top of page
Writer's pictureMohana Krishna Tata

కమ్మని కాఫీ



'Kammani coffee' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 26/06/2024

'కమ్మని కాఫీ' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"ఏమండీ.. ! రేపు మీరు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు, నన్ను కొంచం ఆ సూపర్ మార్కెట్ దగ్గర డ్రాప్ చేస్తారా.. ?"


"ఇప్పుడు అక్కడకి ఎందుకు మధు.. ?"


"ఏం లేదు.. రేపు నా ఫ్రెండ్ అక్కడికు వస్తుంది.. తనకి సిటీ కొత్త.. చాలా రోజుల తర్వాత మేము కలుస్తున్నాము. అది పెద్ద ల్యాండ్‌మార్క్ కదా.. అందుకే అక్కడకి.. !"


"నువ్వు లోపలికి మాత్రం వెళ్ళకు మధు.. అసలే అది చాలా పెద్ద సూపర్ మార్కెట్.. ఎందుకు చెబుతున్నానో నీకు బాగా తెలుసు కదా.. !"


"అలాగేలెండీ.. ! "


మర్నాడు భర్త కార్ లో మధుని సూపర్ మార్కెట్ కు ఎదురుగా డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.. 


"హే! రమ్యా.. ఎక్కడున్నావు.. ? నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను.. " అని ఫోన్ లో మధు.


"వచ్చేసానే.. ఒకసారి నీ వెనుకకు తిరిగి చూడు.. " అంది రమ్య. 


"వచ్చేసావా.. ! ఎలా ఉన్నావే.. ?" అడిగింది మధు.


"ఇలా ఉన్నానే.. ! నువ్వు ఏమీ మారలేదే మధు.. ! పదా.. కాఫీ తాగుదాం.. "


"అవును.. నువ్వు కాఫీ అంటే గుర్తొచ్చింది.. ఇంట్లో కాఫీపొడి అయిపోయింది.. అసలే ఉదయం కాఫీ లేకపోతే, మా ఆయన గోల పెడతారు.." అంది మధు.


"పదా.. ఆ సూపర్ మార్కెట్ కు వెళ్దాము.." అని ముందుకు కదిలింది రమ్య.


"ఎందుకు లేవే.. బిల్ ఎక్కువ అవుతుందేమో.. దారిలో ఎక్కడైనా చిన్న షాప్ లో తీసుకుంటానులే.." అని రమ్యని వెనుకకు లాగింది మధు. 


"ఏమిటా మాటలు.. ! అసలే ఎండగా ఉంది.. షాపింగ్ కోసం అలా ఏసీ లోకి వెళ్లి.. రిటర్న్ లో వేడిగా కమ్మని కాఫీ తాగితే, భలే ఉంటుంది.. పదవే మధు!"


ఫ్రెండ్ మరీ చెబుతుంటే, కాదనలేకపోయింది మధు. ఇద్దరూ సూపర్ మార్కెట్ లోకి వెళ్ళారు. ఆ చుట్టు పక్కల అదే చాలా పెద్ద సూపర్ మార్కెట్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. అప్పుడప్పుడు కస్టమర్స్ ని ఆకర్షించడానికి, డిస్కౌంట్ సేల్ పెడుతూ ఉంటారు. 


"అదిగో.. అక్కడ ఉన్నాయే కాఫీ వెరైటీస్.. తీసుకో మధు.. "


ఆ పక్కనే, పెద్ద సూపర్ సేల్ బోర్డు.. 'యాభై శాతం డిస్కౌంట్' అని రాసి ఉంది. చక చకా ట్రాలీ తీసుకుంది మధు. మొత్తం సామానులతో నింపేసింది.. అవసరం ఉన్నవీ, అవసరం లేనివీ అన్నీనూ.. 


"ఏమిటే ఇది మధు? ఇవన్నీ ఇప్పుడు ఎందుకే.. నీకు కాఫీ పొడి ఒక్కటే కావాలి కదా?"


"డిస్కౌంట్ సేల్ చూస్తే, ఆగలేనే.. అన్నీ కొనేస్తాను.. అంతే!. అందుకే, మా ఆయన సూపర్ మార్కెట్ అంటే వద్దంటారు.."


"నిజమా.. ? నీకు ఇలాంటి సమస్య ఉందని నాకు తెలియదు. ఒకపని చెయ్యి.. అలా ఆ ట్రాలీ అక్కడే వదిలేసి.. బయటకు వెళ్ళిపోదాం పదా..!" అని సలహా ఇచ్చింది రమ్య. 


"అలా చేస్తే, నాకు రెండు రోజుల వరకూ నిద్రపట్టదే రమ్యా.."


"మళ్ళీ ఇదొకటి ఉందా.. ? ఏం చేస్తాం.. కానీ తర్వాత మాత్రం డాక్టర్ కు చూపించుకో.." అంది రమ్య. 


ట్రాలీ తో మధు బిల్లింగ్ సెక్షన్ దగ్గరకు వచ్చింది.. 


"బిల్ ఎంత అయ్యింది బాబు.. ?" అడిగింది మధు. 


"ఆరు వేలు మేడం.. " అన్నాడు షాప్ లో వాడు. 


"బిల్ కట్టేసి వచ్చేయవే రమ్యా.. నేను బయట వెయిట్ చేస్తాను" అంటూ బయటకు వెళ్ళడానికి కదిలింది మధు.


"ఉండవే మధు.. ఉండు.." అని రమ్య అనేలోపే బయటకు వెళ్లిపోయింది మధు. 


బిల్ కట్టేసి బయటకు వచ్చిన రమ్య.. "నీ షాపింగ్ కి నా చేత బిల్ కట్టించావేమిటే..?"


"అది అంతే.. ! నేను షాపింగ్ చేసేటప్పుడు.. నా పక్కన ఉన్నవారే బిల్ కట్టాలి.. లేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు. జనరల్ గా మా ఆయన కడతారు.. ఈ రోజు నువ్వు కట్టావు.. అంతే తేడా!"


"నీ షాపింగ్ కి నన్ను బుక్ చేసావు కదే మధు..!" అంది నీరసంగా రమ్య .


"షాపింగ్ చేసి బాగా అలసిపోయాను.. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం.." అని బై చెప్పేసింది మధు.


"ఈ సారి ఇంట్లో కలుద్దాం.. బయట మాత్రం వద్దు.." అంది రమ్య.. ఖాళీ అయిన తన పర్సు కేసి చూస్తూ.. 


****

************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


91 views0 comments

Comments


bottom of page