top of page
Writer's pictureSurekha Puli

కల్పతరువు - పార్ట్ 11



'Kalpatharuvu - Part 11' - New Telugu Web Series Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 28/01/2024

'కల్పతరువు - పార్ట్ 11' తెలుగు ధారావాహిక

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


బాంబు దాడిలో సత్యలీల భర్త డి. ఎస్. పి. విశ్వం మరణిస్తాడు. మిగిలిన జీవితం ఒంటరిగానే గడపాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్‌లో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. 


పక్క పోర్షన్ అచలాదేవి తో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల, తన భర్త త్యాగిసోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో, అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగిసోనీతో వివాహం జరిపిస్తారు. 


పెళ్ళికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు ఆమె బావ పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండక పోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి మకాం మారుస్తాడు ఆమె తండ్రి నారాయణ. ప్రజ్ఞను కొందరు ఆకతాయిలు వేధిస్తుండటంతో తోడుగా తన అసిస్టెంట్ ఆనంద్ ని పంపుతాడు ఆమె తండ్రి స్నేహితుడు కేశవరెడ్డి. 


త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల. సత్యలీలతో పరిచయం పెరిగాక, తనకు జస్ప్రీత్ అనే మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు అంగీకరిస్తాడు త్యాగి. ఆతనితో సిమ్లా వెళ్లి ఆమెని కలుస్తుంది. అచలకు విడాకులిస్తే వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చని వాళ్లకు చెబుతుంది. విడాకుల కాగితాల మీద అచల సంతకం చేస్తుంది.


టూర్ కి వెళ్లిన ప్రజ్ఞ తలిదండ్రులు ప్రమీల, నారాయణ తిరుగు ప్రయాణంలో మరణిస్తారు. ఆమెను కేశవ రెడ్డి స్వంత కూతురిలా చూసుకుంటాడు. తనకు ప్రజ్ఞ అంటే ఇష్టమని కేశవరెడ్డితో చెబుతాడు ఆనంద్.


ఇక కల్పతరువు ధారావాహిక 11 వ భాగం చదవండి.


అన్నా వదినలకు ఫోన్ ద్వారా వేరే ఇల్లు మారుతున్నామని చెప్పింది. వాళ్ళు వేరే ఇల్లు ఎందుకు, ఆ అమ్మాయిని తీసుకొని హైదరాబాద్ వచ్చేస్తే సంతోషిస్తామన్నారు. 


“మరి అచల, ఆమె పాప మనతోనే వుంటారు. మీకు సమ్మతమేనా?”


“ఇన్ని రోజులైనా మాకు పిల్లలు లేరు, మనింట్లో సందడి మాకు సంతోషమే. ”


“అన్నా, మీ గొప్ప మనసుకి చాలా థాంక్స్. ”


“ట్రైన్ కంటే ఫ్లయిట్ లో తిరుగు ప్రయాణం బెట్టర్” సత్యప్రకాష్ సలహా యిచ్చాడు. 


“సరే, వీలునుబట్టి చూస్తాను. నాదొక చిన్న రేక్వేస్ట్.. ”


“చెప్పమ్మా. ”


“నువ్వూ వదినా ఇక్కడికి రండి, మనమందరము కల్సి కట్రాలోని ‘శ్రీవైష్ణవీదేవి’ మందిరం చూద్దాము, అలాగే రిటర్న్ జర్నీ లో మీతో పాటే హైదరాబాద్ వచ్చేస్తాను. ”


“ఐడియా బాగానే వుంది, నా ఫ్రెండ్ సర్దార్ శరణ్ జీత్ గారిని కూడా మన వెంట రమ్మందాము. మనకు తోడుగా వుంటారు. సరేనా. ”


విడమర్చి అచలకు సంభాషణ తెలిపింది. 


“మేడమ్జీ మీ ఫ్యామిలీ అంతా విశాల హృదయులే. ” అని అచల సత్యలీలను కౌగలించుకుని బుజం మీద ముద్దు పెట్టుకుంది. 


