top of page
Writer's pictureVagumudi Lakshmi Raghava Rao

కరంభ

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Karambha, #కరంభ

Karambha - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 10/01/2025

కరంభ - తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


కళింగ రాజ కుమార్తె కరంభ యౌవనం లోకి అడుగుపెట్టే సరికే ఆమె పేరు ప్రతిష్టలు పదునాలుగు లోకాలు వ్యాపించాయి. యజ్ఞ యాగాది విషయాల ప్రసక్తి వచ్చినప్పుడు అందరూ కరంభ గురించే మాట్లాడుకునే వారు. ముఖ్యంగా కరంభ యజ్ఞ యాగాదులకు అవసరమైన నైవేద్యములను తయారు చేయడంలోనూ, తయారు చేయించడం లోనూ మంచి నైపుణ్యం కలదని త్రిమూర్తులు, త్రిమాతలు కరంభసహితం అనుకునేవారు. ఆమె చేతితో తయారు చేసి సమర్పించిన యజ్ఞ భరిత వేద నైవేద్యములను స్వీకరించడానికి దేవతలు పోటీ పడేవారు. వేద నైవేద్యం లు తయారు చేయడంలో కరంభకు సాటి కరంభయే అని అనుకునేవారు. 


 యజ్ఞ పురుషుడు నిరంతరం కరంభకు సంరక్షకుడు గా ఉండేవాడు. ఒక సారి కామంతో కళ్ళు మూసుకుపోయి అమానుషం గా కరంభ చెయ్యి పట్టుకున్న పరరాజ్య రాజకుమారుని యజ్ఞ పురుషుడు కాల్చి బూడిద చేసాడు. 


 గో సంరక్షణ నిమిత్తం, గో సంవృద్ధి నిమిత్తం కరంభ తయారు చేసిన వేద నైవేద్యములకు "కరంభ" అనియే త్రిమాతలు పేరు పెట్టారు. ఆపై కరంభ స్వహస్తాలతో తయారు చేసి సమర్పించిన నైవేద్యములను త్రిమాతలు మనసారా మహదానందంతో స్వీకరించారు. త్రిమాతల మార్గం లో త్రి మూర్తులు పయనించారు. 


 మంత్రాలతో, ఆయుర్వేద జ్ఞానంతో పవిత్రమైన పచ్చికను మేసిన గోవులు ఇచ్చే పాల నుండి వచ్చిన వెన్నతో కరంభ బార్లీ గింజలను వేయించేది. ఆ వేయించిన గింజలను పొడి పొడి చేసేది. ఆ పొడికి కరంభ "సక్తు" అని పేరు పెట్టింది. సక్తును హయ్యంగ వీనం అనే వెన్నలో కలిపి కరంభ యజ్ఞ దేవతలకు నైవేద్యం తయారు చేసేది. అలాగే బియ్యం పిండి, పెరుగుల తో కూడిన అనేక యజ్ఞ నైవేద్యాలను కూడా కరంభ తయారు చేసేది. తన వేద నైవేద్య జ్ఞానం ను కరంభ ఆడ మగ అనే తేడా లేకుండా ఆసక్తి ఉన్నవారందరికి నేర్పించేది. 


 దేవర్షులు, బ్రహ్మర్షులు, మహర్షులు, ఋషులు, పురోహితులు తదితర పండితులు, ఎవరు యజ్ఞ యాగాదులను చేయించడానికి సిద్ధమైన కరంభ తో లేదా ఆమె అనుచర గణం తో యజ్ఞ నైవేద్యాలను తయారు చేయించమని యజ్ఞం చేయాలనుకున్న వారికి చెప్పేవారు. 


 కరంభ తన అంతఃపురానికి సమీపంలో యజ్ఞ నైవేద్యాలను తయారు చేయడానికి, చేయించడానికి ఒక ఇందీవర వనాన్ని ఏర్పాటు చేయించింది. ఇందీవర వనం నడుమ వేద నైవేద్యాలను తయారు చేయడానికి కరంభ ప్రత్యేక మందిరాలను నిర్మింప చేసింది. 


 ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు కరంభ చేతి వేద నైవేద్యం స్వీకరించడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. జనం అత్యుత్సాహం తో నైవేద్యం కోసం తొక్కిసలాట దిశగా వెళితే కరంభ వారికి అసలు నైవేద్యం ఇచ్చేది కాదు. వారికి సహన మంత్ర తంతు జరిపిన పిమ్మట వేద నైవేద్యం ఇచ్చేది. 

 కరంభ చేతి వేద నైవేద్యం తింటే ప్రాణ శక్తి తేజోవంతమవుతుందని నాటివారు ఎక్కువ మంది నమ్మేవారు. తన దగ్గరకు నమ్మకంతో వచ్చిన వారందరికి నమ్మకం మంచిదే కానీ మూఢ నమ్మకంను మాత్రం పెంచుకోకండి. అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పేది. 


 రంభ సోదరుడు కరంభ ఒకసారి కరంభను ఇందీవర వనంలో చూసాడు. తొలిచూపులోనే కరంభను కరంభ వలచాడు. ఇద్దరి పేర్లు ఒకటేనని కరంభ గ్రహించాడు. 


