'Kalpatharuvu - Part 8' - New Telugu Web Series Written By Surekha Puli
Published On12/01/2024
'కల్పతరువు - పార్ట్ 8' తెలుగు ధారావాహిక
రచన: సురేఖ పులి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సత్యలీల పెళ్లి డి. ఎస్. పి. విశ్వంతో జరుగుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బాంబు దాడిలో విశ్వం మరణిస్తాడు. ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్‌లో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది.
పక్క పోర్షన్ అచలాదేవి తో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల తన భర్త త్యాగిసోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగిసోనీతో వివాహం జరిపిస్తారు.
ప్రజ్ఞా పృథ్వీధర్లు బావామరదళ్లు. పెళ్ళికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండక పోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి మకాం మార్చాలనుకుంటాడు ఆమె తండ్రి నారాయణ. ‘కుట్లు-అల్లికల’ ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అవుతుంది ప్రజ్ఞ. మ్యూజిక్ క్లాస్ లో కూడా చేరుతుంది. తనను కొందరు ఆకతాయిలు వేధిస్తున్న విషయం తండ్రి స్నేహితుడు కేశవరెడ్డితో చెబుతుంది ప్రజ్ఞ. ఆమెకు సహాయంగా ఆనంద్ ని ఉండమంటాడు కేశవరెడ్డి.
త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల. సత్యలీలతో పరిచయం పెరిగాక, తనకు మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు చెబుతాడు త్యాగి.
ఆతనితో సిమ్లా వెళ్లి జస్ప్రీత్ ని కలుస్తుంది. అచలకు విడాకులిస్తే వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చని వాళ్లకు చెబుతుంది.
ఇక కల్పతరువు ధారావాహిక 8 వ భాగం చదవండి
తెల్లారింది. తిరుగు ప్రయాణం. టాక్సీ ఎక్కుతూ “మేడమ్ జీ, విడాకులు దొరికే వరకు అచలతో చెప్పకండి. ఆమెకు మా కుటుంబ పెద్దల అండదండలు వున్నాయి. పెద్దల కోర్కె ప్రకారమే నన్ను పెళ్లి చేసుకుంది. ” సంజాయిషి ఇచ్చాడు.
“అలాగే. ” అన్ని లొసుగులు తనలోనే పెట్టుకొని, అన్యాయంగా ఒక స్త్రీని అబలగా మార్చాడు.
“మరోమాట, మీరు లాయర్తో మాట్లాడి మాకు అనువుగా తీర్పు ఇప్పించండి. ” జేబులోనుండి ఐదు వేలు సత్యలీల చేతిలో పెడుతూ, “ఇవి విడాకుల ఖర్చుల మేరకు వుంచండి. ” అర్ధిస్తున్నాడు జీవితాలతో చెలగాటం ఆడిన జిత్తులమారి.
జస్ప్రీత్ అందుకుంది, “మేము సామాన్యులము, కోర్టు ఖర్చులు మా అందుబాటులో వుండేలా.. ” త్యాగి హిందీలో తర్జుమా చేసి వాక్యాన్ని పూర్తి చేశాడు.
డబ్బును బ్యాగ్లో పెట్టుకొని, 'చాలు' తనకు ఏ విధంగా జవాబు కావాలో అదే రీత్యా ప్రోగ్రామ్ను తయారుచేసింది, సత్యలీల.
ఫోన్లో సత్యప్రకాష్ కు జరిగిన సంగతి, కొత్తగా బుటిక్ ఓపెన్ చేయాలనుకున్న విషయాలు వివరించింది.
***
త్యాగిసోని అనుమానంగా విడాకుల డాక్యుమెంట్స్ అచల చేతిలో పెట్టి, సంతకం కోసం వేచి ఉన్నాడు.
ఏంటని కొత్తగా అడిగింది. విడమర్చి చెప్పాడు. ఆలస్యం చేస్తే మనసు మార్చుకుంటాడేమో అనే భయంతో మారు మాట్లాడక సంతకం పెట్టింది. పంజరం నుండి విముక్తి దొరుకుతున్న తొందరపాటు.
త్యాగి చాలా సంతోషపడ్డాడు. ఆ డాక్యుమెంట్లోని ఒక ముఖ్యమైన అంశాన్ని రహస్యంగా వుంచాడు. విడాకుల అనంతరం అచలకు గాని, ఆమె కూతురు జ్వాలకు గాని ఎటువంటి భరణం చెల్లించే అవసరము లేదు.
