top of page

కాల వాహినిలో - పార్ట్ 9



'Kala Vahinilo - Part 9'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 18/09/2024

'కాల వాహినిలో - పార్ట్ 9' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల. 


గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు. ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య. చంద్రం గురించి చులకనగా మాట్లాడిన నందాదేవితో కటువుగా మాట్లాడుతుంది కావ్య. 


గతంలో నందాదేవి రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది. 


జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవుతుంది. 


ప్రస్తుతం ఆమెలో మార్పు వస్తుంది. 

సత్యానందరావు కుటుంబంతో కాశీయాత్రకు వెళ్తాడు.



ఇక కాల వాహినిలో.. పార్ట్ 9 చదవండి. 


ఆ రోజు ఆదివారం. ఐదు సంవత్సరాల క్రిందట అదేరోజున సత్యానందరావు గారి సోదరుడు రఘునందనరావు గతించిన రోజు. రఘునందన అవివాహితుడు. ప్రతి సంవత్సరం వారు గతించిన రోజున బ్రాహ్మణులను పిలిపించి అతని పేర తర్పణం వదలి నూతన వస్త్రాలతో.... దక్షిణలతో బ్రాహ్మణులను సత్కరించడం సత్యానందరావు గారు ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తుంటారు.


చదువు.... ట్రైనింగ్... ఉద్యోగం.... కారణాంతరాల వల్ల గడచిపోయిన నాలుగు సంవత్సరాల్లో ఆ రోజున కావ్య ఇంట్లో వుండలేదు. ఈ సారి ఇంట్లో వున్నందున సత్యానందరావు... ఇంట్లోని వారంతా నిర్వహించిన కార్యక్రమాన్ని శ్రద్ధగా గమనించింది.


ఆ రాత్రి....

వంట ఇంటి పనులన్నీ ముగించుకొని తన గదికి వచ్చిన తల్లి జానకమ్మను చూచింది.


"అమ్మా!...."


"ఏమిటమ్మా!"


"నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి"


"అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందే! అడుగు"


"చినమామయ్యగారు ఎలా చనిపోయారు?"


జానకి.... ఆశ్చర్యంగా కావ్య ముఖంలోనికి చూచింది. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖాన్ని ప్రక్కన త్రిప్పుకొంది. కొన్ని క్షణాల తర్వాత....

"అది ముగిసిపోయిన కథ. ఇప్పుడు నీకు ఎందుకునే ఆ విషయం?" విచారంగా అంది జానకి.


"చిన మామయ్య మంచివాడూ కాడా!" అడిగింది కావ్య.


"ఏమన్నావ్!" ఆశ్చర్యంగా కావ్య ముఖంలోనికి చూచింది జానకి.


"వారు మంచివారా! చెడ్డవారా!"


"శ్రీరామునితో లక్ష్మణుడు ఎలా వుండేవాడో.... మా పెద్దన్నయ్యతో మా చిన్నన్నయ్య అలాగే వుండేవాడు. కుటుంబ సభ్యులన్నా.... తాను పుట్టిన ఈ వూరి గ్రామస్థులన్నా మా చిన్నన్నయ్యకు ఎంతో ప్రేమ అభిమానం. అర్థాంతరంగా పోయాడు. మాకు తన జ్ఞాపకాలను మిగిలించాడు. మా చిన్నన్నయ్య ఎంతో వుత్తముడే! ఆయన చెడ్డవాడు కాదు" విచారంగా చెప్పింది జానకి.


"వారు బాంబు తాకిడికి చనిపోయారా! బావిలోపడి ఈత రానందున చనిపోయారా!"


కళ్ళు పెద్దవి చేసి జానకి కావ్య ముఖంలోనికి చూచింది.

ఆమె కళ్ళల్లో కన్నీరు.


"మనకు కానివారు చంపారు" మెల్లగా చెప్పింది జానకి.


