'Kalpatharuvu - Part 4' - New Telugu Web Series Written By Surekha Puli
Published On 22/12/2023
'కల్పతరువు - పార్ట్ 4' తెలుగు ధారావాహిక
రచన: సురేఖ పులి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సత్యలీల పెళ్లి డి. ఎస్. పి. విశ్వంతో జరుగుతుంది.
ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బాంబు దాడిలో విశ్వం మరణిస్తాడు. ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్‌లో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది.
ప్రజ్ఞా పృథ్వీధర్లు బావామరదళ్లు. పెళ్ళికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్.
చండీఘడ్ లో పక్క పోర్షన్ అచలదేవి తో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి.
అచల తన భర్త త్యాగిసోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది.
నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగిసోనీతో వివాహం జరిపిస్తారు.
ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండక పోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి మకాం మార్చాలనుకుంటాడు ఆమె తండ్రి నారాయణ.
ఇక కల్పతరువు ధారావాహిక నాల్గవ భాగం చదవండి..
“బాబు పుట్టాడు. పాపను చిన్న చూపు చూస్తూ బాబును ముద్దులాడే వాడు. మా అత్త మామ గార్లు పోయారు. పెద్దదిక్కు లేదు.
ఇన్నాళ్లూ వీధి వరకే పరిమితమైన సిగరెట్లు, గుట్కా, లిక్కర్, అన్ని చెడు అలవాట్లు ఇంట్లోకి చేరుకున్నాయి. నన్ను పాపను అనవసరంగా కొట్టటం, అసహ్యంగా తిట్టటం పరిపాటి అయింది. ఎక్కడికి వెళుతున్నాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు, అడిగినా జవాబు చెప్పడు.
ఆస్తి పోయి అప్పుల జాబితా పెరిగిపోతున్న వేళ నేను స్వెటర్లు, డ్రస్లు కుట్టి రేడిమేడ్ షాపుల్లో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాను.
త్యాగి ఖర్చులకు నన్ను డబ్బు సర్దమనేవాడు. నేను ఇవ్వకపోతే నన్ను చితకబాది, వాతలు పెట్టెవాడు. చావలేక నరకం భరిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకొని చాలా మోసపోయాడని ఉక్రోషంతో నన్ను పాపను ఇంట్లోనుండి పొమ్మని నానా రభస చేసినందుకు ఎన్నో అద్దె ఇళ్ళు మారాల్సి వస్తుంది.
మా వారు యోగిసోనీగారి జ్ఞాపకాలతో బ్రతుకు సాగించక త్యాగిసోనీని మళ్ళీ పెళ్లి చేసుకన్న తప్పుకు, శిక్ష అనుభవిస్తున్నాను. పదిహేను రోజులకొకసారి హిమాచల్ వెళతాడు. కారణాలు చెప్పడు, అడిగే అవసరమూ, ధైర్యమూ నాలో లేవు. ”
హర్యాన్వి కలిసిన హిందీలో ఏకధాటిగా చెప్పుకుంటూ పోతున్నది, బాగా టెన్షన్తో వున్నట్టున్నది, బుగ్గలు, పెదాలు, చెవులు ఎర్రబడ్డాయి.
అచల రెండు చేతులు జోడించి “యోగిగారి సమక్షంలో సంతోషం, స్వేచ్చా, శాంతి వుండేవి కానీ వీడు రాక్షసుడు! నేనూ, జ్వాల వీడికి దూరంగా వెళ్లిపోవాలి. విడాకులు తీసుకోవాలి. ”
“నీ బాధ అర్థమైంది, కానీ నేను ఏ విధంగా సాయం చేయగలను?”
“మీరు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా సుఖంగా మీ బ్రతుకు మీరు బ్రతుకుతున్నారు. నేను ప్రతీరోజు ఛస్తున్నాను. మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు విముక్తి కావాలి”.