ప్రశాంతమైన జీవితము కోరుకుంటున్న అచలాదేవికి విడాకుల డాక్యుమెంట్లోని ప్రతీ అంశాన్ని వాటి అర్థాన్ని ముందే సత్యలీల తెలియజేసింది.
ఎవరి గమ్యం వైపు వాళ్ళు సాగారు. ఒక్క సారిగా భోరుమంది అచల. సత్యలీల ఏడ్పును ఆపలేదు. మనసులో బాధ కరిగి పోతేనే ధైర్యం వస్తుంది.
జీవన సమరంలో ప్రధానంగా కావల్సిన ఆయుధమే ధైర్యం. ఒక స్త్రీ మరొక స్త్రీకి ఆధారం కల్పించింది.
>>>>>>>>>>
కేశవరెడ్డి నారాయణతో మాటలు తగ్గించాడు. గృహకల్ప షాపు ప్రక్కనే తీసుకున్న షాపు పునఃనిర్మాణ పనులతో కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి. తప్పదు మాట్లాడుకోవాలి.
ఆదివారం ప్రొద్దున్నే నారాయణ ప్రజ్ఞా, ప్రమీలను తోడు తీసుకుని కేశవరెడ్డి ఇంటికి వచ్చారు.
శివయ్య ఇచ్చిన అల్లం టీ తాగాక, “పెదనాన్న, ఈ రోజు నేను వంట చేస్తాను, ఇక్కడే అందరమూ భోజనం చేద్దాం. ”
“నాకైతే సమ్మతమే, మా తమ్ముడు, మరదలు ఏమంటారో?”
“ప్రజ్ఞ మాట కాదన లేము. ” ప్రమీల నవ్వుతూ సమాధానం ఇచ్చింది.
శివయ్య పెరట్లోని కూరలు తెచ్చాడు. తల్లీ కూతుళ్ల పాకం, వంటింట్లో సందడి!
“చాలా ఆనందంగా వుంది నారాయణా. ” తృప్తిగా అన్నాడు కేశవరెడ్డి. అవునని తలాడించాడు.
దినపత్రిక చదవటం పూర్తి చేసి, నారాయణ అన్నాడు, “జనరల్ స్టోర్ ఇంకాస్త విస్తరించే బదులు కొత్త షాపులో బట్టలు అమ్మటం, కుట్టటం లాంటి వ్యాపారం పెడితే కొంత బిజినెస్లో కొత్తదనం, కొంత లాభాలు కూడా పెరుగుతాయేమో. ”
“ఆలోచన బాగానే వుంది కానీ అమలు చేయడానికి సమయం పట్టొచ్చు. ”
“ఆనంద్ వంటి నమ్మకమైన వారిని పెట్టుకొని కొంత మన ఆధ్వర్యములో.. ”
“సరే, మన శ్రమ 'కొంత' సరిపోదు, ఇద్దరమూ పూర్తి సమయం కేటాయించాలి. ” రెడ్డి అన్నాడు.
“అమ్మ సాయంతో వంట చేశాను పెదనాన్న. ” ప్రజ్ఞ గర్వంగా చెప్పింది. తరుముకొస్తున్న ఆకలి ముందు ఆలోచన తగదు.
“ఓఫ్! అన్నీ నోరూరించే భోజన పదార్థలే! పుదీనా పచ్చడి, వంకాయ వేపుడు, మిరియాల చారు, చింతకాయ-బచ్చలి పప్పు, పెరుగు, వేడివేడి అన్నం”. కేశవరెడ్డి కడుపులో ఆకలి రెండింతలు పెరిగింది.
కొత్త షాపు పునఃనిర్మాణం పనులు సాగుతున్నాయి. మంచి రోజు చూసుకొని నారాయణ కేశవరెడ్డి ఇంట్లోకి మారారు.
కేశవరెడ్డి భార్య కల్పన బ్రతికున్న రోజుల్లో ఎన్నో ఆశలతో పెద్దిల్లు కట్టుకున్నాడు.
అన్ని సదుపాయాలు సౌకర్యంగా వున్నాయి. ఇంటి చుట్టూ మొక్కలు, శివయ్య కోసం రెండు గదుల చిన్ని ఇల్లు.
