#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #కలిసినబంధం, #KalisinaBandham, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
Kalisina Bandham - New Telugu Story Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 18/11/2024
కలిసిన బంధం - తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
చిప్పిరి నెత్తి, మాసిన బట్టలు, చేతిలో సత్తు గిన్నె పిచ్చి చూపులు చూస్తూ.. “అమ్మాఅయ్యా! ధర్మం చెయ్యండి, ఆకలి ఐతాంది" అని కడుపు చూపిస్తూ, పైసలు బాబూ అని మనిషి మనిషికి తిరుగుతూ దండాలు పెడుతుంది.
“మొద్దుకు మొద్దుఉన్నావు, అడుక్కు తింటున్నావు. ఏదైనా కష్టం చేసు కుని బతుకు. అడుక్కోవడానికి సిగ్గు అనిపించడం లేదా?” అన్న పెద్ద మనిషితో..
“ఆకలికి అన్నం కోసం పైసలు అడుక్కోవడం ఏమీ సిగ్గు కాదు బాబూ, వచ్చేవి డబ్బులే కదా!" అని గర్వంగా చెప్పింది పేదరికం లోఉన్న ఆడ మనిషి.
“ఆ డబ్బులకోసం పని చేయ మంటున్నాను. పని ఇప్పిస్తాను చేస్తావా?” అనగానే
“చేస్తాను సార్! కాకపోతే నాకు ఒక కొడుకున్నాడు. వాడు నామాట అసలు వినడం లేదు. నేను చదివిస్తా అన్నా, మంచి దారిలో పెడతానని. వాణ్ణి మార్చడానికి వెంబడి పడి విసిగి పోయాను".
“ఏడి నీ కొడుకు?”అనగానే..
“ఆ గుడిసె వెనుక గోలీల ఆట ఆడుతూ వెకిలి నవ్వులు నవ్వు తున్నాడు. ఒరేయ్ శీను! ఇట్లారారా. నువ్వు ఈ సారు దగ్గర పనిచేస్తే పైసలిస్త డట" అనగానే.. పైసలు అన్నమాట విని బయటికి వచ్చిoడు శీను.
*******************
గతంలో చెప్పుల వ్యాపారం చేసేవాడు కామేశ్వర్. కూలీ జనం నుండి, కోటీశ్వరుడు అయినా నడక తో సహా ఏపని ఐనా చెప్పులు వేసుకోకుండా చెయ్యరు. తియ్యని జామ పండు తినాలంటే తోట లో శ్రమించాలి. అప్పుడుకూడా చెప్పులు కావాలి.
‘పూలమ్మిన చోట రాళ్ళు అమ్మినట్లు’ పెద్ద డిగ్రీలు చదివి చెప్పులు కుట్టే, అందరి కాళ్ళు పట్టుకుని తొడిగే వ్యాపారం నామోషీ అనిపించింది.
అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న గ్రామాలు, వలస వస్తున్న ప్రజలు, చిన్న చిన్న సమూహాలతో కలిసి ఉండేవారు. ఒకరికొకరు సహాయ పడుతూ, బాధ్యత వహిస్తూ, కొంత బయటి గ్రామాలకు వస్తువులను ఎగుమతి, దిగుమతి చేసుకుంటూ జీవనం చేస్తున్నారు గ్రామ ప్రజలు.
ఒకగ్రామస్తుడికి చెప్పులు తయారు చేయడం వస్తే, మరొకరికి డాక్టర్ గా రోగులకు మందులివ్వడం బాగా తెలిసేది. అవసరాలకోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలిసింది.
కనీస అవసరం చెప్పులు తయారు చేయడానికి జంతువుల చర్మం బాగా అవసరమైంది. ప్రతి ఇంట్లో పశువుల, జంతువుల పెంపకం చెప్పుల వ్యాపారానికి లాభం చేకూర్చింది.
గ్రామం నుండి గ్రామానికి రాక పొకలకోసం రోడ్ మార్గాలు అభివృద్ధి చేయసాగారు. రవాణా సౌకర్యం మెరుగుపడ సాగింది.
కామేశ్వర్ లో మార్పు వచ్చి చెప్పులు కుట్టడం పల్లెవాసుల కు అమ్మ డానికి చిన్న బండ్లపై పెట్టుకుని, సంచార వ్యాపారం చేసినట్లైతే, డబ్బులు వస్తాయని ఆర్థికంగా లాభం చేకూరుతుందని, ఆలోచన చేయ సాగాడు.
ఇలాంటి పనులకు స్త్రీలతో సాధ్యం అని, అనుకూలంగా ఉంటారని ఎంతో మంది స్త్రీలకు ఉపాధి కల్పించాడు.
