top of page

కనురెప్ప

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Kanureppa' New Telugu Story Written By Nallabati Raghavendra Rao

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు


సత్యకీర్తి గొప్ప సాహితీవేత్త.

ఎన్నో గ్రంథాలు రాసి ఎన్నో అవార్డులు రివార్డులు సత్కారాలు కూడా పొందిన దిట్ట.

అతను రచించి ప్రచురింపబడిన.... మహోన్నత గ్రంధాలు రమారమి రెండువందల వరకు ఉంటాయి. అవన్నీ అతని ఇంటిలో తనకోసం కేటాయించు కొన్న 2 గదుల్లో పాతకాలం నాటి టేకు బీరువాల్లో అమర్చుకున్నాడు.... అలాగే తన బిడ్డలు జయేంద్ర, లలితశ్రీ. వాళ్ళిద్దరికీ చెరో గది ప్రత్యేకంగా కేటాయించాడు. అయితే వాళ్లు పెద్దవాళ్లు అయినప్పటికీ, తన పుస్తకాలు భద్ర పరచుకున్న గదుల్లోకి మాత్రం వెళ్లనివ్వడు. కుటుంబం కన్నా పుస్తకాలని అంతలా ప్రేమి స్తాడు అతను.

ఇప్పుడు అతను ఓ మహాగ్రంథం వ్రాస్తూ, తనకన్నా ఘనాపాటి గ్రంథకర్తల స్ఫూర్తి వాక్యాలు అందులో పొందుపరిచి, ఆ గ్రంథాన్ని ముద్రించాలని అనుకున్నాడు. అందుకోసం తనకు దైవసమానులు, గురు తుల్యులులాంటి చాలా మందిని కలిసి, కావలసిన విషయ సేకరణ పొందాడు.

చిట్టచివరగా తను హైస్కూల్ లో చదువుకునే టప్పటి తన తెలుగుమాస్టారు .. విశిష్ట గ్రంధ కర్త అయిన పద్మప్రభాకరం గారు ఉంటున్న చెల్లూరు అనే గ్రామం బయలుదేరాడు.

ఆరోజు..

సాయంకాలం వరకు చాలా కష్టపడి ప్రయాణించి పద్మప్రభాకరo గారు నివసించే ఊరు వెళ్లి ఆయనకు నమస్కరించి, విషయం వివరంగా వివరించి, ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు సత్యకీర్తి.

మాస్టారు పద్మప్రభాకరం గారికి 90 ఏళ్లు వయస్సు పైబడి ఉంటుంది. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. దేశ విదేశాల్లో సైతం ఆయన సన్మానాలు సత్కారాలు పొందారు. అన్ని దేశాలలోనూ ఈయనకు అభిమానులు ఉన్నారు. లెక్కకు మించిన బిరుదులు పొందారు. తన శిష్యుడు చెప్పింది విని అతని మీద అభిమానంతో కాదనలేక నీరసంగా అడుగులు వేసుకుంటూ … లోపలకెళ్లి తను రచించిన.. కట్టలు కట్టబడి ఉన్న పాత కొత్త గ్రంధాలన్నీ జాగ్రత్తగా ఏరిఏరి, దుమ్ము దులుపుతూ, చివరికి ఓ గ్రంథం చేతులతో పట్టుకుంటూ బయటకు వచ్చారు.

'' సత్యకీర్తీ! ఇది నేను రాసిన గ్రంథం నాయనా. ఇది ఎప్పుడో 1990 సంవత్సరంలో ప్రచురింప బడింది. నువ్వు కూడా చాలా గ్రంథాలు రాశావు కదా. నువ్వు సామాన్యుడివి కాదు.. నీ గురించి నాకు తెలుసు.. అయితే నువ్వే నా శిష్యుడు అని మాత్రం ఇంతవరకూ తెలియదు.. నా శిష్యుడు ఇంత గొప్పవాడు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది నాయనా. చాలా సంతోషం '' అంటూ లోపల్నుంచి వచ్చిన మాస్టారు బయట కుర్చీలో కూర్చున్నారు. శిష్యుని ఎదురుగా... చాలా పేజీలు తిరగేసి .. ' దొరికింది' .. అంటూ ఒకచోట ఆగారు.