“నా కాళ్ళు వదులు” కాళ్లని దూరంగా జరిపి కూర్చుంది సత్యలీల. “నన్ను కూడా పెళ్లి చేసుకోమని అంతా బలవంతం చేశారు. అన్నయ్య పెంపకంలో నాకు చదువుతో పాటు స్వేచ్ఛ, స్వాతంత్రం కూడా ఇచ్చాడు. నా ఆలోచనలకు విలువ యిచ్చి నా ఆత్మవిశ్వాసాన్ని బలపర్చాడు. సమాజంలో అన్నావదినల అండదండలున్నా సరే, నేను మళ్ళీ పెళ్ళికి ఒప్పుకోలేదు, కారణం నా ఈ చిన్ని వైవాహిక జీవితంలో మావారి జ్ఞాపకాలు, గుర్తులు చాలు.
కొన్నాళ్లపాటు అందరికీ దూరంగా, ఒంటరిగా వుండాలని యింత దూరం వచ్చి, వుద్యోగం చేసుకుంటున్నాను. ” సత్యలీల మాట్లాడుతూనే వుంది.
వుద్యోగంలోని కష్టనష్టాలు గూర్చి వివరించింది. చాలాసేపు ఇద్దరూ మౌనంగానే వున్నారు.
సత్యలీల ధైర్యం గొంతు విప్పింది “కొంత ఆస్తి అత్తగారికి, మరిదికి యిచ్చేసి, నీ వంతు ఆస్తితో నువ్వు, పాప దూరంగా వుండిపోవలిసింది. మనం విన్నకొద్దీ, భరిస్తూన్న కొద్దీ మన చుట్టూ జనాలు మనల్ని భయపెడుతూనో, బాధపెడుతూనో యిబ్బంది పెడుతూ వుంటారు. మన ఆత్మవిశ్వాసం ముందు సమాజం పిరికిది. "
అచల సంజాయిషీ ఇచ్చుకుంది “మీకు చదువు, సంస్కారం, మంచి పెంపకం వున్నై, మీ వాళ్ళందరు మీ నిర్ణయానికి మీకు తోడుగా వున్నారు, కానీ నా విషయంలో పూర్తిగా వ్యతిరేకం. అయినా ఇప్పటికైనా మించిపోయిందిలేదు, మిమ్మల్ని చూశాక నాలో ఆశ మొదలయింది. నాకు ఈ బంధం నుండి విముక్తి కావాలి. ”
“నేను ఆలోచించుకోవాలి, నాకు కొంచెం టైమ్ కావాలి. ” సత్యలీల నిలకడగా జవాబు చెప్పింది.
ఈ విషయంపై కొన్ని రోజుల పాటు అచలను, త్యాగిసోనీను, పిల్లలను గమనిచ్చింది.
ఫలానా విధంగా జవాబు రావాలంటే కంప్యూటర్ లో ప్రోగ్రాం ఒక పద్దతిగా రాసుకోవాలి. జీవితం కూడా అంతే! మనకు కావలసిన రీతిలో జీవితం సాగాలంటే కొన్ని తెలివిగల అడుగులు వేయాలి.
లాయర్ సర్దార్ శరణ్జీత్ ఇంటికి వెళ్ళి కొన్ని సలహాలు తీసుకుంది.
>>>>>>>>>>
“కేశవ్, నాకు నీ సలహా కావాలి. ” తీరిగ్గా అన్నాడు నారాయణ.
“అలాగే, విషయం ఏమిటీ?”
“నాకు హైదరాబాద్లో ఏదైనా వ్యాపారం చేయాలని వుంది. ”
“పొలం పండించే భూస్వామివి, వ్యాపారం ఎందుకు, ఐనా వ్యాపారానికి పెట్టుబడి కావాలి. కొన్ని రోజుల వరకు లాభాలు మర్చిపోవాలి. ”
“నాకు తెల్సు, నేను, నా కుటుంబం కొత్త పరిసరాల్లో, కొత్త పయనం సాగించాలి. ”
“వూళ్ళో వున్న స్వంత ఇల్లూ, పొలం?”