"ఆ సుబ్బారాయుడి బృందమేనా?" కళ్ళు పెద్దవి చేసి అడిగింది కావ్య.


"ఆ వ్యక్తులెవరో నేను చూడలేదు. నీ ప్రశ్నకు నాకు జవాబు తెలియదు. దయచేసి ఆ ప్రసక్తిని ఇంతటితో ఆపెయ్యి!" దీనంగా చెప్పింది జానకి.


కొన్ని క్షణాలు కావ్య తల్లి ముఖంలోనికి పరీక్షగా చూచింది.

’నిజాన్ని తనకు చెప్పేదానికి అమ్మ భయపడుతూ ఉంది’ అనుకొంది కావ్య.


"చివరి ప్రశ్న అమ్మా! జవాబు చెప్పు"


“ఏమిటది?"


"వారు ఎందుకు వివాహం చేసుకోలేదు?"


"అది ఆయన వ్యక్తిగత విషయం కారణం నాకు తెలీదు."


"అలాగా!" సాలోచనగా తలాడిస్తూ అంది కావ్య.


"అవును.... పొద్దుపోయింది. వెళ్ళి పడుకొంటాను" జానకి గది నుంచి బయటికి వెళ్ళిపోయింది.


కన్నీళ్ళతో వెళ్ళిన తల్లి ముఖం కావ్య కనుల ముందు నిలిచింది.

యదార్థాన్ని కనుక్కోవాలి. నేరస్థులను శిక్షించాలి. అదే ఆలోచనలతో పడకపై వాలిపోయింది కావ్య.

మరుదినం.... ఎనిమిది గంటలకు తయారై తిరుమలరావు ఇంటికి వెళ్ళింది కావ్య.

వాకిట పూలమొక్కలకు పైపుతో నీళ్ళు పెడుతున్న తిరుమల కావ్యను చూచి....

"ఏం చెల్లెమ్మా! ఇంత ఉదయాన్నే వచ్చావ్?" నవ్వుతూ అడిగాడు తిరుమలరావు.


"అన్నయ్యా! నీతో ఓ ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడాలని వచ్చాను"


"ఏమిటమ్మా ఆ విషయం?"


"చినమామయ్య రఘునందనరావు ఎలా చనిపోయారు?"


"ఇప్పుడెందుకమ్మా ఆ విషయం?"


"నిన్న వారి సంవత్సరీకం జరిగింది. అమ్మా, నాన్న, మామయ్య, అత్తయ్య ఎంతగానో బాధపడ్డారు. నాకు ఊహ తెలిసిన తర్వాత వారు అంతగా బాధపడటం.... నేను ఎన్నడూ చూడలేదన్నయ్యా. వారి ఆవేదనను చూచి నాకు మనస్సున బాధ, కన్నీళ్ళు వచ్చాయి. ఏం జరిగిందో వివరంగా చెప్పు అన్నయ్యా!"


"సుబ్బరాయుడు గారు వారి కొడుకు రాంబాబు వారి కూతురు నందాదేవి చిన్నమామయ్య మరణానికి కారకులు. ఆ కుటుంబం మన వూరికి పడమటా నుంచి ఎత్తి వచ్చిన కుటుంబం. ఆ సుబ్బారాయుడుకు ఆరంభం నుంచి మన కుటుంబంపై ద్వేషం, అసూయ. కారణం వారిలోని స్వార్థం. సుబ్బారాయుడు మా అమ్మను తన పెద్దకొడుకు ఆనంద్‍కు ఇచ్చి పెండ్లి చేయమని తాతయ్య ధర్మారావుగారిని అడిగాడు. తాతయ్యగారు కాదన్నారు. అతను బావిలోపడి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆనాటి నుంచి వారికి మన కుటుంబంపై ద్వేషం పెరిగింది. వాళ్ళకు మనస్సు నిండా పగ, ప్రతీకారం. వాటికే చినమామయ్య బలైపోయారు. వారిపై బాంబులు వేసి ఈత తెలియని మమ్య్యను బావిలోకి త్రోసి చంపేశారు" ఎంతో విచారంగా తనకు తెలిసిన విషయాలను చెప్పాడు తిరుమలరావు.


