అందరి మనస్సుల్లో వున్న ప్రశ్న నా గురించి!.. నేను ఎవరనేది? నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గండవరం వాస్తవ్యులు. శ్రీ సత్యానందరావు గారు. మా అమ్మగారి పేరు సావిత్రి. మాట పట్టింపుతో పన్నెండు సంవత్సరాల కిందట ఇంటిని, వూరిని వదలి వెళ్ళిపోయాను. పార్వతీ పరమేశ్వరుల వంటి దంపతుల ఆశ్రయం వారణాసిలో లభించింది. వారు నన్ను తమ బిడ్డగా భావించారు. నా ఇష్టప్రకారం. నన్ను కలెక్టరుగా చేశారు. 


ఏ ఆశయంతో ఇంటిని విడిచి వెళ్ళానో.. ఆ ఆశయాన్ని సాధించాను. నా జన్మభూమికి తిరిగి వచ్చాను. ఐయామ్ ఏ స్పెషన్ కలెక్టర్ విత్ స్పెసిఫిక్ పవర్స్. డైరెక్‍ట్లీ రిపోర్టింగ్ టు ది గవర్నర్. మీ అందరికీ నా మనవి. ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారి హోదాకాలం ఐదు సంవత్సరాలు. కష్టపడి చదివి పరీక్షలు వ్రాసి గవర్నమెంటు ఉద్యోగాన్ని సంపాదించుకొని సక్రమంగా ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చవలసిన వారిని మీ అవసరాల దృష్ట్యా లంచగొండ్లుగా మార్చకండి. లంచం ఇవ్వడం నేరం, తీసుకోవడమూ నేరం. అలాంటి కేసులు నా దృష్టికి వస్తే వారి కథ ముగిసిపోతుంది.


ఆల్ ఆఫీసర్స్! మీరు మీ ఉద్యోగ ధర్మాలను నిర్భయంగా నిష్పక్షపాతంగా సకాలంలో నెరవేర్చాలి. మిమ్మల్ని ఎవరైనా వారి అవసరాలు త్వరగా మీ మూలంగా పూర్తిచేసుకునే నిమిత్తం ’నేను ఫలానా తాలూకా ఎం.పి, ఎం.ఎల్.ఏ ఛైర్మన్ కౌన్సిలర్ మొదలైన పేర్లను చెప్పి బెదిరించినట్లయితే ప్లీజ్ రిపోర్ట్ మి ఇమ్మీడియట్లీ. వారి ఆ హోదా ఇరవైనాలుగు గంటల్లోపల వారికి దూరం అవుతుంది. 


ముఖ్యంగా వాటర్ సప్లై డ్రైనేజీ పైప్‍లైన్స్ వేసే కొన్ని ప్రాంతాల్లో ఆ వీధిలో ఎవరో ఓ హీరో.. పనిచేసేవారికి అంతరాయం కలిగించి డబ్బును డిమాండ్ చేస్తున్నట్లు విన్నాను. ఇంజనీరు కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఆ వీధిని, ఆ వీధిలోని ఇండ్ల శుభ్రతకు పాటుపడుతూ ఉంటే వారికి అంతరాయం కలిగించే ఆ హీరో ఎవరైనా సరే ప్లీజ్ గివ్ మి కంప్లైంట్ వారి దాహాన్ని నేను తీర్చవలసిన పద్ధతిలో సక్రమంగా తీరుస్తాను.


నాయకులుగా పిలువబడే వారు మనం వేసిన ఓట్లతో నాయకులు అవుతారు. పాలు ఇచ్చి పెంచిన తల్లిని మరువవచ్చునా! మరువకూడదు. మన పదవీకాలంలో మన ప్రజలకు మేలు చేయాలి. మన ప్రాంతంలో ఉన్న అవసరాలను గ్రహించి పైవారికి తెలియజేసి నిధులను సేకరించుకొని సద్వినియోగం చేసి మన అవసరాలను తీర్చాలి.


ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరునెలల్లోపల జిల్లాలో అన్ని రోడ్ల ప్రక్కన మొక్కలను నాటాలి. ప్రతి ఆదివారం అందరం ఈ మహత్తర కార్య ఆచరణలో గడపాలి. మీ పిల్లలు మీ బంధువులు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో ఆనందంగా పాలుపంచుకోవచ్చును.


రెండవది బాలికల రక్షణ.. జన సాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో ఆడపిల్లల స్కూళ్ళు, కాలేజీలు ప్రత్యేకంగా ఉండాలి. వారికి వ్యాయామం, కరాటే, యోగాలలో తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. ఉద్యోగ విషయాల్లో వారికి అర్హత అనుసరించి ఉద్యోగాలను ఇవ్వాలి. వరకట్నం అనే అనాది ఆచారపు క్రూర కోరలకు వారు బలి కాకుండా చర్యలు తీసుకోవాలి. కట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం రెండూ నేరమే! ధైర్యంగా అందరూ పాటించాలి.


మూడవది.. ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు: నేరం రుజువైన వెంటనే వాడిని నడిరోడ్లో నిలబెట్టి కాల్పిపారేయాలి. జైళ్ళు, కేసులు, వాయిదాలు, సాక్ష్యాలు, తీర్పులు ఈ అయిదు పదాలతో కాలయాపన జరుగకూడదు. పైన చెప్పిన శిక్ష వెంటనే అమలుచేయాలి.


నాల్గవది.. భయం:- పాలకవర్గాన్ని చూచి అందరూ భయంతో వారిని గౌరవించాలి. ఆ విధానం అమలు కావాలంటే ఎవరైనా నేరం చేస్తే మన - తన అనే భేదం లేకుండా ధర్మంగా.. శిక్ష కఠినంగా విధించాలి. పై నాలుగు అంశాలను మనం అందరం కలిసి క్రమంగా అమలు చేయాలని నేను మిమ్మల్నందరిని కోరుతున్నాను. క్రొత్త సృష్టికి మనమంతా భాగస్వాములం కావాలి.


సార్!.. ఏదో ఒకరోజు తప్పు ఒప్పులను గురించి ఆలోచించి.. తప్పులను మరచి ఒప్పులను చేయాలనే నిర్ణయం తీసుకోవడం.. మనకు.. మన సంతతికి.. మన మొత్తం సమాజానికి మంచిది కదండీ!.. ప్లీజ్!.. ఐయామ్ రిక్వెస్టింగ్ యు ఆల్.. ప్లీజ్ టేక్.. సచ్ డెసిషన్ నౌ.. టుడే! 


అందరం ఇప్పుడు మనసా.. వాచా.. కర్మణా.. కోరుకొనవలసింది శాంతి.. విశ్వశాంతి.. యావత్ శాంతి. మన మాట చేత ఒక్కటే.. జై భారత్! 


నో హిందూ, నో ముస్లిమ్, నో క్రిస్టియన్. వు ఆర్ ఆల్ భారతీయాస్. అందరూ దయచేసి లేవండి. అమరులై, స్వర్గవాసులైన మన వీరజవానుల కోసం రెండు నిముషాలు వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటిద్దాం."

చందాసింగ్ లేచి కళ్ళు మూసుకున్నాడు.


అందరూ లేచి నిటారుగా నిలబడి కళ్ళు మూసుకున్నారు.

రెండు నిముషాల తర్వాత చందాసింగ్ కళ్ళు తెరిచాడు. అతనికళ్ళు ఎర్రగా ఉన్నాయి. పెదవులపైన చిరునవ్వు. చేతులు జోడించాడు.


అందరూ వారి ముందుకు వెళ్ళి నమస్కరించి హాలు నుండి బయటకు నడిచారు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


26 views0 comments

Comments


bottom of page