“అమ్మేస్తాను. ”
“సరేలే, అమ్మటం తేలిక. కానీ ఒక సారి ఇంట్లో వాళ్ళని కూడా సంప్రదించు. ”
“అన్నీ జరిగిన తరువాతే నిన్ను అడుగుతున్నాను. ”
“ఏం బిజినెస్ చేద్దామని?”
“నాకు తెలియక నిన్ను అడుతున్నాను. ”
“తొందర ఎందుకు ఆలోచిద్దాం. ”
“ఆలోచనకు సమయం లేదు, పెట్టుబడి పెడతాను, మార్గం చూపెట్టు. ”
“కిరాయి ఇంట్లో వుంటావా, సొంతిల్లు కొంటావా?"
“ముందు బిజినెస్. ”
“సరే, కల్పనా జనరల్ స్టోర్స్, కోఠి వద్ద బడీచౌడీ లో నా బిజినెస్ వుంది, దాన్నే కొంత నీ పెట్టుబడి పెట్టి మెరుగైన వ్యాపారం చేద్దాం. " ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకొన్నారు.
వూళ్లోని స్థిరాస్తిని అమ్మేసి, హైదరాబాద్కు వలస వచ్చాడు నారాయణ. కోఠి, ఎడిన్బాఘ్ వద్ద కేశవరెడ్డి నివసించే కాలనీ లోనే చిన్న ఇల్లు కిరాయికి తీసుకొని జీవితానికే కొత్త పునాదులు వేశాడు.
కల్పనా జనరల్ స్టోర్స్ ‘గృహకల్ప’ గా రూపుదిద్దు కుంది, కొత్త హంగుల సూపర్ బజార్ జనాలందరిని ఆకర్షిస్తుంది.
ఆశ్వీయుజ మాసం, దసరా, దీపావళి పండుగల కొనుగోళ్లు బాగా జరిగాయి. గృహకల్ప సూపర్ బజారు సరుకుల నాణ్యతకు పలుకుబడి కూడా హెచ్చింది. కేశవరెడ్డి తో జత కలిపి చేసిన పని కలసి వచ్చింది.
“మా బంధువుల అబ్బాయి ఆనంద్ అని.. కొంచెం ఆర్దిక ఇబ్బందిలో వున్నాడు, తండ్రి లేడు, తల్లికి అనారోగ్యం. మన షాప్ తెరిచి నప్పటి నుండి షాప్ మూసే వరకు శ్రద్ద తీసుకుంటాడు, నీ అభిప్రాయం?” అడిగాడు నారాయణను.
“రెడ్డీ, మనకూ, మన వ్యాపారానికీ నష్టం రాకుండా, మనని వెన్నుపోటు పొడవని వాళ్లు ఎవరయినా సరే, నాకు సమ్మతమే. ”
షాపు పనులతో పాటు అప్పుడప్పుడు ఇంట్లో పన్లు కూడా చూసుకోవాలని కేశవరెడ్డి ఆనంద్ కు జీవనోపాధి కల్పించాడు. శివయ్య పేరుకే పనివాడు కానీ ఇంటి మనిషి వలె పనులన్నీ చక్కబెట్టు కుంటాడు.
కేశవరెడ్డి భార్య కల్పన మొదటి పుణ్యతిథి. క్రిందటేడు దసరా నవరాత్రుల్లో గుండె పోటుతో చనిపోయింది. కేశవరెడ్డికి సంతానం లేరు.
కల్పన ఫోటోకు పూజ చేసి ఇష్టాహారము, తద్దిన వంటకాలు సమర్పించి, తిలోదకాలు ధార విడిచి, ఆవుకు ఆరగింపైన పిమ్మట కేశవరెడ్డితో బాటు అంతా భోజనాలు చేశారు.
