top of page

కాలికి బుద్ధి చెప్పు

#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #KalikiBuddhiCheppu, #కాలికిబుద్ధిచెప్పు, #తెలుగుజాతీయాలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

Kaliki Buddhi Cheppu - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham

Published In manatelugukathalu.com On 24/11/2024

కాలికి బుద్ధి చెప్పు - తెలుగు కథ

రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కూర్మన్న పాలెం అనే పల్లెటూళ్ళో  కృష్ణ తన భార్యా పిల్లలతో కలసి జీవిస్తూ ఉండేవాడు. నిరుపేద కుటుంబం వారిది. గ్రామదేవత పండగకు రమ్మని కుమిలి గ్రామంలో ఉంటున్న అత్తవారింటి నుంచి కృష్ణకి పిలుపు వచ్చింది. కూర్మన్న పాలెంకు మూడు కిలో మీటర్ల దూరం లో ఉన్న అప్పన్న పాలెం వెళ్తేనే కానీ బస్సు దొరకదు. 


మర్నాడు  పెళ్ళాం పిల్లలతో కలసి అత్తారింటికి బయలుదేరాడు కృష్ణ. అప్పన్న పాలెం వరకు వెళ్ళడానికి ఆటో వస్తుందేమోనని ఎదురుచూసాడు. ఎంతసేపైనా ఏ వాహనమూ రాలేదు. "ఎంతసేపని ఎదురుచూస్తాం కాళ్ళకి బుద్ధి చెప్పండి” అన్నాడు కృష్ణ.


“కాలికి బుద్ధి చెప్పడం అంటే ఏంటో చెప్పవా నాన్నా.” అని అడిగింది చిన్న కూతురు.


“సరే మీరు నడుస్తానంటే చెప్తాను.” అన్నాడు కృష్ణ.


“ఓ అలాగే” నంటూ నడవడం ప్రారంభించారు.


నడుస్తూ చెప్పడం మొదలెట్టాడు కృష్ణ. 


పూర్వం ఒకానొక గ్రామంలో ఒక ఆసామి చెట్టు కింద హాయిగా నిద్రపోతున్నాడు. అతని శరీర అవయవాలన్నీ మాట్లాడుకోవడం మొదలు పెట్టాయి. నేను ఎంతో కష్టపడి నడవబట్టి నోట్లోకి నాలుగు వేళ్ళు వెళ్తున్నాయి. అలసిపోబట్టే ఆసామి హాయిగా నిద్రపోతున్నాడు.” అన్నాయి కాళ్ళు. “నిజమే నువ్వు కష్టపడి నడవబట్టే ఆహారం దొరికింది  కానీ ఎక్కడి వెళ్ళాలి ఎలా వెళ్లాలి ఏమిచేయాలి ఏమిచేయ కూడదో చెప్పేది నేను అంది చిన్న మెదడు.” 


“మీరెంత కష్టపడి ఆహారం సంపాదించినా నేను నమిలి మింగపోతే  మీ కష్టం వృధా.” అంది నోరు.


“కాళ్ళు కష్టపడి నడిచినా, నువ్వు నమిలి మింగినా నేను జీర్ణం చేసుకోబట్టే అతడు జీవించి అన్నాడు. నేను లేకపోతే మీ శ్రమ వృధా.” అంది కడుపు.


ఇలా ఒకదానితో ఒకటి నేనంటే నేను గొప్పని వాదించు కుంటున్నాయి. కాళ్ళకి కోపం వచ్చింది. “నేను అడుగు తీసి బయట పెట్టను.” అని భీష్మించుకు కూర్చుంది. ఎవరు ఎన్ని చెప్పినా వినలేదు. 


కాసేపటికి కడుపు ఖాళీ అయ్యింది. ఆసామి కి విపరీతమైన ఆకలి వేసింది. కడుపులో మంట పుట్టింది. నీరసం మొదలయ్యింది. ఆహారం కోసం బయటకి వెళ్దామంటే కాళ్ళు సహకరించలేదు.


