top of page
Writer's pictureSurekha Puli

కల్పతరువు - పార్ట్ 1

కల్పతరువు - కొత్త ధారావాహిక ప్రారంభం

'Kalpatharuvu - Part 1' - New Telugu Web Series Written By Surekha Puli

Published On 07/12/2023

'కల్పతరువు - పార్ట్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సత్యప్రకాష్, చెల్లెలు సత్యలీలకు తోడుగా రాజధాని ఎక్స్ప్రెస్ టూటైర్ ఎసిలో వెళ్తున్నాడు. ఇద్దరి మనసులు బరువుగా ఉన్నాయి. సత్యలీల ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ‌గా చండీగఢ్‌లో ఉద్యోగం సంపాదించుకుంది. ట్రైన్ కదిలింది.


అల్లారు ముద్దుగా చూసుకున్న చెల్లెలికి డి. ఎస్. పి. విశ్వంతో ఘనంగా పెళ్లి చేసి హానీమూన్కు పంపించాడు లాయర్ సత్యప్రకాష్. చల్లటి ఊళ్లన్ని వెచ్చ వెచ్చగా తిరిగి వచ్చిన జంట అన్యోనంగా కాపురం చేసుకుంటున్నారు.


ఎన్ని మార్లు అందమయిన ప్రకృతి ఫోటోలు చూసినా తృప్తి తీరటము లేదు.


భర్తతో కోరిక వెల్లడించింది “నాకు హిమాచల్ ప్రదేశ్ చాలా నచ్చింది. స్వచ్చమయిన గాలి, మంచుతో కప్పబడిన పచ్చటి కొండలు.. ఏమో నాకు వర్ణించటము రాదు, కానీ మళ్ళీ చూడాలని వుంది. ”


భార్య ప్రక్కనే కూర్చుంటూ ఆల్బమ్ తిరగేస్తూ “మళ్ళీ హానీమూన్ వెళ్లాలని వుందా?! అంటే రోజూ ఇంట్లో జరిగే హానీమూన్తో సరిపెట్టుకోలేక పోతున్నావన్నమాట. " భార్యను చేతుల్లోకి తీసుకుంటూ కొంటెగా అన్నాడు విశ్వం.


చిరునవ్వు నవ్వి “నేను ప్రకృతి అందాల గురించి చెబుతుంటే, మీరు వేరే అర్థాలు తీస్తునారు. "


“నా ప్రకృతి.. నా భార్య! కనుక నాకు వేరే ఎక్కడికో పోయి అందాలు చూసే ఆనందం కంటే ఎల్లప్పుడూ నాతోనే వుంటున్న నా ఇల్లాలు చాలు. "


“ఓకే, మీ మాట సరే, కానీ నిజంగానే మరోసారి కులుమనార్, కుర్ఫీ, సిమ్లా, ఒకటేమిటి హిమాచల్ ప్రదేశ్ మొత్తం చూడాలని వుంది. మీకు వీలయియతే అక్కడికి ట్రాన్సఫర్ చేయించుకోండి. ”


“నా భార్య గర్బవతి, ఆమె కోరిక మేరకు ఫలానా చోటుకు ట్రాన్సఫర్ చేయండి, అంటే ఎవ్వరూ వినరు మేడమ్! నాలాంటి జూనియర్లను జల్సా చేసుకోమని మన కోరిక మన్నించరు. " డి. ఎస్. పి. గారి స్టేట్మెంట్ విన్నది సత్యలీల.


ఏమనుకొని ట్రాన్సఫర్ గురించి అనుకున్నారో గాని మూడు నెలల్లోనే నల్గొండకు ట్రాన్సఫర్ అయి ఆరు నెలల్లోనే నక్సలైట్స బాంబుల కాల్పులలో మరణించాడు.


చదువు, ఉద్యోగం, ఆస్తి, అందమయిన భార్య కల్గిన విశ్వం జీవితానికి ఆయువు కొరత ఏర్పడ్డది. హృదయవిధారకంగా రోధించిన సత్యలీలకు భర్త చనిపోయిన రెండో రోజుకే గర్భం పోయింది.


భర్త పాత్రకు ముగ్ధురాలయిన భార్యకు మౌనం ఒక్కటే మార్గంగా తోచింది. సుఖవంతమైన సంసారంలో అన్నీ దెబ్బలే!


కన్నుల్లో కళ లేదు. ముఖంలో తేజస్సు లేదు. సత్యలీల పరిస్థితి చూడలేక అన్నావదినలు మళ్ళీ పెళ్లి చేయతలచారు.