ఆఊరి అలేఖ్య పదవతరగతి చదివి, పెద్ద చదువులు అవకాశం లేక, పెళ్లి చేసే స్థోమత లేని తల్లి తండ్రి ఏదైనా ఉద్యోగం చేయమని చెప్పారు.
డిగ్రీ లు చదివిన వారే ఆత్మాభిమానం చంపుకుని, చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. మామూలు ఉద్యోగం ఐనా స్వీపర్ వని చేయడం తప్పదా అనుకుని బాధ పడ సాగింది.
చెప్పుల షాప్ లో పనిచేయడానికి ప్రకటన చూసి, కామేశ్వర్ ను కలిసి తన స్థితి గతిని వివరించింది.
“అలేఖ్య గారూ.. మీరు పదివరకు చదివారు కాబట్టి పేర్లు, నంబర్స్ చదవడం లో, వ్రాయడంలో బాగా ప్రాక్టీస్ చేయండి. తరువాత వాటిని వివరించడంలో తెలివితేటలు ఉపయోగించి కస్టమర్స్ తో చక్కగా మాట్లాడాలి.
“కృతజ్ఞతలు సర్! మీరు చెప్పిన వన్నీ పాటిస్తాను".
రకరకాల పాదరక్షలను చూపించ మని, అవసరమైతే కాళ్ళకు తొడిగి చూపించమని, వాళ్లు మెచ్చేవిధంగా ప్రవర్తించాలి. అందరినీ సంతోష పెట్టేలా, వాటి మన్నికను, నాణ్యతను వివరిస్తూ చాలా మంది కొనుక్కునే విధంగా పని చేయాలి. కామేశ్వర్ చెప్పినట్లు చేసేది.
అలేఖ్య పనితీరు మెచ్చుకుని తనకు సన్నిహితంగా ఉంటూ, ఆమె బాగోగులు కూడా చూస్తూ అండగా ఉండేవాడు.
పశువుల, జంతువుల చర్మం తో తయారు చేయడం వల్ల వాటి పోషణకు కావలసిన సదు పాయాలు, పంటలు పండేoదుకు కొందరు గడ్డి పెంచేందుకు, చేను పంటలు పండిస్తూ అలేఖ్య ఎంతో మంది కొనుగోలుదారులను తీసుకు వచ్చేది.
కొందరు గొర్రెలు, మేకల చర్మం తో చేసుకోవడం బాధ పడి, జనుప నార పండించడం మంచిదని ప్రోత్సహించింది. జనుప నార తాళ్ళు లాగా పేని కొత్తరకం చెప్పులు తయారు చేయించేవారు.
వ్యాపారం అభివృద్ధి తోపాటు, అలేఖ్య పైన మంచి అభిప్రాయ మేర్పడింది. రానురాను ప్రేమగా మారింది.
“అలేఖ్య! నువ్వు నాగురించి ఏమను కుంటున్నావ్? ఇద్దరం కలిసి పెద్ద వ్యాపారం స్థాపిoచాం. కావలసిన ధనం సమకూరింది. నేను నిన్ను ఇష్టపడు తున్నాను. ఏమంటావ్?” అన్నాడు కామేశ్వర్.
“సార్! మీతో అడిగించుకునే అర్హత ఉందా నాకు.. నాకు మంచి జీవితాన్ని ఇచ్చిన వారు. ఎన్నో అర్హతలున్న మీకు నేను సరి జోడీ కాగలనా?" అంది.
"నువ్వు నీ సామర్థ్యాన్ని బట్టి పనిచేసి, సరియైన ఫలితాన్ని పొంద గలుగు తున్నావు. "
“కొందరు స్వార్థ పరులు తక్కువ పనిచేసి తప్పించుకుని, ఎంత దోచుకో గలిగితే అంత దోచుకుని వెళ్లి పోతారు.
మనమిద్దరం ఏకాభిప్రాయంతో సంస్థను ఎన్నో ప్రయోగాలు చేసి ఉన్నత స్థానానికి తీసుకువచ్చినాము. తప్పేముంది?”
**********************""
కొన్ని రోజుల తరువాత తమ ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకున్నారు. వ్యాపారం విజయవంతంగా కొనసాగుతూ విదేశీ ఎగుమతులకు కూడా అనుమతి,
ప్రోత్చాహం లభించింది. అలేఖ్య ను కేవలం వ్యాపారంలో తెలివైన భాగస్వామిగా అర్థం చేసుకుంటూ, సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయసాగాడు. జనాభా కు తగినట్లుగా కొత్త ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పరుచు కోవడం వల్ల ఆదాయం ఎక్కువ రాసాగింది.
కొన్నిరోజులకు వారిద్దరి అనురాగానికి చిహ్నంగా బుజ్జి బాబు పుట్టడం వారి సంతోషం ఇంకా రెట్టింపు అయింది.
