కారణం
- Sudha Vishwam Akondi
- 24 hours ago
- 2 min read
#SudhavishwamAkondi, #Karanam, #కారణం, #సుధావిశ్వంఆకొండి,#TeluguKathalu, #తెలుగుకథలు #కొసమెరుపు

Karanam - New Telugu Story Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 07/04/2025
కారణం - తెలుగు కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
సుబ్బారావు ఎంబీబీఎస్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇక ప్రాక్టీసు మొదలుపెట్టాలనే ఉత్సాహంతో వున్నాడు. అయితే కొంత ప్రాక్టీకల్ నాలెడ్జ్ ఉండాలని ఒక సంవత్సరం పాటు ఒక హాస్పిటల్ లో పని చేశాడు.
ఆ తర్వాత తనకెంతో ఇష్టమైన తాతయ్య వాళ్ల ఊళ్ళో ప్రాక్టీసు పెట్టాలని తన కోరిక. తాతయ్య వాళ్ళింటికి వెళ్ళాడు. వాళ్ళు కూడా మనవడు తమ దగ్గర ఉంటానంటే సంతోషించారు.
ఓ మంచిరోజు చూసుకుని క్లినిక్ తెరిచాడు. చక్కగా తెలుగులో బోర్డు రాయించి పెట్టించాడు తాతయ్య.
***
ఓరోజు పేషంట్స్ చాలా తక్కువ మంది రావడంతో, కాసేపు అలా కూర్చున్నాడు. కాసేపటికి కాంపౌండర్ కోసం పిలుస్తూ బయటకు వచ్చాడు సుబ్బారావు.
తన క్లినిక్ కి ఎదురుగా ఒక చిన్న టీ షాపు ఉంది. అక్కడ పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిపై కూర్చున్న ఒక వ్యక్తి కన్నార్పకుండా తన క్లినిక్ వైపే చూస్తున్నాడు. వింతగా అనిపించింది. కాంపౌండర్ అనిల్ తో చెప్పి, అతన్ని చూపించాడు.
అనిల్ ఆ వ్యక్తికి దగ్గరకు వెళ్లి...
"అలా ఇక్కడ చూస్తూ కూర్చున్నావేంటి? డాక్టర్ గారి వద్దకు వెళ్లి, చూపించుకో!" అన్నాడు
ఆ వ్యక్తి మాట్లాడకుండా అక్కడ్నుంచి లేచి, వెళ్ళిపోయాడు. లంచ్ టైం అయ్యిందని తినడానికి వెళ్ళాడు సుబ్బారావు.
మళ్లీ సాయంత్రం క్లినిక్ ఓపెన్ చేయడానికి వస్తుంటే ఆ వ్యక్తి మళ్లీ యధాస్థానంలో కూర్చుని, ఇటువైపే చూస్తూ కనిపించాడు.
మళ్లీ తన టైం అయిపోయాక తను ఇంటికి వెళ్లిపోతూ అటు వైపు చూశాడు. అతను కూడా వెళ్లిపోవడం కనిపించింది.
"ఎవడు ఈ ఆగంతకుడు? రేపు కనిపిస్తే అడిగెయ్యాలి" అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.
***
మరునాడు ఉదయం క్లినిక్ తెరిచే సమయానికి రెడీగా అక్కడే కూర్చుని ఉన్నాడు.
సుబ్బారావు గబగబా అతని వద్దకు నడిచాడు.
"ఏమయ్యా అలా నా క్లినిక్ వైపే ఎందుకు చూస్తూ కూర్చుంటున్నావు? నీకు ఏమైనా పిచ్చా?" అన్నాడు కాస్త కోపంగా.
అతను చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వి, క్లినిక్ గోడకు తగిలించిన బోర్డు వైపు చూపించాడు.
అక్కడ బోర్డుపైన ఇలా రాసి ఉంది.
'డాక్టర్ సుబ్బారావు, ఎంబీబీఎస్.
చూచు వేళలు :
ఉదయం : తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు.
సాయంత్రం : అయిదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు' అని రాసేసి ఉంది.
"ఆ బోర్డులో ఉన్న ప్రకారం చూస్తూ ఉన్నాను. నిలబడితే కాళ్ళు నొప్పులు వస్తాయి అని ఇలా కూర్చున్నా!" అని తను చూడడానికి గల కారణం వివరించాడు
అతను చెప్పిన కారణానికి తల పట్టుకున్నాడు డాక్టర్ సుబ్బారావు.
*** సమాప్తం ***
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
Comments