“విశ్వంను మర్చిపోలేను, మరో మనిషిని భర్తగా నా జీవితంలో ఒప్పుకోను” ఎంత చెప్పినా చెల్లెలు ఒప్పుకోలేదు.


“నీకు యింకా ఎంతో జీవితం వుంది, పెళ్ళయి ఏడాది నిండలేదు. ఆస్తి వుంది; పిల్లలు లేరు, భవిష్యత్తులో నీకు తోడు అవసరం. ” అభ్యర్థన వెళ్ళడించాడు.


“నేను బావుండలి అంటే నన్నిలా వదిలెయ్యండి. ”


“కాలక్షేపానికి ఏదైనా నిర్వాకం మొదలుపెట్టు చెల్లెమ్మా. ”


“కంప్యూటర్ ప్రోగ్రామర్ పోస్టులకు అప్లై చేశాను, ఉద్యోగం రాగానే జాయిన్ ఆవుతాను. " సత్యలీల చెప్పింది. చెల్లెలి దుఃఖానికి అన్న మనసు కుంచించుకు పోతున్నది.


ఆర్ధిక యిబ్బంది లేకున్నా, సత్యలీల తనకున్న కంప్యూటరు డిగ్రీతో తాను ఇష్టపడే హిమాచల్ ప్రదేశ్కు ప్రక్కనే వున్న హర్యానా రాజధాని చండీగఢ్‌లో పేరుగాంచిన ప్రైవేట్ కంప్యూటరు సంస్థలో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకొన్నది.


ఇది కేవలం టైమ్ పాస్కే అని తెల్సినా, చెల్లెలిని దిగపెట్టి అన్ని బాగోగులు చూడ్డానికి తోడుగా వెళ్తున్నాడు లాయర్ సత్యప్రకాష్.


>>>>>>>>>>


వూహ తెలిసినప్పటి నుండి ప్రజ్ఞా పృథ్వీధర్లు స్వయానా బావామరదళ్లు అయినందుకు కాబోలు ఇరువురి తల్లిదండ్రులు ఇద్దరి మనసులో భార్యభర్తలన్న బీజాన్ని నాటారు. ఆ భావన తోనే పెరుగుతూ ప్రజ్ఞ తానొక రాధ, పృథ్వి మాధవుడు అనే ముద్ర మనసుల్లో నాటుకుంది.


ప్రియమైన బావకు, నువ్వు వీలైనంత త్వరగా ఇంటికి రావాలి. నీకో తీయటి మాట చెప్పాలి. వుత్తరంలో చెప్పలేను, వస్తావుగా. ఇట్లు, నీ ప్రజ్ఞ.


ప్రజ్ఞ వుత్తరాన్ని ఆజ్ఞగా పాటించి రెక్కలు కట్టుకొని అమాంతం రాలేదు. పృథ్విథర్ తన వీలు చూసుకొని వూరికి వచ్చాడు.


బక్కపలచగా చిన్న పిల్లలా వుండే ప్రజ్ఞ, రెండేళ్లలో బాగా రంగొచ్చి, ఒళ్ళు చేసి పౌష్టిగా వుంది. పృథ్విథర్ని చూడగానే ముగ్ధ అయింది.


“తీయటి మాట అన్నావు, నన్ను చూడగానే చప్పబడి పోయావా? వచ్చి రెండు రోజులైంది ఏది చెప్పవేం. ”


ఎంతో సిగ్గు పడుతూ చెప్పాలని ప్రయత్నిస్తూ వుంది. పృథ్వీ బావ తన కాబోయే భర్త! త్వరలోనే పెళ్ళి, పెద్దలు మాట్లాడుకున్నారు. ఈ అమూల్యమైన ముచ్చట విన్నవించాలంటే ఏదో తడబాటు!


ప్రజ్ఞ సిగ్గు, బిడియం చూసిన పృథ్వీకు థ్రిల్లింగ్ గా వుంది. పెద్దల అనుమతి పొంది ఒక చల్లటి సాయంత్రం వేళ ప్రజ్ఞను తీసుకొని బయటికి వచ్చాడు.


ఒక వైపు గాలితో సమంగా వూగుతూన్న పచ్చని పొలాలు, మధ్యన కాలువ, ఇటుకేసి మామిడి తోట, చెట్టు నిండా భారంగా వేలాడుతున్న మామిడి కాయలు.