'' సత్యకీర్తీ! ' విజ్ఞానసాగరం ' అనే ఈ ఆధ్యా త్మిక గ్రంథములోని ఈ రెండు పేజీల ముఖ్యమైన మేటర్ నీకు ఇస్తాను. అందులో నుంచి నీకు పనికి వచ్చిన వాక్యాలు నువ్వు ఇప్పుడు రాస్తున్న గ్రంథంలో ఎక్కడైనా అన్వయించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. దాంతో నీ గ్రంథానికి బలం వస్తుంది... నా శిష్యుడు అయిన నీకు సహాయ పడ్డ తృప్తి నాకు కలుగుతుంది. నువ్వు వచ్చింది దీనికోసమే.. నేను చదువుతాను. నువ్వు రాసుకో నాయనా....'' అంటూ చదవడం ఆరంభించారు మాస్టారు.

“చాలా ఆనందం మాస్టారు! ఈ మీ విజ్ఞానసాగరం గ్రంథంలో నాకు పనికి వచ్చే ఈ రెండు పేజీలు రోడ్డు అవతలకు వెళ్లి ఫోటోస్టాట్ తీయించుకుని.. 10 నిమిషాలలో మీ గ్రంథం మీకు పట్టుకుని వచ్చి ఇస్తాను. మీకు చదివే శ్రమ ఇవ్వడం నాకు ఇష్టం లేదు.. పైగా నాకు కూడా చాలా లేట్ అవుతుంది. ఆ గ్రంథం ఒకసారి ఇవ్వండి మాస్టారు..'' అంటూ వినయంగా అడిగాడు సత్యకీర్తి.

'' పుస్తకం బయటకు పట్టుకుని వెళ్తానంటే ఎవరికీ ఇవ్వను నాయనా. నీ సెల్ కెమెరాతో కాపీ వస్తుం దేమో.. ప్రయత్నించరాదూ.''

'' అలారాదు మాస్టారు. నాది చిన్న సెల్.. కెమెరా కి అనువైనదికాదు.. ''

''ఏమీ అనుకోవద్దు నాయనా. ఇదిగో పేపరుపెన్ను... వ్యాసం చదువుతాను రాసుకో ...'' అంటూ చదవడం ఆరంభించారు పద్మప్రభాకరం మాస్టారు గారు. సత్యకీర్తి చాలాసేపు పూర్తిగా రాసుకున్నాడు

''వయసు చూస్తే 90 పైపడినట్టు ఉన్నారు. మనిషి మీద నమ్మకం లేని బ్రతుకు ఎందుకు..?'' అంటూ మాస్టారుని ఒకపక్క మనసులో చీదరించుకుంటూ, మరోపక్క పుస్తకాల పట్ల ఆయన వాత్సల్యానికి పొగడకుండా ఉండలేకపోయాడు సత్యకీర్తి.

అంతా బాగానే ఉంది కానీ..

మాస్టారు తన.. ప్రచురింపబడిన పుస్తకాలను బీరువాల్లో .. అలమరలలో చక్కగా పేర్చలేకపోయారు కట్టలుకట్టి..పోగులుగా పడేశారు. కొన్నిబూజులు పట్టి ఉన్నాయి.. మరికొన్ని అట్టలు ఊడిపోయి చిందరవందరగా ఉన్నాయి. కావలసిన పుస్తకం వెంటనే తీసుకునేటట్లు ఇండెక్స్ అమరిక లేదు. ఇన్ని వందలాది మహత్తరమైన గ్రంథాల పట్ల ఎందుకు మాస్టారు సరైన శ్రద్ధ తీసుకోలేకపోయారు

..!? వయసు భారమా..? అయ్యుండొచ్చు... పోనీ ఆయన కుటుంబ సభ్యులు..?.. ఏమో ..?.. ఎవరి కుటుంబ విధానాలు ఎలాంటివో...!! కిటికీలోంచి పుస్తకాలు ఉన్న గదులను పరికిస్తూ కించిత్తు బాధ పడ్డాడు సత్యకీర్తి.