ఇంటికి తిరిగి వచ్చిన ప్రమీల భర్తతో: “రెడ్డి గారి ఇల్లు చాలా బాగుంది, మనం కూడా ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటే.. ” పల్లెల్లో, టౌన్లల్లో జీవితం చూసిన ఇల్లాలికి పట్టణ పరిసరాల్లో స్వంత యింటి ఆశ!
“చూద్దాం, ఇంటికంటే ముందు ప్రజ్ఞ భవిష్యత్తు ఆలోచించాలి. ” నారాయణ జవాబు.
“కాలేజీకీ వెళ్ళనంటున్నది. అసలు మనుషుల్లో తిరగటం అంటేనే విసుగు పడుతున్నది. ”
“అవును, నేనూ గమనించాను, కానీ ఎన్నాళ్లు యిలా ఖాళీగా? ఏదో ఒక అభ్యాసం, నిర్వాకం వుండాలి. ”
ఆరోగ్యం కొంచెం కుదుట పడిన ప్రజ్ఞతో, “అమ్మా, మన దగ్గరలోనే కేవలం అమ్మాయిలకు మాత్రమే రెడ్డి కాలేజీ, ఉమెన్స్ కాలేజీ వున్నాయి, ఇంకాస్త దగ్గరలోనే సంగీతం కాలేజీ వుంది. నువ్వు ఖాళీగా వుంటే కుదరదు. ”
“నాన్న, ఎవరిని చూసినా ఒక లాంటి భయం వేస్తుంది. నాకు ఇంట్లోనే బాగున్నది. ”
“భయపడే సమయం కాదు. సృష్టి రీత్యా అమ్మాయివి, కానీ మాకు అమ్మాయి వైనా, అబ్బాఐనా నువ్వే, మాకు ధైర్యం ఇవ్వాలి. ఒక మంచి వుదాహరణగా, మాకు అండగా, బలంగా నువ్వు వుండాలి. అంతేకాని భయపడొద్దు. ”
“ప్రతీ రోజూ అమ్మ చెప్పే మాటలు కూడా ఇవే. ”
“మేమిద్దరుమూ నీతో పాటే వున్నాము, ఇంటర్ చదువు తావా, లేక సంగీతం నేర్చు కుంటావా?”
“నాన్నా, మీరే నిర్ణయించండి, నాకు తెలియదు. అమ్మను కూడా అడగండి. ”
“నువ్వు ఏది నేర్చు కున్నా శ్రద్ధగా, ఏ పని చేసిన ఒక నిర్దిష్ట కార్యాచరణ రూపంలో బయటకు రావాలి. అంతే కానీ టైమ్ పాస్ చేయొద్దు. ” అమ్మ మాట.
“మీరేలా చెబితే అలాగే చేస్తాను, కానీ వూళ్ళో తెలుగు మీడియంలో చదివిన నాకు సిటీ చదువులకు పొంతన కుదురు తుందా?”
“అమ్మలూ, తెలుగు మీడియం చదువు, చదువు కాదా? జీవితంలో కొత్త విషయం ఏది నేర్చుకున్నా ఏకాగ్రత, సాధన ముఖ్యం. అన్నింటికీ సమయం వుంటుంది. ”
ఇక ఆలస్యం చేయక నారాయణ తన కూతర్ని మార్వాడీ వాళ్లు నిర్వహించే ఫైన్ఆర్ట్స్ ఇన్స్టిటుట్లో ‘కుట్లు-అల్లికల’ ట్రైనింగ్, ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సులో జాయిన్ చేశాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ
ఇంటి పేరు: పులి
వయసు: 68 సంవత్సరాలు
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.
పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.
మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.
స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత
ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.
మీ ప్రోత్సాహమే నా బలం 🤝
మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.
సురేఖ పులి
@surekhap4148 • 8 hours ago
Thanks a lot
@dodlaradha1135 • 5 hours ago
Story is very interesting As we all know the very talented Surekha garu will give us a good story. Waiting for next episode
@anilgurram-pi1yn • 7 hours ago
Gm,,