రెండేళ్ల వ్యవధిలో సత్యలీల హోమ్ టౌన్ కు తిరుగు ప్రయాణం. సత్యలీల ఎంతో మన్నికైన కొన్ని డ్రెస్సెస్ కొనుక్కుంది. 


“అచల మనం హైదరాబాద్లో బుటిక్ పెట్టి బిజినెస్ మొదలు పెడితే, డ్రస్ మెటీరీయల్ బట్టలు ఇక్కడి నుండే బల్క్ లో ఆర్డర్ చేద్దాం. 


“ఇక్కడ ఏమీ లేవు, సత్యాజీ, లూధియానా, జలంధర్, అమృతసర్ అటు సైడ్ అంతా యింకా చాలా బాగుంటాయి. ” 


“అవునా, మరి అక్కడ నీకు ఎవరైనా తెల్సిన వాళ్ళు వుంటే, వాళ్ళ అడ్రెస్లు, ఫోన్ నెంబర్లు తీసుకుని జాగ్రత్త చేయి. "


“అలాగే, అడ్రెస్లు, ఫోన్ నెంబర్లు రాసుకొని, ఇద్దరికీ కలిపి ఒక డైరీ పెడతాను. ”


***


అనుకున్న ప్రోగ్రామ్ ప్రకారం జమ్మూ కాట్ర వద్ద గల శ్రీవైష్ణవీ దేవి మందిరానికి రెండు ట్రావెల్లింగ్ టెంపోలు బుక్ చేశారు. ఒకటి సర్దార్ శరణ్ జీత్ గారి ఫ్యామిలీ, మరో టెంపోలో సత్యప్రకాష్, జగదాంబ, సత్యలీల, అచల, జ్వాల. 


సత్యలీల దారిలో ట్రావెల్లింగ్ ఏజెన్సీ వాళ్లిచ్చిన బ్రోచర్ తీసుకుని చదవడం మొదలు పెట్టింది. 


శ్రీవైష్ణవదేవి ఆలయం ఉత్తర భారత్ లోని జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. వైష్ణోదేవి ఆలయం చేరటానికి కాట్ర నుండి 14 కి. మీ. దూరం కొండ ఎక్కాలి. కొండ ఎక్కలేని వారికోసం గుర్రాలు, డోలీలు, హెలికాప్టర్ల సర్వీస్ కూడా వున్నాయి. 


భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయం లోపలికి సెల్ ఫోన్లు, కెమెరాలు, తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చును. 


శ్రీవైష్ణోదేవి మూడు రూపాలు; జనన మరణాలు ప్రసాదించే మహాకాళి, జ్ఞానాన్ని ఇచ్చే మహాసరస్వతి, ఐశ్వర్యాదృష్టాన్ని ఇచ్చే మహాలక్ష్మి. 


మరొక ప్రక్కగా ఉన్న శిఖరం మీద భైరవనాధుని ఆలయం ఉన్నది. వైష్ణవీదేవి అమ్మవారు భైరవుని తల నరికి వేసినప్పుడు తనను దర్శించినవారు భైరవుని తప్పక దర్శిస్తారని వరం ఇచ్చింది. అందువల్ల భైరవ ఘాట్లో భైరవనాధ్ తల ఒక పిండరూపంగా ఉంటుంది. 


వెళ్ళేది అక్కడికే గదా అనుకొని మధ్యలోనే చదవడం ఆపేసింది. 


సాయంత్రం ఆరు ప్రాంతంలో కాట్రా చేరుకున్నారు. స్వల్పంగా భోజనాలు చేసి కొండ దారిన కాలి నడక మొదలు పెట్టారు. 


