#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Kalindi, #కాళింది

Kalindi - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 12/02/2025
కాళింది - తెలుగు కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
"రశ్మిమంతం సముద్యంతం.. దేవాసుర నమస్కృతం.. పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం" అంటూ శ్రీ సూర్య నారాయణుని అనునిత్యం కాళింది పలు రీతులలో స్తుతిస్తుంది. ఆమె స్తుతులకు సూర్య భగవానుడు ఆనంద సందోహ సుందర హృదయంతో ప్రకాశవంతమైన, ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, తేజోవంతమైన, సుర సదృశవంతమైన కిరణాలను కాళింది తనువుపై ప్రసరింపచేస్తాడు. ఆ కిరణ ప్రభావం వలన కాళింది తేజస్సు స్వచ్ఛ సూర్య కిరణం వలే ప్రకాశిస్తుంది.
అలా కాళింది తనువు క్షణం క్షణం అనుక్షణం తేజోవంత మవుతూనే ఉంది. ఆ తేజస్సు కాళింది తనువులోని సమస్త రోగాలను తుడిచి పెట్టేస్తుంది. రోగ రహిత తనూ తేజంతో కాళింది ప్రకాశిస్తుంది. ఆమె తనువును సూక్ష్మంగా పరిశీలిస్తే ఆమె జల కన్యా? సూర్య కిరణ కన్యా? చంద్ర కిరణ కన్యా? స్వేచ్చ మైన నరకన్యా? అని అనిపిస్తుంది. అలా నర కన్య గ జనించిన కాళింది తనువులో సురత్వం అధికం కాసాగింది.
కాళింది దేహమే కాకుండా ఆమె మనసు కూడా సతతం స్వచ్చంగా నిర్మలంగా ఉంటుంది. ఆమె ఏది మాట్లాడినా అందరికి సులభంగా అర్థమయ్యే రీతిలో సరళంగా ఉంటుంది. నర్మ గర్భంగా, అర్థ రహితంగా, అగమ్య గోచరంగా మాట్లాడటం కాళింది కి అసలు తెలియదు . ఆమె తన మనసులోని మాట ను ఎలాంటి మాయ లేకుండా బహిర్గతం చేసేస్తుంది.. రాజు పేద అనే తేడా లేకుండా అందరితో సమానంగా ఉంటుంది.
కాళింది తో మాట్లాడటానికి మహర్షులు, ఋషిపత్నులు, రాజర్షులు, సామాన్య జనం అందరూ ఇష్టపడేవారు. కాళింది ముందు నిలబడితే చాలు ఆమె తనూ తేజ ప్రభావంతో తమ శరీరం మీద రోగాలన్నీ పోతాయనుకునేవారు. ఆమె మాటలతో మనసులోని కాలుష్యమంతా పోతుంది అనుకునేవారు.
కాళింది అందరి దగ్గర ఆరోగ్యమే మహాభాగ్యము అన్న దృష్టితో మాట్లాడేది. మంచి ఆరోగ్యం నిమిత్తం ప్రకృతి ద్వారా స్వీకరించవలసిన రోగ నిరోధక ఔషదాల గురించి మాట్లాడేది. అంటురోగ నిర్మూలనలకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి మాట్లాడేది.
కాళింది మహర్షులందరి దగ్గర తను నేర్చుకోతగిన విద్యలన్నిటిని నేర్చుకుంది.. తను నేర్చుకున్న అన్ని విద్యల ప్రభావాన ఆమె ఆలోచనలలో అనేక నూతన మార్పులు వచ్చాయి.
కాళింది ఆడంబర వేదాద్యయనం అసలు వద్దు అంటుంది. గర్వంతో కూడుకున్న అగ్ని హోత్రం ప్రమాదం అంటుంది. గర్వంతో కూడుకున్న మౌనం, జ్ఞానం లేకుండా ఆడంబరం తో చేసే యజ్ఞం భూమి మీద అయోగ్యం అమానుషం అసుర ఊహాజనితం అని అంటుంది.
ఇలా అనేకమంది మహర్షుల జ్ఞాన ప్రబావం తో ఎదిగిన కాళింది ఆలోచనలు తేజోవంతమయ్యాయి.
సురవంత మయ్యాయి. కడకు ఆమె మాటలనే ఎక్కువ మంది మహర్షులు అనుసరించే స్థాయికి వచ్చారు. మానవత్వం తో కూడుకుని సురత్వ తేజం తో ప్రకాశించే కాళింది మాటలను విని అనేకమంది మనుషులు తమ ఆలోచనా సరళి ని మార్చుకున్నారు. అనేక మంది మనుషులు మహర్షులు తన దివ్య ఆలోచనలను అనుసరిస్తున్నారన్న గర్వం కాళింది లో ఇసుమంత కూడా లేదు.