రాష్ట్ర ముఖ్య పట్టణాల్లో కొడుకు పేరు "శ్రీను" కలిసెట్టుగా "శ్రీ" అనే పేరుపై కొత్త షాప్ ప్రారంభించాడు.
విదేశాల్లో పాల్ అనునతడు తెలివైన పెట్టుబడిదారు. తన వ్యాపారంలో భాగస్వామిగా, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న కె కె ఖాన్ అను దళారీ తాను మొదటి సారి చేపట్టిన కాంట్రాక్ట్ ను పూర్తి చేసి, వచ్చిన లాభాలను కామేశ్వర్ బ్యాంక్ లో వేస్తూ ఉండేవాడు.
అలా విదేశీ మోజులో అక్కడ పరిచయాలు స్త్రీలతో కూడా కొనసాగాయి. అనుభవజ్ఞురాలైన జాస్మిన్ తో వ్యాపారం ప్రారంభించడం, అక్కడ చుట్టు పక్కల పెద్ద చెప్పుల షాప్ లేక పోవడం, పరిశ్రమకు కావలసిన తోళ్లు, లెదర్ వ్యాపారాలు చేస్తూ, బ్యాంక్ లోన్లతో వ్యాపారం చేయడానికి కామేశ్వర్ ను షూరిటీ తీసుకుని తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు డబ్బు అప్పుగా పెడితే లాభమేనని అతన్ని ఒప్పించింది. వ్యాపారం కోసం తన మొత్తాన్ని బ్యాంక్ లో ఆమె పేర పెడతాడు.
జాస్మిన్ చేతిలో చిక్కి, విదేశాల్లో స్థిరపడి, అలేఖ్య ను మరిచి పోయే ప్రయత్నం చేశాడు. ఇండియా లో అభివృద్ధి చెందిన వ్యాపార సంస్థలపై నిర్లక్ష్య భావం ఏర్పడి పట్టించుకోవడం మానేస్తాడు.
అలేఖ్య దిక్కు తోచక, ఒక ప్రక్కన కొడుకును చదివించాలని, తన తెలివితేటలు, అనుభవం తో కాంట్రాక్టర్ లాగే ఏ పని ప్రారంభించినా రెండు నెలలకే అనుకోని సమస్యలు, ఖర్చులు రావడం తో షాపులను నిల్పుకునెందుకు చాలా ప్రయత్నించింది.
జాస్మిన్ భర్తను అలేఖ్య దగ్గరకు రాకుండా పూర్తి కట్టుదిట్టం చేసింది. జాస్మిన్ అందం, ఆకర్షణ లో తన జీవితాన్ని మొత్తం ఆమె చేతిలో పెట్టాడు.
సొంత వ్యాపారాలలో నష్టం వచ్చేట్లు చేసి, జాస్మిన్ తన షాపులను అభివృద్ధి చేసుకుంది. కామేశ్వర్ డబ్బంతా ఆమె ఖాతాలో జమ చేస్తాడు. అలా అప్పులెక్కువై ఇండియా లో షాప్ లు కొన్ని మూతపడ్డాయి. ఎక్కడో దూరప్రాంతాల షాపులు నడి పిస్తూ, కాంట్రాక్టర్ ద్వారా లావా దేవీలు చేస్తూ, కామేశ్వర్ ను అలేఖ్యను కలవకుండా చేసింది.
జాస్మిన్ చేసిన మోసాన్ని తెలుసుకున్నాడు. వ్యాపారంలో నష్టం, జీవితంలో కష్టం, జాస్మిన్ ఇలా ఇదివరలో ప్రేమతో మోసం చేసిన వాళ్లు చెప్పడం వల్ల తాను అలానే మోసపోయానని తెలుసుకున్నాడు.
కొన్నిరోజుల తరువాత ఇండియా వచ్చిన కామేశ్వర్ ఎంత వెదికినా అలేఖ్య కనిపించకపోయేసరికి, నిరాశతో ఇంకా వెదుకుతూనే ఉన్నాడు.
భార్య, కొడుకు కనిపించలేదని, కామేశ్వర్ బలహీనతలను తెలుసుకుని, వ్యాపార సంస్థలన్నీ తన పేరుపై మార్చుకుని, మళ్లీ తనను కలవ వద్దని ఆంక్షలు పెట్టింది జాస్మిన్.
అలేఖ్య తనను పూర్తిగా మరచి పోవడానికి, గుర్తుపట్టకుండా మారిపోయి, కొడుకును మాత్రం తండ్రికి అప్పగించాలని, తెలిసిన వారితో ఎప్పటికప్పుడు కామేశ్వర్ సమాచారం తెలుసుకుంటుంది.
