top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

కర్ణుని జన్మ వృత్తాంతం - 1


'Karnuni Janma Vrutthantham 1/3' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 17/10/2023

'కర్ణుని జన్మ వృత్తాంతం -1/3' తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి


{1} కుంతల దేశమందు కుందనపు బొమ్మగ నొప్పెడి ఇంతియ

కుంతియను రాకుమారి నిరంతర సంతస మొప్పగ ముని

మంతన మంతయున్విని దానకార కాంతగ మది గానక

వింతగ రవిని గోరి మంత్రము పఠించె ముగ్ధ మురిపెము

తోడన్.


{2} కన్నె కోరిక నెంతయు గాదన లేక

విన్నపంబును దీర్చ విను వీధి నొదిలి

సన్నుతాంగిని జేరి సవిత యపుడు

సున్నితంబుగ జూచి సుతుడినొసగె


{3} కర్మసాక్షి యొసగిన కాంచనవర్ణు జూచి

మర్మమెరుగక ముదమొందె మదిని గొంతి

ధర్మ మొక్కటి దన గుండె దడలు గొల్ప

నిర్మలంబగు చిత్తంబు నీరుగార్చె నింతినంత


{4} బాల భానుని బోలిన యా బాలు జూచి

బేల యగుచు గుంతి బెంబేలుబడుచు

నేల దలవంచి యేడ్చి యేడ్చి

కాల మహిమను దలబోసి కన్నీరు కార్చె రమణి

{5} నెలత దలయెత్తి ఇక దా నేడ్పు మాని

కలత జెందుచు కన్న కొడుకు జూచి

కవచ కుండల ధరుండు కాంచన వర్ణుండు

భువన మోహనుడంటు బుజ్జగించె.


{6} చేసిన చేష్టల యందు అనుభవము చేదుగ నున్నను

చూసినవారిక సూదులు గుచ్చెడి మాటలాడినన్

కాసిన పండును కాదన గలనె కాంతగ నగుటన్

పోసిన దేవుడె నారుకు నీరు పోయుట దగదే


{7} అనుచు దలపోసి తనమదిని కుదుటబర్చి

కనుచు బాలుని కడు ప్రీతి కనులు కదుపబోక

ఇనుడి పుత్రుడ నీకింకనిడుములేల

యనెడి మాటలతోడ మదిలోని అలజడి నదిమిబెట్టె


{8} తెలియదు తల్లికిన్ దండ్రికిన్

దెలియదు బంధు జనులకున్ మరి

దెలియదు పరివారమునకున్ నిక

దెలియగ వంశపు తేజమె దరుగున్.


{9} కుంతి మనసున యారాటమంతంత బెరుగ

అంతకంతకు దనయుపై యాశ నధికమవగ

బంతి యాటను బోలిన బతుకు రీతి

ఇంతి మనసున యారాట మంతంత బెరిగె


{10} రాజ భవన మందు పుష్పరాజములును

జాజి విరజాజి విరజిమ్ము పరిమళముల

గాజు ఫలకముల కిటికీలు సుగంధంబు లీన

మోజు మొకమొత్తె తన బాల రాజు జూసి.


{11 }ఇందు బోలిన ఈ పసికందు జూడ

అందచందములు నాడెందమందు యా

నంద మొంది గూడ నందనుండు నాకని

యెందు బలుకు దాన నెవరి ముందు నిలుతు.


{12} అరచేత నిలువని బరువైన లేనట్టి

అరవిరి యాబిడ్డ బరువయ్యె తుదకు

అరసంజ నాతల్లి యరయు మార్గము మదిని

కరువయ్యెనింక నరవాయి కుంతి నావహించె.


{13} తత్తరపాటు మాని మది సత్తువ గొల్పగ

నెత్తురుకందు నెత్తుకొని నెలతుక హృది

నత్తుకొనుచు ఒలచేత బాలునొత్తిబట్టి

ఉత్తరు చిత్తమున ఊతము గోరె నత్తరమొందన్.


{14}ఫాలాక్షు పైనింక భారంబు బడవైచి

నీలాక్షి దను యింక నిలయ మెడలి

కాలాంతకుండింక కాపాడు ననుకొనుచు

చూలాలు గానట్టి బాలింత యింక బయలుదేరె.


=================================================================================

ఇంకా ఉంది..

========================================================================

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


18 views0 comments

Commentaires


bottom of page