#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #కలియుగంలోపాపులకుఒకరోజుస్వర్గప్రాప్తి, #KaliyugamloPapulakuOkarojuSwargaprapthi, #TeluguMoralStories, #నైతికకథలు
Kaliyugamlo Papulaku Okaroju Swargaprapthi - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar
Published In manatelugukathalu.com On 08/02/2025
కలియుగంలో పాపులకు ఒకరోజు స్వర్గప్రాప్తి - తెలుగు కథ
రచన: మల్లవరపు సీతారాం కుమార్
కథా పఠనం: మల్లవరపు భవ్య
youtube link:
అతడొక మహాపాపి. తనెంత పాపాత్ముడో అతడికి బాగా తెలుసు. యమలోకపు బాధలకు, చావుకుముందే ప్రిపేర్ అయిపోయాడు.
కానీ ఆశ్చర్యంగా అతన్ని స్వర్గానికి తీసుకొని వెళ్లారు.
ఇదంతా కలేమోనని అనుకున్నాడు.
చచ్చాక కలలుండవన్నారు అక్కడివాళ్లు.
అతడిని ఒక రోజు గడవగానే అక్కడినుండి నరకానికి నెట్టేస్తున్నారు.
అతడు ఆశ్చర్యంతో "స్వర్గానికి ఎందుకు తెచ్చారు? ఇప్పుడు నరకానికి ఎందుకు తీసుకొని వెళ్తున్నారు" అని ప్రశ్నించాడు.
"నరకంలో ఉన్న శిక్షలేవీ ఇప్పటి పాపులకు భయంకరంగా అనిపించడం లేదు. ఒక రోజు గనుక స్వర్గంలో వుంటే అప్పుడు నరకపు శిక్షలు రెట్టింపు బాధిస్తాయి. అందుకే ఒక రోజు స్వర్గానికి తీసుకొని వచ్చాము. ఇక నరకంలో కోటి సంవత్సరాలు బాధలు అనుభవించు" అంటూ అతడిని నరకలోకంలోకి తోసేశారు.
***
-మల్లవరపు సీతారాం కుమార్.
Comments