నవంబర్ నెల, నిండు పౌర్ణమి, దారి పొడుగునా దేదీప్యంగా వెలుగుతున్న కరెంటు దీపాలు. అక్కడక్కడ ఆకాశంలో తెల్లటి మబ్బులు కదులుతూ కొండ ఎక్కే ప్రయాణికులను సున్నితంగా స్పృశిస్తూ కదిలి పోతున్నాయి. చలిగా లేదు, అట్లని ఉక్కగా కూడా లేదు. ఆహ్లాదకరమైన వాతావరణము. కొండ మలుపుల నుండి కొంచెం వంగి చూస్తే లోయ. ఏ మాత్రం నడక అదుపు తప్పినా, లోయల్లో పడితే నామ రూపల్లేక మటుమాయం అవుతాము. 


కాలుష్యం లేని చుట్టూ పరిసరాల వలన శరీరం, మనసు సంతోషంతో అడుగులు పడుతున్నాయి. 'జై మాతాజీ' అంటూ భజనలు చేస్తూ జనాలు కొండ ఎక్కుతున్నారు. 


నడవలేని వారు బక్క చిక్కిన గుర్రాల పైన సవారి చేస్తున్నారు. బరువులు మోయలేని వారిని పల్లకీలు మోస్తూ ప్రయాణీకుల గమ్యం చేరుస్తున్నారు. 


బక్క చిక్కిన గుర్రాలను, డొక్క లేని బోయీలను చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది. కూటి కొరకు పాట్లు తప్పవు!


అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటూ అమ్మవారిని స్మరిస్తూ నడక సాగుతుంది. 


సర్దార్ శరణ్ జీత్, వారి శ్రీమతి గారివి భారీ శరీరాలు. అందరిలోనూ వారే ఎక్కువ ఆయాసపడాలి, కానీ పడుచు పిల్లలు నడిచినంత హుషారుగా నడుస్తున్నారు. వాళ్ళ ఆరోగ్య రహాస్యమేమిటో అని అడిగింది సత్యలీల. 


“మాతా పైన నిల్పిన ఏకాగ్రత, ఆచరణలో పెట్టిన మనోవాంఛ. ” నవ్వుతూ చెప్పారు. 


వాళ్ళ మాటలు వినగానే అమాంతంగా అచల నడక ఆపి వాళ్ళిద్దరి కాళ్ళకు దండం పెట్టింది. 


ఆలూమగలిద్దరూ హఠాత్చర్యకు ఆశ్చర్యపడుతూనే ఆశీర్వదించారు. 


“మీరు నన్ను కాపాడారు, ఇక నా భవిష్యత్తు కూడా ఆ మాత దయ కావాలని కోరుతున్నాను. ” కన్నీళ్ళు పెట్టుకుంది అచల. సత్యలీల పైకి లేవనెత్తి అక్కున చేర్చుకుంది. 


కొండ పైన ఎక్కుతూన్న కొద్ది పున్నమి చంద్రుడు కూడా మనతో పాటే తోడుగా వస్తున్నట్టు వుంది. మలుపు తిరిగితే మలుపు తిరుగు తున్నాడు. నడక ఆగితే నిలబడు తున్నాడు. ఈ దృశ్యం జ్వాలకు అద్భుతముగా తోచి చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంది. 


కన్నకూతురి ముఖాన ఇంతటి ఆనందం చూసి అచల అమితానందం చెందింది. 



>>>>>>>>>>


సమయం-సందర్భం చూసుకొని ప్రజ్ఞతో, “అమ్మా, చంకలో పిల్లాడిని పెట్టుకొని వూరంతా వెతుకులాట అనే సామెత నాకు సరిగ్గా సరిపోతుంది. ఆనంద్ తన యిష్టాన్ని చెప్పాడు, ఒకవేళ నీకు సమ్మతమైతే.. నేను.. ”


“ఆనందా..! అతను నాతో ఎన్నడూ ఇష్టంగా ప్రవర్తించలేదు, నేను కూడా అతనిలో మంచి స్నేహితుడిని చూశాను. ” 


“అవును, ఆ మంచి స్నేహితుడు ఇక రాబోయే రోజుల్లో నీ భర్తగా నువ్వు అంగీకరిస్తావా?”


జవాబు చెప్పలేక పోతున్నది. 