'' ఈ నా విజ్ఞానసాగరం పుస్తకం ఇప్పుడు ఎక్కడ అమ్మటం లేదు.. అని తెలిసింది నాయనా. ఏ కారణం చేతనైనా ఈ పుస్తకం పోతే మళ్లీ నేను కొనుక్కుందాం అన్నా దొరకదు కదా. అందుకనే ఎవరికీ ఇవ్వటం లేదు. మిగిలిన అన్ని పుస్తకాలలోకి ఈ పుస్తకం నా ప్రాణం. .. మరో విషయం .. నీకు వినిపించిన ఈ రెండుపేజీల ''దిగువనే '.. ఇదిగో ఈ ఖాళీ లో ఈరోజు జరిగింది సింపుల్ గా రాసి తారీకు కూడా వేసి సంతకం పెట్టుకుంటాను. ఇది నా అలవాటు అన్నమాట.. ఇంకో మాట వయసు పైబడిన వాడిని కదా.. నీ పుస్తకావిష్కరణకు రాలేను. నువ్వు నీ గ్రంథం ప్రింట్ చేశాక వీలు పడితే ఓ పుస్తకం పోస్టులో పంపు.''.. . అంటూ మాస్టారు పద్మ ప్రభాకరo గారు.. తన పుస్తకాన్ని లోపలకు తీసుకెళ్ళిపోయి భద్రపరుచుకున్నారు.

సత్య కీర్తి మాస్టారు నుండి సెలవు తీసుకుని ఇంటికి వచ్చాడు ఆయన నుండి తెచ్చిన కొన్ని వాక్యాలను తన గ్రంథంలో కొన్నిచోట్ల అమర్చి గ్రంథం ప్రచురించి పుస్తకావిష్కరణ కూడా కావించి తెలుగు మాస్టారు కోరినట్టు ఆయనకు కూడా ఒక పుస్తకం బుక్ పోస్టులో పంపడం కూడా జరిగిపోయింది.

మూడు నెలలు గడిచి పోయింది.

ఈరోజు..

సత్యకీర్తి మళ్లీ తన తెలుగుమాస్టార్ని కలవడానికి చెల్లూరు బయలుదేరాడు.

తను పోస్టులో పంపిన తన గ్రంథం మీద పద్మ ప్రభాకరం మాస్టారు గారి అభిప్రాయం తెలుసు కోవాలి అన్నది సత్యకీర్తి ..ప్రయాణ ఉద్దేశం.

చెల్లూరు వచ్చి ఊరు బయట టీ బడ్డీ కొట్టు దగ్గర ఆగాడు సత్యకీర్తి.

'' ఓ రెండు మసాలా గారెలు ఇవ్వవోయి. '' అడిగాడు బడ్డీకొట్టు అతన్ని.

వెంటనే బడ్డీవాల తన దగ్గరున్న దళసరి బైండ్ పుస్తకంలోంచి ఓ డబల్ పేపర్ కసక్కన లాగి అందులో రెండు మసాలాగారెలు కొంచెం చెట్నీ వేసి సత్యకీర్తి కి అందించాడు.

ఆకలి మీద ఉన్న సత్యకీర్తి బడ్డీవాల అందించిన మసాలాగారెలు తింటూ ఆ గారెలు పెట్టి బడ్డీవాల ఇచ్చిన.. పేపర్లోని అక్షరాలు స్పష్టంగా కనబడటం

తో చదవనారంభించాడు ఆత్రుతగా.

'' అందుచేత.. ప్రతిమనిషి.... జాగ్రత్తగా విని, గుండె పుటల్లో చెక్కుకోవలసిన చివరిమాట ఒకటే..!!

మనం ఒక చెట్టు నాటడం ముఖ్యం కాదు!!.

అలాగని.. దానికి నీళ్లు పోసి.. పెంచి పోషించడం అది కూడా ముఖ్యం కాదు.!!