గుండెకు చాలా కోపం వచ్చింది. అన్నిటినీ కూర్చోబెట్టి “మీరంతా ఎవరికి వారే గొప్పవారు అనుకుంటున్నారు. మీరు కొంతసేపైనా విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు ఆ అవకాశం లేదు. నేను విశ్రాంతి తీసుకుంటే జీవుడు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాడు. మీరు అచేతన స్థితిలోకి వెళ్ళిపోతారు గుర్తుంచుకోండి.” అని హెచ్చరించింది.

దాంతో భయపడిన  శరీర అవయవాలన్నీ ‘కాలికి బుద్ధి’ చెప్పాయి.  నిజం తెలుసుకున్న కాళ్ళు కష్ట పడటానికి ఇష్ట పడ్డాయి. అలాగే మనకి పరిస్థితులు అనుకూలించ నప్పుడు రవాణా సౌకర్యాలు లేనప్పుడు నడిచి వెళ్ళవలసి వస్తుంది.

అలాంటప్పుడు మనం బద్దకించకుండా నడవడానికి సిద్ధపడాలి. ఆ సమయం లో వాడే జాతీయం ఇది.” అని చెప్తూ ఉండగానే “నాన్నా బస్సు వచ్చింది.” అన్నారు పిల్లలు. బస్సు ఎక్కి అత్తారింటికి వెళ్ళారు కృష్ణ కుటుంబం.


***


పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం

Patrayudu kasi viswanadham


విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ., 

ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).

స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం 

విజయనగరం జిల్లా.

నివాసం : శృంగవరపుకోట (ఎస్‌.కోట)

వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం) 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.


ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు  రాయడం 


ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.


సేకరణలు:

**********

1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్‌ వర్క్‌ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి  విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.


విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:

*******************************

1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.


2.మండలస్థాయిలో విద్యార్థులకు  *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.

3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.


బాల రచయితలుగా తీర్చిదిద్దడం

*******************************

బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.

నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో  10 కి పైగా ప్రచురించబడ్డాయి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


సంకలనాలు :


1.గురజాడ శతవర్ధంతి

కవితా సంకలనం లో  

2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని'         సంకలనం లో 

3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల    సంరక్షణ',

4.'రక్త బంధం', 

5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.

6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల           బంధం' సంకలనం లో 

7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో

9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో 

10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో 

11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో

12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో

13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.

🌷🌷🌷🌷🌷🌷🌷


బహుమతులు

1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016

2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.

3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.

4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో  అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018

7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.

8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి

9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.

ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు. 


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


బిరుదులు : 

1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర, 

2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర, 

3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల, 

4.శతశ్లోక కంఠీరవ, 

5.సూక్తిశ్రీ, 

6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"

7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016

8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.

9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్‌ పురస్కారం 2017,

10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో

11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.

12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023



🌹🌹🌹🌹🌹🌹🌹

ముద్రించిన పుస్తకాలు :


1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),

2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).

3.*దేవునికో ఉత్తరం*  బాలల కధా సంపుటి

4.*అద్భుతం* బాలల కథా సంపుటి

5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.

6.తాతయ్య కల బాలల కథా సంపుటి.

అముద్రితాలు


1*మౌనమేలనోయి* కథల సంపుటి

2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి

3*నీకోసం* భావ కవితా సంపుటి.

4చెట్టు కథలు

5 పేదరాశి పెద్దమ్మ కథలు

6 మృగరాజు సందేశం కథల సంపుటి


ఇష్టాలు


పిల్లలతో గడపడం

బాలసాహిత్య పఠనం

బాలసాహిత్య రచన


ప్రచురణలు


ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల  పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120,  ప్రచురణ అయ్యాయి.

 

🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷

 




61 views0 comments

留言


bottom of page