“కొంచెం సమయం తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకో.. ”


“పెదనాన్నా, మీరు చెప్పండి. నేను కన్ఫూస్డ్ స్టేజ్లో వున్నాను. ”


ప్రజ్ఞ కూర్చున్న చోటుకు కొంచెం దగ్గరగా జరిగి, “అయితే విను, “ఆనంద్ నాకు దూరపు చుట్టమే, చిన్నప్పటి నుండి తెలుసు. వాళ్ళ నాన్నగారు బతికి చెడ్డ మనిషి. అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లోనుండి పారిపోయాడు. ఉన్నాడో లేడో తెలియదు. 


ఇక తల్లి; కన్న పిల్లల ఆకళ్ళు, అవసరాలు తీర్చలేక మంచాన ఉస్సురోమని దిగజారిన వేళ ఆనంద్ స్కూల్ ఫైనల్ చదువు పూర్తి కాగానే నా కిరాణా షాప్ లో పనికి పెట్టుకున్నాను. చాలా బుద్దిమంతుడు, పనిమంతుడు. 

 

వాళ్ళమ్మ చివరి రోజుల్లో ఇద్దరమ్మాయిల పెళ్ళిళ్ళు నా ఖర్చులతో యాదగిరిగుట్ట శ్రీనరసింహస్వామి సన్నిధిలో జరిపించాను. ఆ తరువాత వాడూ ఒక్కడే, నేనూ ఒక్కడినే.. ఒకే చోట కిరాణా షాప్ చూసుకుంటూ వున్నాము. ”


ప్రజ్ఞ తదేకంగా చూస్తూ మాటలు వింటున్నది. “కాఫీ గాని టీ గాని తాగుదమా పెదనాన్నా?”


“పెళ్లి ముచ్చట్లు ఇంకా మాట్లాడుకోవాలి, కాఫీ తీసుకురామ్మా. ” 


పొగలు సెగల ఘుమ ఘుమ కాఫీని నేల పైనే కూర్చుని ప్రజ్ఞ, కీళ్ల నొప్పలు వున్నందుకు పెదనాన్నా సోఫాలోనే కూర్చుని తాగారు. 


“ఇక మీ వయస్సును నేనెప్పుడూ అడిగే అవసరం రాలేదు. జాతకం గురించి.. ” ధీర్ఘమైన నిట్టూర్పుతో.. "నాకు వాటి మీద విశ్వాసం పోయింది. ” 


“పెదనాన్నా, ఆనంద్ నాకు భర్తగా సరిపోతాడా లేదా చెప్పండి, అతని బయోడేటా, హిస్టరీ, జాగ్రఫీ వద్దు. ” 


“అంతా విని, ఇప్పుడు మడత ప్రశ్న వేస్తున్నవా? అమ్మో! తెలివిగల అమ్మాయివే.. ” అని మాట దాటేశాడు. 


నవ్వుతూ, “మీరు ఏమైనా తక్కువా? ఆనంద్ నాకు భర్తగా సరిపోతాడా లేదా చెప్పండి.. ప్లీజ్..” అంటూ సోఫాలో కూర్చున్న కేశవరెడ్డి మోకాళ్ళ పైన తల ఆన్చినది. 


“సిగ్గు, బిడియము పక్కన పెట్టి, నీ నిర్ణయం చెప్పమ్మా. ”


“మనం ముగ్గురమూ ఈ విషయం మాట్లాడుదామా, నేను, నాడౌట్స్, అంటే.. ”


“తప్పకుండా..”

========================================================================

ఇంకా వుంది..


========================================================================


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

 ఇక్కడ క్లిక్ చేయండి.


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


36 views3 comments

3 commentaires



@rakheevenugopal362

• 8 hours ago

Describing about Vaishnav Devi temple, Mountain peek, Moon alongside is excellent.

J'aime

Anil Gurram

10 hours ago

👌🥳👌🙏

J'aime


@divikg5573

• 17 hours ago

nice move

J'aime
bottom of page