"అన్నా! జరిగింది అన్యాయం కదూ!"


"అవునమ్మా!"


"పెదమామయ్య వారిపై కేసు పెట్ట ప్రయత్నించలేదా!"


"వారు ఆ ప్రయత్నం చేయలేదు"


"కారణం?"


"నేను ఏం చేసినా నా తమ్ముడు తిరిగి రాడుగా! ఎవరి పాపం వారిదే.... ఒకనాడు ఫలితాన్ని అనుభవించక తప్పదు. కేసు... కోర్టు.... వాయిదాలు ఇవి ఏవీ నా తమ్ముడిని నాకు తెచ్చి ఇవ్వలేవుగా... ఆ ప్రయత్నం అనవసరం అన్నారు" అంటూ విచారంగా చెప్పాడు తిరుమలరావు.


కావ్య కొన్ని నిముషాలు మౌనంగా వుండిపోయింది. తర్వాత....

"అన్నా! బావ వుండి వుంటే చినమామయ్య చనిపోయేవారు కాదుగా!"


"హు.... ఏమో చెప్పలేం"


"అన్నా...."


"ఏమిటమ్మా"


"ఆ కేసును నేను పునః పరిశీలించాలనుకుంటున్నాను. నేరం చేసినవారు శిక్షను అనుభవించాలి. నాకు నీ సాయం కావాలి చేస్తావా?" నిశితంగా తిరుమలరావు ముఖంలోనికి చూస్తూ అడిగింది కావ్య.


"అందుకు మామయ్య ఒప్పుకోరు"


"వారికి తెలియకుండా కథను నడుపుతాను."


"ఏదో ఒకనాడు వారికి తెలుస్తుంది కదా అమ్మా! అప్పుడు నీవు వారి దృష్టిలో....."


"తప్పు చేసిన దానని అవుతానా? ఒప్పు చేసిన దానని అవుతానా?”


"తప్పు చేసినదానివే అవుతావు"


"నీ దృష్టిలో!"


"సాహసం చేసిన దానివౌతావు"


"నాకు ఆ పేరే కావాలన్నయ్యా!... ఈ విషయాన్ని గురించి నీవు ఎవరితోనూ చెప్పకు వస్తాను" సాలోచనగా కావ్య వెళ్ళిపోయింది.


ఆశ్చర్యంగా కావ్యను చూస్తూ నిలబడిపోయాడు తిరుమల.

ఎ.ఎన్.పి కావ్య ఆఫీసులో తన సీట్లో కూర్చొని ఏదో ఫైల్‍ను చూస్తూ వుంది.


"హలో!"


"సి.పి రుద్రమ..... కావ్యా!"


"యస్... మేడమ్....గుడ్ ఆఫ్టర్ నూన్"


"మాట్లాడవచ్చా!"


"ఆ...."


"నీకు కావలసిన వాణ్ణి పట్టుకొన్నాను. నీవు వెంటనే ఇక్కడికి రావాలి" అంది రుద్రమ.


"ఓకే మేడమ్! నేను వెంటనే బయలుదేరుతాను. ఐదు గంటలకల్లా అక్కడ వుంటాను."


"సరే.... బయలుదేరు"


"థాంక్యూ మేడమ్"


"కావ్యా! మన మధ్యన ఇలాంటి పదాలకు తవు వుండకూడదే జాగ్రత్తగా రా!" నవ్వుతూ చెప్పింది రుద్రమ.


"అలాగే మేడమ్"


రుద్రమ సెల్ కట్ చేసింది.

కావ్య ఎస్.పి రామకృష్ణకు ఫోన్ చేసింది.

"ఆ.... చెప్పు కావ్యా!"