కానీ తన కంటూ కళత్రం, సంతానం లేని లోటును భాగస్వామిని తమ్ముడి వరుస కలుపుకుని కలిసి పోయాడు, మిత్రుడు.
కేశవరెడ్డి వున్న కారు మార్చి కొత్త పెద్ద కారు కొన్నాడు, అందరూ కల్సి పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం వెళ్లి పూజలు చేయించారు.
ఇంటికి వస్తున్న దారిలో నారాయణ అన్నాడు. “వీలు చూసుకొని నాకు మన దేశంలో ప్రసిద్ధి చెందిన శివాలయం చూడాలని వుంది. ”
“సేఠ్జీ.. నాకు తెల్సి రెండు ఉత్తర భారత్ లో వున్నాయి. ఒకటి జమ్మూ లోని అపురూపమైన మంచు శివలింగం అమర్నాథ్ గుహ, హిందువుల పుణ్యక్షేత్రం. ” ఆనంద్ డ్రైవ్ చేస్తూ అన్నాడు.
కేశవరెడ్డి అందుకొన్నాడు “మరొకటి శ్రీఖండ్మహాదేవ్. హిందూ పురాణాలలో ప్రసిద్ధి చెందిన శివాలయం. హిమాచల్ ప్రదేశ్ భూభాగంలోని సహజ ప్రకృతి దృశ్య అద్భుతం. హిమాలయ పర్వత శ్రేణుల మంచుతో కప్పబడిన శిఖరం!”
ప్రమీల, “రెండో ఆలయము గూర్చి అంత తెలియదు కానీ అమర్నాథ్ తీర్థయాత్ర, మంచు శివాలయం విన్నాం. ”
“ఆనంద్, ఇక్కడ కారు ఆపు భోజనాలు చేద్దాం. ” దారి లోని గోపి హోటల్లో తృప్తిగా భోజనాలు చేశారు.
ఇంటికి వచ్చి, సూర్యాస్తపు వేళ ఈజీ చైర్లల్లో వ్యాపారస్తులిద్దరూ ఇంటి ముందున్న పూల చెట్ల ఆవరణలో కూర్చున్నారు.
ప్రజ్ఞ యిలాచి టీ యిచ్చింది. అక్కడక్కడా తెల్లటి మబ్బుల ఆకాశం, చల్లటి గాలి. “రెడ్డీ, ఇంతటి ప్రశాంత జీవితం నీ స్నేహం వల్లనే దక్కింది. ”
“నీ ధృడ నిశ్చయం, కార్యదీక్ష ముందు.. తరువాతనే స్నేహం!
నారాయణా నాదొక విన్నపం. ”
“చెప్పు రెడ్డి”
“మీ తీర్థయాత్ర కంటే ముందు ప్రజ్ఞ పెళ్లి మాట చూద్దాం. ”
“నేను ఒకట్రెండు మార్లు అడిగి చూశాను. ఇప్పుడే పెళ్లి వద్దంటున్నది. ”
“ఈ ఏడుతో డిగ్రీ అయిపోతుంది. మనం సంబంధాలు చూస్తుంటే సరి, మనకు నచ్చిన తరువాత కదా ప్రజ్ఞాను అడిగేది. ”
“ఏమో, దాన్ని నొప్పించటం నాకు నచ్చదు. అయినా నీ మాట కూడా సబబే. ”
ప్రమీల వత్తిడి రోజు రోజూకు పెరుగుతున్నది. “అమర్నాథ్ తీర్థయాత్ర వెళ్ళి, ఆ పరమేశ్వరుని వేడుకుందాము. మంచి అల్లుడు వెతుక్కుంటూ వస్తాడు. ”
ఆబిడ్స్ లోని ట్రావెల్స్ అండ్ టూర్స్ కన్సల్టెన్సీ ని సంప్రదించి, ప్రమీలా నారాయణ టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ
ఇంటి పేరు: పులి
వయసు: 68 సంవత్సరాలు
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.
పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.
మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.
స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత
ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.
మీ ప్రోత్సాహమే నా బలం 🤝
మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.
సురేఖ పులి
@divikg5573 • 2 hours ago (edited)
Good story
@rakheevenugopal362
• 5 hours ago
Very nice continuationNice to listenMeanwhile you are discussing about good Shiva temples also.Interesting
Anil Gurram •6 hours ago
👌🥳👌👍🙏