top of page
Writer's pictureSurekha Puli

కల్పతరువు - పార్ట్ 9



'Kalpatharuvu - Part 9' - New Telugu Web Series Written By Surekha Puli

Published In manatelugukathalu.com On17/01/2024

'కల్పతరువు - పార్ట్ 9' తెలుగు ధారావాహిక

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సత్యలీల పెళ్లి డి. ఎస్. పి. విశ్వంతో జరుగుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బాంబు దాడిలో విశ్వం మరణిస్తాడు. ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్‌లో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. 


పక్క పోర్షన్ అచలాదేవి తో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల తన భర్త త్యాగిసోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగిసోనీతో వివాహం జరిపిస్తారు. 


ప్రజ్ఞా పృథ్వీధర్లు బావామరదళ్లు. పెళ్ళికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండక పోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి మకాం మారుస్తాడు ఆమె తండ్రి నారాయణ. మ్యూజిక్ క్లాసులకు వెళ్లే దారిలో తనను కొందరు ఆకతాయిలు వేధిస్తున్న విషయం తండ్రి స్నేహితుడు కేశవరెడ్డితో చెబుతుంది ప్రజ్ఞ. ఆమెకు సహాయంగా ఆనంద్ ని ఉండమంటాడు కేశవరెడ్డి.


త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల. సత్యలీలతో పరిచయం పెరిగాక, తనకు జస్ప్రీత్ అనే మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు చెబుతాడు త్యాగి. ఆతనితో సిమ్లా వెళ్లి ఆమెని కలుస్తుంది. అచలకు విడాకులిస్తే వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చని వాళ్లకు చెబుతుంది. విడాకుల కాగితాల మీద అచల సంతకం చేస్తుంది.

ప్రజ్ఞ తలిదండ్రులు ప్రమీల, నారాయణ టూర్ కి టికెట్స్ బుక్ చేసుకుంటారు.


ఇక కల్పతరువు ధారావాహిక 9 వ భాగం చదవండి.


"నమస్తే ఆంటీజీ" సత్యలీల, అచల కలసి ఇంటి ఓనర్ శారద మెహతా గారి వద్దకు వచ్చారు. 


“నమస్తే, లోపలికి రండి” అని గౌరవ పూర్వకంగా హిందీలో ఆహ్వానిచ్చింది. 


ఎంతో ఖరీదైన ఫర్నీచర్తో విశాలమైన గదులు. ఇల్లంతా పరిశుభ్రంగా వుంది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ప్రతాప్ మెహతాగారు టీవి చూడ్డం మానేసి, నవ్వుతూ లేచి నిలబడ్డారు. 


అచల హర్యాన్విలో కొంత సేపు మాట్లాడింది. పనిమనిషి ఖారా బూందీ, పెటా స్వీట్ (బూడిద గుమ్మడి కాయ హల్వా), టీ అన్నీ ఒకే సారి తెచ్చి పెట్టింది. స్వీట్, హాట్ తింటే టీ చల్లబడి పోతుంది. ఐనా సరే, దేని దారి దానిది. 


“తీసుకోండి. ” శారదగారు రౌండ్ టేబల్ వైపు జరుపుతూ అన్నది. 


ఒక చేత్తో టీ తాగుతూ మరో చేత్తో స్వీట్ తింటూ వున్నారు అచల, శారద గారు. 


ఇదేదో నచ్చలేదు సత్యలీలకు, వేడివేడి టీ తాగుతూ, స్వీట్ ఎట్లా తినాలి? ఒక స్పూన్ బూందీ తిని, టీ తీసుకుంది. 


“మీఠా లీజియే” పెటా స్వీట్ ప్లేట్ సత్యలీలకు ఇచ్చింది. హిందీలో యిబ్బందిగా అన్నది “నేను టీ తాగుతూ స్వీట్ తినలేను ఆంటీజీ. ”


“కోయి భాత్ నహి, ” అంటూ తానే స్వీట్ తినేసింది. 


మళ్ళీ హిందీలోనే మాటలు కొనసాగాయి. 


“ఆంటీ, అచలకు విడాకులు జరిగాయి. త్యాగిగారు శాశ్వతంగా ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లారు. అచల, పాప ఉంటున్నారు. ”

 

“అవునట, త్యాగిజీ వెళ్లేముందు మమ్మల్ని కలిసి విషయం చెప్పారు, ఫర్వాలేదు. మనసులు కలవనప్పుడు, విడిపోటమే సబబు. ”


ప్రతాప్ మెహతాగారు నోరు విప్పారు “మాకు అమ్మాయిలు లేరు, అచల మా కూతురు అనుకుంటాము. ఏమి శోచనేకా పని లేదు. ”


వాళ్ళ ఆప్యాయతకు అచల కళ్ళు చెమర్చాయి, రెండు చేతులెత్తి నమస్కారం చేసింది. 