"నేను కడపదాకా వెళ్ళి వస్తాను సార్!"


"కడపకా!"


"అవును సార్!"


"ఎందుకు?"


"ఆ విషయంగా.... రుద్రక్క రమ్మని ఫోన్ చేసింది"


"సరే వెళ్ళిరా... తోడుగా కానిస్టేబుల్ వీరయ్యను తీసుకొని వెళ్ళు"


"అలాగే సార్!"


"జాగ్రత్త"


"ఓకే... సార్"


మ్రోగిన్ ఫోన్‍ను చేతికి తీసుకొన్నాడు సత్యానందరావు.

"మామయ్యా" కావ్య పలకరింపు.


"చెప్పమ్మా"


"నేను అర్జంటు పనిమీద కడపకు వెళుతున్నాను. రాత్రికి ఇంటికి రను. అమ్మా.... నాన్నకు.... అత్తయ్యకు చెప్పండి"


"రాత్రికి ఎక్కడ వుంటావమ్మా!"


"కడపలో"


"జాగ్రత్త తల్లీ"


"అలాగే మామయ్యా" సెల్ కట్ చేసింది కావ్య.


"వీరయ్యా!" పిలిచింది.


"ఏమ్మా!"


"మనం కడపకు వెళుతున్నాం"


"ఎప్పుడమ్మా?"


"ఇప్పుడే"


"సరే అమ్మా!"


కావ్య వేగంగా వెళ్ళి కార్లో కూర్చుంది. వీరయ్య కారును స్టార్టు చేశాడు.


కావ్య చెప్పిన ప్రకారం సాయంత్రం ఐదు గంటలకల్లా వారి కారు సి.పి రుద్రామ స్టేషన్ ముందు ఆగింది.


కావ్య దిగి వేగంగా స్టేషన్‍లోకి ప్రవేశించింది. రుద్రమ గదిని సమీపించింది.


కానిస్టేబుల్ తన పేరును చెప్పింది. అతను రుద్రమ గదిలోనికి వెళ్ళి కావ్యను గురించి చెప్పాడు.


"లోనికి పంపు" అంది రుద్రమ.


బయటికి వచ్చి కానిస్టేబుల్ "అమ్మగారు రమ్మంటున్నారమ్మా! వెళ్ళండీ" అన్నాడు.


కావ్య లోనికి వెళ్ళి పద్ధతి ప్రకరం రుద్రమకు సెల్యూట్ చేసింది.

రుద్రమ నవ్వుతూ....

"కూర్చో...... కావ్యా" అంది రుద్రమ.


కావ్య ఆమెకు ఎదురుగా టేబుల్ ముందు కూర్చుంది.

"మేడమ్.... అతని పేరు జోగయ్య కదూ!"


"అవును"


"అతనికి నాటుబాంబులు చేయడమేనా వ్యాపారం?"


"ఒకప్పుడు..."


"ఇప్పుడు?..."


"మానేశాడు.... వ్యవసాయం చేసుకొంటున్నాడు."


"నిజంగానా!"


"అవును కావ్యా! అతని మద్దతుదారుడు జోగిరెడ్డి. మూడేళ్ల క్రిందట మరణించాడు. అప్పటినుంచీ జోగయ్య్ బాంబులు తయారుచేయడం మానేశాడట."


"నాకు కావాల్సిన ఇన్ఫర్‍మేషన్ ఇవ్వగలడా!"


"ఆ వ్యాపారంలో ఇరవై సంవత్సరాలు అనుభవం కలవాడు. అందుకే వాణ్ణి పట్టుకొన్నాను. అడిగి చూద్దాం. ఏమి చెపుతాడో!"


"అలాగే అక్కా!"


రుద్రమ కానిస్టేబుల్‍ని పిలిచింది.

"వన్ నాట్ వన్"


అతను వచ్చి సెల్యూట్ చేశాడు.