మనకు వీలు కానప్పుడు.. ఆ.. ''చెట్టు పట్ల''' మనం నెరవేరుస్తున్న..'' బాధ్యత ''..ఆపకుండా.. దీక్షతో నిర్వహించే వారసుడిని కానీ వారసురాలిని కానీ '' నియమించడం '' .. అదే అదే అతి ముఖ్యం..!!! ''

'' కంటి కన్నా.. ' కనురెప్ప' ముఖ్యం.. ఆ కను రెప్పకు కంటిని 'రక్షించే బాధ్యత' మనిషి అప్ప చెప్పకపోతే....కన్ను చీకటై పోతుంది....!! ''

ఆ వాక్యాలు చదివి ఆశ్చర్యం నుంచి తేరుకోలేక పోయాడు సత్యకీర్తి.

చూస్తే.. బడ్డీవాలా బల్లమీద తెలుగుమాస్టారి... ''విజ్ఞానసాగరం'' గ్రంథం ఉంది....!

ఆ పుస్తకంలో నుంచి చాలా కాగితాలు చింపి అతను మసాలాగారెలు పొట్లాలు కట్టగాకట్టగా .. ఇంకొన్ని... కాగితాలు మాత్రమే మిగిలిఉన్నాయి.

విచిత్రం ఏమిటంటే.. తను చేతిలో పెట్టుకు తింటున్న.. '' మసాలాగారెలు '' పేపర్లో బాగా దిగువన మాస్టారు సంతకం కూడా ఉంది. అది… ఇదివరలో తను మాస్టార్ ని... కలిసినప్పుడు... ఆ రోజు తనతో జరిగిన సంఘటన, పేపరు దిగువ ఖాళీలో తారీకుతో సహా సింపుల్ గా రాసి.. క్రింద పెట్టిన సంతకమే!!!

ఈ రెండు పేజీలలోని వాక్యాలే... సత్యకీర్తి తన గ్రంథంలో పెట్టుకోవడం కూడా జరిగింది. !!!

ఎంత చిత్రం?? మాస్టారి ఇంట్లోని తనకు ఓ ఐదు నిమిషాలు ఇవ్వడానికి నిరాకరించిన ఒరిజినల్ గ్రంథం పేపర్ కటింగ్లోనే తను మసాలాగారెలు తినటమా?

సత్యకీర్తి.. వెంటనే మసాలాగారెలు కింద పడేసి పరుగులాంటి నడకతో.. మాస్టారు ఇంటిని సమీపించి ఆ ఇల్లు తాళం వేసి ఉండటంతో ఇరుగు పొరుగు వారిని విచారించాడు.

తెలుగు మాస్టారు పద్మప్రభాకరoగారు నెలక్రితం చనిపోయారట!! అతని కొడుకులు... కోడళ్ళు కూతుళ్ళు...అల్లుళ్ళు ఇతర దేశాల్లో పెద్దపెద్ద ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారట!!!

మాస్టారు భార్య సామాన్య చదవరి. ఆయన కాలంచేయడంతో కర్మకాండలు అయిన వెంటనే ఆ ఇంటిని అమ్మేసి కొడుకులతో పాటు '' ఆమె'' అమెరికా వెళ్ళిపోతూ తన లగేజీతో పాటు మాస్టారి పుస్తకాలన్నీ మోయలేక.. కొడుకులు కూడా ఆ పుస్తకాలను చీదరించుకుని చిరాకుపడటంతో తూకానికి చిత్తుకాగితాల వాడికి ఆవిడ

'' ఆయన మహోన్నత మహోజ్జ్వల గ్రంథాలన్నీ'' అమ్మేసిందట!!!!!

అలా వచ్చిపడిందన్నమాట మసాలాగారెల బడ్డీకొట్టు లోకి... మాస్టారి...'' విజ్ఞానసాగరం '' గ్రంథం!..

ఈ విషయం గ్రహించిన సత్యకీర్తి మరొక్కక్షణం అక్కడ ఉండలేక వెంటనే తన ఊరు వచ్చి ఇంటికి వెళ్లి గాబరాగా ఆతృతగా తన పిల్లలిద్దర్ని పిలి చాడు..జయేంద్ర.. లలితశ్రీ...ఇద్దరూ వచ్చి తండ్రి ఎదురుగా నిలబడ్డారు.