>>>>>>>>>>



ట్రావెల్స్ అండ్ టూర్స్ ఇచ్చిన బ్రోచర్ చదువుతున్నదీ ప్రజ్ఞ, అమర్నాథ్ గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకే ప్రతీ సంవత్సరం అధిక సంఖ్యలో ఎన్నో సవాళ్ళతో అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు భక్తులు. 


ఈ క్షేత్రానికి జమ్మూ-కాశ్మీర్ లోని పహల్గాం గ్రామం నుంచి వెళ్ళాలి. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. అమర్నాథ్ కొండలు వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరమంతా మంచుతో కప్పబడే ఉంటాయి. 


అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం, లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డ కడుతుంది. పంచభూతాల రూపాల్లో శివుడు ఉంటాడనే హిందువుల నమ్మకం. అందుకే ఇక్కడ శివుడు జలరూపంలో ఉన్నాడని భక్తులు శ్రమ పడి, ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. 


ప్రతీ యేటా మే నెల నుంచి ఆగస్టు వరకు హిమాలయాలలో మంచు కరగడం వల్ల ఈ పుణ్యక్షేత్రం సందర్శనకు వీలుగా ఉంటుంది. ఈ లింగం వేసవిలో చంద్రుని కళల ప్రకారం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుందని విశ్వసిస్తారు. 


కళ్ళకు కనపడు తున్నట్లు భక్తితో చదివింది. 


అమ్మానాన్నలు తనను కూడా తోడు రమ్మంటే బాగుండును. అసలు ఒక్క సారి కూడా తన ప్రస్తావనే రాలేదు. ప్రజ్ఞ మనసు తొలుస్తుంది. 


ఆ మాటే వీలు చూసుకొని పెదనాన్నను అడిగింది. “వాళ్లు వెళ్ళనీ తల్లీ, మనం వచ్చే యేట వెళ్దాము. ” 


పసిపాప వలె మారము చేసే వయసు కాదు కనుక, సరేనంది; కానీ తల్లిదండ్రుల ప్రయాణ సమయాన దుఃఖం ఆగక ఏడ్చేసింది. “మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా లేను. ”

 

తల్లి ఓదార్చి, “మహా ఐతే ఇరవయి రోజుల ప్రయాణం, పెదనాన్నకు మంచి ఆరోగ్యమైన భోజనం పెట్టు, కొత్త మొక్కలను జాగ్రత్తగా చూసుకో, కాలక్షేపానికి సితార్ వుండానే వుంది. ” 

 

తండ్రి దగ్గరగా తీసుకుని, “ప్రజ్ఞా, నా బంగారం! నువ్వు పెద్దదానివి అయిపోయావనుకున్నాను, కానీ యింకా చిన్న పాపవే! కళ్ళు తుడుచుకో. 


మాకు మంచి అల్లుడు రావాలని, ఒక్కసారి ప్రత్యక్షంగా ఆ భగవంతుడిని వేడుకోవాలని మా యాత్ర. అంతే గానీ ఏదో పుణ్యం రావాలని, స్వర్గానికి వెళ్ళే కోరిక కాదు కన్నమ్మా!”


కూతురు బయటకు చెప్పగల్గుతుంది, తల్లిదండులు మనసులో ఇముడ్చు కున్నారు. ఎడబాటు ఇద్దరికీ సమానమే. 


అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం దర్శన భాగ్యం కల్గింది. తమకు తెలియకుండానే ఏకధాటిగా కన్నీళ్ళు కారుతూనేవున్నై, చేతులు జోడించి వున్నా తనువు, మనసు శివునిలో ఐక్యమైనాయి. 


భక్తి పారవశ్యము ఒక వర్ణనాతీతమైన అనుభవం. మనసులోని కోర్కెలు మనసులోనే వుండి పోయాయి, వెలికి వచ్చే అవకాశం రాలేదు. ఈ జన్మకిది చాలు అనుకున్నారు భక్తులు. 


తిరుగు ప్రయాణం. భద్రతా దళాలు వున్నా, అధిక ఎత్తులో ఆక్సిజన్ గాఢత తక్కువ వుండుట వలన వూపిరి ఆడక యాత్రికుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. 


ప్రమీలా నారాయణల జంట కూడా మరణించిన జాబితాలో వున్నారు. 


========================================================================

ఇంకా వుంది..


========================================================================


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


41 views3 comments

3 Comments


Anil Gurram •1 day ago

👌🥳👌👍🙏

Like

rakhee venugopal •1 day ago

Parents died in Amarnath is a sad thing... you made it feel real...👍

Like

Divik G •1 day ago

👌

Like
bottom of page