సూర్యాస్తమం. కాషాయ రంగుతో నిండిన వాతావరణం. తోటలో ఓ వైపు కూర్చుంటూ “ఇప్పుడు చెప్పు, నీ మాటలతో నేనే కాదు, ఈ పుల్లటి మామిడికాయలు కూడా తీయని పండ్లు అయిపోవాలి. "


ప్రశాంత వాతావరణనానికి తోడైన ఏకాంతం. ప్రజ్ఞలో ధైర్యం వచ్చింది. బావ కళ్ళలోకి చూస్తూ భవిష్యత్తుని వూహిస్తు ఇబ్బంది పడుతూ పెళ్లి కబురు చెప్పింది. పృథ్వి పకపకా నవ్వాడు. క్షణం బిత్తరపోయి చేసేది లేక తాను నవ్వింది.


“ప్రజ్ఞా, చాలా థాంక్స్. నాతో ఈ మాట చెప్పడానికి యింత బిడియ పడ్డావెందుకు?” మెత్తని చేతిని అందుకొని అన్నాడు.


“నేను ఇంకా చదువుకోవాలి. మా నాన్నకు నన్నొక సైంటిస్టు గా చూడాలని కోరిక. మరి నువ్వేం అంటావు?”


పెళ్లికి ముందే పురుషోత్తముడు కాబోయే భార్య సంప్రదింపుకు, సలహాకు విలువ ఇస్తున్నాడు, ఎంతటి మహానుభావుడు! సరేనని తల వూపింది.


ఇంట్లో పెద్దలకు చెప్పి కొన్ని సార్లు, చెప్పక కొన్ని సార్లు పొలం వైపు తోటలో కలుసుకోవటం, ప్రకృతిలోని అందాలను జీవితంలో అన్వయించుకోవడం, కలల జగత్తులో మైమర్చి పోయేవారు ప్రేమికులు, కాబోయే దంపతులు.


..


“ప్రజ్ఞా, ఈ రోజు ప్రకృతి అందాలు కాదు, నీకు వేరే అందాలు చూపిస్తాను. ”


“అంటే”


“అదొక ఫాంటసీ, థ్రిల్లింగ్!”


మందంగా వున్న ఒక మాగ్జీన్ తెరిచాడు. పేజీ తరువాత పేజీ తీస్తున్నాడు. అన్ని పేజీల్లోనూ స్త్రీ పురుషుల నగ్న శృంగార భంగిమల చిత్రాలు. ప్రజ్ఞకు గుండె దడ హెచ్చింది. పుస్తకం మూసి అన్నాడు.


“ఎలా వుంది?”


ఏం చెప్పాలి? నచ్చిన ప్రియుడితో బాగుందని చెప్పాలా? కాబోయే భర్తతో బాగాలేదని చెప్పాలా? మౌనంగా తలదించుకుంది.


తల ఎత్తి ముద్దు పెట్టుకొని, “ప్రజ్ఞా, హాలిడేస్ అయిపోతున్నాయి. నేను సిటీ వెళ్ళి చదువులో నిమగ్నం అవుతాను. మన ప్రేమకు నిదర్శనంగా ఈ పుస్తకంలో వున్నట్టు మనం కూడా.. ”


“వద్దు, నాకు భయం. ”


“భయం ఎందుకు? రేపు మా అమ్మ మీ ఇంటికి పచ్చళ్లు పెట్టేందుకు వస్తుంది, మా ఇంట్లో ఎవ్వరూ వుండరు. ఐనా కాబోయే భార్యాభర్తలం మనకేంటి భయాలు, హద్దులు?”


ప్రజ్ఞ కుదురుగా కూర్చున్నా కాళ్ళు చేతులు వణుకు తున్నాయి, తలలో ఏదో తిమ్మిరిగా వుంది. ఎప్పుడు లేని ఈ కొత్త శారీరిక చిత్రమేంటి?


పృథ్వి బ్రతిమాలాడు. “తీయటి మాట చెప్పావు, నేను తీయటి కార్యాన్ని పంచుకోవాలని.. ” ధీనంగా అడుక్కుంటున్న ముఖం; ఎర్ర జీరలేర్పడిన ఆతని కళ్ళు; పుస్తకంలో కొత్తగా మొదటి సారి చూసిన నగ్న శృంగార భంగిమల చిత్రాలు తాలూకు ఏర్పడిన తొందర ‘సరే' అనిపించాయి ప్రజ్ఞతో.

========================================================================

ఇంకా వుంది..


========================================================================


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


139 views6 comments

6 Comments


@dodlaradha1135 • 5 days ago

Interesting story waiting for next part

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Dec 12, 2023
Replying to

Thank you 💞

Like

@rakheevenugopal362 • 5 days ago

A good start up NovelAll the best

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Dec 12, 2023
Replying to

Thank you 💞

Like

nice

@anilgurram-pi1yn • 5 days ago

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Dec 12, 2023
Replying to

Thanks 🙏

Like
bottom of page