'' ఇన్నాళ్లు మీరిద్దరూ నా రూముల్లోకి వస్తుంటే..' వద్దు ' అనే వాడిని. నా గ్రంథాలు.. మీరు చదువు తుంటే...'మీ చదువు ఏదో మీరు చదువుకుంటూ గొప్పవాళ్ళు కండి..నా పుస్తకాల జోలికి రాకండి ' అంటూ కసురుకునే వాడిని. తప్పుచేశాను.. నాకిప్పుడు జ్ఞానోదయమయింది.

గతం గతః.. ఇప్పుడు మీ ఇద్దరికీ చిన్న పరీక్ష పెడుతున్నానర్ర'' అన్నాడు.. పిల్లలు ఇద్దరి వైపు చూస్తూ సత్యకీర్తి.

పిల్లలిద్దరికీ విషయం అర్థం కాలేదు.

సత్యకీర్తి తను రాసిన గ్రంథాలు ఉన్న చెరో రూమ్ లోకి ఆ ఇద్దరినీ విడివిడిగా పంపిస్తూ.. ఒకరోజు గడపమన్నాడు.... ఆ సమయంలో తను రచించిన ' వంద పేజీల' పుస్తకాలు మాత్రమే చదవడానికి ప్రయత్నించమని అన్నాడు. “ఎవరు ఎక్కువ పుస్త కాలు చదువుతారో దాన్నిబట్టి నేను ఒక నిర్ణయా నికి కూడా వస్తాను.'' అంటూ చెప్పాడు.

ఈసారి సత్యకీర్తి మనసు తేలికపడింది. ఎక్కువ పుస్తకాలు చదివిన వారికి పుస్తకాలమీద ప్రీతి ఎక్కువగా ఉన్నట్టు నిర్ణయించి, వారికి తన కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన పుస్తకాల ఆస్తి బాధ్యత అప్పచెప్పాలన్నది అతని ఉద్దేశ్యం.

తను ఇచ్చిన సమయం గడిచాక .. సత్యకీర్తి వాళ్లు ఉన్న రూముల్లోకి వెళ్ళాడు.

ఇంజనీర్ చదువుతున్న జయేంద్ర వెళ్ళిన రూమ్ లోని పుస్తకాలు..ఇదివరకటిలా సక్రమంగా కాకుండా చాలా చిందరవందరగా పడిఉన్నాయి.. అతడిని పిలిచి అడగగా... 3 పుస్తకాలు చదివేసినట్టు గర్వంగా చెప్పుకున్నాడు.. 100 పేజీల పుస్తకాల గురించి వెతకటంతో.. గత్తర అయిన పుస్త కాల్ని మళ్లీ పేర్చడానికి సమయం సరిపోలేదని.. చెప్పాడు.. తండ్రితో.

ఇక.. కూతురు లలితశ్రీ మెడిసన్.. ఆమె ఒక పుస్తకం మాత్రమే చదివిందట.. సత్యకీర్తి కోపంగా ఆమె గడిపిన రూమ్లోకి వెళ్లి అంతా పరికించాడు అయితే..ఆమె చెప్పిన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు.

లలితశ్రీ ముందుగా తనకు తండ్రి ఇచ్చిన రూమ్ లో ..బీరువాలో ..అలమరలో ఉన్న పుస్తకాలు సక్రమమైన పద్ధతిలో పెట్టింది.. దులుపు గుడ్డకర్ర తో దుమ్ములన్నీ దులిపి రూమంతా శుభ్రం చేసింది.

పుస్తకాలు చెదలు పట్టకుండా ఉపయోగించడానికి తండ్రి కిటికీ లో పెట్టిన స్ప్రే కూడా తీసి...రూమంతా స్ప్రే చేసింది. అంతేనా కొన్ని పుస్తకాలు చిరుగు పడితే కిటికీలో ఉన్న గమ్ము బాటిల్ తీసి

అంటించి ఆరబెట్టండి.. ఇవన్నీ చేయడంలో తను కేవలం ఒక పుస్తకం మాత్రమే చదవగలిగాను అని

సమయం చాలలేదని తనను క్షమించమని చేతులు కట్టుకు కోరింది తండ్రిని.