"సెల్‍లో వుండే కోగయ్యను పిలుచుకురా!"


వన్ నాట్ వన్ "యస్ మేడమ్" చెప్పి వెళ్ళిపోయాడు.


’ఈ జోగయ్య నిజం చెబుతాడో, అబద్ధం చెబుతాడో వాడు ఎలాంటివాడో నా ప్రయత్నం ఫలిస్తుందో.... ఫలించదో! సర్వేశ్వరా... నాకు సాయం చేయి తండ్రీ!’ అనుకొంది కావ్య.


వన్ వాట్ వన్, జోగయ్య గదిలోనికి వచ్చారు.

రుద్రమ... కావ్య అతని ముఖంలోనికి పరీక్షగా చూచారు.

జోగయ్యకు అరవై సంవత్సరాల వయస్సు. నెరసిన తల.... నెలరోజులుగా ఎదిగిన తలజుట్టు, గడ్డం, మీసాలు, లోతుకు పోయిన కళ్ళు, ఆ కళ్ళల్లో భయం... వారిని చూచి తలదించుకున్నాడు.


"కూర్చో.... జోగయ్యా" చెప్పింది రుద్రమ.


జోగయ్య భయపడుతూనే కుర్చీలో కూర్చున్నాడు.

"జోగయ్యా! భయపడకు నిన్ను ఏమీ చేయను. మాకు ఒక ఇన్ఫర్‍మేషన్ కావాలి. అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు. నిన్ను వదిలేస్తాను" గంభీరంగా చెప్పింది రుద్రమ.


"తల్లీ!..... ఒకప్పుడు నేను అనేక పాపాలు చేశాను. నన్ను పోషించిన జోగిరెడ్డి చనిపోయాడు. అన్నీ మానేశాను. నాకు భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాకు తెలిసినంతవరకు నిజాన్నే చెబుతాను" దీనంగా చెప్పాడు జోగయ్య.


"మీరు బాంబులు తయారుచేసేవారా?" అడిగింది కావ్య.


"ఐదేళ్ల క్రిందట చేసేవాణ్ణమ్మా!"


"మాకు కావాల్సింది అప్పటి సమాచారమే! ఆ రోజుల్లో నీకు నెల్లూరులో ఎవరైనా పరిచయమా!" అడిగింది రుద్రమ.


"మీరా అనే ఓ ముస్లిం పరిచయం"


"ఏ రీతిగా పరిచయం?"


"నాలుగైదు సార్లు వాడు ఇక్కడికి వచ్చి నా దగ్గర బాంబులు కొన్నాడు"


"వాడి వయస్సు ఎంత?"


"ఐదేళ్ల క్రింద ఓ పాతిక సంవత్సరాల వయస్సుగా వుండొచ్చు"


"అయితే ఇప్పటికి ముఫ్ఫై ఏళ్ళన్నమాట"


"కావచ్చమ్మా!"


"వాడు ఇప్పుడు ఎక్కడ వున్నాడో తెలుసా!" అడిగింది కావ్య.


"తెలీదమ్మా!" దీనంగా జవాబు చెప్పాడు జోగయ్య.


"వాణ్ణి చూస్తే ఇప్పుడు నీవు గుర్తుపట్టగలవా!" అడిగింది రుద్రమ.


కావ్య.... జోగయ్య ఫోటోను సెల్‍లో ఎక్కించింది.

"పట్టగలనమ్మా! వాడికి ఒక చేతికి... ఎడం చేతికి ఆరువేళ్ళు ఉంటాయి" వినయంగా చెప్పాడు జోగయ్య.


"బాగా ఆలోచించి చెప్పు. సరిగ్గా ఐదేళ్ళ కిందట వాడికి నీవు బాంబులు ఏమైనా అమ్మావా?" అడిగింది రుద్రమ.


జోగయ్య తలదించుకొని ఆలోచనలో మునిగాడు.