అలా ఒకరోజు పూర్తి మారు వేషంలో కలిసిన కామేశ్వర్ ను ధర్మ చేయండి బాబూ!" అంటూ కొడుకును చూపించి అతని దగ్గరికి పనికి పంపించింది.
తనకొడుకు అని గుర్తుపట్టక పోయినా, తెలియని ఏదో ప్రేమతో దగ్గరికి తీసుకుని చదువు కోసం బడికి పంపించి, అన్ని రకాల పనులు నేర్పించి, ప్రయోజకుడిని చేస్తాడు.
తనకు భార్య, కొడుకును, విదేశీ మోజులో మరిచానని చెప్తే చీదరించుకుంటాడేమోనని, , ఆ విషయం ఎప్పటికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు.
ఒకరోజు అనుకోకుండా కామేశ్వర్ గదిలో దొరికిన డైరీ లో తన తల్లి పేరుతో సహా ఫోటోలు చూసి వచ్చి తల్లికి చెపుతాడు శ్రీను.
“నాయనా శ్రీను! నాకు తెలుసు కానీ ఇప్పుడే అతనికి నేను కనిపిస్తే నామీద ప్రేమ ఉందో లేదో.. ఇంకా విదేశీ మోజులో ఉంటే, నేను తట్టుకోలేను. అందుకే నిన్ను ముందుగా దగ్గర చేశాను". అనగానే
“అమ్మా! ఆయన పూర్తిగా మారిపోయాడు. రోజూ నిన్ను జ్ఞాపకం చేసు కుంటూ నీ ఫోటోలు, డైరీ చూసుకుంటాడు” అన్నాడు శ్రీను.
ఒకరోజు, “శ్రీను! ఇలారా ! నేను నాకొడుకును భార్యను కూడా రెండు ఏoడ్లప్పుడు వదిలి వెళ్ళాను. ఇప్పుడు నాదగ్గర ఉంటే నీ అంత కొడుకు నాకు ఉండేవాడు” అని బాధ పడ్డాడు కామేశ్వర్.
“నాన్నా! నీ కొడుకునే. మా అమ్మ నా దగ్గరే ఉంది. మీరు పూర్తిగా మారారా ?.. లేదా! అని తెలుసుకుని మీ గురించి చెప్ప మన్నది” అన్నాడు శ్రీను.
“చిన్నాశ్రీను! నువ్వు నాకొడుకువా ?’ అని ఆశ్చర్యంగా ‘ఎనిమిదేండ్ల తరువాత చూసి గుర్తుపట్టలేదు. మీ అమ్మను రమ్మన డానికి నేను అర్హున్ని కాను. నేను చేసిన మోసానికి నన్ను క్షమిస్తుందో లేదో?’ అన్నాడు.
“నాన్నా! అమ్మ మీకోసమే పరితపిస్తుంది. ప్రతిరోజూ మీ తలపుల తో బ్రతుకుతుంది”.
ఆమాటలు విన్న కామేశ్వర్ వెంటనే కొడుకుని తీసుకుని అలేఖ్య దగ్గరికి వెళ్ళాడు.
“క్షమిoచు అలేఖ్యా! నిన్ను కష్టపెట్టి నందుకు..”
ఎదురు చూస్తున్న అలేఖ్య భర్త కౌగిలిలో ఒదిగి పోయింది.
సుఖంగా కాపురం చేస్తూ, వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు, మూడుపువ్వులుఆరుకాయలుగా..
అందరూ సంతోషించారు.
శుభం
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
కలిసిన బంధం కథ జీవితం, ప్రేమ, పునరేకీకరణ ఆధారంగా నడుస్తుంది.
పేదరికంలో ఉన్న ఒక తల్లి తన కొడుకును సరైన దారిలో నడిపించాలని ప్రయత్నిస్తుంది. అతని గోలీల ఆటల నుండి జీవితంలోని విలువలను నేర్పే వరకు, ఆమె ఓ ధైర్యవంతురాలు. కామేశ్వర్ అనే వ్యాపారవేత్త చిన్న చెప్పుల వ్యాపారం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి కొత్త ధోరణులు ప్రవేశపెడతాడు.
అలేఖ్య అనే విద్యావంతురాలు ఆయన వ్యాపారంలో చేరి, తన ప్రతిభతో వ్యాపారానికి ప్రాణం పోస్తుంది. ఈ కలిసి పనిచేసిన రోజులు ప్రేమకు దారి తీస్తాయి.
ఆయన విదేశీ మోజులో మోసపడి తన కుటుంబాన్ని తృణీకరించినప్పటికీ, చివరికి తన తప్పును తెలుసుకొని కుటుంబాన్ని కలవాలని ప్రయత్నిస్తాడు.
ప్రేమ, నమ్మకం, క్షమ, జీవితం పునర్నిర్మాణానికి ప్రతీకగా ఈ కథ నిలుస్తుంది.