 అశ్వం మీద పయనిస్తున్న కరంభను కరంభ అనుసరించాడు. తనను అనుసరిస్తున్న వానిని కరంభ గమనించింది. అశ్వం ను ఆపింది. తన సమీపం నకు వచ్చిన వ్యక్తిని మీరు ఎవరని ప్రశ్నించింది. అప్పుడు కరంభ "నేను రంభ సోదరుడుని. నా పేరు కూడ కరంభయే. తొలి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాను." అని అన్నాడు. 


 కరంభ మాటలను విన్న కరంభ, " నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. ప్రస్తుతం నా మనసు పెళ్ళి మీదకు వెళ్ళడం లేదు" అని అంది. 


 కరంభ మాటలను విన్న కరంభ రాక్షసుడు లా ప్రవర్తించాడు. కరంభ రాక్షసుడు లా ప్రవర్తించే కరంభ కు కరవాలంతోనే బుద్ది చెప్పింది. కామ పృథశ్రవసుల పుత్రుడు అక్రోధనుడు ప్రతిష్టాన పురానికి రాజయ్యాడు. అప్పుడు జరిగిన యజ్ఞ యాగాదులకు కామ పృథశ్రవసుల కోరిక మేర కరంభయే యోగ శక్తితో బ్రహ్మ జ్ఞానం పెంచుకుని వేద నైవేద్యం లను తయారు చేసింది. 


 వేద నైవేద్యం తయారు చేసేటప్పుడు కరంభ అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అక్రోధనుడు కళ్ళార చూసాడు. ఆమె రూపాన్ని మనసులో నిలుపుకున్నాడు. 


 కరంభ అగస్త్య వంశ పునాదులు కలదని పదుగురు చెప్పుకొనగ అక్రోధనుడు విన్నాడు. కరంభ తన రాజ్యం లో వేద నైవేద్యం లు తయారు చేయడమే కాక పాపాలు చేసే దోషులకు తనే శిక్ష విధిస్తుంది అని అక్రోధనుడు తన మంత్రుల ద్వారా తెలుసుకున్నాడు. 


 తన ఉమ్మడి కుటుంబం ను అడ్డం పెట్టుకుని బంధువులను మోసం చేస్తూ, బంధువుల మీద మితి మీరిన కామాన్ని ప్రదర్శించేవారిని, పరుల ధనాన్ని భయపెట్టి అపహరించేవారిని కరంభ అసలు సహించేది కాదు. వారికి కరంభ శిక్ష విధించేది. బాగా వేడిగా ఉన్న ఇసుకను మరింత వేడి చేసి, ఆ ఇసుక గుట్ట నడుమ దోషిని ఉంచి శిక్షించడం ను కరంభ శిక్ష అని అంటారు. 


 అసలు క్రోధమెరుగని అక్రోధనుని రాజ్యంలో విచ్చలవిడి తనం పెరిగిపోసాగింది. దుర్మార్గులను సహితం క్షమించి వదిలేసి వేదాంతం వల్లించే అక్రోధనుని రాజ్యంలో నానాటికి మోసగాళ్ళ సంఖ్య పెరిగిపోసాగింది. మనం ఏం చేసిన అక్రోధన మహారాజు మనల్ని క్షమిస్తాడు అని మనసులో అనుకొని కొందరు మాయగాళ్ళు అక్రోధన మహారాజు ను మంచి మంచి మాటలతో మాయ చేసేవారు. చేతలను నిర్వీర్యం చేసేవారు. ఇది గమనించిన అక్రోధనుని తల్లి కామ కరంభను కోడలిని చేసుకుంటే బాగుంటుంది. ఆమె అక్రోధనుడికి భార్య అయితే అక్రోధనుడు తన ఆలోచనా సరళిని మార్చుకుంటాడు. రాజ్యం కూడా బాగుపడుతుంది అని అనుకున్న కామ అదే విషయాన్ని తన భర్త పృథశ్రవసునికి చెప్పింది. 


అనంతరం భార్యాభర్తలు ఇరువురూ కరంభ తలిదండ్రులను కలిసి తమ మనసులోని మాటను చెప్పారు. అందరి సమ్మతి మీద కరంభ అక్రోధనుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 

 కరంభ తన భార్య అయిన పిదప అక్రోధనుడు అవసరం వచ్చినప్పుడు చెడ్డవారి మీద క్రోధం చూపించడం నేర్చుకున్నాడు. చెడ్డ వారి మనసులోని మాయలను గమనించసాగాడు. 

 కరంభ రాజ్య పరిపాలన విషయంలో కూడా తన భర్త అక్రోధనునికి తగిన సూచనలు ఇచ్చింది. రాజ్య సంక్షేమం కోసం పలు యజ్ఞ యాగాదులను చేయించింది. శ్రేష్టమైన వేద నైవేద్యం లను దేవతలకు సమర్పించింది. 


 కరంభ అక్రోధనుల సుపుత్రుడు దేవతీతి. 


  సర్వే జనాః సుఖినోభవంతు 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








14 views0 comments
bottom of page