వారి మధ్య రెండు నిముషాలు మౌనంగా జరిగిపోయాయి.

"జోగయ్యా!" రుద్రమ పిలుపు.


"గుర్తుకు వచ్చిందా!"


"ఆ... తల్లీ!" తొట్రుపాటుతో చెప్పాడు జోగయ్య.


"వాడు నా దగ్గరకు రావడం అదే చివరిసారి. ఐదు బాంబులు కొనుక్కొని వెళ్ళిపోయాడు."


"నీవు ఆకాలంలో బాంబులు ఎక్కడ తయారుచేసేవాడివి?" అడిగింది కావ్య.


"నల్లటి కడపరాయి కోతకు త్రవ్వి సొరంగంలా వున్న భూమిలోని గుంటల్లో... ఆ గుంటల చుట్టూ నాపరాయి కోసం త్రవ్విన మట్టిని ఎత్తుగా గుట్టగా పోసేవారు. లోపలి గుంటలో నేను చేసే పనిని గురించి ఎవరికీ అనుమానం వచ్చేది కాదు. జోగిరెడ్డి మనుషులు నాకు రక్షణగా సాయం వుండేవారు."


"అవసరమైతే ఇప్పుడు నీకు మాకు చెప్పిన నిజాలను కోర్టుకు వచ్చి చెప్పగలవా?" అడిగింది రుద్రమ.


జోగయ్య భోరున ఏడ్చాడు.

"ఏడవకు... నీకు ఎలాంటి భయం అనవసరం. నేను తీసుకెళ్ళి నాతో మరలా వెనక్కు తీసుకొస్తాను" చెప్పింది రుద్రమ.


బొంగురుపోయిన కంఠంతో "సరే తల్లీ!" అన్నాడు జోగయ్య.


"సరే.... ఇక నీవు వెళ్ళవచ్చు" అంది రుద్రమ.


కుర్చీనుంచి లేచి రుద్రమకు కావ్యకు నమస్కరించి కోగయ్య గదినుండి బయటకు నడిచాడు.


"కావ్యా! నీ రాక ఫలవంతం అయిందిగ!" చిరునవ్వుతో అడిగింది రుద్రమ.


"అక్క! నీ సాయం వల్లనే ఇదంతా జరిగింది. నేను అతని మట్లను సెల్‍లో రికార్డు చేశాను"


"చేశావా?"


"అవును"


"గుడ్ పద ఇంటికి పోదాం. వేకువన బయలుదేరుదువుగని"


"సరే అక్కా"


"రుద్రమ, కావ్య జీప్‍లో రుద్రమ ఇంటికి చేరారు.


స్నానాదులు ముగించి భోజనం చేశరు. సమయ్ం రాత్రి పదిగంటలు.


"అక్కా! నెల్లూరులో వుండే డి.ఐ.జి పార్థసారథి సార్ మీ బ్యాచ్‍మేట్ కదూ"


"నాకంటే రెండేళ్ళు సీనియర్!"


"మీరాను గురించిన వివరాలను...." కావ్య పూర్తిచేయకముందే....

"ఆ.... ఫోన్ చేస్తాను" అంది రుద్రమ.


రుద్రమ డి.ఐ.జి పార్థసారధి గారికి ఫోన్ చేసింది.

"హలో!" పార్థసారథి పలకరింపు.


"సార్!..... రుద్రమ" నవ్వుతూ చెప్పింది.


"ఓ..... రుద్రమా! కడపలో కదా ఉంటున్నావ్ ఎలా వున్నావ్" అడిగాడు పార్థసారథి.


"అంతా మీ ఆశీర్వాద బలం... బాగున్నాను సార్!"


"నీ మాటల తీరులో ఎలాంటి మార్పు లేదు" నవ్వాడు పార్థు.


"నేర్పింది మీరే కదా!" గోముగా అంది రుద్రమ.


"అవునవును... గురువును మించిన శిష్యురాలివై పోయావుగా! ఏమిటి విషయం... ఈ టైములో ఫోను చేశావు?"