సారస్వతిమతినార మహారాజు లు తమ కుమారుడు త్రసుని ప్రతిష్టాన పురానికి రాజుని చేసారు. త్రసుడు అతి చిన్న వస్తువులను, సూక్ష్మ జీవులను కూడా చక్కగా చూడగలడు. వాటి చర్యలను ప్రతీకార చర్యలను అన్నిటిని కనిపెట్ట గలడు. త్రసుని సూక్ష్మ దృష్టి వలన సకల జీవరాశులలో ఉన్న చెడు దృష్టి అంతా నెమ్మది నెమ్మదిగా తొలగి పోసాగింది. కొందరు జనులు త్రసునిలో ఏదో దైవశక్తి ఉంది. అందుకే అతని చూపు పడగానే మనలో మార్పు వస్తుంది అని అనుకునేవారు.
ప్రజల మనసు గమనించిన త్రసుడు, "ప్రజలారా! నాలో ఎలాంటి దైవశక్తి లేదు. అయితే అతి సూక్ష్మ జీవులను, వాటి చేష్టలను కూడా చూడగల శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు. దానితో మీమీ ఆంతర్యాన్ని తెలుసుకుని మాట్లాడ గలుగుతున్నాను. దానితో మీరు భయపడి మీ మనసు విప్పి మాట్లాడుతున్నారు. మీలోని చెడును మీరే నేను చెప్పే ఒకే ఒక్క మాటతో తొలగించుకుంటున్నారు. అంతకు మించి మరేం లేదు. "అని అన్నాడు. అయినప్పటికీ ప్రజలు త్రసుని ప్రత్యేకంగానే చూడసాగారు.
సారస్వతి మతినార మహారాజు లు త్రసునికి తగిన భార్య కోసం అనేక మంది మహర్షులను, పెద్దలను సంప్రదించారు. అందరూ త్రసునికి తగిన భార్య కాళింది అని అన్నారు. కాళింది మనసులోని మాటను స్పష్టంగా, సూటిగా, స్వచ్ఛంగా చెబుతుందని తెలుసుకున్న సారస్వతి కాళిందిని ప్రత్యేకంగా కలిసింది. సారస్వతి మనసును గ్రహించిన కాళింది,
"మీ సుపుత్రుడు త్రసుడు అతి సూక్ష్మ జీవులను కూడా చక్కగా చూడగలడు. ఆ జీవుల మనసును కూడా తెలుసు కోగలడు. అయితే అతని మాట, సూటిగా, స్పష్టంగా ఉండదు. సూక్ష్మ జీవుల మనసును తెలుకున్న అతగాడు వాటిని ఏమంటే ఎలా బాధ పడతాయో అన్న దృష్టితో నర్మ గర్భంగా మాట్లాడతాడు. కొందరు మనుషుల విషయం లో కూడా అతను అలాగే ప్రవర్తిస్తాడు. అతని ప్రవర్తన వలన కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే నాలాంటి కన్య మీకు కోడలు కావాలన్న భావనతో మీరు ఉన్నారు. మీ భావన నాకు ఆమోద యోగ్యమే" అని అంది.
మహర్షుల ద్వారా కాళింది గురించిన పూర్తి సమాచారాన్ని, కాళింది మనసులోని అభిప్రాయాన్ని
సారస్వతి మతినార మహారాజు గమనించారు. అందరి సమక్షంలో కాళింది త్రసుల వివాహం చేసారు.
సర్వే జనాః సుఖినోభవంతు
***
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

-వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
"కాళింది" కథ మానవత్వం, స్వచ్ఛత, ఆధ్యాత్మికతను హృదయానికి హత్తుకునే విధంగా ఆవిష్కరించింది. కథానాయిక కాళిందిని ప్రకృతి తత్వాలతో ముడిపెట్టి, ఆమె తేజస్సును, ఔన్నత్యాన్ని సూర్యకిరణాలతో పోలుస్తూ, ఒక మానవుడు సాధించగల పరమోన్నత దివ్యత్వాన్ని చక్కగా ప్రతిబింబించారు. కథలో ఆమె మాటలు స్పష్టత, సూటితనం కలిగి ఉండడం వల్ల, ఆమె చుట్టూ ఉన్నవారిపై ఎంతో ప్రభావం చూపించగలదని చిత్రీకరించారు. త్రసుని వంటి వ్యక్తికి ఆమెతో పెళ్లి జరగడం సహజమైన పరిణామంగా కనిపిస్తుంది. కథ రచయిత వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారు, కథనాన్ని పురాణ సంబంధిత అంశాలతో మిళితం చేసి, మానవ విలువల ప్రాముఖ్యతను మనకు గుర్తు చేశారు. ఒక మానవుడు సుదీర్ఘ జ్ఞాన సాధన ద్వారా ఎలా సురత్వానికి సమీపిస్తాడో ఈ కథ ద్వారా అర్థమవుతుంది. భాషా శైలి శాస్త్రోక్తమైనది, చిత్రణ మంత్రముగ్ధం చేసేలా ఉంది. అయితే, కథలో సంఘటనల క్రమం మరింత సంక్షిప్తంగా, స్పష్టంగా ఉండి ఉంటే కథ మరింత బలంగా అనిపించేదేమో. మొత్తం మీద, ఇది ఆధ్యాత్మికత, మానవతా విలువలను ప్రతిబింబించే మంచి కథ.