'Karnuni Janma Vrutthantham 2/3' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 18/10/2023
'కర్ణుని జన్మ వృత్తాంతం -2/3' తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
{15} ఎదలోన దడ దడల్ ఎదిగి రాగ
మదిలోన ఎడనెడ సుడులు దిరుగ
గదిదాట తలుపులా సుదతి దెరిచి
పదిలెంగ పయనించ గదినొదిలెనింక
{16} ఘల్లు ఘల్లున గజ్జెల సవ్వడి
ఇల్లు వాకిలి నిండి ఇనుమడించెడి చోట
మెల్లె మెల్లెగ నాఇంతి పల్లటించి
తల్లి యాకృతి దాల్చి తరలుచుండె.
{17} హంసుని అంశన బుట్టిన దనయు
నంసభాగంబున నదిమిబట్టి నిక
హంసక ధ్వనులు నడకన విధ్వంసపు
సంశయంబున గుంతి సంకోచించెన్.
{18} వక్షోరుహము పరోక్షము జేసెడి
లక్షణ మెరిగి ఎరుగని అశిక్షిత చలి
తీక్షణ మరయన్ శిశునాలక్షించెడి
లక్షణ మెరుంగక దీక్షన్ నడుచున్.
{19} మెల్ల మెల్లగ మిద్దె మెట్లు దిగుతు
తల్లడిల్లెడి హృదిని డాచేత దడుము చుండ
వల్లమాలిన చేష్టలు వగపు జూప
ఉల్లముప్పొంగు బెంగ నడిపించె కుంతిని గంగవైపు.
{20} మది గుదులుచు విధి నిందించుచు
గది దాటిన నా ముదిత పదములు నదురన్
నెదురుచు నెదురగు ఉదయము
ముదురుట గని గుదిమె గుంతి మదినంతన్.
{21} అడుగడుగున తడబడు అడుగుల
నడవడి నడుకల ఇడుముల నడుమన్ పడతిక
కడువడి కదలక బిడియము ఎడనెడ
దడదడలు సడలని సవ్వడులన్ గడగడలాడెన్
{22} ప్రదోషంబునన్ గుంతి ప్రవేశించె గంగానది
ప్రదేశంబునకున్ ఆత్మ ప్రబోధించన్ నిక
ప్రదర్శకుండు పరమాత్ముండె ప్రారబ్ద కుండనుచు
నిదర్శనంబులెన్నియొ ఇంతి మది దర్శించెన్.
{23} పరిపరి విధముల పరుగిడు మనమున
మరి మరి మురిపెము మరుగగు చుండగ
గరగరికగు గొమరుని గావగ గోరెను
గిరిధరుని గుంతి గిజగిజ లాడెడి మనసున్.
{24} నెరిగురులను మురిపెము గొల్పగ నెట
సరితూగని యా బాలు సాటి సవితన
పరితోషమున గుంతి పరవశ మొందన్ నిక
పరిత్యాగము నెంచ నాత్మ పరిఘోషించెన్.
{25} తలచితి నేల తపనుని తగదని దెలియక నే
తలచినంతనె దా దడయక రానేల నేల తమ్మిదొర
పిలిచిన నేను కన్యనని కొలుచుట మాని కొరలనేల
పలుచగనైతి నేనిక పరువుగ నుండ జాల పలువురి
ముందున్.
{26} ఉపయామ మొందని నన్నుపభోగమొంది
ఉపమానమిడనట్టి యపవాదునుపలంభ పర్చి
తపనుడు నాయెడ తప్పిదము చేసి తప్పుకొనగ
నెపము మోపగలేనది ఉపయుక్తమనగ లేను.
{27} నది దరి జేరగ గుదిమెడి గుంతి
మదినంతయు నొదులని వ్యథయై
చెదరగ నది నడుమ నగుపడె
బదరికమొక్కటి నది తడలన్ గదులన్.
{28} అంతరంగంబున నాశ గుంతి కొ
కింత బెరుగ అంతకంతకు దరిజేరె
వింతగొల్పెడి పెట్టె అల్లంత దూరంబు నుండి
సంతసంబడయ నింతి సంతసంబెడము గాగ.
=================================================================================
ఇంకా ఉంది..
========================================================================
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
留言