దాంతో ఒక నిర్ణయానికి వచ్చిన సత్యకీర్తి కుమార్తె లలితశ్రీని దగ్గరగా తీసుకొని నుదుటిపై ముద్దాడి

''అమ్మా.. లలితశ్రీ మా తెలుగుమాస్టారు చనిపోయి నాకొక ' జీవితరహస్యం' పాఠం లా నేర్పారు. తన ఆస్తులనే కాదు తన కీర్తి ప్రతిష్టలను కూడా వెనుక ఉన్నవారు నిలుపగలిగేలా .. రక్షించ గలిగేలా ఎవరో ఒకరిని తయారు చేసుకోవడం ప్రతి మనిషికి చాలా ' ముఖ్యం' అన్నది...ఆయన నేర్పిన పాఠం తల్లి.. కవులకు.. రచయితలకు.. చిత్రకారులకు.... వ్యాపారస్తులకు.. ఇంకా చాలా మందికి.. ఇది వర్తిస్తుంది.

ఇకపోతే నేను పెట్టిన పరీక్షలో నా ' కీర్తిప్రతిష్టల వారసత్వం' నిలబెట్టే వారసురాలువి..'' నువ్వే ''

అని.. నీలో క్రమశిక్షణను బట్టి నేను నిర్ణయించు కున్నానమ్మ. నేను కష్టపడి రచించిన నా గ్రంథాలన్ని.. నా అనంతరం చెదపట్టకుండా...అగ్నికి ఆహుతి కాకుండా.. అనామకుల పరం కాకుండా.. తడిచి ముద్దవ్వ కుండా... చివరికి చిత్తుకాగితాల వాడి తూకానికి బలి కాకుండా... చూడవలసిన రక్షణ బాధ్యత నీకు అప్పచెబుతున్నానమ్మా.''..... అంటూ తన గ్రంథాలున్న రెండురూమ్ ల తాళాలగుత్తి కూతురు లలితశ్రీ కి అందించాడు ప్రేమతో సత్యకీర్తి.

నిజమే...

మనం ఒక చెట్టు నాటడం ముఖ్యం కాదు!!. అలాగని.. దానికి నీళ్లు పోసి.. పెంచి పోషించడం.. అది కూడా ముఖ్యం కాదు.!!

మనకు వీలు కానప్పుడు.. ఆ.. ''చెట్టు పట్ల''' మనం నెరవేరుస్తున్న..''బాధ్యత'' ఆపకుండా, దీక్షతో నిర్వహించే వారసుడిని కానీ వారసురాలిని కానీ '' నియమించడం '' .. అదే అదే అతి ముఖ్యం..!!! ''

'' కంటి కన్నా.. ' కనురెప్ప' ముఖ్యం.. ఆ కను రెప్పకు కంటిని 'రక్షించే బాధ్యత' మనిషి అప్ప చెప్పకపోతే....కన్ను చీకటై పోతుంది....!! ''

తన తెలుగు మాస్టారి మహోన్నత గ్రంథంలోని వాక్యాలు మరొక్కసారి గుర్తు చేసుకున్నాడు ... సత్యకీర్తి!


****

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం....


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు



68 views2 comments

2 Comments


KOSRI VISIONS • 5 days ago

కథకు పెట్టిన పేరు అద్భుతం.ఎంతోమంది కళాకారులు,కవుల సంపద,అంటే వారి రచనలు,వారు సంపాదించిన బహుమతులు ఆదరణ కు నోచుకోక రోడ్ల పాలైనవి. వారి తదనంతరం......కథకు రెప్పపాటు....అనే పేరు...బావుండి

Like

Varalakshmi G • 1 day ago

Kanureppa Rachana bavundhi.Rachayitha Nllabati Raghavendra Rao garu chala baga rasaru

Like
bottom of page