top of page
Writer's pictureYasoda Gottiparthi

కానుక

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #కానుక, #Kanuka, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


'Kanuka' - New Telugu Story Written By Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 30/09/2024

'కానుక' తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి


“ఏమ్మా! నువ్వు ఎప్పుడూ ఏదో ఆందోళన పడుతుంటావు? కారణం ఏమిటి? నిన్ననేమో పుస్తకం తల కిందుగా పెట్టి చదువుతున్నావు. ఇవ్వాళేమో ఆఫీస్ కి వెళ్తూ బాక్స్ కూడా మర్చిపోయావు. అక్కడైనా ఏమైనా కొనుక్కొని తిన్నావా క్యాంటీన్లో.. లేదా అలాగే తిరిగి వచ్చావా? అమ్మాయిలకు అపురూపంగా పెరగటమే కాకుండా ఆటుపోట్లను ఎదిరించే శక్తి, మానసిక ధైర్యం అన్నీ ఉండాలి.. అంటే నువ్వు ముందు అన్ని ఆలోచనలు మానేసి ముందు నీ మనసులో ఉన్నది ఏదో నాకు చెప్పు? " అన్నది తల్లి. 


“అలాగని చెప్పుకుంటే పోతే నా గురించి అందరికీ తెలుస్తుంది. వ్యక్తిగత విషయాలు మనసును అర్థం చేసుకున్న వారికి చెప్పాలి”. 


“ఏమిటే పెళ్లయినప్పటి నుండి మీ ఇంటికి అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఎంతో సరదాగా నా వెంట తిరుగుతూ కాలక్షేపం కబుర్లు చెబుతూ ఎలా ఉండే దానివి. ఇప్పుడు మీ చుట్టూ నిశ్శబ్దం తప్ప ఏమీ కనపడటం లేదు. ఈ మౌనమే నాకు కానుకగా ఇస్తున్నావా? చెప్పు” అంటున్న తల్లినిచూడకుండా. . దిక్కులు చూస్తుంది . . కానీ ఏమీ చెప్పట్లేదు. 


“ఏముంది అప్పుడప్పుడు అలాగే ఉంటుంది. అంతగా సీరియస్గా తీసుకోకు” అంటూ పొడి పొడి మాటలు మాట్లాడుతుంది కావ్య. 

 

“ఇందుకే అంటున్నా.. ఏదో మీకు తెలిసిన వాళ్ల కుటుంబం.. అని నన్ను మాధవ్ కు కట్టబెట్టారు కదా .. పెళ్లప్పుడున్నట్టు ఇప్పుడు లేడు. అలాగే నేను ఇన్నాళ్ళ నుండి ఉన్నట్టు లేను”. 


“అసలు ఏం జరిగింది ?ఈ మధ్య ఎందుకలా అయ్యారు?” అంది కావ్య.


“ఏముంది.. పెళ్లయిన కొన్నాళ్లకే జుట్టు పోయింది. బట్ట తల అయ్యింది మాధవ్ కు అని మీరు అనుకుంటున్నారు.. కానీ పెళ్ళికి ముందే బట్టతల . 


పెళ్ళిలో విగ్గు పెట్టుకుని అందరిలో జుట్టు ఉన్న వాడిలా కనపడ్డాడు. ఇప్పుడు జుట్టు సమస్య కాదు. బుద్ధి, గుణం సమస్య. ఇప్పుడు తల మీద హెయిర్ ప్లాంటేషన్ చేయించు కున్నాడు. 


ఇప్పుడు వయసు చిన్నదిగా కనిపిస్తుంది .. కాబట్టి మళ్ళీ కుర్రవాడిలా అనుకునే తాను పదవ తరగతిలోని గర్ల్ ఫ్రెండ్ తో క్లోజ్ గా మాట్లాడుతూ తనని తాను మర్చిపోతున్నాడు. 


పెళ్లయిన మగాడితో ఆ పిల్ల ఎలా మాట్లాడుతుంది?

ఆమెకు పెళ్లయింది. భర్త ఉన్నాడు. అయినా ఫ్రెండ్ కదా అని మాట్లాడుతుంది.


“అయితే ఏమిటి మాటలే కదా.. ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు. . అందులో తప్పేమిటి ?”

“జుట్టు ఉంటే అందంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇష్టపడుతుందేమో? ఆయన.. అదే నా భర్త భ్రమ పడుతున్నాడు. ఆ అమ్మాయి మనసు తెలుసుకుంటే, పెళ్లయి మాట్లాడే వాడు మాత్రమే అని అనుకోవచ్చు. 


నువ్వు ఒక ఫ్రెండ్మాత్రమే అని ఆ అమ్మాయి అంటే అప్పుడు ఈయన గుణం బయట పడుతుంది. ఒకసారి వీడియో కాల్ పెట్టమను అప్పుడు తెలుస్తుంది”. 


తల్లి దగ్గరుండి “అల్లుడుగారు, మీరు మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నారు. నాకిక ఏ బెంగాలేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను” అని చెప్పి వెళ్ళిపోయింది కావ్య తల్లి. 

******

ఒకరోజు వీడియో కాల్ పెట్టమనగానే రోజు మాట్లాడుతున్న సుమ గుండుతో కనిపించేసరికి దిగ్భ్రాంతి చెందాడు కార్తీక్. 


“ఏమైంది?” అని ఆశ్చర్యంగా అడిగాడు. 


“కొన్ని రోజుల్లో ఆ దేవుడు నన్ను తన దగ్గరికి తీసుకు పోతున్నాడు. నాకు ఈ క్యాన్సర్ జబ్బును కానుకగా ఇచ్చి తన సొంతం చేసుకుంటున్నాడు. అందుకే కీమో, రేడియో థెరపీ.. నా వెంట్రుకలన్నీ ఊడి పోయి బోడిగుండు అయింది. 

 అది కాదు సమస్య. ఇప్పుడు నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్, తోటి బంధువులతోటి రోజు తనివి తీరా మాట్లాడుతూ సంతోషంగా గడుపుతున్నాను. ఈ ఆనందం ఈ చివరి రోజుల్లోనే..” దీనంగా చెప్పింది. 


 అలా అనేసరికి తాను అనుకున్న దానికి తల క్రిందులై, 

‘ఏదైనా ఏ విషయాన్ని అయినా పాజిటివ్గా తీసుకుని ప్రశాంతంగా ఉండాలి. నేను ఎలాగో మాట్లాడుతుంది కదా అని ఏదేదో ఊహించుకొని నన్ను ప్రేమించే భార్యను కూడా దూరం చేసుకో బోయాను..’ అనుకొని తన జుట్టు గురించి పట్టించుకోకుండా మామూలు మనిషి అయ్యాడు కార్తీక్. 


భార్య మనసును అర్థం చేసుకొని “నీకోసమే పెద్ద కానుక ఇస్తున్నాను తెలుసు.కో ముందు కళ్ళు మూసుకో” అంటూ ఎరుపెక్కిన భార్య చెక్కిలిపైన తియ్యటి ముద్దు ఇచ్చాడు. 


శుభం


యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం




60 views0 comments

Comentários


bottom of page