"నాకు ఒక ఇన్ఫర్‍మేషన్ కావాలి సార్!"


"ఏమిటది?"


"మూలాప్పేటలో వుండే ’మీరా’ అనే వ్యక్తిని గురించి...."


"పేరు మీరానా!"


"అవును..."


"వాడు ఇప్పుడు కౌన్సిలర్"


"ఐదేళ్ళ క్రిందవాడు"


"వాడు"


"నాటు బాంబులు అమ్మేవాడు"


"నీకెవరు చెప్పారు?"


"వాడి బాబు.... వాడు కడపలోనే వున్నాడు"


"అంటే... ఏదైనా పాతకేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నావా?"


"అవును"


"వాడిది రూలింగు పార్టీ...."


"అయితే ఏం?.... మీరు ఎ.ఎస్.పి కావ్య పేరు విని వున్నారుగా"


"ఆ... విన్నాను. నీకు డూప్లికేట్ అంట" చిరునవ్వుతో చెప్పాడు రామకృష్ణ.


"ఆమె ఇప్పుడు నాతోనే నా ప్రక్కనే వుంది. ఆమెకు కావాలి ఆ మీరా వివరాలు"


"ఫోన్ కావ్య చేతికి ఇవ్వు?" చెప్పాడు డి.ఐ.జి పార్థసారథి.


రుద్రమ సెల్‍ను కావ్యకు అందించింది.

"పార్థసారథి సార్ మాట్లాడు" అంది రుద్రమ.


"సార్... గుడ్ ఈవెనింగ్!"


"కావ్యా! ఇది గుడ్ ఈవెనింగా!"


"సారీ సార్! గుడ్ నైట్" తొట్రుపాటుతో చెప్పింది కావ్య.


"కావ్యా!"


"యస్ సార్!"


"నీవు చాలా చిన్నదానివి"


కావ్య మౌనంగా వుండిపోయింది.

"మాట్లాడు కావ్యా!" అంది రుద్రమ.


"చెప్పండి సార్" సాలోచనగా అంది కావ్య.


"నీవు వచ్చి నన్ను కలువు సరేనా!"


"ఓకే సార్ రేపు సాయంత్రం మూడు గంటలకు వస్తాను సార్ ఓకేనా!"


"ఓకే!" చెప్పి "ఫోన్ రుద్రమ చేతికి ఇవ్వు" అన్నాడు పార్థసారథి.


సెల్‍ను రుద్రమకు అందించింది కావ్య.

పార్థసారథి మాటలు కావ్యకు నచ్చలేదు. వదనంలో గంభీరం... అసహ్యం....

"చెప్పండి సార్!" అంది రుద్రమ.


"కావ్య నీ దగ్గరకు ఎందుకు వచ్చింది?"


"చెప్పానుగా ఓ పాతకేసని?"


"ఏమిటా కేసు?"


"అటాక్ విత్ బాంబ్ మనిషి చనిపోయాడు"


"అది ఎప్పుడు జరిగింది?"


"ఐదేళ్ళ క్రిందట"


"ఆ వ్యక్తికి ఈ కావ్యకు ఏమిటి సంబంధం?"


"చనిపోయిన వ్యక్తి కావ్య మామగారు"


"ఓహో అదా విషయం!"


"అవును"


"ఆయన ఎలాంటివాడు?"


"కావ్యను మీరు రమ్మన్నారుగా.... రేపు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమెనే అడిగి తెలుసుకోండి. బై సార్!" సెల్‍ను కట్ చేసింది రుద్రమ.


"అక్కా! నాకు వారి భావన అర్థం అయ్యింది. డోంట్ వర్రీ. ఇక పడుకొందాం" చిరునవ్వుతో చెప్పింది కావ్య.


ఇరువురూ పడకపై వాలారు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


22 views0 comments

Comments


bottom of page