#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #KannavariPrabhodamu, #కన్నవారిప్రబోధము
Kannavari Prabhodamu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 07/12/2024
కన్నవారి ప్రబోధము - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
రోజూ బడికి పోవాలి
గురువుకు దండం పెట్టాలి
స్నేహితులను పలకరించి
తరగతిలోకి వెళ్ళాలి
క్రమశిక్షణ నేర్వాలి
చదువులెన్నో చదవాలి
శ్రద్ధగా ఆలకించి
వృద్ధిలోనికి రావాలి
సదా సాధన చేయాలి
విజ్ఞానము పొందాలి
నైతిక విలువలు నేర్చి
సంస్కారం కోరాలి
దేశభక్తి చూపాలి
దేశకీర్తి చాటాలి
మహనీయుల దారిలో
ఎదగాలి జీవితంలో
సోమరితనం వీడాలి
దురాలవాట్లు మానాలి
క్రమేణా జీవితాన
ఉన్నత స్థితికి చేరాలి
దేశం పేరు నిలపాలి
మాతృభూమిని తలవాలి
త్యాగమూర్తుల స్పూర్తితో
దేశమాతను కొలువాలి
-గద్వాల సోమన్న
Comments